Live Updates: ఈరోజు (సెప్టెంబర్-30) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-30) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 30 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి: రా.11-29 వరకు తదుపరి పౌర్ణిమ | పూర్వాభాద్ర నక్షత్రం రా.1-41వరకు తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: ఉ.8-28 నుంచి 10-12 వరకు | అమృత ఘడియలు: సా.6-49నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-32 నుంచి 12-31 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Hemanth Case updates: హేమంత్ కేసులో ముగిసిన నిందితుల తొలిరోజు కస్టడీ: లక్ష్మారెడ్డి...
    30 Sep 2020 3:40 PM GMT

    Hemanth Case updates: హేమంత్ కేసులో ముగిసిన నిందితుల తొలిరోజు కస్టడీ: లక్ష్మారెడ్డి...

    -హేమంత్ హత్య కేసులో ముగిసిన నిందితుల తొలిరోజు కస్టడీ

    -విచారణలో హత్యకు గల కారణాలను విషయాలను వెల్లడించిన నిందితులు

    -అవంతి ప్రేమ విషయం తెలిసే కట్టడి చేశాం

    -మా నుంచి తప్పించుకుని హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

    -వివాహం చేసుకున్నట్లు మాకు పోలీసుల నుంచి సమాచారం వచ్చింది

    -15 సంవత్సరాలుగా బావమ్మర్ధి యుగంధర్‌తో మాటలు లేవన్న లక్ష్మారెడ్డి

    -హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చింది

    -ప్రాణం కంటే పరువుకే ముఖ్యమని భావించే కుటుంబం మాది

    -మేము ఉంటున్న కాలనీలో మా కుటుంబానిదే అధిపత్యం 

    -అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చింది - లక్ష్మారెడ్డి

  • 30 Sep 2020 1:42 PM GMT

    Telangana updates: దేశం మొత్తంలో మెజారిటీ సంఖ్య ఉన్న పార్టీ టీఆరెస్...

    గంగుల కమలాకర్ రాష్ట్ర మంత్రి@ తెలంగాణ భవన్..

    * 2013 వరకు మొక్కుబడిగా 18వందల కోట్లు మాత్రమే బిసి వర్గాలకు బడ్జెట్ పెట్టారు.

    * ఈ ఆరేళ్ళ లో 26వేల కోట్లు బడ్జెట్ కేసీఆర్ కేటాయించారు.

    * కేసీఆర్ ప్రభుత్వం పాలనలో 261 గురుకులాలు బీసీలకు కేటాయించింది.

    * 95వేల మంది బీసీ గురుకులాల ద్వారా బిసిలు చదువుకుంటున్నారు.

    * బిసి కులాల కోసం హైదరాబాద్ లో బీసీ భవన్ కడుతున్నాము.

    * కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎప్పుడైనా బిసిల కోసం ఆలోచన చేసిందా?

    * టీడీపీ కంటే ఎక్కువగా టీడీపీ తరువాత కేసీఆర్ కి దగ్గరగా కేసీఆర్ కి ఉన్నారు.

  • 30 Sep 2020 1:38 PM GMT

    Telangana updates: లక్ష్మణ్ ఓబీసీ చైర్మన్ కాగానే బిసిలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు అనేది ముమ్మాటికీ అవాస్తవం...

    వినయ్ భాస్కర్ ప్రభుత్వ చిప్ విప్@తెలంగాణ భవన్

    * తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అమలులో ఉన్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రజలకు అందిస్తున్నారా?

    * గత ప్రభుత్వాల హయాంలో పనిలేక ఆత్మహత్యలకు పాల్పడే చేనేత కార్మికులు- వివిధ కులాలకు ఉపాధి టీఆరెస్ ప్రభుత్వం కల్పించేది వాస్తవం కాదా?

    * హైదరాబాద్ టు ఆదిలాబాద్ వరకు మాస్త్యకార్మికుడు ఎంతో సంతోషంగా ఉన్నారు.

    * కనీసం చదువుకోలేని పరిస్థితి నుంచి ఉన్నత చదువువుల కోసం విదేశాలు వెళ్లే పరిస్థితి కేసీఆర్ వల్ల వచ్చింది వాస్తవం కాదా?

    * తెలంగాణ బిసిలు దేశంలోని బీజేపీ వైపు చూడటం కాదు...దేశంలోని అన్ని రాష్ట్రాల బిసిల కేసీఆర్ వైపు- టీఆరెస్ పథకాల పై వైపు చూస్తున్నారు.

    * లాక్డౌన్ సమయంలో వలసకులీలను కేంద్రం పట్టించుకోకపోతే... కేసీఆర్ తెలంగాణలో ఉన్న వలసకులీలను సొంతరాష్ట్ర ప్రజల్లాగా చూసుకున్నారు.

    * రైల్వే- ఎల్ఐసి ని ప్రైవేట్ పరం చేసిన ఘనత బీజేపీ.

  • 30 Sep 2020 1:35 PM GMT

    Telangana updates: బీజేపీ లక్ష్మణ్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారు...

    బొల్లా మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యే@ తెలంగాణ భవన్..

    * మతాలు-కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ.

    * సెంటిమెంట్ రాజకీయాలు బీజేపీ చేస్తోంది.

    * దేశ సరిహద్దులను పెట్టకుండా ఎందుకు బీజేపీ రాజకీయాలు చేస్తోంది.

    * బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న వాదన కేసీఆర్ ది.

    * రాజకీయ విమర్శలు లక్ష్మణ్ మానుకోవాలి--బీజేపీ బీసీలకు చేసింది ఏంటో చెప్పాలి?

    వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే@తెలంగాణ భవన్..

    * బీజేపీకి కేసీఆర్--టీఆరెస్ పై విమర్శలు చేయడం అలవాటు అయింది.

    * తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా బిసిలందరూ టీఆరెస్ కు బ్రమ్మరథం పడుతున్నారు.

    * హైదరాబాద్ లో ఉండి మాట్లాడితే నాయకుడు కాదు..గ్రామాల్లో తిరిగితే నిజాలు తెలుస్తాయి.

    * కేసీఆర్ పేరుకే అగ్రకులానికి చెందిన వ్యక్తి... బిసిలన్న బలహీన వర్గాలు అన్నా ప్రాణం.

  • 30 Sep 2020 1:31 PM GMT

    Komaram Bheem district updates: కొమరం భీమ్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు...

    కొమరం భీమ్ జిల్లా..

    -ఈనెల ముప్పై నుండి వచ్చేనెల. అక్టోబరు 31 వరకు అమలు..

    -బహిరంగ సభలు, సమావేశాల పై నిషేదం

    -ఉత్తర్వులు జారీ చేసిన ఇంచార్జ్ ఎస్పీ సత్యనారాయణ

  • Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కు కొనసాగుతున్న  వరద...
    30 Sep 2020 1:26 PM GMT

    Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద...

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

    -15 గేట్లు ఎత్తిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 117.550 మీటర్లు

    -పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    -ప్రస్తుత సామర్థ్యం 7.68 టీఎంసీ

    -ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 40,000 క్యూసెక్కులు

  • MP Asaduddin Owaisi:  బాబ్రీ మజీద్ పై తీర్పు ఒకే వ‌ర్గానికి అనుకూలం : ఎంపీ అసదుద్దీన్
    30 Sep 2020 9:58 AM GMT

    MP Asaduddin Owaisi: బాబ్రీ మజీద్ పై తీర్పు ఒకే వ‌ర్గానికి అనుకూలం : ఎంపీ అసదుద్దీన్

    - హైదరాబాద్ దారుస్సలాం ఎంఐఎం పార్టీ కార్యాలయం..

    - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మీడియా సమావేశం..

    - బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ కోర్టు తీర్పు తమకు బాధ కలిగించింది.. కె 

    - బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందరిపై అభియోగాలు కొట్టివేయడం ఈ రోజు ఆ తీర్పు వెలువరించడం చీకటి రోజులుగా భావిస్తున్నాం..

    - బాబ్రీ మసీదు కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు ఎలా తీర్పు ఇచ్చింది అర్దం కానీ విషయం..

    - సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేయడం ఎంత వరకు సరైన నిర్ణయం.

    - నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవన్న కోర్టు మరి బాబ్రీ మసీదు ఎవరు కూల్చేశారు తేల్చాలి..

    - బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది ఈ ఘటనలో ఎంతో మంది గాయాలు అయ్యాయి. ప్రాణాల మీదకు తెచ్చుకున్నరు.

    - ఉమ భారతి, అద్వానీ బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు అనంతరం వీరు అందరూ కలిసి స్వీట్లు పంచుకుని పండుగ చేసుకుంటున్నారు.

    - సీబీఐ ఛార్జ్ లో అనేక విషయాలు దాచి పెట్టింది.

    - కేంద్రంలో అద్వానీ కళ్యాణ్ సింగ్ తో ఎందుకు రాజీనామా చేయించలేదు..

    - బాబ్రీ మజీద్ పై సిబిఐ కోర్టు తీర్పు ఓ వర్గం వారికి అనుకూలంగా ఉంది..

    - సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది బాబ్రీ మసీదును మేము సంరక్షించడంలో..

    - బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ ఓ ముద్దాయి గ వున్నాడు కానీ కేంద్రం ఇతనికి సివిలైజేషన్ అవార్డు ఇచ్చింది..

  • 30 Sep 2020 9:10 AM GMT

    క‌స్ట‌డీలో హేమంత్ కేసు నిందితులు

    అవంతిక తండ్రి లక్ష్మ రెడ్డి,యుగేందర్ రెడ్డి లను కస్టడీలోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు

    చర్లపల్లి జైలు నుంచి ప్రైవేట్ వాహనం లో ఇద్దరు నిందితులను లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన గచ్చిబౌలి పోలీసులు.

  • HEMANTH MURDER CASE: సీపీ సజ్జనార్ ను కలిసిన హేమంత్ కుటుంబ సభ్యులు
    30 Sep 2020 8:11 AM GMT

    HEMANTH MURDER CASE: సీపీ సజ్జనార్ ను కలిసిన హేమంత్ కుటుంబ సభ్యులు

    - హేమంత్ కుటుంబ సభ్యలతో పాటు తనకి ప్రాణ హాని ఉందని సిపి తెలిపిన అవంతి.

    - నిందితులను కఠినంగా శిక్షించాలని కోరిన కుటుంబ సభ్యులు.

  • TRS: టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు..
    30 Sep 2020 8:08 AM GMT

    TRS: టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు..

    నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ

    టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు..

    బీజేపీ నుంచి మరో కార్పొరేటర్ జంప్

    అర్బన్ ఎం.ఎల్.ఏ. సమక్షం లో టిఆర్ ఎస్ లో చేరిన 27 వ డివిజన్ కార్పొరేటర్ నారాయణ

Print Article
Next Story
More Stories