Live Updates: ఈరోజు (సెప్టెంబర్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 29 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | త్రయోదశి: రా.10-21వరకు తదుపరి చతుర్దశి | శతభిష నక్షత్రం రా.1-41వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: ఉ.7-55 నుంచి 9-36 వరకు | అమృత ఘడియలు: సా.6-04 నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి రా.10-39 నుంచి 11-27 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 29 Sep 2020 9:55 AM GMT

    KONDAPUR: కోండాపుర్ లో రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు

    - హైదరాబాద్ కోండాపుర్ లో నూతనంగా చేపట్టిన Ghmc లింకు రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు

    - కొండాపూర్ గ్రామం సర్వే నెంబర్ 59 లో గల 12 మంది రైతులకు సంబంధించిన 24 ఎకరాల స్థలం తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డు పనులను అడ్డుకున్నారు

    - కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారులు తమ స్థలలలో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని ఆందోళన

    - కేవలం గ్రీన్ కో కంపెనీ కోసం రోడ్డు విస్తరణ పనులు నిర్వహిస్తున్నారని ఆరోపించిన రైతులు

  • MLA JAGGA REDDY: 2023లో త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే జ‌‌గ్గారెడ్డి
    29 Sep 2020 9:52 AM GMT

    MLA JAGGA REDDY: 2023లో త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే జ‌‌గ్గారెడ్డి

    *జగ్గారెడ్డి ...సంగారెడ్డి ఎమ్మెల్యే:  నిన్న సీఎల్పీ లో ఇన్ ఛార్జ్ మణికం ఠాగూర్ తో జరిగిన ముఖాముఖి సమావేశంలో నాకు ఇన్ ఛార్జ్ వార్నింగ్ ఇచ్ఛిన్నట్లు వార్తల ప్రచారాన్ని ఖండిస్తున్న దీని సోషల్ మీడియా లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది.

    - ఇది మంచి పద్దతి కాదు. నిన్న ఇన్ ఛార్జ్ తో సీఎల్పీ లో జరిగిన సమావేశం సంతృప్తిగా ఉంది.

    - ఇంచార్జి మణికం ఠాగూర్ లో పార్టీ బలోపేతం అవుతుంది.

    - తప్పకుండా 2023 లో ప్రజల సహకారంతో ప్రభుత్వాన్నీ  ఏర్పాటు చేస్తుందని నమ్మకం ఉంది ..

  • KTR :సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదు: మంత్రి కేటీఆర్
    29 Sep 2020 8:18 AM GMT

    KTR :సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదు: మంత్రి కేటీఆర్

    బతుకమ్మ చీరల ప్రదర్శన లో 

    # సంక్షోభ సమయంలోను తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆగలేదన్న మంత్రి కేటీఆర్

    - మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో మాత్రమే కోతలు విధించాం

    - ఢిల్లీలో మాకు అనుకూలమైన ప్రభుత్వం లేదు‌

    - రాజకీయ ప్రత్యర్థతులు కేంద్రంలో అధికారంలో ఉన్నా.. సంక్షేమ పధకాలను కొనసాగిస్తున్నాం

    - ఫ్లోరోసిస్ రహిత తెలంగాణ గురించి కేంద్రం పార్లమెంటు సాక్షిగా చెప్పింది

    - నేతన్నలు, రైతు ఆత్మహత్యల లేని తెలంగాణను చూస్తున్నాం

    - ఇతర రాష్ట్రలకు చీరలను సప్లై చేసే స్థాయికి మన నేతన్నలు ఎదగటం గర్వకారణం

    - చేనేతల కోసం వివిధ పథకాలు తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయి

    - మాకు మతపరమైన ఎజెండా లేదు. దసరా, రంజాన్, క్రిస్మస్ లకు చీరలిస్తాం

    - మహిళా సంఘాల ద్వారా అక్టోబర్ 9నుంచి చీరల పంపిణీ

    - నేతన్నల కష్టాలు తెలిసిన ఏకకై వ్యక్తి సీఎం కేసీఆర్

    - నేతన్నల ఆత్మహత్యలను పీడ కలగా మార్చిపోయేలా చేశాం

    - చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నాం

    - ఆడవాళ్ళకు నచిన చీర తేవటం భర్తల వల్ల కూడా కాదు'    

  • బల్దియా ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి.  కేటీఆర్
    29 Sep 2020 8:09 AM GMT

    బల్దియా ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి. కేటీఆర్

    మినిస్టర్ క్వాటర్స్ క్లబ్ హౌజ్..

    బల్దియా ఎన్నికలు మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పై హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్ లతో సమావేశంలో కేటీఆర్...

    #నవంబరు రెండో వారం తరువాత ఏ క్షణం అయిన గ్రేటర్ ఎన్నికలు వచ్చే అవకాశం...

    #అందరూ సిద్ధంగా ఉండాలి..

    #గ్రేటర్ లో 15 మంది కార్పొరేట్ ల పనితీరు బాగాలేదు సర్వేలో అదే విషయం తెలిసింది..

    #ఇప్పటికి అయినా పనితీరు మార్చుకోండి.

    #గ్రేటర్ హైదరాబాద్ లో అభివృద్ధి కి ఇప్పటికి 60వేల కోట్ల రూపాయలు వెచ్చించాము.

    #కార్పొరేట్ లకు ఇంకా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేల దృష్టి కి తీసుకురావాలి.

    #నిత్యం ప్రజల్లో ఉండండి.

    #గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకొని తెలియజేయండి.

    #అవసరం అయితే గ్రేటర్ అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేస్తాం.

    #ప్రతి కార్పోరేటర్ 3 వేల గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించాలి.

    #అక్టోబర్1 న ప్రజాప్రతినిధులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలి.

  • బల్దియా ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి.  కేటీఆర్
    29 Sep 2020 8:09 AM GMT

    బల్దియా ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి. కేటీఆర్

    మినిస్టర్ క్వాటర్స్ క్లబ్ హౌజ్..

    బల్దియా ఎన్నికలు మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పై హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్ లతో సమావేశంలో కేటీఆర్...

    #నవంబరు రెండో వారం తరువాత ఏ క్షణం అయిన గ్రేటర్ ఎన్నికలు వచ్చే అవకాశం...

    #అందరూ సిద్ధంగా ఉండాలి..

    #గ్రేటర్ లో 15 మంది కార్పొరేట్ ల పనితీరు బాగాలేదు సర్వేలో అదే విషయం తెలిసింది..

    #ఇప్పటికి అయినా పనితీరు మార్చుకోండి.

    #గ్రేటర్ హైదరాబాద్ లో అభివృద్ధి కి ఇప్పటికి 60వేల కోట్ల రూపాయలు వెచ్చించాము.

    #కార్పొరేట్ లకు ఇంకా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేల దృష్టి కి తీసుకురావాలి.

    #నిత్యం ప్రజల్లో ఉండండి.

    #గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకొని తెలియజేయండి.

    #అవసరం అయితే గ్రేటర్ అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేస్తాం.

    #ప్రతి కార్పోరేటర్ 3 వేల గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించాలి.

    #అక్టోబర్1 న ప్రజాప్రతినిధులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలి.

  • KTR MEETING: జీహెచ్ఎంసి ప్ర‌జాప్ర‌తినిధుల‌తో కేటీఆర్ సమావేశం
    29 Sep 2020 8:04 AM GMT

    KTR MEETING: జీహెచ్ఎంసి ప్ర‌జాప్ర‌తినిధుల‌తో కేటీఆర్ సమావేశం

    - జీహెచ్ఎంసి కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం

    # గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది

    #వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించి, వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధిపరచి , లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్ కు రప్పించిన ప్రభుత్వం మాది

    # గత ఐదు సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 67 వేల కోట్ల రూపాయలను హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేసింది

    #గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి చేసిన కార్యక్రమాలను, పథకాలను మౌలిక వసతులకు, సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని, ఒకచోట చేకూర్చి "ప్రగతి నివేదిక" విడుదల చేస్తాం

    #ఈ ప్రగతి నివేదిక గత ఐదు సంవత్సరాల్లో తమ పనితీరుకి నిదర్శనంగా ఉండబోతుంది.

    #జిహెచ్ఎంసి పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపు

    # రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లోకి మరింత సమాచారాన్ని తీసుకుపోవాలని కార్పొరేటర్ లకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు పిలుపు

    # హైదరాబాద్ నగరంలో అనేక కారణాలతో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ప్రజల ఆస్తుల పైన సంపూర్ణ హక్కులు లేకుండా కొన్ని సమస్యలు ఉన్నాయి

    #వీటన్నింటినీ సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది' 

    # ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీసుకువచ్చారు

    # స్థిరాస్తుల పైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుంది

    #ఇలాంటి ప్రక్రియలో దళారులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లకు సూచన

    #హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలన్న మంత్రి కేటీఆర్

    # హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచేందుకు నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లలను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నం చేయాలి

    #అక్టోబర్ 1వ తేదీన ప్రతీ ఒక్కరు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించాలి

  • AGRICULTURE BILL 2020: వ్యవసాయ బిల్లుతో రైతులకు మోడీ పట్టం కట్టారు: ఎంపీ అర్వింద్
    29 Sep 2020 7:59 AM GMT

    AGRICULTURE BILL 2020: వ్యవసాయ బిల్లుతో రైతులకు మోడీ పట్టం కట్టారు: ఎంపీ అర్వింద్

    నిజామాబాద్ : వ్యవసాయ బిల్లుతో రైతులకు మోడీ పట్టం కట్టారని ఎంపీ అర్వింద్  అన్నారు.

    వ్యవసాయ బిల్లు తో ప్రతిపక్షాల చాప్టర్ క్లోస్.

    అక్టోబర్ 2 నుంచి వ్యవసాయ బిల్లు పై రైతులకు అవగాహన సదస్సులు.

    వ్యవసాయ బిల్లు తో మార్కెట్ యార్డులు మూత పడతాయని దుష్ప్రచారం చేస్తున్నారు.

    మార్కెట్ ఫీజు రూపంలో 10వేల కోట్ల ఆదాయం పోయిందని టీ.ఆర్.ఎస్. గగ్గోలు.  

    బిల్లు ఏకపక్షంగా ఆమోదించారని అంటున్న టి.ఆర్.ఎస్. ప్రభుత్వం వి.ఆర్.ఓ.ల తొలగింపు పై ప్రతిపక్షల తో చర్చించారా?

    ముఖ్యమంత్రి రాష్ట్ర ఖజానా కోట్ల గొట్టి సొంత ఖజానా నింపుకుంటున్నారు.

    డి.శ్రీనివాస్, సురేష్ రెడ్డి, మండవ టి.ఆర్.ఎస్. లో చేరిన

    ఎంపీ ఎన్నికల్లో కవితను గెలిపించుకోలేకపోయారు.

    వలసల తో బీజేపీ కె మంచిది. కార్పొరేటర్ల పోతే పార్టీకి ఒరిగేది ఏమీలేదు.

    సునాయాసంగా గెలిచే బిడ్డ సీటు కోసం లక్షలు పోసి కొంటున్నారు.

    వేల కోట్లు తిన్న కేసీఆర్ ఆయన కొడుకు రాబోయే కాలం లో జైలుకు వెల్లడం ఖాయం.

  • Deepika kidnap case:  వికారాబాద్ దీపికా కిడ్నాప్ కథ సుఖంతం
    29 Sep 2020 7:53 AM GMT

    Deepika kidnap case: వికారాబాద్ దీపికా కిడ్నాప్ కథ సుఖంతం

    - Hmtv తో వికారాబాద్ ఎస్పీ నారాయణ...

    - ఆదివారం సాయంత్రం కిడ్నాప్ కి గురైన దీపికా క్షేమంగా ఉంది..

    - కొద్దీ సేపటి క్రితమే అఖిల్, దీపికా అందుబాటులోకి వచ్చారు..

    - మరికాసేపట్లో వికారాబాద్ ఎస్పీ కార్యాలయానికి రానున్న దీపికా, అఖిల్...

    - 6 బృందాలు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నాయి...

    - ఫోన్ డేటా, సిగ్నల్స్ ఇతర టెక్ నికల్ ఏవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేసాము.

  • 29 Sep 2020 7:48 AM GMT

    Karimnagar: బిల్ కలెక్టర్ లను నిర్బంధించిన గ్రామస్థులు

    కరీంనగర్ : బిల్ కలెక్టర్ లను నిర్బంధించిన గ్రామస్థులు ...

    - తాగు నీటి బావి విద్యుత్ కనెక్షన్ కట్ చేసారని ఆరోపణ

    - కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఘటన ...

    - విద్యుత్ బిల్లు వసూళ్లకు గ్రామానికి వచ్చిన బిల్ కలెక్టర్ ను గ్రామ పంచాయతీలో నిర్బంధించిన గ్రామస్తులు.

  • 29 Sep 2020 6:30 AM GMT

    Karimnagar updates: కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం..

    కరీంనగర్ :

    -కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రెవిన్యూ సమస్యల పై జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం..

    -సమావేశంలో పాల్గొన్న మానకొండూర్ MLA రసమయి బాలకిషన్ గారు, నగర మేయర్, సుడా చైర్మన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, తదితరులు..

Print Article
Next Story
More Stories