Live Updates: ఈరోజు (సెప్టెంబర్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 29 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | త్రయోదశి: రా.10-21వరకు తదుపరి చతుర్దశి | శతభిష నక్షత్రం రా.1-41వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: ఉ.7-55 నుంచి 9-36 వరకు | అమృత ఘడియలు: సా.6-04 నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి రా.10-39 నుంచి 11-27 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 Sep 2020 12:42 PM GMT
Vijayawada updates: కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పై కోర్టు ధిక్కరణ పిటీషన్..
కృష్ణాజిల్లా..
-2018లో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కోర్టు ఉత్తర్వులను అమలు పరచని కలెక్టర్ ఇంతియాజ్
-జగ్గయ్యపేట R.S.NO.278/1 దాఖలా 5.6 ఎకరాల ప్రభుత్వానికి చెందవలిసిన భూమికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశం
-కృష్ణా జిల్లా కలెక్టర్ వారు ఎటువంటి చర్యలు తీసుకొని క్రమంలో హైకోర్టులో పిటీషను దాఖలు
-ఏపీ హైకోర్టు లో రిట్ పిటీషన్ 6287/2019 దాఖలు
-హైకోర్టు 3 నెలల కాలంలో సదరు విషయంపై చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ కు ఆదేశం
-నేటికి కృష్ణాజిల్లా కలెక్టర్ ఎటువంటి చర్యలు చేపట్టని క్రమంలో వారిపై కోర్టు ఆదేశాలు ధిక్కరించినందుకు CC 969/2020 ద్వారా హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
- 29 Sep 2020 12:36 PM GMT
Amaravati updates: టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ కి పిటిషన్ కాపీ అందజేయాలని హైకోర్టు ఆదేశం..
అమరావతి..
-తిరుమలలో డిక్లరేషన్, పూజాధి కార్యక్రమాలు సరిగా నిర్వహణ లేదని దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు
-ఆగమ శాస్త్రంతో పాటు పిటిషన్ లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి మెటీరియల్ ను అందజేయాలని ఆదేశం
-తదుపరి విచారణ అక్టోబర్ 16కి వాయిదా
- 29 Sep 2020 12:34 PM GMT
Vijayawada updates: విస్సన్నపేటలో విగ్నేశ్వర ఎంటర్ ప్రైజెస్ లక్కీ డ్రా స్కీమ్ పేరిట ప్రజలకు కుచ్చుటోపీ..
కృష్ణాజిల్లా..
-నెలవారి నగదు చెల్లిస్తే వాహనాలు, గృహోపకరణాలు వస్తాయని నమ్మించి బోర్డ్ తిప్పేసిన వైనం
-సుమారు 30 లక్షలకు పైగా లక్కీడ్రా పేరిట మోసంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు
-బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించి దర్యాప్తు చేస్తున్న విస్సన్నపేట పోలీసులు
- 29 Sep 2020 10:01 AM GMT
CM JAGAN: వ్యవసాయ ఉత్పత్తుల సేకరణపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్
అమరావతి: వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం జగన్
- ఖరీఫ్ పంట చేతికొస్తుంది కాబట్టి, అక్టోబర్ 15 నుంచి ధ్యాసపెట్టాలి
- ఆర్‌బీకేల ద్వారా మన ప్రొక్యూర్‌మెంట్ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలి.
- ఈ క్రాపింగ్ ప్రతీ పంటకు కంప్లీట్ కావాలి.
- ఈ క్రాపింగ్ ఎక్కడా కూడా పెండింగ్ ఉండకూడదు,
- కలెక్టర్లు, జేసీలు దృష్టిపెట్టాలి
- ఈ క్రాపింగ్ తర్వాత రైతుల రిజిస్ట్రేషన్ జరగాలి,
- సోషల్ ఆడిట్ చేయాలి, మిస్ అయితే వెంటనే నమోదుచేయాలి.
- ఫామ్‌గేట్ అనేది ప్రతీ పంటకూ చేయాలి.
- కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్ చేస్తామని చెప్పాలి
-ఎక్కడా కూడా మ్యాన్యువల్ సర్టిఫికెట్ ఉండకూడదు,
- ఈ క్రాపింగ్ తప్పనిసరిగా జరగాలి
- సీఎంయాప్ ద్వారా మానిటరింగ్ జరగాలి,
- అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంటనే అలర్ట్ చేయాలి, జేసీలు వెంటనే రైతుకు మార్కెటింగ్ సౌకర్యం చూపాలి.
- ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అనేది అక్టోబర్ 1 న రిలీజ్ చేస్తాం, అక్టోబర్ 5 కల్లా అన్ని ఆర్‌బికేలలో డిస్‌ప్లే చేయాలి.
- కనీస గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ రేట్‌కు మనం అమ్మించగలగాలి
- రైతుకు పూర్తిగా తోడు నిలబడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
- *కలెక్టర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రైతు అనే వ్యక్తి నష్టపోతే అందరూ నష్టపోతారు, ఫార్మర్స్ ఈజ్ హయ్యెస్ట్ ప్రయారిటీ.
- కోవిడ్ 19 నివారణా చర్యలపై స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్.జగన్
- పాజిటివిటీ రేట్ 12.0 నుంచి 8.3 కి తగ్గడం మంచి పరిణామం
-టెస్ట్‌లు పెరిగాయి, కేసులు తగ్గుతున్నాయి.
కోవిడ్ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనం
కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే మనం దానికి తగిన విధంగా అప్రమత్తంగా ఉండాలి.
జనవరికల్లా వ్యాక్సిన్ వస్తుందనే పరిస్ధితి కనిపిస్తుంది
104 నెంబర్‌కు ఫోన్ కొడితే టెస్ట్‌లు, హాస్పిటల్స్ వివరాలు అందాలి.
ఈ నెంబర్‌కు మాక్ కాల్స్ చేసి నెంబర్ పనిచేస్తుందా లేదా పీరియాడికల్‌గా చెక్‌చేయండి,.
ఎక్కడైనా లోటుపాట్లుంటే వెంటనే సరి చేసుకోవాలి
ప్రతీ రోజూ మానిటర్ చేయండి.
ఈ నెంబర్‌కు ఫోన్ చేయగానే అరగంటలోనే బెడ్ అందుబాటులో ఉందో లేదో చెప్పాలి,కాబట్టి ఈ నెంబర్ పక్కాగా పనిచేయాలి.
కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రీట్ చేస్తున్న రాష్ట్రం మనదే
కోవిడ్ హాస్పిటల్స్ లిస్ట్ గ్రామ సచివాలయాల్లో ఉండాలి.
ఎంప్యానల్ హస్పిటల్స్ లిస్ట్ కూడా అందుబాటులో ఉండాలి
104కు ఎవరు ఫోన్ చేసినా కోవిడ్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు అందాలి.
రిక్రూట్ చేసిన వారంతా కూడా కరెక్ట్‌గా డ్యూటీకి వెళుతున్నారా లేదా చెక్ చేయాలి,
పీరియాడికల్లీ చెకప్ ఉండాలి
దాదాపు 30 వేల మందిని కొత్తగా తీసుకొస్తున్నాం,.
వీరందరినీ మానిటర్ చేయాలి
37000 వేల బెడ్స్, 240 హాస్పిటల్స్‌లో ఫుడ్, శానిటేషన్, ఇన్‌ఫ్రా, స్టాఫ్ వీటిపై మానిటరింగ్ పక్కాగా ఉండాలి.
ప్రతీ రోజూ కలెక్టర్లు, జేసీలు మానిటర్ చేయాలి
ఈ నాలుగు కరెక్ట్‌గా ఉంటే ట్రీట్మెంట్ కరెక్ట్‌గా అందుతుంది.
కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఫుడ్, శానిటేషన్, మెడికేషన్ ఖచ్చితంగా జరగాలి.
అక్కడ కూడా హెల్ప్ డెస్క్ ఉండాలి
హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కిట్లు ఇస్తున్నామా లేదా ప్రతీ ఒక్కరూ దృష్టిపెట్టాలి,
కిట్లు రాలేదంటే ఖచ్చితంగా కలెక్టర్లు, జేసీలు భాద్యత వహించాలి, ఏఎన్‌ఎంలు, లోకల్ డాక్లర్లు మ్యాపింగ్ చేయాలి, డాక్టర్ కూడా ఆ ఇంటికి వెళ్ళి చూడాలి,
ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం, పిహెచ్‌సీ డాక్టర్ ముగ్గురూ ఖచ్చితంగా వారితో మాట్లాడాలి.
104 నెంబర్ పబ్లిసిటీ కూడా బాగా జరగాలి, దానితో పాటు లోకల్ కంట్రోల్‌రూమ్ నెంబర్ కూడా పబ్లిసిటీ చేయాలి.
కోవిడ్ భాదితులను ఎర్లీగా ఐడెంటీటీ చేయడం వల్లే మరణాల సంఖ్య తగ్గుతుంది.
మనం చంద్రబాబు అనే వ్యక్తితో కాదు, నెగిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్న ఎల్లోమీడియాతో కూడా యుద్దం చేస్తున్నాం
మనం ఎంత మంచి చేస్తున్నా వేలెత్తి చూపే దుర్భుద్దితో పనిచేస్తున్నారు
అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం, నెగిటివ్ వార్తలు చదువుదాం, మనం కరెక్ట్ చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసుకుందాం, వారు అతిగా రాసినవి కూడా ఎత్తిచూపుదాం
- 29 Sep 2020 9:46 AM GMT
Thungabhadra Pushkaralu: తుంగభద్ర పుష్కరాల పనులకు 100.8 కోట్లు
అమరావతి: మొత్తం 34 పనులకు గాను 100.8 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు జారీ
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- 29 Sep 2020 9:40 AM GMT
PV SINDU: పీవీ సిందూ కు మరో ఏడాదిపాటు ఆన్ డ్యూటి ఫెసిలిటీ
అమరావతి: బ్యాట్మెంటన్ క్రీడా కారిణి పీవీ సిందూ కు మరో ఏడాదిపాటు ఆన్ డ్యూటి ఫెసిలిటీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- ఇప్పటికే హైదరబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఓఎస్డిగా ఉన్న డెప్యూటీ కలెక్టర్ పీవీ సిందూ
- ఈ ఏడాది ఆగష్టు 30 తో ఆన్ డ్యూటి వెసులుబాటు ముగియడంతో మరో ఏడాది పాటు పొడగింపు
- వచ్చే ఏడాది ఆగష్టు 31 వరకు ఆన్ డ్యూటి ఫెసిలిటీ కల్పించిన సర్కార్
- 29 Sep 2020 9:38 AM GMT
వైసీపీ నేత కుమారుడి నకిలీ బాగోతం .. 11 కోట్ల టోకరా
విశాఖ: నకిలీ పట్టాలతో రూ.11 కోట్లకు ఒక బ్యాంక్ కు టోకరా వేసిన వైసీపీ నేత కుమారుడు
- వైఎ సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుమారుడు జీడి పిక్కల కమీషన్ వ్యాపారం
- ఓ బ్యాంకు నుంచి జీడిపి క్కల ఉత్పత్తిదారుల (రైతులకు) పేరిట నకిలీ పట్టాదారు పాస్ పుస్త కాలను సృష్టించి ఏకంగా రూ.11 కోట్లు కొల్లగొట్టాడు.
- విశాఖ జిల్లా గొలుగొండ మండలం ఏఎల్ పురానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత కుమారుడు జీడిపిక్కల కమీషన్ వ్యాపారం చేస్తున్నాడు.
- అనకాపల్లి లో ఒక గోదాము నిర్వహిస్తున్నాడు.
- ఈ నేపథ్యంలో 2017లో అనకాపల్లి లోని బ్యాంక్ ఆఫ్ బరోడా ను సంప్రదించాడు.
- గొలుగొండ మండలంలో 16 మంది రైతులకు చెందిన జీడి పిక్కలు అనకాపల్లి గోదాములో నిల్వ ఉన్నట్లు చూపించి ఏకంగా రూ.11 కోట్ల రుణం తీసుకున్నాడు.
- ఇందులో సుమారు కోటి రూపాయలు వరకూ తిరిగి చెల్లించినట్లు సమాచారం
- మిగిలిన బకాయిలు చెల్లించకపోవడంతో జీడి పిక్కల గోదామును సీజ్ చేశారు.
- అంతేకా కుండా, రుణ మంజూరుకు తనఖాగా పెట్టిన 16 మంది రైతుల పట్టాదారు పాసు పుస్తకాల వివరాలను గొలుగొండ మండల రెవెన్యూ కార్యాలయానికి ఇటీవల పంపారు.
- క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక అందించాలని కోరారు
- వీఆర్వోలు రెండు మూడు రోజులుగా పాతమల్లంపేట, ఏఎల్ పురం, కృష్ణదేవిపేట గ్రామంలో పర్యటించారు.
- రైతులను కలిసి విచారణ జరిపారు
- పట్టాదారు పాస్ పుస్తకాల్లో నమోదైన పేర్లు, సర్వే నంబర్లు, రెవెన్యూ గ్రామలకు పొంతన లేదని గుర్తించారు.
- అనకాపల్లి బ్యాంకులో తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని రైతులు చెప్పినట్లు తెలిసింది.
- దీంతో సదరు వైసీపీ నేత కుమారుడి నకిలీ బాగోతం వెలుగు వచ్చింది
- 29 Sep 2020 9:31 AM GMT
KODALI NANI: చంద్రబాబుకు లోకజ్ఞానం తెలియదు: కొడాలి నాని:
కృష్ణాజిల్లా: గుడివాడలో కొడాలి నాని, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కైలే అనిల్ సమావేశం
ఎంపి బాలశౌరి: అమరావతి భూ కుంభకోణాలపై, గత ప్రభుత్వం సిబిఐ విచారణ ఎదుర్కోవాలి
- కేంద్రం సిబిఐ విచారణ వేసే వరకు పార్లమెంటులో నిరసన కొనసాగుతూ ఉంటుంది
- మంత్రి కొడాలి నాని: టీడీపీ సన్నాసులకు చంద్రబాబు స్క్రిప్టులు చదవడం తప్ప లోకజ్ఞానం తెలియదు
- దళితులపై దాడులు, టిడిపి నాయకులే చేయించి, జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు
- తీసేసిన తహసిల్దార్ లు లాంటి కొంతమంది టిడిపి నాయకులు టీవీ చర్చల్లో, విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారు
- టిడిపి నాయకులు కోర్టుల్లో కేసులు వేయడం వల్లే, ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా
- ఆలస్యమైన కేసులన్నీ పరిష్కరించి మహిళల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం
- 29 Sep 2020 9:25 AM GMT
CM JAGAN: తండ్రికి తగ్గ తనయుడు జగన్: మోపిదేవి వెంకటరమణ
కృష్ణాజిల్లా: కుటుంబ సమేతంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ
- స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మోపిదేవి వెంకటరమణ దంపతులు
- రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.
- తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రంలో జగన్ అద్భుతమైన పరిపాలన చేస్తున్నారని - మోపిదేవి వెంకటరమణ, రాజ్యసభ సభ్యుడు అన్నారు.
- ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు పాలనలో ప్రతి సంవత్సరం నీటి కొరత కొనసాగింది
- జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలకు సాగునీటికి తాగునీటికి కొరత లేదు
- జగన్ కృషితో ఈరోజు రాయలసీమలో సైతం నీటి కొరత లేకుండా ఉంది
- రానున్న రోజుల్లో సముద్రం పాలు అవుతున్న నీటిని ఒడిసి పట్టి ప్రతి నీటి బొట్టు ప్రజలకు అందేలా కృషి చేస్తాం
- 29 Sep 2020 8:52 AM GMT
TTD NEWS: అక్టోబరులో శ్రీవారి విశేష ఉత్సవాలు
తిరుమల:
- తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరులో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు
- అక్టోబరు 1, 31వ తేదీల్లో పౌర్ణమి గరుడ సేవ.
- అక్టోబరు 15న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
- అక్టోబరు 16న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
- అక్టోబరు 20న గరుడసేవ.
- అక్టోబరు 21న పుష్పక విమానం.
- అక్టోబరు 24న చక్రస్నానం.
- అక్టోబరు 25న పార్వేట ఉత్సవం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire