Live Updates: ఈరోజు (సెప్టెంబర్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 29 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | త్రయోదశి: రా.10-21వరకు తదుపరి చతుర్దశి | శతభిష నక్షత్రం రా.1-41వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: ఉ.7-55 నుంచి 9-36 వరకు | అమృత ఘడియలు: సా.6-04 నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి రా.10-39 నుంచి 11-27 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 Sep 2020 4:24 PM GMT
National News : నూతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ల నియామకం
జాతీయం
- వాణిజ్య శాఖ కమిటీ చైర్మన్ గా మరోసారి వై ఎస్ ఆర్ సి పి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
- పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు
- రవాణా పర్యాటక సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మెన్గా బీజేపీ ఎంపీ టిజి వెంకటేష్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ.
- 29 Sep 2020 2:41 PM GMT
Amalapuram updates: బ్యాంక్ లో కోటి నిధుల గోల్మాల్..పోలీసులకు ఫిర్యాదు..
తూర్పు గోదావరి జిల్లా..
అమలాపురం..
-సమనస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బంగారు ఆభరణాలు లేకుండా కోటి నిధుల గోల్మాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంకు ఉన్నతాధికారులు
-బ్యాంక్ క్యాషియర్ బీవీ సత్య సుబ్రహ్మణ్య శర్మ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎస్ బి ఐ రీజనల్ మేనేజర్ కోల జగదీశ్వర్ రావు
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అమలాపురం పోలీసులు
- 29 Sep 2020 2:33 PM GMT
National updates: ఎస్.పి. బాలుకి “భారత రత్న” ఇవ్వాలి: జయప్రద..
ఢిల్లీ:
-రాష్ట్రపతికి, ప్రధానికి సినీనటి జయప్రద లేఖలు..
-ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కు “భారత రత్న” పురస్కారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి,
-ప్రధానికి సినీ నటి జయప్రద లేఖలు.
- “భారత రత్న” పురస్కారం ప్రదానం చేయడం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకి ఘనమైన నివాళులని లేఖలో పేర్కొన్న జయప్రద.
-సినీ సంగీతానికి, భారత చలన చిత్ర పరిశ్రమ కి ఎస్.పి.బి చేసిన ఎనలేని సేవలు చేశారని లేఖలో వివరించిన జయప్రద.
- 29 Sep 2020 2:02 PM GMT
Guntur updates: ఇద్దరు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు..
గుంటూరు జిల్లా..
-నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం లో ఇద్దరు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు.
-బుకీలు నుండి 2 లక్షల 58 వేలు నగదు,13 సెల్ ఫోన్లు,ఒక లాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.....
- 29 Sep 2020 1:57 PM GMT
Anantapur updates: కేసి కెనాల్ డైవెర్షన్ నీరు ఇప్పటికి అడుక్కోవాల్సి వస్తోంది..
అనంతపురం:
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి:
-డిస్ట్రిబ్యూటర్ లకి నీరు రావడం లేదు. వచ్చే ఏడాది కి హంద్రీనీవా కింద ఆయకట్టు కి ఇవ్వండి.
-ఎంపీఆర్ డ్యాం కింద ఆయకట్టు కు నీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు.
-అజెండా లో సమగ్ర సమాచారం లేదు. ముందుగా నీళ్లు ఇవ్వకపోతే రైతులు నష్టపోతారు.
- 29 Sep 2020 1:50 PM GMT
West Godavari updates: ఉచిత మెగా పశు వైద్య శిబిరంలో పాల్గొన్న మంత్రి తానేటి వనిత..
పశ్చిమ గోదావరి జిల్లా..
-పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వురు నందమూరు రోడ్లో గల ఎమ్. వి. ఆర్ రైస్ మిల్లు ఆవరణలో ఏర్పాటు చేసిన
-ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయిలో జరుపుతున్న ఉచిత మెగా పశు వైద్య శిబిరం లో పాల్గొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత.
-పశుగ్రాసాల సాగు, దాని ఆవశ్యకత పై మరియు జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమ అవగాహన సదస్సు లో పాల్గొన్న మంత్రి తానేటి వనిత.
- 29 Sep 2020 1:45 PM GMT
Visakha updates: భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ నిధిని వేరు అవసరాలకు మళ్లించవద్దు.
విశాఖ..
టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కామెంట్స్:
-సంవత్సరకాలంగా నష్టపోయి కష్టపడుతున్న కార్మికులను ఆదుకోండి
-ఇప్పటికే ఇసుక కొరత కారణంగా ఆరు నెలలు పాటు నిర్మాణ రంగం కుదేలయింది
-ఇప్పుడు కరోనా కారణంగా దాదాపు ఫిబ్రవరి నెల నుండి మళ్ళి పనులు కోల్పోయి కష్టపడుతున్నారు .
-వారి సంక్షేమ నిధిని విడుదల చేయకుండా , నెలలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది
-సిఎం జగన్, కార్మిక శాఖ మంత్రి కి గణబాబు వినతి
- 29 Sep 2020 1:41 PM GMT
Vijayawada updates: ఏపీ సీఎం జగన్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు..
విజయవాడ..
కన్నబాబు....ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి:
-ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభం లో ఉండే పరిస్థితి వస్తుందని అనవసర ప్రచారం చేస్తున్నారు.
-ప్రస్తుతం చంద్రబాబు మతాన్ని ఎంచుకుని. దారుణ ప్రచారం చేస్తున్నారు
-అంతర్వేది రథం సంఘటన పై ఇంకా రాజకీయం చేస్తున్నారు.
-ప్రతిదీ రాజకీయం చేసి బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు.
-జరిగిన దాడుల ఘటనల వెనుక టీడీపీ హస్తం ఉందని విచారణలో తేలినట్టు నాకు సమాచారం ఉంది
-డిజిపి ని ఇష్టారాజ్యంగా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.
-పోలీస్ వ్యవస్థ ను దిగ జార్చారని బాబు మాట్లాడ్డం తప్పు.
-ప్రజల్లో వ్యవస్థ ల గొప్పతనాన్ని దిగ జారుస్తున్నారు బాబు..
-చంద్రబాబు ను ఇలాగే వదిలేస్తే అమ్మఒడి....ఆరోగ్య శ్రీ కూడా తన పథకాలే అంటారు.
- 29 Sep 2020 1:36 PM GMT
Amaravati updates: మాజీ జడ్జి రామకృష్ణ వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్ర రెడ్డి..
అమరావతి..
-మాజీ జడ్జి రామ కృష్ణ విషయంలో పదే పదే చంద్రబాబు నా ప్రస్తావన తెస్తున్నారు.
-నేను హరిజనులకు వ్యతిరేకినని నాపై ముద్ర వేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
-జడ్జి రామకృష్ణ తమ్ముడిపై దాడి చేసింది టీడీపీ నేతలే.
-జడ్జి రామకృష్ణ విషయంలో చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోండి.
-జడ్జి రామ కృష్ణను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చెయ్యాలని చేస్తున్నారు.
-టీడీపీ కి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి జడ్జి రామకృష్ణ తమ్ముడిపై దాడి చేశారు.
-నాపై పదే పదే విమర్శలు చేసిన చంద్రబాబు దీనికి ఏమి సమాధానం చెప్తారు.
-డిజిపి రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం చెప్పాలి
-ప్రభుత్వం,పార్టీ దళితులకు వ్యతిరేకమనే ముద్ర వేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
-కొందరు మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్ర రెడ్డి..
- 29 Sep 2020 1:29 PM GMT
Anantapur updates: నీటిపారుదల శాఖ సమస్యలపై అధికారులు స్పందించడం లేదు: ప్రకాష్ రెడ్డి..
అనంతపురం:
-వాడి వేడిగా ఐఏబీ సమావేశం.
ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి:
-పేరురు డ్యాం కు ఒక టీఎంసీ నీరు ఇస్తామని గత మీటింగ్ లో చెప్పారు అజెండాలో తగ్గించారు.
-పిఎబిఆర్ డ్యాం కింద లక్ష ఎకరాల ఆయకట్టు కు నీరివ్వాలి.
-పిఎబిఆర్ లో నీటినిల్వ సామర్థ్యము పెంచే చర్యలు తీడుకోండి.
-హెచ్ ఎల్ సి ఆధునికీకరణ పూర్తి చేయండి.
-ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి: హంద్రీనీవా సెకండ్ ఫేజ్ పనులు పూర్తి చేయాలి.
-నియోజకవర్గం లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. చెరువులకు నీరు ఇచ్చి ఆదుకోండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire