Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 28 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి: రా.9-38 వరకు తదుపరి త్రయోదశి | ధనిష్ఠ నక్షత్రం రా.12-19 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: మ.1-31 నుంచి 3-11 వరకు | దుర్ముహూర్తం: మ.12-15 నుంచి 1-03 వరకు తిరిగి మ.2-39 నుంచి 3-27 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-51

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Kurnool district updates: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద ఉధృతి..
    28 Sep 2020 4:29 AM GMT

    Kurnool district updates: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద ఉధృతి..

    కర్నూలు జిల్లా..

    -10 గేట్లు 25 అడుగుల మేర ఎత్తివేత

    -ఇన్ ఫ్లో 4,21,748 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 6,00,908 క్యూసెక్కులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు

    -ప్రస్తుతం 884 అడుగులు

    -పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు

    -ప్రస్తుతం 210.0320 టీఎంసీలు

    -కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • Visakha updates: పెందుర్తి మండలం లో గుర్తుతెలియని మృతదేహం..
    28 Sep 2020 4:23 AM GMT

    Visakha updates: పెందుర్తి మండలం లో గుర్తుతెలియని మృతదేహం..

    విశాఖ..

    -పెందుర్తి మండలం లో 96 వార్డు పరిధి మర్రిచెట్టు కాలనీ దుర్గ ఆదర్శనగర్ లో గుర్తుతెలియని మృతదేహం..

    -రాత్రి ఒంటిగంట ప్రాంతంలో సుమారు 30 సంవత్సరాలు గల వ్యక్తిని చంపి నడిరోడ్డుపై ఒదిలి వెళ్లిపోయిన హంతకులు..

    -దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

  • Nellore district updates: సోమశిల జలాశ యాని కి కొనసాగుతున్న వరద ప్రవాహం...
    28 Sep 2020 4:20 AM GMT

    Nellore district updates: సోమశిల జలాశ యాని కి కొనసాగుతున్న వరద ప్రవాహం...

    నెల్లూరు :--

    -- ఇన్ ఫ్లో 1లక్ష 20 వేల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 1లక్ష 20 వేల క్యూసెక్కు లు.

    -- ప్రస్తుత నీటి మట్టం సి 74.28 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు

  • Anantapur district updates: అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గుట్కా సంచుల స్వాధీనం..
    28 Sep 2020 4:18 AM GMT

    Anantapur district updates: అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గుట్కా సంచుల స్వాధీనం..

    అనంతపురం:

    -అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ డోనేకల్ వద్ద పెద్ద ఎత్తున గుట్కా సంచుల స్వాధీనం

    -బళ్లారి నుంచి రూ మూడు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

    -గుత్తి పట్టణానికి చెందిన ముగ్గురు అరెస్టు, రిమాండ్ కు తరలింపు

  • Tirumala updates: శ్రీవారి దర్శనం కోసం సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా...?
    28 Sep 2020 4:13 AM GMT

    Tirumala updates: శ్రీవారి దర్శనం కోసం సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా...?

    తిరుపతి..

    ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి..

    -గోవింద నామాలు నుదుటున పెట్టుకుని ఆయన దర్శనానికి వెళ్ళటం కంటే డిక్లరేషన్ ఉంటుందా?

    -దళితులకు వైకాపా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది

    -తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నాకు అవమానం జరిగింది అనేది అవాస్తవం

    -ప్రతిపక్షానికి మరేం లేక గుడులు..గోపురాల పై రాజకీయాలు చేస్తోంది

  • Tirumala updates: అలిపిరి సమీపంలో ఎస్వీబీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం..
    28 Sep 2020 3:10 AM GMT

    Tirumala updates: అలిపిరి సమీపంలో ఎస్వీబీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం..

    తిరుపతి..

    -టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి..

    -కార్యాలయాన్ని ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

    -రిలయన్స్ సౌజన్యంతో చేపట్టనున్న అలిపిరి కాలినడక మార్గం ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన

    -25 కోట్ల రూపాయలతో కాలినడక మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన రిలయన్స్ సంస్థ.

    -ఎస్వీబీసీ నూతన కార్యాలయాన్ని 20 కోట్ల రూపాయల వ్యయంతో తీర్చిదిద్దాం

    -త్వరలో ఎస్వీబీసీ ఇంగ్లీష్, హిందీ భాషల్లో చానళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

    -కల్యాణోత్సవాలు సహా ఆన్లైన్ లో జరిపేందుకు అవకాశం ఉన్న సేవలను ఆన్లైన్ లో పెట్టేందుకు కృషి చేస్తున్నాం

    -25 కోట్ల రూపాయలతో రిలయన్స్ సౌజన్యంతో అలిపిరి నడక మార్గాన్ని అభివృద్ధి చేస్తాం

    -భక్తులు పెద్దగా లేనందున 6నెలల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నాం

  • Amaravati updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక..
    28 Sep 2020 2:46 AM GMT

    Amaravati updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక..

    అమరావతి.. 

    - కె. కన్నబాబు, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్..

    -కృష్ణా వరద ఉధృతి..

    -ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

    -ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 5,97,087 క్యూసెక్కులు

    -కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

  • Krishna District updates: విస్సన్నపేట మండలం కొర్రతండాలో క్రికెట్ బుకీల అరెస్టు..
    28 Sep 2020 1:53 AM GMT

    Krishna District updates: విస్సన్నపేట మండలం కొర్రతండాలో క్రికెట్ బుకీల అరెస్టు..

    కృష్ణజిల్లా..

    -29 మంది బుకీలను అదువులోకి తీసుకున్న విస్సన్నపేట పోలీసులు

    -వారివద్ద నుంచి ఒక టీవీ, ఒక సెల్ ఫోన్ స్వాధీనం..

Print Article
Next Story
More Stories