ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 28 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం దశమి (ఉ. 10-59 వరకు) తదుపరి ఏకాదశి, మూల నక్షత్రం (మ. 3-46 వరకు) తదుపరి పూర్వాషాఢ, అమృత ఘడియలు (ఉ. 9-35 నుంచి 11-07 వరకు) వర్జ్యం (మ. 2-14 నుంచి 3-46 వరకు తిరిగి రాత్రి 1-12 నుంచి 2-46 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-26 నుంచి 1-16 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-16
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 28 Aug 2020 1:02 PM GMT
Narayanapet Updates: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పట్టివేత..
నాగర్ కర్నూల్ జిల్లా :
జిల్లా కేంద్రంలో కరోన పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ చికిత్స పొందుతున్న వారి ఇళ్ళ వద్దకు వెళ్ళి కిట్స్,పండ్లు, బ్రెడ్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి...
నారాయణ పేట్ : మద్దూర్ మండలం తిమ్మారెడ్డి పల్లి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పట్టివేత..
పోలీస్ స్టేషన్ కు తరలించి , కేసు నమోదు చేసిన పోలీసులు .
- 28 Aug 2020 12:21 PM GMT
సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం గొల్లపల్లి మండలం గుట్ట గూడెం అన్నపురెడ్డిపల్లి లో 400 ఎకరాల భూమిని 110 మంది ఆదివాసీ గిరిజనులు 22 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నారు...
ఈ భూముల్లో పత్తి నువ్వులు జీడి తోటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు...
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పత్తి పంటను వేశారు...
ప్రతి మొక్కలు ఏపుగా పెరిగే క్రమంలో సాయుధ బలగాలు 70 మంది ఫారెస్ట్ ఆఫీసర్ రెండు వందల మంది పోలీసులు వచ్చి పంటను ధ్వంసం చేయడం అన్యాయం...
ఎంతో కష్టపడి పంట సాగు చేస్తుంటే ధ్వంసం చేయడం సమంజసమా...?
19 మంది గిరిజనుల పై కేసులు పెట్టారు...
గిరిజనుల పై కేసులు ఉపసంహరించుకొని భూములను సాగు చేస్తున్న సాగుదరులకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి....
- 28 Aug 2020 12:21 PM GMT
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
లక్ష్మీ బ్యారేజ్
65 గేట్లు ఎత్తిన అధికారులు
పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 91.20 మీటర్లు
పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 1.047 టీఎంసీ
ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,52,000 క్యూసెక్కులు
- 28 Aug 2020 12:21 PM GMT
నిర్మల్ జిల్లా బాసర. బాలుని హత్య కేసును చేదించిన పోలీసులు..
పాలు త్రాగిస్తానని చెప్పి ప్రాణం తీసిన కిరాతకుడు
బాలున్ని హత్య చేసింది నాగరాజుని నిర్థారించిన పోలీసులు..
నిజామాబాద్ అరస పల్లి లో బాలున్ని హత్య చేసి బాసర రైల్వే స్టేషను సమీపంలో బాలుని శవాన్ని పడేసిన పోలీసులు..
నిజామ్ బాద్ మహిళ తో గత కోన్ని రోజులు గా అక్రమ సంబంధం కోనసాగిస్తున్నా నాగరాజు
అక్రమ సంబంధం బయట పడటంతో నాగరాజు పై దాడి చేసిన. బాలుని తండ్రి..
ఆ పగతోనే బాలుని హత్య చేసిన నాగరాజు
- 28 Aug 2020 12:20 PM GMT
ఏసీబీ కోర్ట్......
కీసర మాజీ తహసీల్దార్ కేసులో బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్ట్ విచారణ..
ఇప్పటికే నలుగురు నిందితులు బెయిల్ పిటీషన్..
బెయిల్ పిటిషన్ పై కౌంటర్ ధాఖలు చేయడానికి సమయం కోరిన ఏసీబీ..
బెయిల్ పిటీషన్ పై సోమవారం విచారించనున్న ఏసీబీ కోర్టు.
తదుపరి విచారణను సోమవారం కు వాయిదా.
- 28 Aug 2020 10:30 AM GMT
సంగారెడ్డి కలెక్టరేట్‌లో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్ ల పంపిణీ కార్యక్రమం.
530 మందికి చెక్ లు పంపిణీ చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
మంత్రి హరీశ్ రావు కామెంట్స్.
కరోనా తో ఆదాయం తగ్గినా సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా 7400 కోేట్లు రైతు బంధు సాయం అందించింది.
పేదల సంక్షేమమే ప్రభుత్వ కర్తవ్యం.
కరోనా ఇబ్బందుల్లో నూ పేదల ఆసరా పెన్షన్ల కోసం వేయి కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.
- 28 Aug 2020 10:30 AM GMT
కరీంనగర్ : మరోసారి లోయర్ మానేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు
మూడు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల
లోయర్ మానేరు కి వస్తున్న 10 వేల క్యూసెక్స్ ఇన్ ఫ్లో
కాకతీయ కెనాల్ ..,గేట్ల ద్వారా కొనసాగుతున్న 10 వేల క్యూసెక్స్ అవుట్ ఫ్లో
- 28 Aug 2020 10:30 AM GMT
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అభ్యంతరాలు వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ లో నేడు వాదనలు వినిపించిన తెలంగాణ ప్రభుత్వం
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో లో అన్ని అంశాలను పరిశీలించకుండానే పర్యావరణ అనుమతులు అవసరం లేదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఇప్పుడున్న దానికంటే అధికంగా నీటిని తరలించే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి రాయలసీమలో 10 లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించకుండానే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చి ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరకరం. కమిటీ ఇచ్చిన నివేదిక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది
కమిటీలో 4 సభ్యులు ఉంటే ఇద్దరు సభ్యులు ఈ నివేదికను తోసిపుచ్చారు , మరొక సభ్యుడు మౌనంగా ఉన్నప్పటికీ ఓకే సభ్యు డు ఇచ్చిన నివేదికను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని వాదించిన తెలంగాణ ప్రభుత్వం
పర్యావరణ శాఖ తరఫున కమిటీ తరఫున ఒకే వ్యక్తి ఇచ్చిన నివేదిక వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణాట్రిబ్సునల్ లో నష్టం వాటిల్లుతుంది.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ విస్తరణ తో ముందుకు వెళుతుంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి NGT ఎటువంటి సంబంధం లేదు ఇది జలవివాదం అని ట్రిబ్యునల్లో వాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
తదుపరి విచారణను వచ్చే నెల మూడో (3) తారీఖు వాయిదా వేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.
- 28 Aug 2020 10:29 AM GMT
రాచకొండ సీపీ, మహేష్ భగవత్
లాక్ డౌన్ సడలింపుతో మళ్ళీ చోరీలు పెరిగాయి...
మేడిపల్లి పొలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగిన చోరి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశాము..
మధ్య ప్రదేశ్ కి చెందిన రితురాజ్ సింగ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు..
గతంలో నగరంలో ద్విచక్రవాహనాల చోరీ లో అరెస్ట్ అయ్యాడు .
2016 మధ్య ప్రదేశ్ లో ఓ హత్య కేసులో రితురాజ్ నిందితుడు.
విడుదల అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి ప్రసాద్ సేన్ తో కలిసి చోరీలు చేస్తున్నారు.
రెక్కీ చేసి శివారు ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలకు పాలడ్డారు....
- 28 Aug 2020 10:29 AM GMT
జగిత్యాల జిల్లా : జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన
కొడిమ్యాల మండలం నల్లగొండ వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్...
పాల్గొన్న జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ వసంత
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire