Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧
Live Updates
- 27 Oct 2020 4:27 PM GMT
Amaravati Updates: ఆపదమిత్ర పథకంలో శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపిక...
అమరావతి:
-విపత్తు నిర్వహణ కింద కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపదమిత్ర పథకంలో శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపిక
-వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం అందించేందుకు దేశ వ్యాప్తంగా ఆరు వేల మంది కమ్యూనిటీ వలంటీర్లను సిద్దం చేస్తున్న కేంద్రం.
-దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లోని 30 జిల్లాల్లో రెండు వందల చొప్పున కమ్యూనిటీ వాలంటీర్లను సిద్ధం చేయాలని నిర్ణయం
-వరదల్లో ప్రజలకు సాయం అందించేలా కమ్యూనిటీ వలంటీర్లకు ఆపద మిత్ర పథకం కింద శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం.
-కృష్ణా జిల్లాలోని 200 మంది కమ్యూనిటీ వలంటీర్లను గుర్తించి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం
-ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ద్వారా కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం
-రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో అత్యవసర పరిస్థితులు, వరద సమయాల్లో అత్యవసరంగా స్పందించేందుకు 9 జిల్లాల్లో హ్యామ్ రేడియో వ్యవస్థను ఏర్పాటు చేసిన విపత్తు నిర్వహణ సంస్థ
- 27 Oct 2020 4:26 PM GMT
Nellore District updates: టిడిపి నేత మాజీమంత్రి పై నెల్లూరు ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్....
నెల్లూరు :--
-- సర్వేపల్లిలో ధాన్యం కొనుగోలులో టీడీపీ కార్యకర్తే అక్రమాలకు పాల్పడ్డాడు.. దానిపై విచారణకు ఆదేశించాము.. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం..
-- సోమిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు.. ప్రజలు గమనిస్తున్నారు.
-- ఇక జీవితంలో సోమిరెడ్డి ఎమ్మెల్యే కాలేడు..ఆ ఆందోళనతో ఇష్టమొచ్చిట్లు మాట్లాడుతున్నారు.
-- ఇప్పటి కీ సోమిరెడ్డి అధికారంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు..
-- ఎన్నడూ లేని విదంగా ఈసారి ఎడకారులో అధిక మొత్తంలో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసాము.
- 27 Oct 2020 4:17 PM GMT
Tirumala Updates: నవంబరు నుండి ఆన్‌లైన్ సేవలుగా శ్రీవారి ఆర్జిత సేవలు....
తిరుమల
-- శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కోవిడ్ - 19 నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్లో వర్చ్యువల్ విధానంలో నవంబరు నెలలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయం.
-- లాక్‌డౌన్ తరువాత శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తుంది.
-- వర్చ్యువల్ ఆర్జిత సేవల పాల్గొన్న భక్తులకు దర్శనం లేదు.
-- సాయంకాలం నిర్వహించే సహస్రదీపాలంకార సేవను భక్తుల విజ్ఞప్తి మేరకు ఆలయం వెలుపల సహస్రదీపాలంకార సేవా మండపంలో ప్రయోగాత్మకంగా నిర్వహణ
-- ఇకపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధులలో విహరించి ఆలయానికి చేరుకుంటారు.
-- ఈ సేవలను గృహస్థ భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలి వీక్షించాలి.
-- సేవల్లో పాల్గొనే గృహస్తుల గోత్ర నామాల పట్టికను శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.
- 27 Oct 2020 4:11 PM GMT
Nellore District Updates: ధాన్యం తడిసినా ఈ స్థాయిలో సేకరించడం దేశంలోనే ఒక రికార్డ్ ..
నెల్లూరు :--
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్.
-- ఒక పక్క రాష్ట్రంలో అకాల వర్షాలు , పంట నష్టాలు జరిగిన నేపథ్యంలో రైతు భరోసా కింద ఇచ్చిన ఆర్థిక సహాయం రైతులకు కొంత ఊరట కలిగించింది.
-- నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎడగారులో 3 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం ఓ రికార్డు.
-- అధికార యంత్రాంగం కదిలి రాజకీయ నాయకత్వం మొత్తం ముందుండి నడిపి ఏ విపత్తు వచ్చినా మేమున్నామ౦టూ భరోసా ఇచ్చింది.
-- ఇప్పుడు కూడా టీడీపీ మాపై బురద చల్లేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తోంది..
-- రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేస్తే.. గత ప్రభుత్వం ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తినా పట్టించుకోలేదు..
-- సీఎం జగన్మోహన్రెడ్డి ఏ విధంగా రైతులకు అండగా నిలబడుతున్నారో రైతులకు , రాష్ట్ర ప్రజలకు తెలుసు..
-- జిల్లాలో ఏ చిన్న సమస్య తలెత్తినా మేమున్నామంటూ నాయకులంతా వస్తున్నారు..
-- చిన్న చిన్న లోటు పాట్లు ఉన్న సరిదిద్దుకునే౦దుకు వాటిపై కూడా దృష్టి పెడుతున్నాం
-- భవిష్యత్తులో మరింత సమన్వయంతో పనిచేసి జగన్మోహన్రెడ్డి ఆశయాల మేరకు ప్రజల జీవితాల్లో అట్టడుగు స్థాయి వరకు మార్పు తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తా౦..
- 27 Oct 2020 3:25 PM GMT
Bonda Uma: ఎన్నికల కమిషన్ సమావేశం లో టిడిపి నేతలు పాల్గొంటారు...
-ఎన్నికల నిర్వహణ పై బోండా ఉమ
-బీహార్ లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి
-కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది
-ఎపి లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహింవచ్చు
- 27 Oct 2020 3:11 PM GMT
Vijayawada Updates: అమరావతిని నాశనం చేయాలనే ఏకైక లక్ష్యం తో వైసిపి ప్రభుత్వం పని చేస్తుంది...
విజయవాడ
-బోండా ఉమ మాజీ mla
-315రోజులుగా రైతులు, మహిళల లు ఆందోళన చేస్తున్నా జగన్ స్పందించక పోవడం దారుణం
-ఎప్పుడూ బయటకు రాని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. పోలీసులు తో కొట్టించా
-అనేక అక్రమ కేసులు పెట్టినా .. భయపడకుండా ఉద్యమం కొనసాగిస్తున్నారు
-ఇప్పటికే అనేక మంది రైతులను జైలుకు పంపారు
-అమరావతి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా కార్యక్రమం చేపడి మళ్లీ కేసులు పెట్టారు
-ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడమే కాక, తీవ్రవాదులు కు తరహాలో రైతులకు సంకెళ్లు వేయడం నీచమైన చర్య
-అన్నదాతలను ఏవిధంగాఈ ప్రభుత్వం చూస్తుందో ఆలోచించండి
-అమరావతి అనుకూలంగా ఉద్యమం చేసినవారిని అణచివేయాలని జగన్ చూస్తున్నా
-ఎపి లో పోలీసులు రాజ్యం నడుస్తుంది... వారిని అడ్డం పెట్టుకొని జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు
-ఈ ఘటనల పై జాతీయ మానవుల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
-ఫిర్యాదు వెనక్కి తీసుకుంటామన్న కూఢా.. పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం సరి కాదు
-న్యాయ పరంగా కూడా పోలీసులు, ప్రభుత్వం పై పిటీషన్ వేస్తాం
-జిఒ నెంబర్ 21 ప్రకారం ప్రజలపై ఫైన్ల భారం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది
-ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు ప్రజల నుంచి చిన్న తప్పులకే భారీ జరిమానాలు వేస్తారా
-దీని వల్ల అవినీతి మరింత పెరిగే అవకాశం ఉంది
-సాక్షి పత్రిక లో ఇష్టం వచ్చినట్లు గా యాడ్ ల రూపంలో ప్రభుత్వ సొమ్మును కూడ పెడుతున్నారు
-ప్రజలు నిబంధనలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
-అంతేకానీ తప్పులు దొరికాయని ప్రజల నుంచి వేలకు వేలు బాధేయడం దుర్మార్గం
-భరత్ అను నేను సినిమా ప్రభావం తో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారేమో
-ఈ 21జిఒ వల్ల... కొంతమంది అధికారులు వసూళ్ల కూడా మొదలు పెట్టారు
-ఈ జిఒ రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నిరసన కార్యక్రమాలు చేపడుతుంది
-ఇటువంటి తుగ్లక్ జిఒలు, తుగ్లక్ నిర్ణయాలను ఉపసంహరించు కోవాల
- 27 Oct 2020 3:04 PM GMT
Amaravati Updates: ఎన్నికల కమీషన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని పార్టీనిర్ణయించడం జరిగింది...
అమరావతి
-యస్.విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
-భారతీయ జనతా పార్టీ రేపు జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని పార్టీనిర్ణయించడం జరిగింది.
-పార్టీ ప్రతినిధిగా సీనియర్ నాయకులు పాక సత్యనారాయణ హాజరు కావాలని రాష్ట్ర బిజెపి నిర్ణయించడం జరిగింది.
-పార్టీ ప్రతినిధిగా ఆయన రేపు సమావేశంలో పాల్గొని పార్టీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు.
- 27 Oct 2020 2:48 PM GMT
Vizianagaram Updates: ముగిసిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం..
విజయనగరం..
-అతి తక్కవ భక్తులతో నిరాడంబరంగా జరిగిన సిరిమానోత్సవం
-సిరిమానోత్సవాన్ని తిలకించిన మంత్రి బొత్స సత్యనారాయణ, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య
-సిరిమానోత్సవాన్ని ఎల్సీడి స్క్రీన్ల ద్వారా వీక్షించిన భక్తులు
- 27 Oct 2020 2:38 PM GMT
Peddireddy Ramachandra Reddy Comments: సీఎం గారి వినూత్న ఆలోచనతో గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
-పరిపాలన ప్రతి ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళింది
-అమలవుతున్న సంక్షేమ ఫలాలు వీటి ద్వారా అందుబాటులోకి వచ్చాయి
-ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారు
-కాళీలు 16208 కు నోటిఫికేషన్ ఇచెప్పుడు ఉన్నాయి
-18048 కాళీలు ప్రస్తుతం ఉన్నాయి...మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా ఎంపిక
-7.68 మంది క్వాలిఫై అయ్యారు....
-ఈ ఏడాది కట్ ఆఫ్ లేదు...మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది
-చాలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాం
-గత ఏడాది, ఈ ఏడాది చూసినా ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు
- 27 Oct 2020 2:07 PM GMT
Amaravati Updates: గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్..
అమరావతి
*పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, ఉన్నతాధికారులు
*వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలు గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
*సమన్వయంతో పనిచేయాలని వివిధ డిపార్ట్మెంట్ లకు ఆదేశం
*కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 155251 నంబర్ కు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచన
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire