ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 27 Aug 2020 5:36 PM GMT
- గౌలిగుడ అగ్గిని ప్రమాద స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే రాజసింగ్...
- అగ్ని ప్రమాదం గల కారణాలు అధికారులను, యజమాని ఆడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
- పాఠశాల దుస్తులు మరియు బెల్టులు, దీనివల్ల దగ్దం మైనట్లు... దాదాపు 1 కోటి రూపాయల నష్టం జరిగినట్లు ఎమ్మెల్యే కు వివరించిన షాప్ యజమాని
- 27 Aug 2020 5:07 PM GMT
Hyderabad breaking news:గౌలిగూడ కొత్త బస్తీలో అగ్ని ప్రమాదం
- హైదరాబాద్ గౌలిగూడ కొత్త బస్తీలో అగ్ని ప్రమాదం..
- స్టేషనరీ కి సంబంధించిన గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో ఎగిసిపడుతున్న మంటలు..
- ఘటనా స్థలానికి చేరుకున్న అఫ్జల్ గంజ్ పోలీసులు, ఫైర్ ఇంజన్ సిబ్బంది..
- ఐదు ఫైర్ ఇంజన్ లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా అగ్నిమాపక సిబ్బంది..
- 27 Aug 2020 2:36 PM GMT
Keesara tahasildar case: కీసర కేసులో నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు చేపించిన ఏసీబీ..
- కీసర కేసులో నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు చేపించిన ఏసీబీ..
- అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచిన ఏసీబీ అధికారులు..
- నలుగురు నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ రీమాండ్ కు చంచల్ గూడ జైల్ కు తరలించిన ఏసీబీ.
- నిందితులు ధాఖలు చేసిన బెయిల్ పిటీషన్ రేపు ఏసీబీ కోర్ట్ విచారణ.
- 27 Aug 2020 2:35 PM GMT
Etela Rajender: పారామెడికల్ సంఘాల డిమాండ్ల పై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈటల
- డాక్టర్స్, పారామెడికల్ సంఘాల డిమాండ్ల పై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈటల..
- ప్రభుత్వ నిర్ణయం తో ఆందోళన తాత్కాలికంగా వాయిదా వేసుకున్న డాక్టర్లు, హెల్త్ కేర్ సిబ్బంది
- కరోనా తో చనిపోయిన వైద్య సిబ్బందికి ఎక్స్ గ్రేషయా ఇచ్చే విషయం నిర్ణయం..
- ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా ల్లో విధానాలను పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తామని హామీ..
- డాక్టర్లకు, హెల్త్ కేర్ సిబ్బందికి నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స కోసం ప్రభుత్వం జీవో ఇవ్వనుoది.
ఈటల
- కరోనా వచ్చి లీవ్ లో ఉన్న వాళ్లకు ఆన్ డ్యూటీ కింద పరిగణనలోకి తీసుకుంటూ జీవో ఇస్తాం.. ఈటల
- 27 Aug 2020 12:36 PM GMT
HimayathSagar: హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫారం హౌస్ సందర్శించిన శంషాబాద్ dcp ప్రకాష్ రెడ్డి
- హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫారం హౌస్ సందర్శించిన శంషాబాద్ dcp ప్రకాష్ రెడ్డి
- రాజేంద్రనగర్ సీఐ సురేష్ తో పాటు అటవీశాఖ అధికారులు సందర్శించారు...
- రాజేంద్రనగర్ చిరుత జాడలు కనుక్కోవడానికి ప్రత్యేక డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు..
- పోలీస్ అధికారులు జాగిలాలు తో (కుక్కలు) సైతం. రంగంలోకి దించారు..
- చిరుతను పట్టుకునేందుకు అధికారులు బూన్ లను ఏర్పాటు చేశారు.
- 27 Aug 2020 12:35 PM GMT
Hyderabad Weather Updates: 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది: ఐఎండి డైరెక్టర్ హైదరాబాద్
- ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నైరుతి జార్ఖండ్ లో కేంద్రీకృతమై ఉంది దీనికనుగుణంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది...
- దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి...
- ఈ ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి ,రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
- తెలంగాణ జిల్లాలో రేపు ,ఎల్లుండి తేలికపాటి వర్షాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాలో రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది....
- ఈరోజు ప్రత్యేకంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి,జనగామ ,సూర్యాపేట, నల్గొండ, వరంగల్ జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- కోస్తాంధ్ర లో ఇవాళ ,రేపు ఎల్లుండి తేలికపాటి వర్షాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇవాళ ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- దక్షిణకొస్తా, రాయలసీమ జిల్లాలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది..
- దక్షిణ కోస్తాలో ఇవాళ ఒకటి ,రెండు చోటక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
- హైదరాబాద్ లో ఇవాళ ,రేపు తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి ,రెండు చోట్లా భారీ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది..
- నైరుతి రుతుపవనాల కాలంలో ఇప్పటి వరకు తెలంగాణ సాధారణం కన్నా 47 శాతం అధికంగా ఒక వరంగల్ పట్టణంలో నే సాధారణం కన్నా 150 శాతం అధికంగా,నిర్మల్ జిల్లాలో 11 శాతం లోటు వర్షపాతం నమోదైంది...
- కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 47 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది...
- 27 Aug 2020 12:34 PM GMT
Narayanapet: నారాయణపేట జిల్లా ఏరియా ఆసుపత్రి ముందు అఖిలపక్షం ఆద్వర్యంలో దర్నా
నారాయణపేట జిల్లా :
- ఊట్కూరు మండలం ఎర్గట్ పల్లి లో జరిగిన ఘటనలో నిందితులను వెంటనే శిక్షించాలని నారాయణపేట జిల్లా ఏరియా ఆసుపత్రి ముందు అఖిలపక్షం ఆద్వర్యంలో దర్నా.
- 27 Aug 2020 12:30 PM GMT
Lakshmi Barrage: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 91.90 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 1.463 టీఎంసీ
- ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,96,850 క్యూసెక్కులు
- 27 Aug 2020 12:29 PM GMT
Sarasvathi Barrage: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరస్వతి బ్యారేజ్
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరస్వతి బ్యారేజ్
- 8 గేట్లు ఎత్తిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ
- ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 14,300 క్యూసెక్కులు
- 27 Aug 2020 12:27 PM GMT
Gandhi Bhavan:ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని గాంధీభవన్లో NSUI చేపట్టిన దీక్ష
గాంధీ భవన్
- రాష్ట్రంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని గాంధీభవన్లో NSUI చేపట్టిన దీక్ష ను సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..
- రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ ఆమరణ నిరాహార దీక్ష
- చేస్తున్నట్లుగా ప్రకటన
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- రాష్ట్ర ప్రభుత్వ తీరు తో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు...
- కరుణ వైరస్ వ్యాప్తి సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు
- విద్యార్థుల కోసం ఎన్ఎస్యుఐ నిరాహార దీక్ష చేస్తుంది..
- జాతీయ స్థాయి లో నిర్వహించే
- NEET, JEE నీ పోస్ట్ ఫోన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది..
- విద్యార్థులు జీవితాలతో దేశంలో మోడీ, రాష్ట్రం లో కేసీఆర్ ఆటలు ఆడుతున్నారు...
- కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న టైంలో పరీక్షలు పోస్ట్ ఫోన్ చేయాలి...
- తెలంగాణ రాష్ట్రం లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ కూడా పోస్ట్ ఫోన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది...
- జాతీయ స్థాయి NEET- JEE, , రాష్ట్ర స్థాయి లో ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు...
- అయ్యకార్ భవన్ వద్ద ఆందోళన చేపడతాం.
- దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేయాలి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire