Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 27 Aug 2020 3:31 PM GMT
Ananthapur: ఆస్పత్రి ఆవరణ లో విద్యత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు
అనంతపురం:
- ఆస్పత్రి ఆవరణ లో విద్యత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు
- రెండు రోజుల కిందట రికార్డు రూమ్ లో షార్ట్ షార్క్యూట్ తో ప్రమాదం. ప్రమాదాన్ని వెంటనే గుర్తించడం తో తప్పిన ముప్పు.
- 27 Aug 2020 3:29 PM GMT
KanakaDurga Flyover: కనకదుర్గ ఫ్లైఓవర్ పై లోడ్ టెస్టింగ్ చేయనుండడంతో ట్రాఫిక్ డైవర్షన్
విజయవాడ
- కనకదుర్గ ఫ్లైఓవర్ పై లోడ్ టెస్టింగ్ చేయనుండడంతో ట్రాఫిక్ డైవర్షన్
- హైదరాబాదు నుంచీ వచ్చే వాహనాలకు మళ్ళింపులు లేవు
- గుంటూరు నుంచీ వచ్చే వాహనాలకు పోలీసు కంట్రోల్ రూమ్ నుంచీ సీతార సెంటర్, గొల్లపూడి మీదుగా మళ్ళింపు
- ప్రకాశం బ్యారేజి నుంచీ వచ్చే వాహనాలు బీఆర్పీ రోడ్, చిట్టినగర్, సితారా సెంటర్ మీదుగా మళ్ళింపు
- ఏలూరు నుంచీ వచ్చే వాహనాలు ఇన్నర్ రింగ్, పైపుల రోడ్, సీవీఆర్ ఫ్లైఓవర్, సితారా సెంటర్, గొల్లపూడి మీదుగా మళ్ళింపు
- 27 Aug 2020 2:48 PM GMT
Visakhapatnam District: విశాఖ జిల్లాలో దారుణం.వాలంటీర్ భర్త చేయి నరికివేత.
విశాఖ:
- విశాఖ జిల్లాలో దారుణం.వాలంటీర్ భర్త చేయి నరికివేత.
- భీమిలి వార్డు వాలంటరీ హేమ భర్త శ్రీనివాసరావు చేయి నరికేసిన దుండగులు...
- నిడిగట్ఠు వార్డు వాలంటీర్ హేమను కొంతకాలంగా వేదిస్తున్న మాస్ చిన్న అనే వ్యక్తి....
- హేమ భర్త శ్రీనివాసరావు కు విషయం తెలపడంతో చిన్న ను మందలించిన శ్రీనివాస్...
- కక్షతో మాస్ చిన్న అనుచరులతో శ్రీనివాసరావు పై దాడి.
- దాడిని అడ్డుకున్న శ్రీనివాసరావు సోదరుడు ప్రసాద్ కు కూడా గాయాలు .
- క్షతగాత్రులు కింగ్ జార్జి ఆసుపత్రి కి తరలింపు .
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్ప భీమిలి పోలీసులు
- 27 Aug 2020 2:33 PM GMT
Srikakulam District: సోంపేటలో 19 మంది వాలంటీర్ లను విధుల నుంచి తొలిగించిన అధికారులు
శ్రీకాకుళం జిల్లా..
-సోంపేటలో 19 మంది వాలంటీర్ లను విధుల నుంచి తొలిగించిన అధికారులు..
- కోవిడ్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున తొలగింపు..
- వాలంటీర్ లను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు..
- 27 Aug 2020 12:38 PM GMT
Kakinada: 20 ఆక్సిజన్ యూనిట్ లు అంద చేసిన జన సేన నాయకుడు పంతం నానాజి
తూర్పు గోదావరి..
- కాకినాడ: జన సేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మ దినోత్సవం సందర్భంగా కాకినాడ GGH సూపరిండెంట్ డా. రాఘవేంద్రరావు కి 20 ఆక్సిజన్ యూనిట్ లు అంద చేసిన జన సేన నాయకుడు పంతం నానాజి తదితరులు.
- 27 Aug 2020 12:33 PM GMT
Ananthapur: జిల్లాలో సెబ్ ఆధ్వర్యంలో ఈరోజు కొనసాగిన దాడులు, స్వాధీనం వివరాలు
అనంతపురం:
* జిల్లాలో సెబ్ ఆధ్వర్యంలో ఈరోజు కొనసాగిన దాడులు, స్వాధీనం వివరాలు
* నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 1700 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు.
* 1056 టెట్రా పాకెట్లు, 38 మద్యం సీసాలు, 88 లీటర్ల నాటు సారా స్వాధీనం.
* 21 కేసులు నమోదు... 27 మంది అరెస్టు...09 వాహనాలు సీజ్
* ఇసుక అక్రమాలపై చర్యలు..
* 3 కేసులు నమోదు... ఏడుగురు అరెస్టు
* ఒక జె.సి.బి, 4 ట్రాక్టర్లు స్వాధీనం... 15 టన్నుల ఇసుక స్వాధీనం
- 27 Aug 2020 12:28 PM GMT
Coronavirus Updates in Srikakulam: జిల్లాలో విజృంభిస్తున్న కరోనా..
శ్రీకాకుళం జిల్లా..
- జిల్లాలో విజృంభిస్తున్న కరోనా..
- గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 846 పాజిటివ్ కేసులు నమోదు..
- దీంతో జిల్లా వ్యాప్తంగా 21,095 కి చేరిన కరోనా కేసుల సంఖ్య..
- ఈరోజు కరోనా నుంచి కోలుకుని 523 మంది డిశ్చార్..
- ప్రస్తుతం జిల్లాలో 5,878 ఆక్టీవ్ కేసులు..
- 27 Aug 2020 12:26 PM GMT
CM YS Jagan Review Meeting: మత్స్యశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.
అమరావతి.
- పశుసంవర్ధక, మత్స్యశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.
- పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు.
- 27 Aug 2020 12:26 PM GMT
Health Minister Alla Nani: "మాస్కే కవచం" పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం
విజయవాడ
- "మాస్కే కవచం" పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడి
- విజయవాడలోని ఆర్ &బి బిల్డింగ్ కొవిడ్ కమాండ్ సెంటర్ లో ప్రచార కార్యక్రమాన్ని ప్రాంభించిన మంత్రి ఆళ్ల నాని
- అధ్యక్షత వహించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి
- కొవిడ్ మహమ్మారిని అంతం చేయడమే ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం
- ఉపయోగించిన మాస్కుల్ని మూడురోజులపాటు మూసిన కవర్లో ఉంచి పారవేయండి మంత్రి ఆళ్ల నాని
- ఇలా చేస్తే ఒకరి నుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందదు
- మీ ఇళ్లల్లో వయసు మీరిన వారికి కొవిడ్ వ్యాప్తి చెందకుండా యువత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
- బయటికి వెళ్లినప్పుడు యువత తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలి మంత్రి ఆళ్ల నాని
- మాస్కుల వల్ల ప్రయోజనాల్ని వైద్య ఆరోగ్య శాఖ తో పాటు మిగతా ప్రభుత్వ శాఖలన్నీ అవగాహన కల్పిస్తున్నాయి
నెల రోజుల విస్తృత ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలి
మంత్రి ఆళ్ల నాని
- 27 Aug 2020 11:38 AM GMT
Coronavirus Updates in Nellore: జిల్లాలో కొనసాగుతున్న కరోనా విలయం..
నెల్లూరు:
-- జిల్లాలో కొనసాగుతున్న కరోనా విలయం..
-- ఈవాళ రికార్డు స్థాయిలో 1234 మందికి సోకిన మహమ్మారి.
-- జిల్లాలో 26,893 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire