Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 26 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి: రా.9-43 వరకు తదుపరి ఏకాదశి | ఉత్తరాషాఢ నక్షత్రం రా.11-00 వరకు తదుపరి శ్రవణం | వర్జ్యం: ఉ.7-04 నుంచి 8-39 వరకు, తిరిగి తె.వ. 3-04 నుంచి 4-41 వరకు | అమృత ఘడియలు: సా..4-38 నుంచి 6-13 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-53 నుంచి 7-29 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-53
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 Sep 2020 9:23 AM GMT
ఎస్సార్ నగర్ పిఎస్ అప్డేట్..
- ఇద్దరిని మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు..
- నిన్న కస్టడీలోకి తీసుకోగానే శ్రావణి నివాసంతో పాటు శ్రీ కన్య హోటల్ వద్ద ఏ1 దేవరాజ్ రెడ్డి ఏ 2 సాయికృష్ణ రెడ్డి ఇద్దరితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు..
- మూడు రోజుల కస్టడీ లో భాగంగా మరికొంత సమాచారాన్ని సేకరించనున్న పోలీసులు .
- 26 Sep 2020 9:20 AM GMT
Nirmal News: నిర్మల్ లో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత ర్యాలీ
నిర్మల్ జిల్లా కేంద్రంలో సీఎంకు కృతజ్ఞతగా నిర్మల్ లో ర్యాలీ*
- ర్యాలీని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- కోత్త రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ర్యాలీ
- పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం ప్రకటించిన రైతులు, పార్టీ శ్రేణులు
- 26 Sep 2020 7:52 AM GMT
అప్రమత్తంగా ఉండాలి : ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్
- రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్ననేపధ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
- రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.
- జిల్లా అధికారులందరు హెడ్ క్వార్టర్ లోనే ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలని.
- ఉద్యోగులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని, సెలవు దినాలలో ఎటువంటి మినహాయింపు అనుమతులు ఇవ్వరాదని సి.యస్ ఆదేశం.
- లోతట్లు ప్రాంతాలు, వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలపే ప్రత్యేక నిఘా పెట్టాలి.
- వర్షాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్ రూం కు పంపాలన్నారు.
- ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను సి.యస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
- 26 Sep 2020 7:47 AM GMT
Mahabubabad News: చెరువుకు గండి
మహబూబాబాద్ జిల్లా : పెద్ద వంగర మండలం గంట్లకుంట గ్రామంలోని చింతలకుంట చెరువుకు గండి...
గ్రామంలోకి చేరిన వరద నీరు.. మునిగిన ఇండ్లు..
కొడకండ్ల - తొర్రూరు ప్రధాన రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నిలిచిపోయిన రాకపోకలు..
వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.
- 26 Sep 2020 7:43 AM GMT
Hussain Sagar: నిండుకుండలా హుస్సేన్ సాగర్
- భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ వద్ద పెరిగిన నీటిమట్టం
- వరద ఉధృతితో 513.69 మీటర్లకు చేరిన నీటి మట్టం
- దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన జిహెచ్ఎంసి అధికారులు
- 26 Sep 2020 6:22 AM GMT
యాసంగికి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
యాసంగికి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
#11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ ప్రభుత్వం
# గత యాసంగిలో సాగు లెక్కల ప్రకారం 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం
#తెలంగాణలో పెరిగిన సాగునీటి వసతులు, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా గత యాసంగి కన్నా 30 శాతం సాగు పెరిగే అవకాశం ఉందని తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ
#గత యాసంగిలో 53.82 లక్షల ఎకరాలలో సాగు
#మొత్తం సాగులో యూరియా అధికంగా వినియోగించే వరి, మొక్కజొన్న, ఉద్యానపంటలే 80 శాతం
#వానాకాలం పంటల కన్నా యాసంగి పంటలలో యూరియా అధిక వినియోగం
# ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కోరిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
#గత ఏడాది 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులకు గాను 7.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం
#రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను 2 లక్షల మెట్రిక్ టన్నులు పెంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చేందుకు అంగీకరించిన కేంద్రం
#10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 1.2 లక్షల మెట్రిక్ టన్నుల డీఎపీ, 1.1 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, 0.5 లక్షల మెట్రిక్ టన్నుల సూపర్ పాస్ఫేట్, 5.5 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో కలిపి 18.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తెలంగాణకు కేటాయించిన కేంద్రం
#కేటాయింపులకు అనుగుణంగా సరఫరా చేయాలని, అదనంగా అవసరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసే విజ్ఞప్తులకు సహకరించాలని వినతి
#తప్పకుండా సహకరిస్తామని కేంద్రం హామీ
- 26 Sep 2020 2:54 AM GMT
Mahaboobnagar updates : ఇసుక కూపన్ల జారీలో అవకతవకలు..తహశీల్దార్ సస్పెన్షన్
మహబూబాబాద్:
* నర్సింహులపేట మండలం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, ఆర్ ఐ లను సస్పెండ్ చేసిన కలెక్టర్.
* జిల్లాలోని ఆకెరువాగు ఇసుక తరలింపు వ్యవహారంలో నర్సింహులుపేట తహసీల్దార్ పున్నంచందర్ తోపాటు, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ లపై వేటు వేసిన జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్...
* ఇసుక తరలింపులో కుపన్ల జరిపై అవకతవకలకు పాల్పడడంతో తహసీల్దార్ పున్నం చందర్ సస్పెండ్, ఇద్దరు అధికారుల బదిలీలు ఉత్తర్వులు జారీచేసిన మహబూబాబాద్ కలెక్టర్..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire