Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 26 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి: రా.9-43 వరకు తదుపరి ఏకాదశి | ఉత్తరాషాఢ నక్షత్రం రా.11-00 వరకు తదుపరి శ్రవణం | వర్జ్యం: ఉ.7-04 నుంచి 8-39 వరకు, తిరిగి తె.వ. 3-04 నుంచి 4-41 వరకు | అమృత ఘడియలు: సా..4-38 నుంచి 6-13 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-53 నుంచి 7-29 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-535-53
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 Sep 2020 12:05 PM GMT
ప్రకాశం జిల్లా,
ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పీసీ పాయింట్స్.
జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో 162ప్రాంతాల్లో ధాడులు చేశాం.
నకిలీ స్టాంపులు, నకిలీ బ్రాండ్స్ తో ఉన్న కాలీ గోతాలు, బిల్స్, లేబుల్స్ ను స్వాధీనం చేసుకున్నాం.
32మంది నిందితులపై కేసులు నమోదు చేశాం.
వీరివద్ద అక్రమంగా నిలువ ఉన్న నాలుగు లక్షల ముపైఐదు వేల ఎనిమిది వందల కేజీల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం.
వీటి విలువ ఒక్కకోటి పదిలక్షలు.
కోటి 46లక్షల కిలోల బయ్యాన్ని ఇప్పటి వరకు నిందితులు అక్రమంగా తరలించినట్లు విచారణలో తేలింది.
నిర్వాహకులు మిల్లర్లను మద్యవర్తులుగా చేసుకుని కొంతమంది బ్రోకర్ల ద్వారా పాలీస్ చేసి నకిలీ బ్రాండ్లను సృష్టించి చెనై, నెల్లూరు కృష్ణ పట్నం మహారాష్ట్ర లోని పన్వేల్ పోర్ట్స్ ద్వారా అక్రమ రవాణా సాగుతోంది.
జిల్లాలో పట్టు బడ్డ నిందితులపై 16క్రిమినల్ కేసులు నమోదు చేశాం.
ఈ సంఘటనపై విచారణ ఇంకా కొన సాగుతోంది.
నిందితులు పెరిగే అవకాశం ఉంది.
మార్టూరులో బయటపడ్డ ఈ వ్యవహారంలో గతంలో రైస్ మిల్లులో పనిచేసిన రమేష్ ప్రధాన సూత్రధారిని పట్టుకొని విచారించడంతో పాత్రదారులను గుర్తించ గలిగాం.
తనకున్న అనుభవంతో నెట్ వర్క్ ఏర్పాటు చసుకొని ఇంటర్నేషనల్ స్థాయిలో అక్రమ బియ్యం వ్యాపారం సాగించారు.
దీని ద్వారా ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని నివారించ గలుగుతున్నాం.
- 26 Sep 2020 12:05 PM GMT
శ్రీకాకుళం జిల్లా..
టిడిపి పాలన పై స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు..
గత ప్రభుత్వంలో ప్రజా ధనం దుర్వినియోగం అయ్యింది..
కాంట్రాక్టర్ లకు ఇచ్చిన అవినీతి డబ్బుతో మరో పోలవరం కట్టచ్చు..
అందుకే వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండర్లు తెచ్చింది..
రివర్స్ టెండర్లు ద్వారా రాష్ట్రానికి 12, 13 వేల కోట్లు నిధులు మిగులుతున్నాయి..
బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఉన్న జాబులు కత్తిరించుకు వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు..
కానీ జగన్ పాలన అలా కాదు..
మాట ఇచ్చాడంటే జాబు వచ్చినట్లే..
మరొక నెల రెండు నెలల్లో టీచర్లకి మెగా డీఎస్సీ ఇస్తున్నారు..
మెగా డీఎస్సీ ద్వారా సుమారు లక్ష ఉద్యోగాలను ప్రభుత్వం ప్రకటన చేయబోతోంది..
- 26 Sep 2020 12:04 PM GMT
కర్నూలు జిల్లా శ్రీశైలం
శ్రీశైలం జలాశయానికి గంట గంట కు పెరుగుతున్న వరద ఉధృతి
10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
ఇన్ ఫ్లో 2,96,328 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 3,10,879 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం 885 అడుగులు
పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు
ప్రస్తుతం 215.8070 టీఎంసీలు
కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 26 Sep 2020 12:04 PM GMT
అమరావతి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించిన అఖిల భారత భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్.
ఆ జాబితాలో చోటు దక్కించుకున్న అందరికీ శుభాకాంక్షలు....
జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ఆధ్వర్యంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో భాజపా బలోపేతానికి ఈ సభ్యులు మార్గదర్శనం అవ్వాలని ఆకాంక్ష...
ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర సహా ఇంచార్జి సునిల్ దేవధర్ జాతీయ కార్యదర్శి .వై. సత్యకుమార్కి హార్దిక శుభాకాంక్షలు....
- 26 Sep 2020 12:04 PM GMT
కడప :
వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తున్న లక్ష్మీప్రసన్న అత్మహత్యా యత్నం..
ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపర్వైజర్ సుదర్శన్ వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ
మనస్థాపం చెంది ట్యాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఆమె బంధువులు ఆరోపణ ..
విషయం తెలుసుకుని బంధువులు ఆమెను హుటాహుటిన వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...
పరిస్థితి విషమం కావడంతో ఆమెను కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలింపు...
- 26 Sep 2020 12:03 PM GMT
మంత్రి అవంతి శ్రీనివాసరావు పొలిటికల్ కామెంట్స్
వైయస్ రాజశేఖర్ రెడ్డి,జగన్ మోహన్ రెడ్డి దేవుడిని ప్రగాఢంగా నమ్ముతారు.
కొంత మంది నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మతాల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దేవాలయాపై దాడులు జరగడం దుర్మార్గం.
చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.
- 26 Sep 2020 9:13 AM GMT
క్రైస్తవ సమాధుల ధ్వంసం
గుంటూరు: చిలకలూరిపేట లో క్రైస్తవ సమాధుల ధ్వంసం చేయడం దుర్మార్గం. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం.
- సంబంధిత అధికారులు బహిరంగ క్షమాపణ చెప్పాలి.
- టిడిపి క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీ.
- 26 Sep 2020 9:10 AM GMT
YSR Jalakala Program: 28న 'వైయస్‌ఆర్ జలకళ' పథకం ప్రారంభం
అమరావతి: ఈ నెల 28న 'వైయస్‌ఆర్ జలకళ' పథకం ప్రారంభం
- క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్
- రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు మేలు
- వైయస్‌ఆర్ జలకళ కోసం రూ.2,340 కోట్లు కేటాయింపు
- 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా అందనున్న సాగునీరు
- పారదర్శకత కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్
- దరఖాస్తు నుంచి బోర్ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం
: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- 26 Sep 2020 9:04 AM GMT
మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఫిర్యాదు
గుంటూరు: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఫిర్యాదు
- మంగళగిరి రూరల్ స్టేషన్ లో చీటింగ్ చేశారంటు ఫిర్యాదు.
- దమ్మాలపాటి కుటుంబం తనను మోసం చేసిందని ఫిర్యాదు చేసిన రిటైర్డ్ లెక్చరర్ కోడె రాజా రామ్ మోహన్...
- దమ్మాలపాటి కుటుంబం భాగస్వామ్యం తో కృష్ణాయపాలెం లేక్ వ్యూ అపార్ట్మెంట్ లు నిర్మాణం....
- ప్లాట్ విషయం లో తనను మోసం చేశారని కోడె ఫిర్యాదు.
- బాధితుడు ఫిర్యాదు మేరకు దమ్మాలపాటి కుటుంబం పై కేసు నమోదు చేయునున్న పోలీసులు
- 26 Sep 2020 9:02 AM GMT
నిండు కుండలా ఏలేరు జలాశయం.
తూర్పుగోదావరి : నిండు కుండ ను తలపిస్తున్న ఏలేరు జలాశయం..
- 85.95 మీటర్లకు చేరుకున్న రిజర్వాయర్ నీటి మట్టం..
- రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 86.56 మీటర్లు కావడంతో ఆందోళన లో దిగువ ప్రాంత రైతులు.
- 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్న అధికారులు..
- రిజర్వాయర్ నుంచి వస్తున్న వరద నీటితో ఇప్పటికే 30 చోట్ల గండ్లు పడిన ఏలేరు కాలువ..
- ఏలేరు కాలువ పరివాహక ప్రాంతంలో నీట మునిగిన వేలాది ఎకరాల వరి పంట..
- గత 12 రోజులుగా వరద నీటిలో ఉన్న పంట పొలాలు..
- ఏలేరు జలాశయం ఎగువన క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలు..
- ఏలేరు రిజర్వాయర్ లో చేరుతున్న వరద నీరు.. గరిష్ట స్థాయికి చేరువులో ప్రాజెక్ట్ నీటి మట్టం..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire