Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 Oct 2020 4:26 PM GMT
Hydarabad Updates: ట్యాంక్ బండ్ పై సందడి వాతావరణం....
హుస్సేన్ సాగర్...
//హుస్సేన్ సాగర్ వద్దకు నిమజ్జనానికి భారీగా చేరుకుంటున్న దుర్గామాత విగ్రహాలు
//నిమజ్జనానికి ట్యాంక్ బండ్ పై 10 క్రేన్లను ఏర్పాటుచేసిన జిహెచ్ఎంసి
//నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు
//ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్డు మీద వచ్చే వాహనాల దారి మళ్లింపు
- 26 Oct 2020 4:17 PM GMT
Hyderabad Updates: హైద్రాబాద్ నుంచి సిద్ధిపేట బయలుదేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...
హైద్రాబాద్...
-బీజేపీ అభ్యర్థి రఘనందనరావు బంధువుల ఇంట్లో సోదాలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తోన్న బీజేపీ
-ఇప్పటికే కరీంనగర్ నుంచి సిద్ధిపేట చేరుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
- 26 Oct 2020 3:51 PM GMT
Sangareddy Updates: పఠాన్ చెరు మండలం పాటి చౌరస్తా లో విషాదం...
సంగారెడ్డి..
* పఠాన్ చెరు మండలం పాటి చౌరస్తా లో హత్య చేసి పక్కన చెట్ల పొదల్లో పడేసిన మృత దేహం..
* ఘటన స్థలానికి చేరుకున్న BDL భానుర్ పోలీస్ లు.
* భానుర్ గ్రామానికి చెందిన వికలాంగుడు మంగలి సత్యనారాయణ (40) గా గుర్తించిన పోలీసులు.
* తన సమక్షంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని చెబుతున్న భార్య మనీల ( 38).
- 26 Oct 2020 3:45 PM GMT
Bandi Sanay: రఘునందన్ రావు బంధువుల కుటుంబాలపై దాడి చేయడం తెలంగాణ బీజేపీ తీవ్రంగా కండిస్తుంది...
బండి సంజయ్ .... బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
* అప్రజాస్వామికంగా తెలంగాణ పోలీసులు దుబ్బాక నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల కుటుంబాలపై దాడి చేసి, సోదాలు చేయడం తెలంగాణ బీజేపీ తీవ్రంగా కండిస్తుంది.
* దుబ్బాక శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు,సోదాలు చేయడం ఎన్నికల నియమావాళికి విరుద్ధం.
* ఈ చర్య తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం యొక్క దుందుడుకు చర్య.
* దాడి జరిగిన కుటుంబసబ్యులను కలవడానికి సిద్దిపేటకు బయలుదేరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.
- 26 Oct 2020 1:39 PM GMT
Dubbaka Updates: దుబ్బాకలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు దుబ్బాకలో నియమించాలి...
- Hmtv తో బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు.
- ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా.
- బీజేపీ కార్యకర్తలను తమ అభ్యర్థిని టార్గెట్ చేసి టీఆరెస్ చేసింది.
- పోలీసులు బీజేపీ అబ్యర్థికి ఇబ్బందులు పెడుతున్నారు.
- బీజేపీ కార్యకర్తకు దుబ్బాకలో రక్షణ లేదు.
- బీజేపీ కార్యకర్తను కొట్టిన పోలీసులు రక్షణ కల్పించడం లేదు.
- రాష్ట్ర పోలీసులు టీఆరెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారు.
- రాష్ట్ర పోలీసుల పై ఫిర్యాదు చేస్తా.
- వరదల నష్టం పై కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బాదునామ్ చేస్తున్నాడు.
- వరదల్లో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ తక్షణ సాయం ఎం చేసాడో చెప్పాలి.
- గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే డబ్బుకు పంచుతున్నాడు సీఎం కేసీఆర్.
- ఎందుకు పంటనష్టపోయిన రైతులకు డబ్బులు ఇవ్వడం లేదు.
- మొక్కల కొనుగోలు పై సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు.
- ఎగుమతులు , దిగుమతులు దేశం ప్రాతిపదికన జరుగుతాయి తప్ప రాష్ట్రం పై ఆధారంగా ఉండదని సీఎం కేసీఆర్ కు తెలియదా ప్రజలకు చెప్పాలి.
- 26 Oct 2020 12:48 PM GMT
D.K.Arunu: దుబ్బాక ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్న డీకే అరుణ...
# డీకే అరుణ...బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు.
# బీజేపీ అభ్యర్థి రఘనందనరావు బంధువుల ఇళ్ళపై పోలీసుల సోదాలు చేయటాన్ని ఖండిస్తున్నాను
# సర్వేలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావటాన్ని హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నాడు
# టీఆర్ఎస్ ను ఓడించి దుబ్బాక ప్రజలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనున్నాను
# వేల కోట్లున్న టీఆర్ఎస్ నాయకులు వదిలి.. బీజేపీ నేతల ఇళ్ళపై పడటం సిగ్గుచేటు
# దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించే టార్గెట్ ను పోలీసులకు ప్రభుత్వం ఇచ్చింది
# పోలీసులు గులాబీ చొక్కాలను తీసివేసి ఖాకీ చొక్కాలు వేసుకోవాలి
# పోస్టింగుల కోసం పోలీసులు టీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
# తెలంగాణ పోలీసుల తీరును ప్రజలు అసహయించుకుంటున్నారు
# ఆర్థికమంత్రి హోదాలో హరీష్ రావు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు
# దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్ కు జ్ఞానోదయం కలగాలి
- 26 Oct 2020 11:45 AM GMT
Kishan Reddy: డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే.. బీజేపీకి అంత ఎక్కువ లాభం...
- మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్
- ఇళ్ళు వచ్చిన వారి కంటే రాని వారికే ఎక్కువ కడుపు మంట
- డబుల్ బెడ్రూం ఇళ్ళ అంశం ప్రాతిపదికనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి
- డబుల్ బెడ్రూం ఇళ్ళు, కరోనా, హైద్రాబాద్ వరదలు.. అన్నిటిల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం
- దుబ్బాకలో బీజేపీ గెలుస్తోందనటానికి మంత్రి హరీష్ రావు ఫ్రస్టేషనే ఉదాహరణ
- దుబ్బాకలో నిరుద్యోగులు బీజేపీకి ప్రచారం చేయటాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోతున్నాడు
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీచేసే అంశంపై పార్టీలో చర్చ జరగలేదు
- దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే విషయంలో స్పష్టత లేదు
- CMRFకు విరాళాలవ్వాలని ముఖ్యమంత్రే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి అడుగుతున్నారు
- విరాళాలు ఇవ్వాలని సినీ నటులను మంత్రి తలసాని అడిగనందునే .. నాయకులు సైతం విరాళాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు
- కేంద్రం నుంచి రాష్ట్రనికి త్వరలో విపత్తు నిధులొస్తాయి.
- 26 Oct 2020 11:19 AM GMT
Jakkampudi Raja: చంద్రబాబు తన పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకోలేదు...
తూర్పు గోదావరి -రాజమండ్రి
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..
-రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పిసీ కామెంట్స్
-రుణమాపీ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదు
-రైతులకు పెట్టుబడి రాయితీ క్రింద ప్రతి ఏటా రూ. 13వేల 500 సిఎం జగన్ చెల్లిస్తున్నారు
-రేపు రెండోవిడత రైతు భరోసా మొత్తాలను రైతుల ఖాతాలో వేయనున్న సిఎం జగన్
-జగన్ ది ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వం
-వరదలు, వర్షాలు వల్ల నష్టపోయిన రైతులందరినీ సిఎం జగన్ ఆదుకుంటారు.
-చందబాబు నాయుడు బిసీలను ఓటు బ్యాంకులా వాడుకున్నారు
-కాపు కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు 250 కోట్లే 50వేల మంది రుణాలిచ్చారు
-ఈ నేపధ్యంలో చీడపురుగులంటూ ఎంపీ భరత్ చేసిన ప్రకటన అభ్యంతరకంగా వుంది.
-తనపై దుష్ప్చచారం చేసేలా ఆ వ్యాఖ్యలు వక్రీకరించినట్టుగా కన్పిస్తున్నాయి.. ఎంపీ యే ఆ పదం వాడారని అనుకోవడం లేదు
-నేను ఏ విషయంలోనూ అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు.
-సిఎం జగన్ ఆదేశాలే మాకు శిరోధార్యం..
-ఏదైనా తప్పుచేస్తే రాజకీయాలనుంచే తప్పుకుంటాను..
-గ్రూపు రాజకీయాలు, వర్గపోరు ఏ పార్టీలోనైనా వుంటాయి. తాము పనిచేసేది పార్టీకోసం, జగన్ కోసమే..
-మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గానికి గెస్ట్ గా వస్తున్నారు
-తెలుగుదేశం పాలనలో ఇసుకలో వందల కోట్లను నిలువునా పెందుర్తి దోచుకున్నారు
-తానేదో రోడ్డుఎక్కితే రోడ్డు పోస్తున్నారనే బిల్డప్ కోసమే వెంకటేస్ పాదయాత్ర చేశారు
- 26 Oct 2020 11:14 AM GMT
Chada Venkat Reddy: అకాల వర్షాల కారణంగా నగరాలు కాలనీలో ముంపునకు గురయ్యాయి...
-చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...
-గత 15 రోజులుగా అకాల వర్షాల కారణంగా నగరాలు కాలనీలో ముంపునకు గురయ్యాయి...
-మరోవైపున చెరువులు కుంటలు నాలాలు ఆక్రమణకు గురికావడంతో పలు కాలనీలు నీటమునిగాయి...
-నిరుపేదలు పూర్తిగా నష్టపోయారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించకపోవడం అన్యాయం..
-రైతులు వారికి నచ్చిన, మేలైన పంటలు వేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ సాగు విధానం తీసుకొచ్చింది...
-దీంతో ప్రభుత్వం సూచించిన కొన్ని పంటలను రైతులు తమ భూమిలో వేసుకోవడానికి సూచనలు చేశాయి..
-ప్రభుత్వం సూచించిన విధంగా కామారెడ్డి జిల్లా, లింగాపూర్ అనే గ్రామంలో ఒక పేద రైతు మూడు ఎకరాలు సన్నబియ్యం వరి సాగు చేశాడు...
-ఆ పంట దోమపోటు కు గురి కావడంతో మొత్తం పంటను దగ్ధం చేయడం జరిగింది...
-నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో రైతులు ఆందోళన చేసి మొక్కజొన్న వేశారు....
-మొక్కజొన్న పంటకు 1800 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్లు ప్రకటించడం స్వాగతిస్తున్నాం..
-ప్రభుత్వము సూచించిన పంట, తమ భూమికి అనువైన పంట వేయడంలో రైతులు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా గా దిక్కుతోచని స్థితిలో కి నెట్టబడ్డారు..
-అకాల వర్షాల కారణంగా వల్ల నష్టపోయిన వరి, పత్తి ఇతర పంటలకు సమగ్ర సర్వే చేసి నష్టపరిహారం రైతులకు అందించాలని సిపిఐ డిమాండ్
-బిజెపి నేతలు నష్టాలపై వాక్యాలు చేస్తున్నట్లు గానే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కనీసం పది వేల రూపాయల కోట్ల సహాయం అందించేందుకు కృషిచేయాలని సిపిఐ విజ్ఞప్తి...
- 26 Oct 2020 11:01 AM GMT
Nalgonda District Updates: కరోనా మహమ్మారి వలన ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి...
నల్గొండ.....
కంకణాల శ్రీధర్ రెడ్డి..
-కరోనా మహమ్మారి వలన ఉపాధి కోల్పోయిన ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం
-ఆర్ధిక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, వారికి మద్దతుగా బీజేపీ
-నల్గొండ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఒక రోజు నిరాహారదీక్ష....
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire