Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 Oct 2020 10:39 AM GMT
Amaravati Updates: వ్యవసాయానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారు..
అమరావతి....
-Hmtv తో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే
-నేను 14 ఎకరాలు పంట వేసాను..
-5 ఎకరాల్లో 20 నుండి 25 సాతం ఈ నకిలీ విత్తనాలు వచ్చాయి..
-సాధారణంగా 1.5 శాతం మాత్రమే బెరుకు విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది..
-గుంటూర్ జిల్లా వ్యవసాయ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళా..
-పొలం పరిశీలించారు.. రిపోర్టు రాగానే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా..
-ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, సీఎం దృష్టికి తీసుకువెళ్తా...
-ఏపీ సీడ్స్ కి సరఫరా చేసే విత్తనాల కంపిణీలపై విజిలెన్స్ జరుగుతుందా లేదా చూడాలి..
-ఇలాంటి విత్తనాలు సరఫరా చేసిన మంజీరా కంపిణీ పై చర్యలు తీసుకోవాలి..
-విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా..
- 26 Oct 2020 10:35 AM GMT
Nara Lokesh Comments: జగన్ బయటకు రాకపోవడం వల్లే నేను బయట తిరుగుతున్నాను..
పశ్చిమ గోదావరి జిల్లా
పశ్చిమలో నారా లోకేష్ కామెంట్స్
-జగన్ చేతకాని తనం వల్లే నేను ఇప్పుడు బయట తిరగాల్సి వస్తుంది..
-నేను బయట తిరగతాన్ని ఎగతాళి చేస్తూ ఓ మంత్రి నన్ను ఎద్దుతో పోల్చారు...నేను ఎద్దునైతే మీ ముఖ్యమంత్రి దున్నపోతా
-వరద బాధితులకు కనీసం ఇవ్వాల్సిన 25 కేజీల బియ్యం కూడా ఇవ్వడం లేదు.
-జగన్ రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించడం లేదు.
-అనంతపురంలో ప్రకటిస్తుంటే మాపైనే దాడులు చేస్తున్నారు.
-జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ కేవలం రైతులకు 25లక్షలు ఖర్చు చేశారు.
-కొల్లేరుకు ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో వరదలు వస్తే వారిని ఆదుకునే చర్యలు లేవు
-ఉభయగోదావరి, కృష్ణా జిల్లా రైతలకు సూచిస్తున్నా.. మోటార్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలి
-ఈ అంశంపై టీడీపీ రైతులకు అండగా ఉంటుంది
-దళిత, బీసీ రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.. అది ఎలా రైతు సంక్షేమం అవుతుంది
-రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలు 40రూపాయలకు అమ్ముతున్నారు.. మరీ దారుణం
-పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయకుండా.. కేంద్రం వద్ద తాకట్టు పెట్టేసారు
-నిధులు రాకపోతే మాపై ట్విట్లు చేయడం కాదు.. పనికి మాలిన యంపీలు ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయాలి
-అమరావతి కోసం రైతులు పోరాటం చేస్తుంటే, బయట నుంచి మనుష్యులను తీసుకు వచ్చి కేసులు పెడుతున్నారు
-ఢిల్లీ చుట్టూ ప్రతిసారి 59లక్షల ఖర్చుపెట్టి అటూ ఇటూ తిరుగుతున్నాడు.. ఎందుకో తెలీదు.. రాష్ట్రానికి ఏమీ లాభం రాలేదు
- 26 Oct 2020 10:31 AM GMT
Guntur District Updates: కేసు మిస్టరీని ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు...
గుంటూరు జిల్లా...
-గుంటూరు జిల్లా,తెనాలి సుల్తానాబాద్ హత్య కేసు మిస్టరీని ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు
-ఈ నెల 21న జరిగిన చంద్రనాయక్ హత్యకు సంబంధించి భార్యే కీలక సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ
-వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో చంద్ర నాయక్ ను హత్యచేయించిన భార్య జ్యోతి బాయ్
-అక్రమ సంబంధమే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు
-చంద్రనాయక్ భార్య జ్యోతితో పాటు ఆమె ప్రియుడు శివ నాగార్జున అరెస్టు
-హత్యకు సహకరించిన జ్యోతి అక్క కొడుకు సాయి కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 26 Oct 2020 10:28 AM GMT
Visakha Updates: గీతం విధ్యా సంస్థలు ఆక్రమణల కు పాల్పడిన భూమిని ప్రభుత్వం స్వాధీనం పరచుకుంది....
విశాఖ...
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ కామెంట్స్....
-40 ఎకరాల గీతం విధ్యా సంస్థలు ఆక్రమణల కు పాల్పడిన భూమిని ప్రభుత్వం స్వాధీనం పరచుకుంది....
-భూమి విలువ 800 కోట్ల పైచిలుకు
-విశాఖ లో ప్రభుత్వ భూములు కాపాడాలని ప్రభుత్వం చూస్తుంది
-దీనిని పొలిటికల్ కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు..
-సామాన్య ప్రజలు ఎవరూ ఇది సరికాదు అని అనలేదు.. కేవలం టిడిపి నాయకులే అంటున్నారు
-56 పేజీల రిట్ పిటీషన్ వేశారు,వచ్చిన కోర్ట్ ఆర్డర్ ను వక్రీకరించి ప్రజల ముందు పెట్టాలని చూస్తున్నారు
-కోర్ట్ లో గీతం భూమి మాదే అని చెప్పలేదు
-ప్రభుత్వ భూముల్లో ఆక్రమించి కట్టిన భూముల్ని ప్రభుత్వ అవసరాలకు రానున్న కాలంలో ఉపయోగిస్తాం
-ఆగస్టు3 ముఖ్యమంత్రి కి గీతం వారు లేఖలో 40 ఎకరాలు అభివృద్ధి కోసం కావాలని రాసారు.ఇంతకన్నా అది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి సాక్ష్యాలు కావాలా...
-గీతంలో ఒక్క పేద వాడైనా చదువుకొనే అవకాశం ఉందా..
-చంద్రబాబు కు విద్యా దానం కంటే భూ దానం ఎక్కువయ్యింది .
- 26 Oct 2020 10:19 AM GMT
Nellore District Updates: అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి...
నెల్లూరు :--
ఏపి టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు. పీసీ
-- రాష్ట్రంలో దళితులపై దాడులు,దళిత మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి
-- 5లక్షల భూమిని 50లక్షలకి పెంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే దళితుల భూమిని ప్రభుత్వం లాక్కుంటుంది
-- అభివృద్ధి వికేంద్రీకరణకి టీడీపీ వ్యతిరేకం కాదు వికేంద్రీ కరణ పేరుతో అమరావతికి అన్యాయం చేయడానికి మేము వ్యతిరేకం
-- గాంధీజి కలలను సాకారం చేస్తా అన్న ముఖ్యమంత్రి సచివాలయలను అడ్డుపెట్టుకుని దళారులకు ఉడిగం చేస్తున్నారు
-- దళిత రైతు జైపాల్ పై అక్రమ కెలుసు పెట్టాడని మేము తీవ్రంగా కండిస్తున్నాం,దీనిపై కేంద్ర ఎస్సి ఎస్సి కమీషన్,హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకెళ్లతం
-- దళితులు,రైతుల సంక్షేమం గురించి ఈ ప్రభుత్వనికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు,ధరల స్థిరీకరణ గురించి అస్సలు చర్యలే లేవు
--దళారుల వెనకున్న మాఫీయాని బహిర్గతం చేసేవరకు మా పార్టీ పోరాటం చేస్తుం ది.
- 26 Oct 2020 10:17 AM GMT
Kadapa District Updates: ప్రభుత్వ వైఫల్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది..
కడప :
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కామెంట్స్..
-ప్రభుత్వ వైఫల్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది..
-టీడీపీ అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఉండేది..
-వైసీపీ అసమర్థత కారణంగా పోలవరంకు కేంద్రం నిధుల కేటాయింపులో వెనుకడుగు వేస్తోంది..
-నిధులు కావాలని అడగటానికి వైసీపీ ఎంపీలకు నోరు రావడం లేదు..
-పోలవరం పూర్తి కాకపోతే రాయలసీమ ప్రాంతం పూర్తి ఎడారిగా మారుతుంది..
-హోదా విషయంలో ఢిల్లీ పెద్దల మెడలు వంచుతామన్న వైసీపీ నేతలు వారి వద్దే వంగి వంగి మెడలు వంచుతున్నారు..
-పోలవరం నిధులు రాబట్టలేకపోతే ఎంపీలు రాజీనామా చేయాలి..
-వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ...
-గీతం, నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గు చేటు..
- 26 Oct 2020 9:58 AM GMT
Amaravati Updates: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే కేంద్రం నిధులు..
అమరావతి..
-పునరావాసంతో సంబంధం లేదంటున్న కేంద్రం..
-ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో వెలుగులోకి కీలక అంశాలు..
-2016 సెప్టెంబర్ నాటి కేంద్ర ఆర్థిక శాఖ మెమో ప్రకారం..
-పోలవరం నిర్మాణం నిధులు మాత్రమే కేంద్ర భరిస్తుందని స్పష్టీకరణ..
- 26 Oct 2020 9:42 AM GMT
C.M.Jaganmohan reddy: దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం...
ముఖ్యమంత్రి వైయస్.జగన్ కామెంట్స్:
– ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా.
– ఎస్సీలు ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలి.
– ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామిక వేత్తలుగా, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
– రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా రూ. 1 కోటి రూపాయిలు కూడా ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం.
– ఎస్సీలు, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసేలా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాం.
– వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను చేపడుతున్నాం.
– ఫెసిలిటేషన్ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం.
– 16.2 శాతం ఎస్సీలకు, 6శాతం ఎస్టీలకు ఇండస్ట్రియల్ పార్కుల్లో భూముల కేటాయింపు .
– స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్.. పేటెంట్ రుసుముల్లో రాయితీలు... ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయి.
– ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి, వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం.
– సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి.
– పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ అమలుచేస్తున్నాం.
– అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందడానికి గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టాం.
– ఆసరా, చేయూత లాంటి పథకాలనుకూడా చేపట్టాం.
– మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్‌ను, పీ అండ్‌జీని, రిలయన్స్‌లాంటి సంస్థలను తీసుకు వచ్చాం.
– చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నష్టపోకుండా చూశాం.
– ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
– రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని ఈ కార్యక్రమాలు చేపట్టాం .
– అందరికీ మంచి జరగాలని, అలాగే మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
– ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఎలా చేయాలి? ఎవరిని కలవాలి? దీనిపై అధికారులు దృష్టిపెట్టాలని సమావేశంలోఆదేశించిన సీఎం
- 26 Oct 2020 9:13 AM GMT
Amaravati Updates: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకోసం ప్రత్యేక పారిశ్రామిక విధానం...
అమరావతి:
// ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం
// ‘‘జగనన్న వైయస్సార్ బడుగు వికాసం’’ను క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సీఎం వైయస్.జగన్
- 26 Oct 2020 9:10 AM GMT
West Godavari Updates: ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి...
పశ్చిమ గోదావరి జిల్లా..
// ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి అశ్వియుజమాస నిజకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
// శ్రీవారిని అమ్మవార్లను పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెలు గా అలంకరణ చేసి తంతు సంకల్పం నిర్వహించారు.
// ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు S.V.సుధాకరరావు మరియు MP. మార్గాని.భారత్ రామ్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire