Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 26 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం అష్టమి: (మ. 2-35 వరకు) తదుపరి నవమి, అనూరాధ నక్షత్రం (సా. 5-42 వరకు) తదుపరి జ్యేష్ఠ అమృత ఘడియలు (ఉ. 7-53 నుంచి 9-24 వరకు) వర్జ్యం (రా. 11-02 నుంచి 12-33 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-37 నుంచి 12-27 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 26 Aug 2020 6:55 AM GMT

    నాగర్ కర్నూల్ జిల్లా :

    - కొల్లాపూర్ పట్టణంలో జూపల్లి కృష్ణారావు కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని రామాలయంలో పూజలు నిర్వహించిన జూపల్లి వర్గీయులు.

  • 26 Aug 2020 6:54 AM GMT

    Srisailam Fire Accident Updates: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్ర ప్రమాదం పై సీఐడీ దర్యాప్తు ముమ్మరం...

    - శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్ర ప్రమాదం పై సీఐడీ దర్యాప్తు ముమ్మరం...

    - సీఐడి దర్యాప్తు లో వెలుగులోకి వస్తున్న కీలక అంశాలు.....

    - మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసిన సీఐడీ.....

    - ఎఫ్ఐ ఆర్ లో పలు సెక్షన్ లను అదనంగా చేర్చిన సీఐడీ....

    - కేసును ప్రభావితం చేసే కీలక అంశాలను గుర్తించి సీఐడీ...

    - ప్రమాదం పై సిబ్బంది నిర్లక్ష్యం నిర్వహణ, లోపాల దృష్టి సారించిన గుర్తించిన సీఐడీ....

    - అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రమాద తీవ్రతను పెంచిందని గుర్తించిన సీఐడీ...

    - అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనాన్ని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఎందుకు ఫైర్ సేఫ్ట్యి నిబంధనలు పాటించలేదన్న దానిపై విచారిస్తున్న సీఐడి...

    - 240 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్స్ బ్లాస్ట్ అయిన నేపద్యంలో దాన్ని కంట్రోల్ చేయడానికి సరైన పరికరాలు చేపట్టలేదని గుర్తించిన సీఐడి....

    - ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్పెషల్ రెస్క్యూ టీమ్ లేకపోవడం పై ప్రమాద తీవ్రత ను పెంచిందన్న సీఐడీ..

    - యాజమాన్యం సరి పడినంత రక్షణ చర్యలు తీసుకోకపోవడం వలనే ప్రమాదం తీవ్రత పెరిగిందని భావిస్తున్న సీఐడీ....

    - ఈ వారం లో మరోసారి ఘటన స్థలానికి వెళ్లనున్న సీఐడీ....

  • 26 Aug 2020 6:01 AM GMT

    నిజామాబాద్ జిల్లా

    - డిచ్ పల్లి మండలం నడిపల్లి పంచాయతీ పరిధిలోని రెయిన్బో హోమ్స్ వెంచర్, మైనారిటీ స్మశాన వాటిక హద్దుల స్థల వివాదం

    - నిన్న టిఆర్ఎస్ నేతల కార్లు దగ్ధం లో వెంచర్ యజమాని సందీప్ తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసిన నిజామాబాద్ పోలీసులు

  • 26 Aug 2020 6:01 AM GMT

    Jurala Project: జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన వరద...

    మహబూబ్ నగర్ జిల్లా :

    - జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన వరద...

    - 22 గేట్లు ఎత్తి వేత

    - ఇన్ ఫ్లో: 1 లక్ష 70 వేల క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో: 1 లక్ష 82 వేల 227 క్యూసెక్కులు.

    - పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: 9.657 టీఎంసీ.

    - ప్రస్తుత నీట్టి నిల్వ: : 9.050 టీఎంసీ.

    - పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

    - ప్రస్తుత నీటి మట్టం: 318.220మీ.

  • 26 Aug 2020 6:00 AM GMT

    Kavitha: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత


    - దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా పీవీ ప్రధాని పదవి చేపట్టారు.

    - పీవీ నరసింహారావు సేవలను యువతరానికి తెలియజేసేలా రాష్ట్ర వ్యాప్తంగా శతజయంతి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా తెలంగాణ జాగృతి నాయకులకు మాజీ ఎంపీ కవిత పిలుపు

    - పీవీ నరసింహారావు మేధస్సు కు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్షర నివాళి-

    - ప్రతి నెలా రెండు సార్లు 'బుక్ క్లబ్' పేరుతో పీవీ నరసింహారావు రచనలు, జ్ఞాన సంపత్తికి నేపథ్యంలో, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాము.

  • 26 Aug 2020 5:59 AM GMT

    ACB Updates: రెండవ రోజు నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ...

    ఏసీబీ అప్డేట్స్..

    - రెండవ రోజు నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ...

    - చంచల్ గూడ జైల్ నుండి నలుగురు నిందితులను ఏసీబీ ప్రధాన కార్యాలయం కు తరలిస్తున్న ఏసీబీ..

    - నేడు మరోసారి నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ..

    - కోటి 10 లక్షల రూపాయలు,బ్యాంక్ లాకర్లు, నగదు లావాదేవీల పై ఆరా తీయనున్న ఏసీబీ.

  • 26 Aug 2020 5:59 AM GMT

    Nizamabad: నిజామాబాద్ జిల్లా లోవింత చోరీ

    నిజామాబాద్ జిల్లా

    - నిజామాబాద్ జిల్లా లోవింత చోరీ

    - లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించిన వ్యక్తి

    - బాధితుడి ఫోన్ పే అకౌంట్ నుండి 50 వేల రూపాయలు డ్రా

    - పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన బాధితుడు కేసు నమోదు.

  • 26 Aug 2020 5:57 AM GMT

    హైదరాబాద్: 

    - మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా, హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో "సమాలోచన సభ" ప్రారంభం

    - హాజరైన ఎంపీ కే.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, రచయిత కల్లూరి భాస్కర్, కవి అంపశయ్య నవీన్

  • 26 Aug 2020 5:57 AM GMT

    Nizamabad: నందిపేట మండలం పలు గుట్ట దగ్గర ప్రేమ జంట ఆత్మహత్య యత్నం

    నిజామాబాద్ :

    - నందిపేట మండలం పలు గుట్ట దగ్గర ప్రేమ జంట ఆత్మహత్య యత్నం

    - పురుగుల మందు తాగి కారులో అపస్మారక స్థితి లో పడిపోయిన ప్రేమ జంట.

    - పరిస్థితి విషమం.. జిల్లా ఆసుపత్రికి తరలింపు.

  • 26 Aug 2020 5:56 AM GMT

    Nalgonda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ కనకదుర్గమ్మ దేవాలయంలో చోరీ.

    నల్గొండ:

    - నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ కనకదుర్గమ్మ దేవాలయంలో చోరీ.

    -  గర్భగుడి తాళం పగలకొట్టి .. అమ్మవారి విగ్రహం పై ఉన్న 12 కిలోల వెండి 2 తులాల బంగారు ఆభరణాలు, 10 వేల నగదు ను అపహరించిన దుండగులు.

    - దేవాలయం లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న వన్ టౌన్ పోలీసులు.

Print Article
Next Story
More Stories