Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 26 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం అష్టమి: (మ. 2-35 వరకు) తదుపరి నవమి, అనూరాధ నక్షత్రం (సా. 5-42 వరకు) తదుపరి జ్యేష్ఠ అమృత ఘడియలు (ఉ. 7-53 నుంచి 9-24 వరకు) వర్జ్యం (రా. 11-02 నుంచి 12-33 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-37 నుంచి 12-27 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 Aug 2020 12:25 PM GMT
నెల్లూరు
-- మండల కేంద్రం కలిగిరి సమీపంలో ఉత్తర కాలువ గట్టున పేకాట స్థావరాలపై పోలీసులు దాడి
-- నాలుగురు పేకాట రా యుళ్లు అరెస్ట్. రూ. 3,100 లు నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం.
- 26 Aug 2020 12:25 PM GMT
Coronavirus: తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు మొత్తం 1528 కోవిడ్ కేసులు నమోదు..
కాకినాడ
- తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు మొత్తం 1528 కోవిడ్ కేసులు నమోదు..
- కాకినాడ అర్బన్ లో 259
- కాకినాడ రూరల్ లో 40
- రాజమండ్రి సిటీ లో 247
- రాజమండ్రి రూరల్ 36 కేసులు నమోదు
- 26 Aug 2020 12:23 PM GMT
Swarna Palace: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో పోలీసుల విచారణకు ఆటంకం
విజయవాడ
- స్వర్ణ ప్యాలెస్ ఘటనలో పోలీసుల విచారణకు ఆటంకం
- విచారణకు హాజరు కాని రిమాండ్ నిందితుల తరఫు న్యాయవాదులు
- న్యాయవాదుల సమక్షంలోనే నిందితులను విచారించాలని ఆదేశించిన జిల్లా కోర్టు
- జిల్లా జైలులో న్యాయవాదుల కోసం ఎదురుచూసి వెనుతిరిగిన పోలీసులు
- న్యాయవాదుల సహాయ నిరాకరణ పై జిల్లా కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్న పోలీసులు
- 26 Aug 2020 12:22 PM GMT
జాతీయం
- కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో నీట్ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు, విపక్ష సీఎంలు, నేతలు డిమాండ్ .
- కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయిన ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేష్ బాగేల్, హేమంత్ సోరేన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేలు .
- నీట్ పరీక్షవాయిదా అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పాలిత సీఎంలు నిర్ణయం.
- ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించకపోవడంపై ఆందోళన .
- రాష్ట్రాలకు సరైన సమయంలో జీఎస్టీ పరిహారం ఇవ్వడం లేదని, బకాయిలు పెరిగిపోయాయని సోనియా గాంధీ ఆరోపణ. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించే పరిస్థితుల్లో కేంద్రం లేదన్న సోనియాగాంధీ.
- రైల్వేల ప్రైవేటీకరణ, ఎయిర్‌పోర్టుల వేలం నిర్ణయాలను తప్పుపట్టిన సోనియా
- కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన జాతీయ విద్యా విధానం సరిగా లేదని విమర్శ.
- పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వీటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం.
- నీట్ పరీక్షపై విద్యార్ధులు, తల్లితండ్రుల్లో భయాందోళనలు ఉన్నాయన్న రాహుల్ గాంధీ
- దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో వరదలు సంభవించాయని ఈ పరిస్థితుల్లో నీట్ పరీక్ష నిర్వహించడం సరికాదనన్న రాహుల్ గాంధీ.
- అందరి అభిప్రాయాలూ కేంద్రం తెలుసుకున్న తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
- 26 Aug 2020 12:08 PM GMT
Nellore: జిల్లాలో కరోనా విలయతాండవం..
నెల్లూరు
-- జిల్లాలో కరోనా విలయతాండవం.
-- గడచిన 24 గంటల్లో 1168 కి మందికి సోకిన మహమ్మారి.
-- జిల్లా వ్యాప్తంగా 20, 569 చేరిన వైరస్ బాధితుల సంఖ్య.
-- రికవరీ లో రేటు పెరుగుతు న్నా.. ఆందోళన కలిగిస్తున్న మరణాలు సంఖ్య. ఇప్పటివరకు 400 మందికీ పైగా మృతి.
- 26 Aug 2020 12:08 PM GMT
Andhra Pradesh: ఆంధ్రా తమిళనాడు బార్డర్ లో సినీ ఫక్కీలో దొంగతనం
- ఆంధ్రా తమిళనాడు బార్డర్ లో సినీ ఫక్కీలో దొంగతనం
- నిన్న రాత్రి శ్రీపేరంబుర్ నుండి ముంబై కి వెళ్తున్న మొబైల్ కంటైనర్ ని సినీ ఫక్కీలో ఆంధ్ర బార్డర్ నగిరి వద్ద మరో లారీ తో అడ్డం పెట్టి డ్రైవర్ ని కొట్టి అందులో ఉన్నటువంటి 6 కోట్ల రూపాయలు విలువ చేసే మొబైల్స్ ను దోచుకెళ్లిన దుండగులు ...
- లారీల మొత్తం 12 కోట్లు విలువ చేసే మొబైల్ ఫోన్లు ఉన్నట్టుగా సమాచారం
- అందులో 16 బాక్స్ లు ఉండగా 8 బాక్సుల్లో 7500 మొబైల్ ఫోన్ ని దోచుకెళ్లారు
- మొబైల్ ఫోన్లు అన్నీ కూడా షామీ కంపెనీ చెందినవి
- మొబైల్ ఉన్న లారీని తీసుకొని పుత్తూరు మొబైల్స్ అని మరో లారీ లోకి మార్చుకుని లారీని పుత్తూరులో వదిలేసి వెళ్లిన దుండగులు పరార్.
- 26 Aug 2020 12:07 PM GMT
తూర్పు గోదావరి -
- రాజమండ్రి- పెద్దాపురం
- మాజీ ఉపముఖ్యమంత్రి , పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ప్రెస్ మీట్ పాయింట్స్......
- కరోనా సమయంలోనూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు విడనాడక పోవడం విచారకరం...
- నాలుగేళ్ల క్రితం ముగిసిన కృష్ణా పుష్కరా పనులపై ఇప్పడు విచారణకు ఆదేశించడం ఏమిటి
- కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో మా ప్రభుత్వం ఘాట్ల నిర్మాణం జరిగే గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో అనుసంధానం రహదారుల నిర్మాణం, దేవాలయాల ఆధునీకరణ, విజయవాడ కార్పొరేషన్ సుందరీకరణ పనులు చేసిఁది
- నాలుగేళ్ళ తర్వాత విచారణకు ఆదేశించడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే....
- ఇదే పంథాలో ఎమ్.జి.ఎన్.ఆర్.జి.యస్ పనులపై కూడా విచారణ పేరుతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండాఇబ్బందులు పెడుతున్నారు.....
- ఈ రోజు ప్రకాశం జిల్లాలో మాజీ తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, రామారావులకు చెందిన గ్రానైట్ లీజు రద్దుచేయడం వైకాపా కక్ష సాధింపులకు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనం చినరాజప్ప
- 26 Aug 2020 10:09 AM GMT
Tirumala: సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.
- సెప్టెంబరు 1న అనంత పద్మనాభ వ్రతం
- సెప్టెంబరు 17న మహాలయ అమావాస్య.
- సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
- సెప్టెంబరు 19న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
- సెప్టెంబరు 23న శ్రీవారి గరుడసేవ.
- సెప్టెంబరు 24న శ్రీవారి స్వర్ణరథోత్సవం.
- సెప్టెంబరు 26న రథోత్సవం.
- సెప్టెంబరు 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి.
- సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం.
- 26 Aug 2020 10:08 AM GMT
Peddapuram: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు చిన రాజప్ప కామెంట్స్
తూర్పు గోదావరి:
పెద్దాపురం: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు చిన రాజప్ప కామెంట్స్
- వైసిపి ప్రభుత్వం కరోనా సమయంలోనూ కక్ష సాధింపు చర్యలు ఆపకపోవడం గర్హనీయం.
- నాలుగేళ్ల క్రితం ముగిసిన కృష్ణా పుష్కరా పనులపై ఇప్పడు విచారణకు ఆదేశించడం.శోచనీయం...
- కృష్ణా పుష్కరాలు ముగిసి 4 సంవత్సరాల తరువాత విచారణకు ఆదేశించడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే.... ఇప్పటికే గుత్త సంస్థల నిర్వహణ కాలపరిమితి ముగిసింది.
- ఇదే పంథాలో ఎమ్.జి.ఎన్.ఆర్.జి.యస్ పనులపై కూడా విచారణ పేరుతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా... ఇబ్బందులు పెడుతున్నారు.
- ముఖ్యమంత్రి కి ఇష్టంలేని విషయాలపై విచారణకు ఆదేశించడం పరిపాటి అయింది.
- కృష్ణా పుష్కర పనులు అన్ని నీటిపారుదల శాఖ, రహదారుల భవానాల శాఖ, నగర పాలక సంస్థ అధికారులతో నిర్వహించడం జరిగింది.... కావున ప్రభుత్వం వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
- ప్రకాశం జిల్లాలో మాజీ తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, రామారావులకు చెందిన గ్రానైట్ లీజు రద్దుచేయడం వైకాపా కక్ష సాధింపులకు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.
- 26 Aug 2020 10:06 AM GMT
Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు
అమరావతి...
- సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు
- పేదల ఇళ్ల స్థలాలకు అడ్డం పడుతున్న టీడీపీని లెఫ్ట్ పార్టీలు ఎందుకు ప్రశ్నించలేదు..
- పేదల ఇళ్ల స్థలాలు అడ్డుకుంటున్న టీడీపీతో కలిసి ధర్నాలు చేయడం ఏమిటి..
- పాలన వికేంద్రీకరణపై ఏడాది పాటు చర్చించి నిర్ణయం తీసుకున్నాము..
- పాలన వికేంద్రీకరణ చేసేది ప్రజలు కోసమే..
- టీడీపీ ఉద్దేశ్యపూర్వకంగా ఎదో లిటికేషన్ పెట్టి పాలన వికేంద్రీకరణను అడ్డుకోవాలని చూస్తుంది..
- న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు ఉంది..
- ప్రమాదంలో రమేష్ హాస్పిటల్ యాజమాన్యం తప్పు ఉంది..
- రమేష్ ఏ తప్పు చేయకపోతే పోవాల్సిన అవసరం ఏమి ఉంది..
- సుప్రీంకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయి..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire