Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Sep 2020 1:00 PM GMT
Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతికి సంతాపం తెలియజేసిన మంత్రి కేటీఆర్..
#ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి విచారకరం.
#సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు, లక్షలాది వారి అభిమానులకు తీరని లోటు. ఆలపించిన ఎన్నో వేల పాటల ద్వారా వారు ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలుస్తారు.
#వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన మంత్రి.
- 25 Sep 2020 12:02 PM GMT
Balasubrahmanyam: బాలు మరణం పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతాపం...
-గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం చనిపోయాడు అని తెలిసి చాలా బాధగా ఉంది.
-ఆయన సంగీత సాహిత్య లోకానికి మారుపేరు. చిన్న వయసులోనే ఆయన సంగీత ప్రపంచానికి వచ్చాడు.
-తుది శ్వాస వరకు కళామతల్లికి సేవ చేస్తూనే ఉన్నాడు. నగరి హైస్కూల్లో ఆయన కొంతకాలం చదివాడు.
-ఆయనతో నాకు చిన్నప్పటినుంచి పరిచయం ఉండడం వలన ఆయనంటే ప్రత్యేక అభిమానం.
-ఆయన వలన కొన్ని వేల మంది గాయకులు, సంగీత కళాకారులు తయారయ్యారు. గొప్ప సేవలు చేసినటువంటి వ్యక్తి కొవిడ్ బారినపడి మరణించడం దురదృష్టకరం.
-డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అయినా సరే ఆయన మరణం సంగీత లోకానికి తీరని లోటు.
-ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సంగీత సాహిత్యం ఈ భూమి ఉన్నంత వరకు అజరామరం. ఘంటసాల తర్వాత బాలు గారే సంగీత గానములో ప్రసిద్ధిగాంచారు.
-ఆయన సేవలు గుర్తించుకుంటూ జ్ఞాపకార్థం ప్రభుత్వం నిర్మిస్తే బాగుంటుంది.
-కమ్యూనిస్టు పార్టీ తరఫున ఆయనకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.
- 25 Sep 2020 11:46 AM GMT
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ బ్యాలెట్, evm అన్న దానిపై అభిప్రాయం చెప్పని కాంగ్రెస్..
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ని కలిసిన కాంగ్రెస్ నేతలు..
-మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్
-బ్యాలెట్ విధానం, evm విధానంలో ఏ విధానం ద్వారా జరిపితే బాగుంటుందో ఎన్నికల సంఘం చెప్పలేదు
-వారు రాజకీయ పార్టీలను అభిప్రాయం కోరడం సబబు కాదు
-బ్యాలెట్ బాక్స్ లు సిద్ధం చేయడాన్ని ఆక్షేపిస్తున్నాము
-బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా అధికారులని నియమించారు
-కాంగ్రెస్ పార్టీ కి అనుమానాలు కలుగుతున్నాయి
-ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి
-డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు
-గతంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు
-న్యాయ బద్దంగా ఎన్నికలు జరపాలి
-ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన జరపాలి
- 25 Sep 2020 11:16 AM GMT
Nagarkurnool district updates: జూపల్లి కృష్ణారావు కు ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు..
నాగర్ కర్నూలు జిల్లా :
-కొల్లాపూర్ పట్టణానికి కరోనా నుండి కోలుకున్న తర్వాత మొదటిసారిగా వచ్చినందుకు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కు ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు.
-రెవిన్యూ బిల్లుకు ఆమోదం పొందినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు.
- 25 Sep 2020 11:05 AM GMT
Balasubrahmanyam: అనేక భారతీయ భాషల్లో పాడిన అద్భుత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం: మంత్రి ఎర్రబెల్లి!
-గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-గాయకుడు ఎస్పీ బాలు గారి మరణం అత్యంత బాధాకరం
-పాటల ప్రపంచంలో ఆయన గాన గాంధర్వుడు
-వారి మరణం యావత్తు దేశానికి,పాటల ప్రియులకు తీరని లోటు
-వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..
- 25 Sep 2020 10:54 AM GMT
Balasubrahamnyam: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం తీరని లోటు -ఎల్ .రమణ టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు!
ఎల్ .రమణ టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు..
-సుప్రసిద్ధ గాయకుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది.
-సంగీత దర్శకుడిగా, గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చిత్రసీమకు ఎనలేని సేవలందించారు.
-హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో వేలాది పాటలకు తన స్వరంతో ప్రాణం పోసిన గాన గంధర్వుడు.
-తెలుగు జాతికి లభించిన అద్భుత వరం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. అటువంటి గొప్ప గాయకుడిని కరోనా రూపంలో మృత్యువు కబలించడం బాధాకరం.
-ఆయన మరణం యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.
-కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
- 25 Sep 2020 8:37 AM GMT
SPB: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను: చాడ వెంకట్ రెడ్డి!
చాడ వెంకట్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...
-రెండు తెలుగు రాష్ట్రాలనేకాక ప్రపంచ దేశాల ప్రజలను తన గానంతో అలరించి మన్ననలు పొందాడు..
-ఎస్పీ. చలన చిత్ర పరిశ్రమతో పాటు యావత్ సమాజానికి తీరని లోటు. ఆయనకు సంతాపం...
-వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను..
- 25 Sep 2020 7:53 AM GMT
Hyderabad latest news: నిన్న గచ్చిబౌలి పీయస్ లో కిడ్నాప్ కేసు నమోదు చేశాం...
Hmtv తో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు..
-చందానగర్ తారానగర్ లో అవంతి రెడ్డి, హేమంత్ కుమార్ లు ఉండేవారు..
-అవంతి రెడ్డి బీటెక్ చదవగా, హేమంత్ డిగ్రీ కంప్లీట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు...
-ఇద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు..
-కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లో మ్యారేజ్ చేసుకున్నారు..
-నిన్న మీతో మాట్లాడలంటు గచ్చిబౌలి లోని హేమంత్ నివాసానికి వచ్చిన అవంతిక కుంటుంబ సభ్యులు...
-చందానగర్ కీ వెల్లాలని వారిని కారులో తీసుకేళ్లుతుండగా అనుమానం రావడంతో తప్పించుకునెందుకు ప్రయత్నంచిన అవంతిక, హేమంత్...
-కారులో నుంచి తప్పించుకుని అత్తమామలకు ఫోన్ చేసిన అవంతిక...
-మరో కారులో హేమంత్ తీసుకుని పోయిన అవంతిక మేనమామ యుగంధర్ రెడ్డి, మరికొందరు...
-హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తం అయిన గచ్చిబౌలి పోలీసులు...
- 25 Sep 2020 7:48 AM GMT
Adilabad District updates: ఎన్ కౌంటర్ల పై లేఖ విడుదల చేసిన మావోయిస్టు అదికార ప్రతినిధి జగన్..
ఆదిలాబాద్ ..
తెలంగాణ మావోయిస్టు పార్టీ అదికార ప్రతినిధి: జగన్..
-ఎన్ కౌంటర్ల పై హైకోర్టు న్యాయ విచారణ చేయాలి..
-మావోయిస్టులను కదంబ అడవులలో పట్టుకోని కాల్చి చంపారు...
-బాస్కర్ పేరిట. పోలీసులే లేఖను విడుదల చేశారు..
-ఎన్ కౌంటర్లకు నిరసనగా ఈ నెల 28న తెలంగాణ బంద్ కు పిలుపునిస్తున్నాం జగన్
- 25 Sep 2020 7:14 AM GMT
Mancherial district updates: చందారం రైతు ర్యాలీ లో అపశ్రుతి...
మంచిర్యాల జిల్లా..
-అదుపు తప్పి బోల్తా పడిన ట్రాక్టర్..
-నలుగురు కార్యకర్తలకు స్వల్ప గాయాలు..
-కొత్త రెవిన్యూ చట్టం స్వాగతిస్తూ ర్యాలీ నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire