Live Updates: ఈరోజు (సెప్టెంబర్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 24 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి: రా.11-44 తదుపరి నవమి | మూల నక్షత్రం రా.11-36 తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.8-11 నుంచి 9-43 వరకు తిరిగి రా.10-04 నుంచి 11-36 వరకు | అమృత ఘడియలు: సా.5-26 నుంచి 6-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-52 నుంచి 10-40 వరకు తిరిగి మ.2-41 నుంచి 3-29 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-54
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 24 Sep 2020 11:34 AM GMT
Medak ACB updates: నగేష్ కేసులో ముగిసిన ఏసీబీ కస్టడీ విచారణ..
ఏసీబీ అప్ డేట్స్ మెదక్ కేసు....
-మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో ముగిసిన ఏసీబీ కస్టడీ విచారణ.
-నాలుగు రోజులుగా ఏసీబీ ఆఫీస్ లోనే విచారణ చేసిన ఏసీబీ
-బినామిల పాత్రపై క్లారిటీ తీసుకున్న ఏసీబీ.
-6గురు బినామిలను నాలుగు రోజుల పాటు విచారణ.
-మెదక్ తో పాటు హైదరాబాద్ శివరాళ్లలో బినామిల పేర్లతో అస్స్తులు ఉన్నట్టు గుర్తింపు.
-నగేష్ భినమిలా నుండి వివరాలు సేకరించిన ఏసీబీ..
-నిందితులను ఏసీబీ ఆఫీస్ నుంచి వైద్య పరీక్షలకు తరలించిన ఏసీబీ
-అనంతరం న్యామూర్తి ముందు హాజరు పరచనున్న ఏసీబీ.
-కేస్ లో నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ పై కొనసాగుతున్న దర్యాప్తు..
- 24 Sep 2020 11:32 AM GMT
Mahabubabad updates: ఇసుక మాఫియాకు యువకుడు బలి, మరో యువకుడి పరిస్థితి విషమం.
మహబూబాబాద్ జిల్లా :
-మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలో బైక్ ను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్
-వీఎస్ లక్మీపురం గ్రామానికి చెందిన ఓయువకుడు మృతి, మరో యువకుడికి గాయాలు
-ఎలాంటి అనుమతులు లేకుండా రేయంబవళ్లు నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లు, పట్టించుకోని అధికార యంత్రాంగం
-అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్లు తమ ఊరి నుంచి వెళ్లినందుకు డబ్బులు వసూలు చేస్తు అక్రమార్కులను ప్రోత్సహించిన గుండంరాజుపల్లి గ్రామ పంచాయతీ
- 24 Sep 2020 11:22 AM GMT
Rangareddy district updates: ఆంధ్ర బ్యాంకు లో నకిలీ గోల్డ్ పెట్టుకొని బ్యాంకుకు టోకరా చేసిన వ్యక్తి..
రంగారెడ్డి జిల్లా..
-మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ లో ఆంధ్ర బ్యాంకు లో గోల్డ్ కొలతలు చూసుకునే సిబ్బంది చేతివాటం
-నకిలీ గోల్డ్ పెట్టుకొని బ్యాంకుకు టోకరా చేసిన వ్యక్తి. రెండున్నర కోట్ల వరకు బ్యాంకు నుంచి రుణాలు పొందిన వ్యక్తి.
-అతన్ని పరిచయస్తులు పేర్ల మీద గోల్డ్ తాకట్టు పెట్టి బ్యాంకు నుండి లోన్ తీసుకున్న వ్యక్తి.
-నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అతనికి సహకరించిన బ్యాంకు సిబ్బంది మొత్తం ముగ్గురు వ్యక్తులు.
-పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
-పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఎల్బినగర్ జోన్ డిసిపి సన్ ప్రీత్ సింగ్.
-పలువురు బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు
- 24 Sep 2020 11:19 AM GMT
Mancherial district updates: భారీ వర్షాలకు అన్నారం బ్యారేజ్ లోకి వచ్చి చేరుతున్న వరద నీరు..
మంచిర్యాల జిల్లా :-
-ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అన్నారం బ్యారేజ్ లోకి వచ్చి చేరుతున్న వరద నీరు.
-అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తక పోవడంతో ఎగువ ప్రాంతాల్లో ని పంట పొలాలను ముంచిన వరద నీరు.
-త్వరితగతిన గేట్లు ఎత్తి పంట పొలాలను కాపాడాలని కోరుతూ అన్నారం బ్యారేజ్ వద్ద రైతుల ఆందోళన,
- 24 Sep 2020 11:08 AM GMT
Pragathi Bhavan: ప్రగతి భవన్ లో మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం..
ప్రగతి భవన్..
-రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై చర్చ..
-ఈ సమావేశం లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం...
-హైదరాబాద్ లో ఆర్ టి సి బస్సులపై తిరిగే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం..
-హైదరాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఆర్ టి సి బస్ లు తిప్పడానికి అనుమతి ఇవ్వాలని సీఎం కొరనున్నరూ..
-హైదరాబాద్ లో 10 శాతం ఆర్ టి సి బస్ లు నడిపించేందుకు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం...
- 24 Sep 2020 10:49 AM GMT
Telangana High Court: అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంపై హైకోర్టులో విచారణ..
టీఎస్ హైకోర్టు....
-న్యాయవాది గోపాల్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ
-రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
-అక్టోబరు 14 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం,
-తదుపరి విచారణ ను అక్టోబర్ 15కి వాయిదా వేసిన హైకోర్టు.
- 24 Sep 2020 10:46 AM GMT
Telangana High Court: కరోనాకు సంబంధించిన పిటీషన్ లపై హైకోర్టులో విచారణ..
టీఎస్ హైకోర్టు.....
-రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రశ్నించిన హైకోర్టు
-మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారన్న హైకోర్టు
-రోజుకు 40వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదన్న హైకోర్టు
-డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవన్న హైకోర్టు
-మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలన్న హైకోర్టు
-వెయ్యి మందికి కనీసం మూడు బెడ్ లు లేక పోవడానికి కారణాలు తెలపాలన్న హైకోర్టు
-తదుపరి విచారణ ను అక్టోబరు 8 కి వాయిదా వేసిన హైకోర్టు
- 24 Sep 2020 10:43 AM GMT
Pragathi Bhavan: మరికాసేపట్లో ప్రగతి భవన్ లో మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం..
ప్రగతి భవన్..
-రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై చర్చ.
-ఈ సమావేశం లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్.
- 24 Sep 2020 10:41 AM GMT
T Harish Rao Comments: గతంలో పాస్ బుక్కుల కోసం ఆఫీసు ల చుట్టు తిరిగే పరిస్థితి: మంత్రి హరీష్ రావు!
-రైతులు బ్యాంకుల చుట్టు, రెవెన్యూ ఆఫీసు ల చుట్టూ తిరగకుండా కొత్త రెవెన్యూ చట్టం ఉపయోగపడుతుంది.
-రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చాము.
-పంట పంటకు ఏడాదికి ఎకరానికి 10 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీ ఆర్ ఎస్ మాత్రమే.
-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పింఛన్లు కోసం 11400 కోట్లు ఖర్చు పెడుతుంది, కేంద్రం కేవలం 200 కోట్లు మాత్రమే ఇచ్చ గొప్పలు చెప్పుకుంటున్నారు.
-దుబ్బాక ఉప ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ అభ్యర్థి ని గెలిపించండి.
-డిజిటల్ సర్వే తో భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చేస్తాము.
-సమగ్ర భూ సర్వే రైతులపాలిట వరం.
-రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మందికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వార సహాయం చేసాము.
-కరోన కారణం గా ఆదాయం తగ్గి ఆర్ధిక ఇబ్బందులు ఉన్న...సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఆపలేదు.
-మన రాష్టానికి వాటా గా వచ్చే 10 వేల కోట్లు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది.
-రాష్టానికి రావాల్సిన GST బకాయిలను చెల్లించిన తర్వాత బీజేపీ నాయకులు మాట్లాడాలి - మంత్రి హరీష్ రావు..
- 24 Sep 2020 10:30 AM GMT
Warangal Urban Updates: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్‌పెక్టర్ల బదిలీ..
వరంగల్ అర్బన్..
-వి.ఆర్ లో వున్న జె. రామకృష్ణ కు టాస్క్ ఫోర్స్.
-ఎ. శ్రీనివాస్ కు స్టేషన్ ఘన్‌పూర్ కు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire