Live Updates: ఈరోజు (సెప్టెంబర్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 24 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి: రా.11-44 తదుపరి నవమి | మూల నక్షత్రం రా.11-36 తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.8-11 నుంచి 9-43 వరకు తిరిగి రా.10-04 నుంచి 11-36 వరకు | అమృత ఘడియలు: సా.5-26 నుంచి 6-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-52 నుంచి 10-40 వరకు తిరిగి మ.2-41 నుంచి 3-29 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-54
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 24 Sep 2020 2:52 PM GMT
Vishnuvardhan Reddy: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కి కోవిడ్ పాజిటివ్
విజయవాడ
- ఈ రోజు బీజేపీ ధర్నా కార్యక్రమం అనంతరం పరీక్ష చేయించుకున్న విష్ణువర్ధన్ రెడ్డి
- కరోనా వచ్చినట్లు నిర్ధారణ, ఐసోలేషన్ కి విష్ణు
- విష్ణు కు పాజిటివ్ రావడం తో బీజేపీ నేతల్లో గుబులు
- నాలుగు రోజుల క్రితం బీజేపీ పదాడికారుల సమావేశం లో నేతలను కలిసిన విష్ణు.
- ఎమ్మెల్సీ లు, ముఖ్య నేతలతో మీడియా సమావేశాలు పెట్టిన విష్ణువర్ధన్ రెడ్డి
- ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి నిరసనలో పాల్గొన్నవారి లో ఆందోళన.
ఉదయం నిరసనల సందర్భం గా కార్యకర్తలు, పోలీసు, మీడియా ప్రతినిధులను కలిసిన విష్ణు
- 24 Sep 2020 11:58 AM GMT
Srisailam updates: శ్రీశైలంలో అన్యమతం పార్శిల్ కలకలం.
కర్నూల్ జిల్లా..
-శ్రీశైలంలోని ఒక కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపించిన క్రిస్టియన్ సంస్థ
-శ్రీశైలం పర్యాటక శాఖ ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి వచ్చిన పార్శిల్
-కార్గో ద్వారా వచ్చిన పార్శిల్ ను స్వాధీనం చేసుకున్న దేవస్థానం, పోలీస్ అధికారులు
-శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో పార్శిల్ ఘటన పై విచారణ చేస్తున్న అధికారులు
-పార్శిల్ చిరునామా కలిగిన వ్యక్తులను విచారిస్తున్న ఎస్సై హరిప్రసాద్, దేవస్థానం అధికారులు
- 24 Sep 2020 11:50 AM GMT
Ongole updates: ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించిన ఒంగోలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు..
ప్రకాశం జిల్లా..
-మార్కాపురంలో పేసెంట్లనుండి అధిక ఫీజు వసూల్లు చేస్తున్నారనే సమాచారంతో ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించిన ఒంగోలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.
-పలు రికార్డులు స్వాధీనం.
-కొనసాగుతున్న తనిఖీలు.
- 24 Sep 2020 11:37 AM GMT
Tirumala-Tirupati updates: ఆన్ లైన్ కల్యాణోత్సవం టికెట్ల అక్టోబర్ కోటా విడుదల.
తిరుమల..
-అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆన్ లైన్ కల్యాణోత్సవం టికెట్ల కోటాను టిటిడి గురువారం ఆన్ లైన్లో విడుదల చేసింది.
-అక్టోబర్ 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 25న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉన్న కారణంగా ఆ రోజుల్లో కళ్యాణోత్సవం రద్దు
-టికెట్లు బుక్ చేసుకునే గృహస్తులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా వారి పంపిణీ
-ఆన్‌లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశం
- 24 Sep 2020 11:29 AM GMT
Kadapa updates: మీడియా ముందుకు ప్రొద్దుటూరు నకిలీ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అసలు సూత్రధారి భాస్కర్ రెడ్డి..
కడప :
-నకిలీ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు నా పనే ....
-హోసూరులో సుబ్బిరామిరెడ్డి అనే వ్యక్తి ద్వారా సలహా మేరకే ఇలా చేశాను ...
-హోసూరులో పనిచేస్తున్న సమయంలో సుబ్బిరామిరెడ్డి పరిచయం......
-నకిలీ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల ద్వారా డబ్బులు వస్తాయని చెయ్యమని చెప్పడం వల్లే చేశాను .....
-ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చూసే అసిస్టెంట్ ద్వారా చెక్కుల సమాచారం తెలుసుకున్నా....
-అసలు సూత్రధారి నేనే నని ప్రచారం జరుగుతుండటంతో లొంగిపోవాలని అనుకున్నాను....
-పోలీసుల ఎదుట కూడా ఇదే చెబుతా ....
-మూడు చెక్కులు మినహా నాకెలాంటి సంబంధం లేదు ....నన్ను ఎవ్వరు విచారించలేదు.... నేనే లొంగిపోతున్నా
- 24 Sep 2020 11:12 AM GMT
Visakha updates: డిక్లరేషన్ ఇచ్చి సిఎం దర్శనానికి వెళ్లి వుండాల్సింది.
విశాఖ..
-Hmtv తో ఏపి సాధూ పరిషత్తు అధ్యక్షులు శ్రీనివాసంద స్వామి
-డిక్లరేషన్ వ్యవహారం లో సిఎం హిందువు ల మనోభావాలు దెబ్బతీశారు
-ధార్మిక సంస్థలను కించపరిచేలా మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని తన పదవికి రాజీనామా చేయాలి
-దమ్ముంటే మళ్ళి పోటీ చేసి గెలవాలని సవాల్
-భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- 24 Sep 2020 11:05 AM GMT
Vizianagaram updates: సాలూరు మండలం చీపురువలసలో ఎమ్మెల్యే రాజన్నదొరకు చుక్కెదురు..
విజయనగరం....
-గెలిచాక తమ గ్రామాన్ని పట్టించుకోలేదని గ్రామం వద్ద అడ్డుకున్న గిరిజనులు.
-గ్రామ సమస్యలు తీర్చకుంటే మళ్ళీ గ్రామానికి రానని హమీనిచ్చిన ఎమ్మెల్యే.
-ఎమ్మెల్యే రాజన్న దొర వెళ్లిన త్రోవలో నిరసనగా మంటలు వేసిన గిరిజన యువకులు.
- 24 Sep 2020 11:03 AM GMT
Guntur updates: ఏపిఈడబ్ల్యూఐడీసి డైరెక్టర్ సూరే బాలకృష్ణ తీరు పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం...
గుంటూరు ః
ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి రఫీ .
-తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.
-తమ పట్ల బాలకృష్ణ అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు
-కమిషనర్ ఆదేశాలను సైతం డైరెక్టర్ బాలకృష్ణ తుంగలో తొక్కుతున్నాడు.
-దళిత ఉద్యోగుల పట్ల బాలకృష్ణ వివక్ష చూపుతున్నారు.
-తన పద్దతి మార్చుకోకపోతే పోరాటం చేస్తాం
- 24 Sep 2020 11:00 AM GMT
Amaravati updates: మా నాయకుడిపై ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తోంది..
అమరావతి..
ప్రభుత్వ సలహాదారులు, సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్...
- ఇష్టానుసారంగా ఎల్లో మీడియా రాతలు రాస్తోంది
- పిచ్చి రాతలతో ఎల్లోమీడియా ప్రజలను పక్కదారి పట్టిస్తోంది
- హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రధాన ప్రతిపక్షం ఉంది
- రాజకీయ స్వార్థం కోసం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు
- తమ అనుకూల మీడియా ద్వారా వార్తలు ప్రచారం చేసుకుంటున్నారు
- ప్రతి అడుగు ప్రజల కోసమే వేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్
- హిందూ మతంపై విశ్వాసంతో కాదు, అధికారంలో లేమనే బాధతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి
- అత్యంత భక్తిభావంతో సీయం జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు
- సంక్షోభం సృష్టించాలన్న తాపత్రయమే ప్రతిపక్షాల్లో కనిపిస్తోంది
- ఊహించడానికి కూడా భయపడే అత్యంత భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూడా విజయవంతంగా పరిపాలిస్తున్న సవ్యసాచి జగన్ మోహన్ రెడ్డి
- ఏపీలో వ్యవస్థ చాలా బాగుందని.. వాలంటీర్, గ్రామ సచివాలయాలు.
- మంచి ఆలోచన అని, ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుందని స్వయంగా ప్రధానే జగన్ ను మెచ్చుకున్నారు
- 24 Sep 2020 10:56 AM GMT
West Godavari updates: నిడదవోలులో ప్రముఖ వ్యాపారవేత్త పై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించిoది..
పశ్చిమగోదావరి జిల్లా..
👉నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త పై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించిoది.
👉 నిడదవోలులోని ప్రముఖ వ్యాపార వేత్త , 28 కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు సత్తివేణుమాధవ్ రెడ్డి పై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేశారు.
👉అనంత లక్ష్మీ నరసింహ రా రైస్ మిల్ వివాదంలో గత కొంత కాలం గా పాత కక్షలు నేపద్యంలో దాడికి పాల్పడినట్లు.. చెబుతున్న మాధవ రెడ్డి కుటింబుకులు.
👉 దాడి నిర్వహణలో...చవ్వ సత్య కృష్ణ, శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులు ప్రధానపాత్రపోషించినట్లు...చెబుతున్న చూపరులు.
👉రంగంలోకి దిగిన పోలీసులు. చవ్వా
👉 శ్రీధర్ ని అదుపులోకి తీసుకున్న సమిశ్రగూడెం పోలీసులు. పరారీలో చవ్వా సత్య కృష్ణ వారి కుటుంబీకులు.
👉విషమ పరిస్థితిలో ఉన్న మాధవరెడ్డిని ఆసుపత్రికి తీసుకు వచ్చి వదిలేసి పారిపోయిన ప్రత్యర్ధులు.
👉స్థానిక శేషగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధవ రెడ్డి.
👉 దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire