Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 24 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి ఉ.11-25 వరకు తదుపరి నవమి | ఉత్తరాషాఢ నక్షత్రం ఉ.06-36 వరకు తదుపరి శ్రవణ | వర్జ్యం: ఉ.10-39 నుంచి 12-16 వరకు | అమృత ఘడియలు రా.08-21 నుంచి 09-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-59 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧
ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 24 Oct 2020 7:57 AM GMT
కోదండరెడ్డి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు..
అన్వేష్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్
ప్రభుత్వ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది..
నిన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి పరిశీలన బృందం వచ్చింది. మేము రాష్ట్రంలో జరిగిన నష్టాలను లేఖ రూపంలో తెలియజేశాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నష్టం అంచనాలు వేయలేదు.
వైపరీత్యాలు జరగ్గానే నష్టం వివరాలు కేంద్రానికి తెలియజేయాలి..కానీ బృందం వచ్చే వరకు ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు..
బీజేపీ, టిఆర్ఎస్ పార్టీ లు వరదలను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. వరికి ఎకరానికి 20 వేలు, పత్తి ఇతర పంటలకు ఎకరానికి 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసాము..
టిఆర్ఎస్ కేవలం బీజేపీని నామమాత్రంగా వ్యతిరేస్తుంది. కేంద్రంలో మూడు వ్యవసాయ చట్టాలు తెస్తే వాటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో లో తీర్మానం చేయలేదు..
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు, వ్యవసాయానికి చాలా నష్టం చేస్తున్నాయి..
రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను నామమాత్రంగా కాకుండా అసెంబ్లీలో తీర్మాణం చేయాలి.
- 24 Oct 2020 7:56 AM GMT
భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలకే... మంత్రి నిరంజన్‌రెడ్డి
#ఆకాశాన్నంటిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
#ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం... వ్యాపారులు నిల్వచేసే పరిమితులపై ఆంక్షలు విధించింది.
# రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై ఉల్లి సరఫరా చేపట్టింది
# జంటనగరాల్లోని 11 రైతు బజార్లలో 35 రూపాయలకే కిలో ఉల్లిగడ్డలు సరఫరా చేస్తున్నాము.
#ఉల్లి ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది
# ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఉల్లి విక్రయిస్తామన్నారు.
# ఏదైనా గుర్తింపుకార్డు చూపించి ఉల్లిగడ్డలు తీసుకోవచ్చన్నారు.
#భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతింది...లాభం లేకుండా రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు చేపట్టాము
#బహిరంగ మార్కెట్‌లో ఉల్లి 90 రూపాయలు పలుకుతోంది.
- 24 Oct 2020 7:56 AM GMT
కామారెడ్డి :
జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో టీఆరెఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం.
మొక్కజొన్న పంటను 1850 ధరతో కొనుగోలు చేస్తామన్న సీఎం ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం.
- 24 Oct 2020 7:56 AM GMT
జగత్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీ ఆటోలో పేలుడు...
ఆటోలో ఎక్కుతున్న యూసూఫ్ అలీ అనే వ్యక్తి కాలికి తీవ్రగాయాలు..
ఆసుపత్రికి తరలింపు..పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది...
- 24 Oct 2020 5:54 AM GMT
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- 24 Oct 2020 5:54 AM GMT
రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ఆడబిడ్డలది
బతుకమ్మను రాష్ట్ర పండగగా చేయడానికి ఆడబిడ్డలకు ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనం
తెలంగాణ ఆడబిడ్డలకు నిండు మనసుతో ఇచ్చే గొప్ప కానుక బతుకమ్మ చీర
తీరొక్క పూలతో పేర్చిన అందమైన బతుకమ్మ అనేక ఆనందాలకు ప్రతీక
రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
- 24 Oct 2020 5:53 AM GMT
జాయింట్ సి పి అవినాష్ మహంతి.. ఓఎల్ఎక్స్ కేస్ అప్డేట్..
👉 OLX నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ధైర్య సాహసాలు.
👉 OLX లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది ముఠాను తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
👉ఈ ముఠా ఇంతకు ముందు బంగారం దొంగతనాలకు పాల్పడేవారు.
👉ఇప్పుడు టెక్నాలజీ వాడుతూ.. సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
👉హైదరాబాద్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రాజస్థాన్ భరత్ పూర్ జిల్లాలోని కళ్యాణ్ పూరి చౌవేరా గ్రామాలకు వెళితే ఊర్లో వాళ్ళు, మహిళలు పోలీసులపై దాడులు చేశారు.
👉తాజాగా OLX మోసాలు భారీగా పెరగడంతో.. రాజస్థాన్ భరత్ పూర్ జిల్లా పోలీసుల సహాయంతో నిందితులకు చెందిన రెండు గ్రామాలపై దాడులు చేశాం.
👉ఈ క్రమంలో అక్కడి గ్రామస్తులు, మహిళలు పోలీసుల పై దాడులు చేసి, రాళ్లు రువ్వారు, కారం పొడి చల్లారు.
👉అయినప్పటికీ పోలీసులు ధైర్య సాహసాలు ప్రదర్శించి.. 18 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
👉ఈ ముఠా పై పిడి యాక్ట్ నమోదు చేస్తాం.
👉ఇకపై సైబర్ నేరస్తుల పై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టి.. ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
- 24 Oct 2020 5:52 AM GMT
రాజన్న సిరిసిల్ల : జిల్లా లో టి టిడిపి అద్యక్ష్యుడు ఎల్ రమణ పర్యటన
వేములవాడ శ్రీ రాజారాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రమణ
సిరిసిల్ల జిల్లా లో ఇటీవల పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న ఎల్ రమణ
- 24 Oct 2020 5:52 AM GMT
తెలంగాణ రాష్ట్ర మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి
ప్రకృతిలో లభించే పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకం.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను అక్కా చెల్లెల్లు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను..
కరోనా మహమ్మారి నేపధ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుని మహిళలు బతుకమ్మను జరుపుకోవాలని నా విజ్ఞప్తి...
- 24 Oct 2020 5:51 AM GMT
నిర్మల్ // బాసర
శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజైన నేడు 'మహా గౌరీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారు..ఉదయం తొమ్మిది గంటలకు ఆలయం లో గౌరి నామార్చన నిర్వహించిన ఆలయ అర్చకులు ..వేద పండితులు...చక్కెర పొంగలి నైవేద్యం గా సమర్పించిన ఆలయ అర్చకులు ..వేద పండితులు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire