Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 24 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి ఉ.11-25 వరకు తదుపరి నవమి | ఉత్తరాషాఢ నక్షత్రం ఉ.06-36 వరకు తదుపరి శ్రవణ | వర్జ్యం: ఉ.10-39 నుంచి 12-16 వరకు | అమృత ఘడియలు రా.08-21 నుంచి 09-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-59 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧
ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 24 Oct 2020 3:07 AM GMT
విజయనగరం...
ఈ నెల 26వ తేది నుండి పైడితల్లి అమ్మవారి జాతర ప్రారంభం..
26న తోళ్ళేళ్ళ సంబరం, 27న అమ్మవారి సిరిమానోత్సవం భక్తులు లేకుండా జాతర జరిపేందుకు ఏర్పాటు
కరోనా నిభందనలు పాటిస్తూ అమ్మవారి జాతర
26, 27 తేదీలలో జిల్లాలో పూర్తి లాక్ డౌన్ విధింపు.
లాక్ డౌన్ అమలులోనున్న రెండు రోజులు జిల్లాలో ఎటువంటి వాహనాలు తిరగకుండా కట్టుదిట్టం చేస్తున్న అధికారులు.
ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఎవ్వరూ జాతరకు రావద్దని విజ్ఞప్తి.
- 24 Oct 2020 3:07 AM GMT
అమరావతి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి 2 రోజులు విజయవాడ పర్యటన.
అధికారిక కార్యక్రమాలతో పాటు, పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్రలో రాజకీయ పరిస్థితులపై సమావేశం.
రేపు ఉదయం నూతన రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
ఈరోజు సాయంత్రం కి విజయవాడకు చేరుకోనున్న కేంద్ర మంత్రి.
- 24 Oct 2020 3:06 AM GMT
విశాఖ...
గీతం విశ్వవిద్యాలయం లో కొన్ని కట్టడాలను కూల్చివేస్తున్న జీవీఎంసీ అధికారులు.
గీతం విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం,ప్రహరీ గోడను కూల్చివేసిన జీవీఎంసీ అధికారులు.
జె సి బి,ఇతర యంత్రాలు తో అర్ధరాత్రి నుంచి కట్టడాలను కూల్చివేస్తున్న జీవీఎంసీ అధికారులు.
గీతం విశ్వవిద్యాలయం వద్దకు చేరుకుంటున్న టీడీపీ శ్రేణులు.
ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నరు అంటున్న గీతం యాజమాన్యం.
ఎందుకు కూల్చివేస్తున్నారో చెప్పలేదు అంటున్న గీతం యాజమాన్యం.
బీచ్ రోడ్ లో గీతం కు వెళ్లే మార్గాన్ని రెండు వైపులా మూసివేసిన అధికారులు.
భారీగా పోలీసులు మోహరింపు.
- 24 Oct 2020 3:05 AM GMT
విశాఖ
శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరైన మంత్రి విశ్వరూప్.
రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న విశ్వరూప్ దంపతులు
- 24 Oct 2020 3:05 AM GMT
విశాఖ
గీతం యూనివర్సిటీ వద్ద అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు..
గీతం కు వెళ్ళే రూట్ బ్లాక్ చేసిన పోలీసులు
గీతం చెర లో 40.51 ఏకరాలు
రుషికొండ, ఎండాడ పరిసరాల్లో
భూ ఆక్రమణలు
గీతం విద్యా సంస్థల భూ ఆక్రమణలపై ప్రభుత్వనికి నివేదిక ఇచ్చిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం
ఎండాడ, రుషికొండ ప్రాంతాల్లో 40.51 ఎకరాల భూములు గీతం విశ్వవిద్యాలయం ఆక్రమణల్లో ఉన్నాయంటూ ఆర్టీవో ప్రభుత్వానికి నివేదిక
గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయం సమీపంలోని భూముల్ని గీతం యాజమాన్యం ఆక్రమించినట్లు అధికారులు నిర్ధారిన
ఎండాడలోని సర్వే నం. 15(పీ) 16(పీ),17పీ, 18పీ, 18పీ, 20వీ, రుషికొండలోని 553, 613, 34, 35, 37, 38లోని మొత్తం 40.51 ఎకరాల భూమి గీతం చెరలో ఉందని రెవెన్యూ యంత్రాంగం నివేదిక
ఈ ఆక్రమణలపై విశాఖ ఆర్టీవో పెంచల్ కిశోర్ ఇచ్చిన నివేదికతో పాటు సిట్ తమకు అందిన ఫిర్యాదు నంబర్ 2670 ప్రకారం విచారణ
- 24 Oct 2020 3:04 AM GMT
తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేటితో సమాప్తం.
చివరి రోజైన ఇవాళ ఉదయం చక్రధారుడి చక్రస్నానం
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం కార్యక్రమం
ఏకాతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా
అయిన మహల్ వద్ద ప్రత్యేకంగా చిన్న పుష్కరిణి నిర్మించిన టీటీడీ
రాత్రి 7 గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం.
- 24 Oct 2020 3:04 AM GMT
కర్నూలు జిల్లా
దసరా మహోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజైన నేడు అమ్మవారికి మహాగౌరి అలంకారం,
స్వామిఅమ్మవార్లకు నందివాహనవాహనసేవ
ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,
అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు
రుద్రహోమం, చండీహోమం
ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, జపానుష్ఠానాలు
ఈ రోజుసాయంకాలం స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాల సమర్పణ
రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పించనున్న రాష్ట్ర కార్మిక శాఖా మాత్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్
- 24 Oct 2020 3:03 AM GMT
కర్నూలు జిల్లా శ్రీశైలం
శ్రీశైలం జలాశయాని కీ కొనసాగుతున్న వరద ఉధృతి
10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
ఇన్ ఫ్లో 2,06,335 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 3,11,540 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం 884.30 అడుగులు
పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు
ప్రస్తుతం 211.4759 టీఎంసీలు
కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 24 Oct 2020 3:03 AM GMT
ఈనెల 29 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఈశాన్య రాష్ట్రాల మీదకు వెళ్లి క్రమంగా బలహీన పడుతున్న ప్రస్తుత వాయుగుండం
ఈనెల 28 నాటికి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తి
అదే రోజు ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభం
28 నుంచి తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు దక్షిణ కోస్తాంధ్రలోనూ వర్షాలు
- 24 Oct 2020 3:02 AM GMT
తిరుమల సమాచారం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 17,577 మంది భక్తులు
తలనీలాలు సమర్పించిన 5,791 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.188 కొట్లు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire