Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 24 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం షష్ఠి (రా. 7-04 వరకు) తదుపరి సప్తమి స్వాతి నక్షత్రం (రా. 8-35 వరకు) తదుపరి విశాఖ అమృత ఘడియలు: (మ. 12-23 నుంచి 1-53 వరకు) వర్జ్యం: (రా. 1-49 నుంచి 3-19 వరకు) దుర్ముహూర్తం: లేదు రాహుకాలం: (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-47 సూర్యాస్తమయం: సా.6-18
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 24 Aug 2020 11:27 AM GMT
అమరావతి...
అంబటి రాంబాబు ....వైసీపీ ఎమ్మెల్యే
అమరావతి ప్రజా ఉద్యమమే లేదు..
అమరావతిలో జరిగేది భూస్వామ్య, పెట్టుబడి దారి, ధనవంతుల ఉద్యమం..
రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నారు..
అమరావతి అనేది పెద్ద స్కాం..
చంద్రబాబు తన తాబేదార్లు కోసం పెట్టిందే అమరావతి..
దళితులకు ఇచ్చిన భూములను బలవంతంగా టీడీపీ నేతలు లాక్కున్నారు..
వాగులు వంకలు, చెరువులు, దేవాదాయ భూములు లాక్కుని పట్టాలు టీడీపీ నేతలు సృష్టించారు..
అమరావతి పై విచారణ జరుగుతుంది..
ఇప్పటికే కొంతమంది ని అరెస్ట్ చేశారు..
త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేస్తారు..
అభివృద్ధి అంతా హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడం వలన మనం నష్ట పోయాము..
ఏ ప్రాంతానికి అన్యాయం జరగ కూడదనే పరిపాలన వికేంద్రీకరణ సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు..
జూమ్ లో చంద్రబాబు కూర్చొని ప్రజలను రెచ్చిగొడుతున్నారు..
ఎవరిని సంప్రదించకుండా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు మాట్లాడడానికి సిగ్గుండాలి..
పరిపాలన వికేంద్రీకరణపై శాసనసభలో చర్చ జరిగింది..
అ రోజు చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయారు..
పీడిత ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ మద్దతు తెలుపుతున్నారు..
మీది కమ్యూనిస్టు ఆఫ్ ఇండియానా, క్యాప్టులిస్ట్ ఆఫ్ ఇండియానా రామకృష్ణ సమాధానం చెప్పాలి..
నేరం జరిగినప్పుడు దర్యాప్తు చేయాల్సిన ప్రభుత్వం మీద ఉంది..
రమేష్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం కారణంగా పది మంది చనిపోయారు..
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా..
అప్పుడు నిమ్మగడ్డ రమేష్, ఈప్పుడు డాక్టర్ రమేష్ ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు..
రమేష్ ను మీరు ఎందుకు దాస్తున్నారు..
ఎందుకు వెనకేసుకువస్తున్నారు..
రమేష్ ను పోలీసులకు అప్పగించాలి..
విచారణకు రమేష్ సహకరించాలి
రమేష్ ను ఎక్కడ దాచారో సమాధానం చెప్పాలి..
- 24 Aug 2020 11:26 AM GMT
అమరావతి...
డొక్కా మణిక్యవర ప్రసాద్ ఎమ్మెల్సీ
దళితుల ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్న చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ మద్దతు తెలపడం ఎంత వరకు సమంజసం..
దళితులకు అమరావతిలో 52 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు కోర్టు లో కేసులు వేశారు..
కోర్టుల్లో కేసులు వేసిన వారిపై ఎస్సి ఎస్టీ చట్టం కింద కోర్ట్ సుమోటుగా విచారణ జరపాలి..
రాజధాని రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది..
సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం శోషనియం..
టీడీపీ ట్రాప్ లో రైతులు పడవద్దు..
రైతులకు ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో సంప్రదించాలి.
రాజధానిలో జరిగే ఉద్యమానికి దళితులకు సంబంధం లేదు..
- 24 Aug 2020 11:26 AM GMT
విజయవాడ
దేవినేని అవినాష్....వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి
కేశినేని నాని దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై మాట్లాడటం సిగ్గు చేటు..
అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది..ఇప్పుడు
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లి నాని హడావుడి చేస్తున్నారు
సీఎం జగన్ గురించి విమర్శలు చేసే నైతిక హక్కు కూడా నానికి లేదు
కేశినేని ట్రావెల్స్ లో పనిచేసే కార్మికుల జీతాలు ఎగకొట్టిన నాని,,నీతి నిజాయితీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు
లెనిన్ సెంటర్ లో కార్మికులు జీతాలు గురించి ధర్నా చేస్తుంటే దొంగ చాటుగా పారిపోయిన వ్యక్తి కేశినేని నాని
ప్రజల ఉసురు పోసుకున్నారు కాబట్టే టీడీపీ పుట్టగతులు లేకుండా పోతుంది
అధికారంలో ఉండగా బీజేపీని విమర్శించి బయటకు వచ్చిన టీడీపీ ఇప్పుడు ఏమి నచ్చి వెనకేసుకొస్తున్నారు..
2సంవత్సరాల క్రితం బీజేపీని తిట్టిన మీరు ఈ రోజు ఎలా పొగుడుతున్నారు
గతంలో ప్రధాని మోడీ ని విమర్శించిన నాని ఇప్పుడు ఎందుకు ప్రసంసిస్తున్నాడు
ప్రజలంతా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలా ఆనందంగా ఉన్నారు...
కృష్ణనది పరివాహక ప్రాంతంలో ప్రజలందరిని రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తానని గత టీడీపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది..
ఇచ్చిన ప్రతి హామీని జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ,,ప్రజల విశ్వాసం సంపాదించింది
శాసన రాజధాని అమరావతి అబివృద్దికి వైస్సార్సీపీ కట్టుబడి ఉంది..
కేశినేని నాని నోరు జారీ జగన్ పై విమర్శలు చేస్తే సరైన గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నాం
- 24 Aug 2020 11:25 AM GMT
నాగర్ కర్నూల్ జిల్లా :
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో నిండిన సిపేజ్ వాటర్
2 జనరేటర్లను 15 రోజులలోపు రెడీ చేసే విధంగా కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చినా సి.ఎం.డి దేవులపల్లి ప్రభాకర్
భూగర్భ జల విద్యుత్ కేంద్రం లోపల దిగువున ఉన్న ఫ్లోర్ ల లో వేడి తీవ్రత అధికమవడంతో మరమ్మతు పనులు చేయుటకు వీలు లేని పరిస్థితి
జల విద్యుత్ కేంద్రంలో జరిగిన నష్టాన్ని చూడలేని పరిస్థితి నెలకొనడం ఎమర్జెన్సీ వెలుతురు కోసం జెన్కో కాలనీ నుండి వేసిన ఫోల్స్ ద్వారా లైటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్న జెన్కో అధికారులు
ఒక నెల రోజుల లోపల జనరేటర్లు అన్ని సిద్ధం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామన్న సీఎం డి.
ప్యానెల్ బోర్డులలో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు చెలరేగి విస్తరించి కేబుల్ అలాగే దిగువ వరకు మంటలు చెలరేగడంతో జరిగిన నష్టం అంచనా వేసేందుకు ఎక్కడ ఎక్కడ నష్టం వాటిల్లింది అనే కోణంలో విచారణ లోనే సగం టైం అయిపోతుందని పెదవి విరుస్తున్న నిపుణులు.
ప్రస్తుతం సి పేజీ వాటర్ ను డి వాటరింగ్ చేసే పనుల్లో సిబ్బంది బిజీ బిజీ.
- 24 Aug 2020 10:46 AM GMT
తూర్పుగోదావరి -రాజమండ్రి
జిల్లాలో కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే వుంది
జిల్లాలో 50,686కు చేరిన
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1120
వీటిలో యాక్టివ్ కేసులు 1,7540 మంది
కోలుకున్న వారి సంఖ్య 32,811 మంది
జిల్లాలో 330 దాటిన కరోనా మృతులు.
గత 24 గంటల్లో 1121 మందిని డిశ్చార్జి
జిల్లాలో రోజూ వెయ్యికి తగ్గకుండా నమోదవుతున్న కరోనా కేసులు
కొవిడ్ టెస్ట్లు ఫలితాల వెల్లడిలో కొనసాగుతున్న జాప్యం.
హోం ఐసోలేషన్ లోనే వేల సంఖ్యలో కరోనా ట్రీట్మెంట్
జిల్లాలో వివిధ,కొవిడ్ కేర్ సెంటర్లలో 2,894 మంది చికిత్స పొందుతున్నారు.
- 24 Aug 2020 10:46 AM GMT
విజయనగరం ...
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను పరామర్శించిన రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
మంత్రి బొత్స తల్లి ఈశ్వరమ్మ మృతికి సంతాపం తెలిపిన మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
- 24 Aug 2020 10:46 AM GMT
అమరావతి
సీఎంకు అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక
అవినీతి నిరోధానికి సంబంధించి గతంలో కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం గుడ్ గవర్నెన్స్ పై నివేదిక సమర్పించిన ప్రతిష్టాత్మక సంస్థ అహ్మదాబాద్ ఐఐఎం
సీఎం వైయస్.జగన్‌కు నివేదిక సమర్పించిన ప్రొఫెసర్ సుందరవల్లి
నారాయణ స్వామి
ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించి, వాటి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పేర్కొన్న సీఎం.
ఎమ్మార్వో కార్యాలయాలు, ఎండీఓ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ కార్యాలయాలను యూనిట్‌గా తీసుకుని, సిబ్బంది విధులు, బాధ్యతల్లో స్పష్టత ఇవ్వడంతో పాటు, అవినీతి ఆస్కారమున్న అంశాలను గుర్తించి ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
- 24 Aug 2020 10:45 AM GMT
కర్నూలు జిల్లా
ఆలూరు లో కార్మిక శాఖ మంత్రి తో వేదవతి ప్రాజెక్ట్ కు భూములు ఇచ్చిన రైతుల ఆందోళన
వేదవతి నది కి భూములు ఇవ్వడంతో తీవ్రంగా నష్టపోయామని తమను ఆదుకోవాలని కార్మిక శాఖ మంత్రి జైరాం తో మొరపెట్టుకున్నా రైతులు
సమస్యతో పాటు రైతులను కూడా సీఎం వద్దకు తీసుకెళ్లి, తగిన నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ..
దీంతో వెనుతిరిగి రైతులు
- 24 Aug 2020 10:45 AM GMT
అమరావతి
బ్రేకింగ్ :
కృష్ణ పుష్కరాల ఘాట్ల పనుల్లో జరిగిన అక్రమాలపై చర్యలకు సర్కార్ సిద్ధం
పవిత్ర సంగమం, దుర్గ ఘాట్ ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు ధృవీకరణ
పుష్కరాల సమయంలో పనులు చేసిన నలుగురు అధికారులపై విచారణకు ఆదేశం
రిటైర్డ్ సి ఈ సుధాకర్, ఎస్ ఈ సుగుణా కర్ , ఈ ఈ రవి బాబు, రిటైర్డ్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు పై విచారణ
కమీషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఆర్పీ సిసోడియా కు ఆదేశాలు
రెండు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశo.
- 24 Aug 2020 6:37 AM GMT
విశాఖ ఏజెన్సీలో నాటు తుపాకీ కలకలం
విశాఖ ఏజెన్సీ నాటు తుపాకితో అన్నను కాల్చి చంపిన తమ్ముడు..
పెదబయలు మండలం కుంతుర్ల గ్రామంలో గుంట రాంబాబుని, నాటు తుపాకీతో కాల్చి హతమార్చిన తమ్ముడు గుంట కృష్ణారావు.
తుపాకీ తో కాల్చి చంపాడు .
కుటుంబ కలహాలు అని అనుమానాలు లో
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire