Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Sep 2020 12:42 PM GMT
Harish Rao Comments: పప్పులో చిటికెడు ఉప్పేసి.. పప్పంతా నాదే అన్నట్లుగా కేంద్ర బీజేపీ వ్యవహరిస్తోంది..ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు..
మంత్రి హరీశ్ రావు కామెంట్స్:
-పప్పులో చిటికెడు ఉప్పేసి.. పప్పంతా నాదే అన్నట్లుగా కేంద్ర బీజేపీ వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు.
-బాయికాడ మీటర్లు రావొద్దన్నా.., విదేశీ మక్కలు రావొద్దన్నా.., మార్కెట్ యార్డులు రద్దు కావొద్దన్నా.. దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఏస్ అభ్యర్థిని లక్ష మెజారిటీతో గెలిపించి బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేయాలని నియోజకవర్గంలోని రేషన్ డీలర్లకు మంత్రి పిలుపునిచ్చారు.
-మీ సంక్షేమం.. మా బాధ్యతగా చెప్పుకొచ్చారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబరు వన్ గా ఉన్నామని వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని, దుబ్బాక సంక్షేమం, దుబ్బాక అభివృద్ధి టీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందని ప్రజలకు తెలపండని కోరారు.
-కేంద్రం NFSA కింద 40 లక్షల కార్డు దారులకు 5 కిలోల చొప్పున్న బియ్యం అందిస్తుందని, కానీ 90 లక్షల రేషన్ కార్డు దారులకు 6 కిలోల చొప్పున్న బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని.. బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని ప్రజలకు తెలియజేయాలని కోరారు.
-11వేల 700 కోట్లు పింఛన్ల కోసం రాష్ట్రం వెచ్చిస్తే.. కేవలం 200 కోట్లు కేంద్రం ఇస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించేలా తెలియజెప్పాలని కోరారు.
-రేషన్ డీలర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించేలా.. పరిష్కారం తీసుకుంటానని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, డీలర్లకు మేలు చేసిందని మంత్రి హరీశ్ రావు వివరించారు.
- 23 Sep 2020 12:22 PM GMT
Hyderabad RTC updates: హైదరాబాద్ సిటీ బస్సులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..
గ్రేటర్ ఆర్టీసీ ED వెంకటేశ్వర్లు..
-తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు...
-సిటీ శివార్లలో 290 సర్వీసులను ఈరోజు నుంచి నడుపుతున్నాం...
-అన్ని డిపోలలో బస్సుల ను సిద్ధం చేసి ఉంచాం...
-కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాట్లు కూడా చేసాం...
-ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నాం...
- 23 Sep 2020 11:44 AM GMT
Telangana updates: సిబిఎస్‌ఇ, ఇంటర్మీడియట్ కోసం 30% సిలబస్‌ను తగ్గించడానికి అనుమతించిన ప్రభుత్వం: సయ్యద్ ఉమర్ జలీల్..
సయ్యద్ ఉమర్ జలీల్, సెక్రెటరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్
- మొదటి & రెండవ సంవత్సరం సైన్స్, మ్యాథ్స్ సిలబస్ సిబిఎస్ఇ సూచించిన విధంగా తగ్గించబడ్డాయి
- హ్యుమానిటీస్ విషయంలో, ఇంటర్మీడియట్ సిలబస్ మన స్టేట్ సిలబస్ ఆధారంగా ఉంది.
- ప్రతి సబ్జెక్టు నిపుణుల కమిటీ చర్చించి సిఫారసులను చేసింది
- తగ్గించబడిన పాఠ్యాంశాలు ఈ సంవత్సరానికి మాత్రమే.
- జాతీయ వీరులు, సామాజిక సంస్కర్తలు, ప్రముఖ వ్యక్తులపై పాఠాలు తొలగించబడవు
- 23 Sep 2020 11:20 AM GMT
Telangana updates: తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన తెలంగాణ జనసమితి అద్యక్షులు ఫ్రో,,కోదండరాం ...
-ఒకవైపు ఇంటిపార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుండగానే పార్టీ కార్యాలయానికి చేరుకున్న కోదండరాం..
-ఇప్పటి పట్టబద్రుల ఎన్నికల మద్దతు కోసం వివిధ పార్టీ నాయకులను కలుస్తున్న టీజేఎస్..
-తాను కూడా పట్టబద్రుల పోటీలో ఉన్నానని ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్...
-ఈ ఇద్దరి సమావేశానికి ప్రాధాన్యత...
- 23 Sep 2020 11:03 AM GMT
Hyderabad updates: సరూర్ నగర్ భూముల అక్రమణ పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి...
సరూర్ నగర్..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి...
-సరూర్ నగర్ లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురై వరదనీరు కాలనీల మధ్య పోవడం వల్లే నవీన్ కుమార్ కొట్టుకుపోయి మరణించాడు...
-అక్కడ భూ ఆక్రమణలు జరగడం వల్లే ఇలా జరిగిందగని కాలనీ వాసులు చెప్తున్నారు...
-బైరంగుడా పైన ఉన్న చేపల చెరువు ఆక్రమణకు గురవడం వల్ల రెడ్డి కాలనీ మధ్య వరద ప్రవహిస్తుంది...
-రెడ్డి కాలనిలో అడ్డంగా గోడ నిర్మాణం ఉండడం వల్ల అక్కడే నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ అడ్డంగా ఉండడం వల్ల వర్షపు నీరు ఎక్కడికి వెళ్లడం లేదు...
-ఫ్లై ఓవర్ తరువాత ఉన్న కాలువలు ఆక్రమణకు గురయ్యాయి 6 ఎకరాలు ఉన్న చెరువు 3 ఎకరాలు కబ్జాకు గురైంది..
-సరూర్ నగర్ ,బైరామల్ గూడ చెరువులన్నీ సమగ్ర సర్వే చేపట్టి అక్రమ లే అవుట్ లపై చర్యలు తీసుకోవాలి..
-నవీన్ కుమార్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి..
- 23 Sep 2020 10:48 AM GMT
Ease of Doing Business: రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మరిన్ని సంస్కరణలు..కేటీఆర్..
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్..
#రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపు పై పలు శాఖల అధిపతులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి కేటీఆర్ సమావేశం
#ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలతో రాష్ట్ర పౌరులకు సైతం అనేక ప్రయోజనాలు
#శాఖల పరంగా చేపట్టే సంస్కరణలతో ఆయా శాఖల పనితీరులో సానుకూల మార్పులు
# పౌరులకి అన్ని సేవలని ఒకేచోట అందించేందుకు ప్రత్యేకంగా సిటిజన్ సర్వీసెస్ మేనేజ్మెంట్ పోర్టల్ కు ప్రతిపాదన
#ఇదే సమావేశంలో టి ఎస్ బి పాస్ అమలుపై న చర్చ
#చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసము.
- 23 Sep 2020 10:36 AM GMT
Telangana BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసమ్మతి నేతల ధర్నా..
- మంగళవారం ప్రకటించిన నగర జిల్లా అధ్యక్షుల జాబితాలో ఉమమహేందర్ పేరు లేదు అని నిరసన..
- గోశామహల్ - గోల్కొండ అధ్యక్ష పదవి పాండు యాదవ్ కు ఇవ్వడంపై నిరసన
- ఉమమహేందర్ కు న్యాయం చేయాలని ఆయన అనుచరులు డిమాండ్..
- సద్ది చెపుతున్న ఎమ్మెల్సీ రాంచందర్ రావు.
- 23 Sep 2020 10:26 AM GMT
ACB updates: మల్కాజిగిరి ఏసీపీ నరసింహరెడ్డి ఇంట్లో కొనసాగుతున్న ఎసిబి సోదాలు..
-ఏసిబి సోదాలు..
-హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు.
-సికింద్రాబాద్ లో తన ఇంట్లో భారీగా బంగారం వెండి ఆభరణాలు గుర్తింపు.
-భారీగా ఆస్తులు, ప్లాట్స్, వ్యవసాయ భూములు గుర్తింపు
-ఏపి, తెలంగాణ, హైదరాబాద్ లో 12 చోట్ల కొనసాగుతున్న సోదాలు
-ఈరోజు సాయంత్రం వరకూ సోదాలు కొనసాగే అవకాశం
-కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు
-ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేసే అవకాశం
-మియాపూర్, బేగంపేట్, ఉప్పల్ సిఐగా చిక్కడపల్లి , మల్కాజిగిరి ఏసీపీ గా పనిచేసిన నర్సింహారెడ్డి
-నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, భూ వివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు
-Acp నర్సింహారెడ్డి బంధువులకు సంబంధించిన ఇండ్లలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..
-జనగామ జిల్లాలోని లింగాలఘనపురం మండలం వడ్ఢిచెర్లలో, బచ్చన్నపేట, రఘునాధపల్లి మండలాల్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..
- 23 Sep 2020 10:20 AM GMT
Warangal Urban updates: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్‌పెక్టర్ల ( సిఐల ) బదిలీలు..
వరంగల్ అర్బన్..
- వి.ఆర్ విభాగంలో వున్న కె. విజయ్ కుమార్ కు హన్మకొండ ట్రాఫిక్ ,
- కె. రామకృష్ణ వి.ఆర్ నుండి సి.సి.ఆర్.బి కిబదిలీ.
- ప్రస్తుతం హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ హన్నన్ వి.ఆర్ బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు
- 23 Sep 2020 10:16 AM GMT
Yadadri updates: భువనగిరి ఏరియా ఆసుపత్రిలో శిశు విక్రయం కలకలం...
యాదాద్రి....
- 10 రోజుల వయసు పసికందు 60 వేల రూపాయలకు విక్రయించిన తల్లి.
- ఈనెల 12వ తేదీన ఏరియా ఆసుపత్రికి ప్రసవానికి వచ్చిన భువనగిరి మండలానికి చెందిన ఓ యువతి...
- యువతి తల్లి 60 వేల రూపాయలకు ఘట్కేసర్ మండలానికి చెందిన వారికి విక్రయం
- రెండు రోజుల క్రితం నేరేడ్మెట్ పోలీసులు ఓ కేసు విషయంలో ఓ ఇద్దరిని విచారించగా ఈ ఘటన వెలుగులోకి....
- పూర్తి స్థాయి విచారణ చేపట్టిన భువనగిరి టౌన్ పోలీసులు...
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire