Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Oct 2020 2:58 PM GMT
Amaravati updates: రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు విడుదల...
అమరావతి:
*ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో రాయల సీమ స్టీల్స్ లిమిటెడ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు.
*ఆర్ఎస్ సిఎల్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ
*ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ పర్యవేక్షణలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం
*గత కొద్ది కాలంగా ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించని ఆర్ఎస్ సిఎల్
- 23 Oct 2020 12:14 PM GMT
Nellore updates: బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ సెబ్ అధికారుల మెరుపు దాడులు...
నెల్లూరు :--
-- పొదలకూరు (మం) బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ సెబ్ అధికారుల మెరుపు దాడులు..
-- సుమారు 1,600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన సబ్ అధికారులు.. నిందితులు పరార్
--సెప్టెంబర్ నెలలో 51 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ పొదలకూరు సీఐ గంగాధర్ రావు
--సెబ్ అధికారులు ఎప్పుడు దాడి చేసిన నిందితులు తప్పించుకోవడం పై అనుమానాలు
- 23 Oct 2020 12:11 PM GMT
Vijayawada updates: అమరావతి శంఖుస్థాపన జరిగి 5 సం లు పూర్తి..
విజయవాడ
*జెఏసీ కన్వీనర్ శివారెడ్డి కామెంట్స్
*నిన్న అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఒకే రాజధానిగా అమరావతిని సూచించారు
*310 రోజులుగా అమరావతి ఉద్యమం జరుగుతున్నా నిన్న అపశృతి చోటుచేసుకుంది
*ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్యమాన్ని అణచాలని చూస్తోంది
*దళిత పెయిడ్ ఆర్టిస్ట్ లతో మూడు రాజధానులకు మద్దతుగా పోలీసు కవాతు చేయడం దూరదృష్టకరం
*సీఎం జగన్ మా సహనాన్ని పరీక్షించవద్దు
*వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేవరకు పోరాటం చేస్తాం
*మంత్రులు జగన్ మెప్పుకోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
*మాలో మాకు వైషమ్యాలు సృష్టిస్తే సహించేది లేదు
*ప్రభుత్వ దృశ్చర్యలను ముక్త కంఠంతో ఖండించాలి
- 23 Oct 2020 11:43 AM GMT
Y.S.Jagan: సమావేశంలో సీఎం వైయస్ జగన్ కామెంట్స్....
సమావేశంలో సీఎం వైయస్ జగన్ కామెంట్స్
వ్యవసాయానికి ప్రాధాన్యం:
– కోవిడ్ సమయంలో నిధులకు కొరత లేకుండా చూసినందుకు ధన్యవాదాలు
– ఆర్థిక రంగానికి వ్యవసాయ రంగం ఒక వెన్నుముక, రాష్ట్రంలో దాదాపు 62 శాతం ఆ రంగంపైనే ఆధారపడ్డారు.
– అందుకే ఆ రంగం ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం, ఆ దిశలో పలు చర్యలు తీసుకుంది.
వైయస్సార్ రైతుభరోసా, పీఎం–కిసాన్:
– రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.13,500 చెల్లింపు.
– ఖరీఫ్ ప్రారంభంలో (జూన్‌లో) రూ.7500, ఆ తర్వాత రబీ ప్రారంభం (అక్టోబరులో) రూ. 4 వేలు, ఆ తర్వాత పంట చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండగ సమయంలో మరో రూ.2 వేలు ఇస్తున్నాము.
రైతు భరోసా కేంద్రాలు:
– ప్రతి గ్రామంలో ఆర్బీకేల ఏర్పాటు, 10,600కు పైగా కేంద్రాలు ఏర్పాటు.
– పరీక్షించిన, నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా, ఆర్డర్ చేసిన 48 గంటల్లో డోర్ డెలివరీ.
– ఈ–క్రాపింగ్.
_ గ్రామాల్లో వ్యవసాయ సహాయకుడు, రెవెన్యూ కార్యదర్శి, సర్వేయర్లు, వారంతా కలిసి ఈ–క్రాపింగ్ చేస్తున్నారు.
ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాలు:
– 2020–21 ఖరీఫ్‌లో రుణాలు రూ.75,237 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.62,650 పంపిణీ చేశారు.
– ఇది టార్గెట్‌లో 83.27 శాతం కాగా, గత ఏడాది కంటే ఇది రూ.3 వేల కోట్లు తక్కువ.
– గ్రామంలో ఈ–క్రాపింగ్‌లో నమోదైన ప్రతి రైతుకు రుణాలు అందుతున్నాయా? లేదా అన్నది చూడాలి.
– బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ రైతు ఈ–క్రాపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉన్నాడా? అన్నది చూడాలి.
– పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల కోసం ఈ–క్రాపింగ్ తప్పనిసరి.
అదే విధంగా ఎక్కడా అవినీతికి తావు ఉండదు.
ధరల స్థిరీకరణ నిధి:
– గత ఏడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3200 కోట్లతో పంటలు కొన్నాము.
– ఈసారి దాదాపు రూ.3500 కోట్లతో ఆ నిధి ఏర్పాటు చేశాము.
– సచివాలయంలో ఉండే వ్యవసాయ సహాయకుడు ప్రతి రోజూ పంటల ధరలు, వాటి డిమాండ్‌ను ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌డేట్ చేస్తారు.
ఇంకా..
– ప్రతి గ్రామంలో గోదాములు. మండల కేంద్రాల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయబోతున్నాము.
– అదే విధంగా ప్రతి గ్రామంలో జనతా బజార్ల ఏర్పాటు. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ ఏర్పడుతుంది.
– వీటన్నింటికీ బ్యాంకర్ల నుంచి సపోర్టు కావాలి.
నాడు–నేడు:
– ఇంకా స్కూళ్లు, ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం నాడు–నేడు చేపట్టాము. దానికి కూడా బ్యాంకర్ల సహాయం కావాలి.
– ప్రతి స్కూల్‌లో 10 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము, మంచినీరు, టాయిలెట్లు, ప్రహరీలు, లైట్లు, కిచెన్, ఇంగ్లిష్ ల్యాబ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము.
– తొలి దశలో 15,715 స్కూళ్లులో మార్పులు. డిసెంబరులో రెండోదశ పనులు చేపట్టబోతున్నాము.
– స్కూళ్లలో నాడు–నేడు కోసం తొలి దశలో రూ.4000 కోట్లు, రెండో దశలో రూ.4500 కోట్లు, మూడో దశలో దాదాపు రూ.3500 కోట్లు ఖర్చు చేయబోతున్నాము.
విలేజ్ క్లినిక్‌లు:
– ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు చేస్తున్నాము. వాటిలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు.
– ఇంకా 51కి పైగా మందులు కూడా ఆ క్లినిక్‌లో ఉంటాయి.
ఆస్పత్రులు, నాడు–నేడు, టీచింగ్ ఆస్పత్రులు:
– ఆస్పత్రుల్లో కూడా నాడు–నేడుతో పూర్తిగా మార్పులు చేయబోతున్నాము.
– కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రుల ఏర్పాటు.
– ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటు చేయబోతున్నాము.
– దీనిపై కోవిడ్ వీడియో కాన్ఫరెన్సులో ప్రధానమంత్రికి కూడా నివేదించాము.
– వచ్చే 3 ఏళ్లలో దాదాపు రూ.13 వేల కోట్లు, 16 టీచింగ్ ఆస్పత్రులకు ఖర్చు చేయబోతున్నాము.
సంక్షేమ పథకాలు:
– వచ్చే నెలలో జగనన్న తోడు పథకం అమలు చేయబోతున్నాము.
– ఇక వైయస్సార్ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మహిళలకు ప్రయోజనం కలుగుతోంది.
– వారికి ఉపాధి కల్పన దిశలో అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, రిలయెన్స్, అల్లానా గ్రూప్‌లతో అవగాహన చేసుకున్నాము.
– ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మహిళలకు మొత్తం రూ.75 వేల సహాయం చేస్తాము.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్లో 45–60 ఏళ్ల వారికి సహాయం.
ఎంఎస్‌ఎంఈలు:
– ఎంఎస్‌ఎంఈ రంగానికి అర్థికంగా అండ. కోవిడ్ సమయంలోనూ పారిశ్రామిక రాయితీ (పెండింగ్‌లో ఉంటే) పూర్తిగా రూ.1100 కోట్లు ఇచ్చాం.
– ఆ మొత్తం ఎంఎస్‌ఎంఈ రంగానికి ఎంతో అండగా నిల్చింది. కోవిడ్ సమయంలో వారికి పెట్టుబడిగా ఉపయోగపడింది.
స్వయం సహాయక బృందాలు:
– వైయస్సార్ ఆసరా పథకం ద్వారా ఆ మహిళలకు సహాయం. వారి రుణాలు నాలుగేళ్లలో పూర్తిగా చెల్లింపు.
– వీటన్నింటి కోసం బ్యాంకర్ల మద్దతు ఉండాలని, సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను.
- 23 Oct 2020 10:12 AM GMT
Mekapati Goutham Reddy: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదు..
అమరావతి
*మంత్రి గౌతమ్ రెడ్డి...
*నవంబర్, డిసెంబర్ నెలలో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి..
*దసరా తరువాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెపుతున్నారు..
*బీహార్ ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సిన రాష్ట్ర ఎన్నికలు కావున నిర్వహిస్తున్నారు..
*రాష్ట్ర ఎన్నికలు రాజ్యాంగ ప్రకారం జరిగి తీరాల్సిందే..
*వాటితో.. స్థానిక సంస్థలను పోల్చకూడదు..
- 23 Oct 2020 10:06 AM GMT
Andhra Pradesh updates: ఏపీ బీజేపీ నేతల వీడియో కాన్ఫరెన్స్...
* కేంద్ర పంచాయితీ రాజ్,వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపలాతో ఏపీ బీజేపీ నేతల వీడియో కాన్ఫరెన్స్
* వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు,పురందరేశ్వరి,విష్ణు వర్ధన్ రెడ్డి, బిజెపి ఎంపీలు సీఎం రమేష్,సుజనాచౌదరి, టిజి వెంకటేష్ నేతలు
* ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎంపీ జీవిఎల్,ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శశిభూషన్ రెడ్డి
* ఇటివల కురిసిన వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంట నష్టం వివరాలను కేంద్రమంత్రికి వివరించిన బిజెపి నేతలు
- 23 Oct 2020 9:54 AM GMT
G. V. L. Narasimha Rao: అకాలవర్షాల వల్ల జరిగిన తీవ్రపంట నష్టాన్ని వివరించాము...
*జీవీఎల్ నరసింహారావు, బిజెపి రాజ్యసభ సభ్యులు
*కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి తో వీడియోకాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో జరిగిన అకాలవర్షాల వల్ల జరిగిన తీవ్రపంట నష్టాన్ని వివరించాము.
*రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆశాజనకంగా లేవని వివరించాము.
*కేంద్ర బృందాన్ని వెంటనే పంపించి పంటనష్టాన్ని అంచనావేయడం తో పాటు రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరాము. మంత్రి సానుకూలంగా స్పందించారు.
- 23 Oct 2020 9:45 AM GMT
Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై కొండచరియలు పరిశీలన చేశాము..
విజయవాడ
-Hmtv తో జియో ఎక్సపర్ట్ కమిటీ సభ్యులు త్రిమూతి రాజు
-ఓంకారం మలుపు, మౌన ముని గుడి వద్ద కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది.
-ఇంద్రకీలాద్రిపై కొండలు మట్టి, రాళ్లు కలిసి ఉన్నాయి..
-వర్షాలు ప్రభావంతో జారీ పడుతున్నాయి
-కొండచరియలు పడే ముందు అలారం ఏర్పాటు, ఐరెన్ మెష్ పటిష్టం, లూజ్ గా ఉన్న కొండ చరియలు తొలగింపు చేయాలి
-మరో 10 నుంచి 15 రోజుల్లో నివేదిక ఇష్టము
- 23 Oct 2020 9:41 AM GMT
Amaravati updates: జీవో 111 అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టాలి..
అమరావతి...
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్
• ఎఫ్.టి.ఎల్. నిబంధనను పట్టించుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారు
• నాలాలు, చెరువులు ఆక్రమించి నిర్మించడం... ఆపై క్రమబద్ధీకరణ చేయడం ఓ ధోరణిగా మారింది
• అర్బన్ ప్లానింగ్ లో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను చక్కదిద్దాల్సిన బాధ్యత టి.ఆర్.ఎస్.పై ఉంది
- 23 Oct 2020 9:36 AM GMT
Kurnool district updates: దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె...
కర్నూలు...
*గఫుర్, సీపీఎం పార్టీ
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను పట్ల అశ్రద్ధ చూపిస్తున్నారని వారిని అడ్డుకోవడంతో విఫలమయ్యారని సీపీఎం పార్టీ గఫుర్..
*ప్రభుత్వాలకు వైఖరికి నిరసనగా నవంబర్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire