Live Updates: ఈరోజు (23 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 23 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | నవమి - 24:34:32 వరకు తదుపరి దశమి | శతభిష నక్షత్రం - 13:05:20 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం 08:40:26 నుండి 09:25:22 | అమృత ఘడియలు 11:40:09 నుండి 12:25:04 | దుర్ముహూర్తం 12:25:04 నుండి 13:10:00, 14:39:51 నుండి 15:24:47 | రాహుకాలం 07:49:54 నుండి 09:14:08 | సూర్యోదయం: ఉ.06-23 | సూర్యాస్తమయం: సా.05-39
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Nov 2020 1:51 PM GMT
N. Uttam Kumar Reddy Comments: టి.ఆ.ర్ఎస్. మేనిఫెస్టో చెత్తబుట్టలో వెయ్యాలి..
ఉత్తమ్ కుమార్ రెడ్డి...
- ఒక లక్ష ఇళ్లు కటిస్తామని ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు..
- వంద రోజుల ప్రణాళిక అన్నారు .. వెయ్యి రోజులు అయిన ఏమి కాలేదు..
- 2014 నుంచి 2016, 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు..
- 2016 గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి కేసీఆర్, కేటీఆర్ సమాధానం ఇవ్వాలి..
- 23 Nov 2020 1:46 PM GMT
Ponnam Prabhakar Comments: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీయార్ కి నాయి బ్రాహ్మణులు గుర్తొచ్చారా...
కరీంనగర్:
- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కామెంట్స్
- ఎన్నికల తరువాత కటింగ్ చేసేవారికే కటింగ్ పెట్టడమే కేసియర్ కంటెంట్
- గంప గుత్తగా ఓట్లు రావాలన్న ఆశతో కేసీయార్ ఈ మెనోఫెస్టో పెట్టారు
- హైదరాబాద్ లో మాత్రమే కాదు పేదలు రాష్ట్రము లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నారు
- మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తాగునీరు ఫ్రీ గా ఇవ్వరు
- 23 Nov 2020 1:32 PM GMT
Telangana High Court Updates: ధరణిలో ఆస్తుల నమోదు అంశంపై హైకోర్టులో విచారణ..
టీఎస్ హైకోర్టు....
* ధరణిలో ఆస్తుల నమోదు, ఆధార్ సేకరణ చట్టం బద్ధం కాదన్న పిటిషనర్లు
* ధరణిలో ఆస్తుల నమోదుపై రేపు కొనసాగనున్న వాదనలు
* వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేయవద్దన్న ఉత్తర్వులు రేపటి వరకు పొడిగించిన హైకోర్టు..
* తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.
- 23 Nov 2020 11:29 AM GMT
Mohammed Ali Shabbir Comments: సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కు అబద్ధాలు చెప్పడం లో గిన్నిస్ బుక్ లో మొదటి స్థానం ఇవ్వొచ్చు..
షబ్బీర్ అలీ కాంగ్రెస్ సీనియర్ నేత
- గత 2016 ఎన్నికల్లో 100 రోజుల ప్రణాళిక అన్నారు..
- డబల్ బెడ్ రూమ్ ఇల్లు లక్ష అన్నారు..ఇప్పుడు ఏమైంది..?
- ఇంటర్ నెట్ ఫ్రీ అన్నారు ఏమైంది?
- ఎంబీసీ లకు కార్పొరేషన్ ఎక్కడ?
- మాటంటే మాట అని సీఎం అన్నారు ఏం మాటయ్య నీది..
- ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు..
- యువకులకు నిరుద్యోగ భృతి ఎక్కడ?
- అవి ఇస్తా ఇవి ఇస్తా అని వాగ్దానాలు ఇస్తున్నాడు..
- గతంలోఇచ్చిన వాగ్ధానాలే అమలు కాలేదు..
- తండ్రి కొడుకులు ఇద్దరు మోసగాళ్లే..
- నేను రెండు ఛాలెంజ్ లు విసురుతున్న కేసీఆర్ కేటీఆర్ కి..
- పాతబస్తీ మెట్రో ఎక్కడా?
- అసెంబ్లీ ముందు నుండి మెట్రో అవసరమా కేసీఆర్ అన్నాడు..?
- 18,300 కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కి మెట్రో కోసం నిధులు చెప్పాము..
- కేటీఆర్ 17000 కోట్లు ఖర్చు చేసామంటున్నారు..
- కేటీఆర్ సిగ్గుండాలి..
- హైదరాబాద్ ఇంచార్జ్ మినిస్టర్ గా గతంలో నేనే ఉన్నాను..
- హైదరాబాద్ కుండల ప్రదర్శన లేదు అంటున్నావ్..
- కానీ కృష్ణ జలాలు హైదరాబాద్ కి తీసుకొచ్చింది కాంగ్రెస్సే..
- మూసి ప్రక్షాళన అన్నారు..చేశారా?
- 23 Nov 2020 3:24 AM GMT
Mahabubabad Updates: తొర్రూరు గ్రామ శివారు పాల కేంద్రం వద్ద వాహనాల తనిఖీ...
మహబూబాబాద్ జిల్లా:
* పెద్దవంగర మండలం చిట్యాల గ్రామం నుండి గత రాత్రి అక్రమంగా తరలిస్తున్న 75 బస్తాల రేషన్ బియ్యం తొర్రూరు గ్రామ శివారు పాల కేంద్రం వద్ద వాహనాల తనిఖీలో భాగంగా పట్టుకున్న తొర్రూర్ ఎస్ఐ....
* సుమారు 75 బస్తాల రేషన్ బియ్యం ఒక వాహనం, ఒక బైక్ తో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు
* చిట్యాల గ్రామం నుండి రాయపర్తి కి తరలిస్తుండగా పట్టుకున్న తొర్రూర్ ఎస్ఐ.
- 23 Nov 2020 3:20 AM GMT
Warangal Urban Updates: నగరంలో దారుణం!
వరంగల్ అర్బన్
* వరంగల్ గిర్మజిపేట్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తిని మండి బజార్ లో కత్తులు తో హత్య
* హత్య చేసిన లడ్డు అనే స్నేహితుడు,పాత కక్ష్యలే కారణం.
- 23 Nov 2020 3:17 AM GMT
Nizamabad Updates: ధాన్యం సేకరణ లో రాష్ట్రంనే జిల్లా మొదటి స్థానం..
నిజామాబాద్:
* రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.
* జిల్లా నుంచి 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన అధికారులు.
* రైతులకు 386.75 కోట్ల చెల్లింపులు.
- 23 Nov 2020 3:13 AM GMT
Nizamabad Updates: దర్పల్లి మండలం దమ్మున్న పేట చెరువులో ఇద్దరి గల్లంతు...
నిజామాబాద్:
* చెరువులో చేపల వేట కు వెళ్లిన రావ్ సింగ్, గోవర్ధన్.
* గజ ఈత గాళ్లతో గాలింపు. లభించని మృతదేహాలు.
- 23 Nov 2020 3:10 AM GMT
Nizamabad Updates: మరో పోరుకు శ్రీకారం చుట్టిన ఆర్మూర్ రైతులు...
నిజామాబాద్ :
* నేడు ఆర్మూర్ లో రైతు జే.ఏ.సి ఆధ్వర్యంలో మహాధర్నా.
* సన్న రకానికి క్వింటాల్ కు 2500, పసుపు పంట కు కనీస మద్దతు ధర కు డిమాండ్.
* మామిడి పల్లి జాతీయ రహదారిపై మహా ధర్నా చేపట్టనున్న రైతులు.
* మహాధర్నా దృష్ట్యా.. పోలీసుల భారీ బందోబస్తు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire