Live Updates: ఈరోజు (23 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (23 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 23 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | నవమి - 24:34:32 వరకు తదుపరి దశమి | శతభిష నక్షత్రం - 13:05:20 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం 08:40:26 నుండి 09:25:22 | అమృత ఘడియలు 11:40:09 నుండి 12:25:04 | దుర్ముహూర్తం 12:25:04 నుండి 13:10:00, 14:39:51 నుండి 15:24:47 | రాహుకాలం 07:49:54 నుండి 09:14:08 | సూర్యోదయం: ఉ.06-23 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Nara Lokesh Comments: ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో కాకినాడ డిఆర్సీ సమావేశం జరిగిన తీరు చూస్తే అర్థమవుతోంది..
    23 Nov 2020 1:57 PM GMT

    Nara Lokesh Comments: ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో కాకినాడ డిఆర్సీ సమావేశం జరిగిన తీరు చూస్తే అర్థమవుతోంది..

     అమరావతి

    * నారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

    * వీధి రౌడీలు ప్రజాప్రతినిధులు అయితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో కాకినాడ డిఆర్సీ సమావేశం జరిగిన తీరు చూస్తే అర్థమవుతోంది.

    * వైసీపీ అధినేత నుండి ఎమ్మెల్యేల వరకూ అభివృద్ధితో సమాధానం చెప్పలేక నోటికి పనిచెబుతున్నారు.

    * సొంత పార్టీ నాయకులే జరుగుతున్న అవినీతిని ఎండగడుతుంటే కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి టి.డి.పి. ఎమ్మెల్యే జోగేశ్వరరావుని తోసేశారు.

    * మరో ఎమ్మెల్యే చినరాజప్పని నోరుమూసేయ్ అంటూ బెదిరించడం వైసీపీ నాయకులు రౌడీయిజాన్ని మరోసారి బయటపెట్టింది.

    * టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి రౌడీల పాలనలో ప్రజల పరిస్థితి తలచుకుంటే బాధేస్తోంది.

  • Amaravati Updates: చైతన్య సింధు ను అభినందించిన సీఎం వైయస్‌ జగన్..
    23 Nov 2020 1:38 PM GMT

    Amaravati Updates: చైతన్య సింధు ను అభినందించిన సీఎం వైయస్‌ జగన్..

      అమరావతి...

    * ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎంసెట్‌–2020 (అగ్రికల్చర్‌ విభాగం) టాప్‌ ర్యాంకర్‌ జి చైతన్య సింధు.

    * సింధును అభినందించిన సీఎం వైయస్‌ జగన్‌.

    * వైద్య విద్య పూర్తైన తర్వాత పేదలకు మంచి సేవలందించాలని సూచించిన సీఎం

    * చైతన్య సింధు స్వస్ధలం గుంటూరు జిల్లా తెనాలి.

    * ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల ఎంసెట్‌–2020 అగ్రికల్చర్‌ విభాగంలో ఫస్ట్‌ ర్యాంకుతో పాటు నీట్‌–2020లో ఏపీ టాపర్‌గా నిల్చిన చైతన్య సింధు.

    * ముఖ్యమంత్రిని కలిసిన సింధు తండ్రి డాక్టర్‌ జి కోటేశ్వర ప్రసాద్, తల్లి డాక్టర్‌ సుధారాణి, చిల్డ్రన్స్‌ స్పేస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ జి.శాంతమూర్తి.

  • Vishnu Kumar Raju Comments: శనివారం ఆదివారం కూడా కోర్టులు తెరిచి ఉంచాలి...
    23 Nov 2020 1:28 PM GMT

    Vishnu Kumar Raju Comments: శనివారం ఆదివారం కూడా కోర్టులు తెరిచి ఉంచాలి...

     విశాఖ

    - మాజీ ఎమ్మెల్యే విష్ణు కూమార్ రాజు కామెంట్స్

    - ప్రతి శనివారం కూల్చివేతలు పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుంటుంది

    - శుక్రవారం నోటీసులు ఇచ్చి శనివారం కూల్చి వేస్తున్నారు

    - ఇళ్లు వస్తాయని అనుకున్న ప్రజలుకు ఈ ప్రభుత్వం నిరాశ పరుస్తుంది

    - జివిఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రజలు హక్కులను హరించే వద్దు

    - ఇటువంటి పనులు చేస్తే పెట్టు బడులు పెట్టడానికి ఎం ఒక్కడు రాడు

    - చిన్న చిన్న బడ్డీలను సైతం వదలడం లేదు

  • Amaravati Weather Updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం..
    23 Nov 2020 11:09 AM GMT

    Amaravati Weather Updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం..

      అమరావతి....

    - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

    - కె.కన్నబాబు, కమిషనర్ విపత్తుల‌ నిర్వహణ శాఖ

    - భారత వాతావరణ శాఖ (ఐఎండి) సూచనల ప్రకారం నైరుతి మరియు దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

    - 24 గంటల్లో తుఫానుగా బలపడనున్న వాయగుండం

    - దీని ప్రభావంతో రాగల 3 రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు

    - రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు

    - బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు

    - మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం

    - తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో బలమైన గాలులు

    - సముద్రం అలజడిగా ఉంటుంది

    - మూడురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు

    - ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసాము

    - రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

    - తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

  • Amaravati Updates: గుంటూరులో మౌజం హనీఫ్ పై వైసీపీ శ్రేణుల దాడి హేయం..
    23 Nov 2020 10:56 AM GMT

    Amaravati Updates: గుంటూరులో మౌజం హనీఫ్ పై వైసీపీ శ్రేణుల దాడి హేయం..

     అమరావతి..

    - కింజారపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

    - పత్రికా ప్రకటన

    - ముస్లిం సోదరులకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదా..?

    - కుట్రలో భాగంగానే మైనార్టీలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు

    - రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఏ ఒక్క సామాజిక వర్గానికి రక్షణ లేకుండా పోయింది.

    - ముఖ్యంగా మైనార్టీల పరిస్థితి దయనీయంగా మారింది.

    - వారిపై విద్వేష దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయి.

  • Kakinada updates: కాకినాడ చేరుకున్న యుద్ధ నౌక..
    23 Nov 2020 5:36 AM GMT

    Kakinada updates: కాకినాడ చేరుకున్న యుద్ధ నౌక..

    తూర్పు గోదావరి జిల్లా

    కాకినాడ

    - ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..

    - కాకినాడ తీరంలో ఈనెల 24 నుంచి 26 వరకు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్త ఆధ్వర్యాన జలప్రహార్‌-2020 పేరుతో జరగనున్న యాంపీబీయస్‌ విన్యాసాల కోసం   అధికారులు ఏర్పాట్లు

    - కాకినాడ రూరల్‌ (మం) సూర్యారావుపేట తీరంలో నేవల్‌ ఎన్‌క్లేవ్‌లో జలప్రహార్‌ పేరిట జల, గగన తలాలపై నిర్వహించనున్న విన్యాసాల కోసం లైట్‌హౌస్‌    సముద్రతీరానికి దూరంగా డీప్‌ సీలోకి విశాఖపట్టణం నుంచి చేరుకున్న యుద్ధనౌక.

    - విన్యాసాల కోసం బీచ్‌రోడ్డులోని లైట్‌హౌస్‌ నుంచి ఉప్పాడ వైపు వెళ్లే రహదారిలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు-

    - కాకినాడ డీఎస్పీ భీమారావు ఆదేశాల మేరకు పోలవరం, నేమాం నుంచి బీచ్‌ రోడ్డువైపు, బీచ్‌రోడ్డు నుంచి ఓల్డ్‌ ఎన్టీఆర్‌ బీచ్‌లోకి వెళ్లే సమాంతర రోడ్లకు అడ్డంగా   నివారణ చర్యలు చేపట్టి బందోబస్తు ఏర్పాటు ..తిమ్మాపురం ఎస్‌ఐ విజయబాబు

  • 23 Nov 2020 5:33 AM GMT

    National Updates: ఢిల్లీని వణికిస్తున్న చలి...

      జాతీయం

    * దట్టంగా అలుముకున్న పొగమంచు

    * ఈరోజు 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

    * గరిష్టంగా 25 డిగ్రీల ఉషోగ్రత నమోదుకానున్నట్లు అంచనా వేసిన భారత వాతావరణ శాఖ

    * పశ్చిమ హిమాలయాల మీదుగా వచ్చే చల్లటి గాలుల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలి ప్రభావం

    * నిన్న ఢిల్లీలో అత్యల్పంగా 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

    * నవంబర్ నెలలో 17 ఏళ్ళలోనే కనిష్ట ఉషోగ్రత నమోదు

  • Amaravati Updates: అభయ్ యాప్ ను వర్చువల్ పద్దతిలో ప్రారంభించనున్న సీఎం జగన్...
    23 Nov 2020 5:31 AM GMT

    Amaravati Updates: అభయ్ యాప్ ను వర్చువల్ పద్దతిలో ప్రారంభించనున్న సీఎం జగన్...

     అమరావతి....

    -క్యాబ్,ఆటోల్లో ప్రయాణించే మహిళ రక్షణ కు ప్రతిష్టాత్మకంగా అమలు...

    -138.48కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐవోటీ ప్రాజెక్టు...

    -పైలెట్ ప్రాజెక్టుగా విశాఖ ఎంపిక...వెయ్యి ఆటోల్లో ట్రాకింగ్ డివైజ్ లు ...

    -వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు...

  • Krishna District Updates: జి.కొండూరులో రోడ్డు ప్రమాదం..
    23 Nov 2020 5:28 AM GMT

    Krishna District Updates: జి.కొండూరులో రోడ్డు ప్రమాదం..

     కృష్ణాజిల్లా..

    * ఎదురెదురుగా ఢీకొన్న ట్రాక్టర్ , కారు .... కారుడ్రైవర్ కు తీవ్ర గాయాలు

    * పోలీసులు కారులో ఇరుక్కున్న వ్యక్తి ని బయటకు తీసేందుకు ప్రయత్నం

    * జి.కొండూరు వైపు నుంచి మైలవరం కంకరు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్

    * మైలవరం వైపు నుంచి జి.కొండూరు వైపు వెళ్తున్న కారు

    * అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొనడంతో రహదారిపై పల్టీ కొట్టిన ట్రాక్టర్

    * ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు

    * ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవరును 30 నిమిషాలు శ్రమించి బయటకు తీసిన పోలీసులు

    * విజయవాడ - భద్రాచలం రోడ్డుపై స్తంభించిన ట్రాఫిక్

  • Nellore District Updates: నెల్లూరు జిల్లాలో తూఫాను ప్రభావం...
    23 Nov 2020 5:25 AM GMT

    Nellore District Updates: నెల్లూరు జిల్లాలో తూఫాను ప్రభావం...

      నెల్లూరు...

    ... మళ్లీ ప్రారంభమైన వర్షం

    ... తెల్లవారుజాము నుంచి పలు మండలాల్లో మోస్తరుగా వర్షాలు

    ... ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న చెరువులు, జలాశయాలు.

    ... అప్రమత్తం గా ఉండాలంటూ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.

Print Article
Next Story
More Stories