Live Updates:ఈరోజు (ఆగస్ట్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 23 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం పంచమి: (రా. 9-32 వరకు) తదుపరి షష్టి, చిత్త: (రా. 10-15 వరకు) తదుపరి స్వాతి, అమృత ఘడియలు: (సా. 4-18 నుంచి 5-47 వరకు) వర్జ్యం: (ఉ. 7-22 నుంచి 8-51 వరకు తిరిగి తె. 3-27 నుంచి 4-57 వరకు) దుర్ముహూర్తం: (సా. 4-38 నుంచి 5-28 వరకు) రాహుకాలం: (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం: ఉ.5-47 సూర్యాస్తమయం: సా.6-19

రోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Pulichinthala Project: పులిచింతల ప్రాజెక్టులో జలకళ
    23 Aug 2020 5:45 AM GMT

    Pulichinthala Project: పులిచింతల ప్రాజెక్టులో జలకళ

    విజయవాడ: పులిచింతల ప్రాజెక్టు

    నీటి లెవెల్ -+52.00M (170.602 ft)/ FRL 53.34 M (175.000 ft )

    పులిచింతల ప్రాజెక్టు సామర్ధ్యం 39.218/45.77 TMC

    10 గేట్లు ఎత్తి 311898 క్యూసెక్కులు దిగువకు

    విద్యుత్ ఉత్పత్తికి 15వేల క్యూసెక్కులు విడుదల

    మొత్తం ఔట్ ఫ్లో 326898 క్యూసెక్కులు

    మొత్తం ఇన్ ఫ్లో 353370 క్యూసెక్కులు

  • YCP MP Vijaya sai Reddy: జగన్ గారి పాలనపై ప్రకృతి వరాల జల్లు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
    23 Aug 2020 5:39 AM GMT

    YCP MP Vijaya sai Reddy: జగన్ గారి పాలనపై ప్రకృతి వరాల జల్లు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

    అమరావతి: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

    జగన్ గారి పాలనపై ప్రకృతి వరాల జల్లు.

    వరుసగా రెండో ఏడాది నిండిన నాగార్జున సాగర్, శ్రీశైలం. నిండు కుండల్లా జలాశయాలు

    పరవళ్లు తొక్కుతున్న నదీ నదాలు. రాష్ట్రంలో సంతోషాల పంట

    చంద్రబాబుకు మాత్రం పెరిగిన కడుపు మంట.

  • Govadari updates: పోలవరం వద్ద గోదావరికి పోటెత్తిన వరద..
    23 Aug 2020 5:35 AM GMT

    Govadari updates: పోలవరం వద్ద గోదావరికి పోటెత్తిన వరద..

    ప‌శ్చిమ గోదావ‌రి: సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న వరద ఉధృతితో

    పాతపోలవరం వద్ద కోతకు గురవుతూ ప్రమాద స్థాయిలో నెక్లెస్ బండ్..

    నెక్లెస్ బండ్ ను పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు..

    పోలవరం వద్ద కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ ముత్యాలరాజు, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు..

    పాత పోలవరం, కమ్మరివారి గూడెం, యడ్లగూడెం గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు..

  • 23 Aug 2020 3:03 AM GMT

    Samarlakota: సామర్లకోట ఓవర్ బ్రిడ్జి పై బైక్ ను ఢీకొట్టిన లారీ

    తూర్పుగోదావరి

    - సామర్లకోట ఓవర్ బ్రిడ్జి పై బైక్ ను ఢీకొట్టిన లారీ

    - మహిళ అక్కడికక్కడే మృతి

    - పారిపోతున్న లారీని వెంబడించి పట్టుకున్న స్థానికులు

  • 23 Aug 2020 1:32 AM GMT

    Guntur: అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు..

    గుంటూరు:

    - అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు..

    - 250వరోజుకు చేరుకున్న రైతులు ధీక్షలు,నిరసనలు...

    - రైతులు కు సంఘీభావంగా మాజీమంత్రి నక్కాఅనందబాబు గుంటూరు నివాసంలో ధీక్ష..

    - అమరావతి రాజధాని కోనసాగించాలంటు... రైతులు కు సంఘీభావంగా సిపిఐ ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జీ సెంటర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన...

    - అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో "రాజ్యాంగాన్ని గౌరవిద్దాం - అమరావతిని కాపాడుకుందాం" అనే నినాదంతో అంబేద్కర్, న్యాయ దేవత విగ్రహలకు విజ్ఞాపన పత్రాలు అందిచు కార్యక్రమము..

    - అమరావతే రాష్ట్ర రాజధానిగా కొనసాగాలని చేస్తున్న ఉద్యమం 250 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా అమరావతి రైతులకు, ఉద్యమకారులకు సంఘీభావంగా నిరసన.

  • 23 Aug 2020 12:39 AM GMT

    Vizianagaram: వినాయక నిమజ్జనంలో అపశృతి..

    విజయనగరం:

    - వినాయక నిమజ్జనంలో అపశృతి..

    - వినాయక చవితి సంధర్భంగా ప్రతిమను నిమజ్జనం చేస్తుండగా వ్యక్తి మృతి.

    - కురుపాం మండలంలోని ఏజన్సీ గ్రామం గుజ్జువాయీ గిరిజన గ్రామములో వినాయక చవితి సంధర్భంగా ఇంట్లో పూజను జరుపుకొని సాయంత్రం నిమజ్జనం చేస్తుండగా కాలుజారి కాలువాలో పడి కందుల శ్రీకర్ (14) మృతి..

  • 23 Aug 2020 12:38 AM GMT

    Lock down in Srikakulam: శ్రీకాకుళం పరిధిలో నేడు సంపూర్ణ లాక్ డౌన్..

    శ్రీకాకుళం జిల్లా:

    - శ్రీకాకుళం పరిధిలో నేడు సంపూర్ణ లాక్ డౌన్..

    - కరోనా తీవ్రత దృష్ట్యా ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ నిర్వహణకు నిర్ణయించిన అధికారులు..

    - జిల్లా కేంద్రంలో మూతపడనున్న అన్ని వ్యాపార వాణిజ్య సముదాయాలు..

    - నగరంలో మందుల దుకాణాలకు మాత్రమే అనుమతి..

    - ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు తెరుచుకొనున్న మెడికల్ షాపులు..

    - వైద్య సేవలకు పూర్తి అనుమతి..

    - ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని తెలిపిన అధికారులు..

    - అనవసరంగా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు..

    - దేవాలయాల్లో నిత్య కైంకర్య సేవలకు మాత్రమే అనుమతి..

Print Article
Next Story
More Stories