Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 22 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి రా. 3-09వరకు తదుపరి సప్తమి | అనూరాధ నక్షత్రం రా. 1-36 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం ఉ.6-45 నుంచి 08-15 వరకు | అమృత ఘడియలు: ఉ. 3-45 నుంచి 6-22 వరకు | దుర్ముహూర్తం: ఉ. 08-17 నుంచి 09-06 వరకు తిరిగి రా. 10-44 నుంచి 11-33 వరకు | రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Sep 2020 8:16 AM GMT
GHMC Updates: జిహెచ్ఎంసి ఎన్నికల ఏర్పాట్లపై స్పీడ్ పెంచిన బల్దియా అధికారులు..
జిహెచ్ఎంసి..
లోకేష్ కుమార్..
- జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో అధికారులతో కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశం
- ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించిన కమిషనర్ లోకేష్ కుమార్
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలి
- ఓటింగ్ శాతాన్ని పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
- పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, కంప్లైంట్ సెల్ వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి
- 22 Sep 2020 8:06 AM GMT
Anti-Agrarian Bill: రైతాంగ వ్యతిరేక బిల్లులపై క్షేత్రస్థాయిలో ఉద్యమం...ఠాగూర్..
డీసీసీ అధ్యక్షులతో..ఏఐసీసీ ఇంచార్జి ఠాగూర్..
- రైతు సంఘాలతో కలిసి వ్యవసాయ బిల్లులపై పోరాటం..
- పార్టీ అభివృద్ధి లో డీసీసీ ల పాత్ర చాలా కీలకం..
- వారితో అన్ని విషయాలలో సంప్రదిస్తాం..
- క్రమశిక్షణ, టీమ్ వర్క్ చాలా ముఖ్యం..
- మండలి ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో క్రియాశీలకంగా ఉండాలి.
- పంచాయత్ రాజ్ సంఘటన్ జిల్లా కో ఆర్డినెటర్లను వెంటనే నియమించండి..
- తెలంగాణ ప్రజలు బావోగ్వేద అంశాలపై ఎక్కువ స్పందిస్తారు. తెలంగాణ విషయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ చేసిన త్యాగాలు వారి గుండెల్లోకి చేరేలా కృషి చేయండి..
- వ్యయసాయ బిల్లులతో మోడీ, అంబానీ, ఆధానిలు విలన్లుగా రైతులను దోచుకంటున్నారు..
- కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కావొద్దు.. మన భావజాలం ఇంటింటికీ చేరాలి..
- క్రమశిక్షణ ఉల్లంగిస్తే ఊరుకునేది లేదు.. టీం వర్క్ గా పనిచేయాలి..
- సామాజిక మాధ్యమాల్లో క్రమశిక్షణ ఉల్లంఘించి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు.
- 22 Sep 2020 7:58 AM GMT
Kamareddy updates: సీఎం కేసీఆర్ కు వ్యతిరేఖంగా నినాదాలు..
కామారెడ్డి :
-నూతన ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ముట్టడి
-రహదారి వద్దనే నాయకులను అడ్డుకున్న పోలీసులు
-బారికేడ్లను తోసుకుంటూ కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించి నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ కు వ్యతిరేఖంగా నినాదాలు..
- 22 Sep 2020 7:37 AM GMT
National updates: కేటీఆర్ పై మండిపడ్డ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్..
జాతీయం..
ధర్మపురి అరవింద్, బీజేపీ ఎంపీ..
-కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులిస్తున్నా ఇవ్వడం లేదని అసత్యాలు చెప్తున్నారు
-కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలలో వివిధ పధకాల కింది తెలంగాణకి ఏడు వేల కోట్లు కేటాయించిది
-కానీ కేటీఆర్ కేవలం 290 కోట్లు కేటాయించిదని తప్పుడు ట్విట్ చేసాడు
-290 కోట్లు కేవలం కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి ఇచ్చింది
-అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ ని మించి పోతున్నాడు కేటీఆర్
-కేంద్రం పంపిన వెంటిలేటర్ లను కూడా ఉపయోగించుకోలేదు
-కోవిడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తున్నదో ప్రజలకు తెలుసు..
- 22 Sep 2020 7:25 AM GMT
ACB updates: రెండవ రోజు కొనసాగుతున్న విచారణ..
ఏసీబీ అప్ డేట్స్.....
-అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామి జీవన్ గౌడ్ భూ అక్రమాల పై సాగుతున్న విచారణ...
-గతంలో నగేష్ పనిచేసిన ప్రాంతాల్లో జరిగిన అక్రమాల పై ఆరా తీస్తున్న ఏసీబీ..
-నిజామాబాద్ జిల్లాలో ఆర్డీవో గా పనిచేసిన సమయంలో జీవన్ గౌడ్ తో జరిపిన లావదేవీల పై ఏసీబీ విచారణ...
-నగేష్ కు సంబంధించిన భారీగా ఆస్తుల గుర్తింపు
-నగేష్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ కోసం బ్యాంక్ అధికారుల తో మరో డూప్లికేట్ కీ సిద్ధం చేస్తున్న ఏసీబీ..
-లాకర్ ఓపెన్ చేస్తే మరిన్ని వివరాకు వెలుగులోకి వస్తాయని భావిస్తున్న ఏసీబీ..
-ఇప్పటికే ఆర్డీవో అరుణా రెడ్డి బ్యాంకు లాకర్ ఓపెన్ చేసిన ఏసీబీ..
-NOC కోసం మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి స్టాంప్ అండ్ రీజిస్టేషన్ కు రాసిన లేఖ లో ఉన్న సంతకం పై ఆరా తీస్తున్న ఏసీబీ..
-త్వరలో నోటీసులు ఇచ్చి ధర్మారెడ్డి ని విచారించే అవకాశం.
- 22 Sep 2020 7:10 AM GMT
Karimnagar updates: జిల్లా కలెక్టరేట్ ముందు బిజెపీ నేతల ఆందోళన ఉద్రిక్తత..
కరీంనగర్ జిల్లా..
-రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు...
-పేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వాలని, ఎల్ ఆర్ఎస్ ను తొలగించాలని డిమాండ్...
-అందోళనకు భారీ ఎత్తున హాజరైన బీజేపీ నాయకులు,కార్యకర్తలు..
-ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు..
- 22 Sep 2020 6:53 AM GMT
Telangana Latest news: డబుల్ బెడ్రూం ఇళ్ళపై భట్టి, తలసాని మధ్య కొనసాగుతోన్న మాటల యుద్ధం..
-డబుల్ బెడ్రూం ఇళ్ళపై మంత్రి తలసానివి బోగస్ లెక్కలంటోన్న భట్టి
-నాంపల్లి నియోజకవర్గంలో 1824 ఇళ్ళు కట్టినట్లు నిన్న తలసాని ప్రకటన
-నాంపల్లిలో కడ్తోన్న 1824 ఇళ్ళను పరిశీలించటానికి మీడియా ప్రతినిధులతో బయలుదేరిన భట్టి విక్రమార్క
-నాంపల్లిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదంటోన్న భట్టి
-ప్రభుత్వ మోసాలు నగర ప్రజలకు తెలియాలంటోన్న సీఎల్పీ నేత
- 22 Sep 2020 5:55 AM GMT
Komaram Bheem district updates: కుమ్రంబీమ్ జిల్లాలో కోనసాగుతున్నా పోలీసుల కూంబింగ్...
-కొత్తగా మరో ఆరు గ్రేహౌండ్స్ బలగాలను రంగంలోకి దింపిన పోలీసులు
-మొత్తంఇరవై గ్రేహౌండ్స్ బలగాలతొ కోనసాగుతున్నా కూంబింగ్
-సిర్పూర్ టి, దహేగామ్, కాగజ్‌నగర్, బెజ్జూర్, చింతలమానే పల్లి మండలాల్లో గూడాలను , అడవులను జల్లేడ పడుతున్న పోలీసులు..
-మావోలను అడవులలో చుట్టుముట్టిన పోలీసు. బలగాలు..
-దిగ్బందనంలో చిక్కుకున్నా మావోయిస్టు నాయకుడు బాస్కర్, వర్గీస్, రాము, లింగవ్వ.
-తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో కోనసాగుతున్నా నిఘా...
-డెగ కన్నుతో మావోల కదలికలు పరిశీలిస్తున్నా పోలీసులు..
-మహరాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసిన తెలంగాణ పోలీసులు..
-మావోలు పారిపోతే మహరాష్ట్ర లో పట్టుకోవడానికి అహేరి, గడ్చిరోలి ప్రాంతాలలో విస్త్రుతమైనా తనిఖీలు
-మావోల డైరీ అదారంగా సమాచారం సేకరిస్తున్నా ఇంటలిజెన్స్ వర్గాలు..
-మావోలకు సహకరికస్తున్నా వారి సమాచారాన్ని కూపీలాగుతున్నా నిఘా వర్గాలు
- 22 Sep 2020 5:16 AM GMT
ACB updates: కోటి 12 లక్షల లంచం కేసులో రెండవరోజు నిందితుల కస్టడి..
ఏసీబీ అప్ డేట్స్....
-ఐదుగురు నిందితులను రెండవ రోజు విచారించనున్న ఏసీబీ..
-ఆర్డీవో అరుణా రెడ్డి ని చంచల్ గూడ జైలునుండి ఏసీబీ కార్యాలయానికి తరలించినున్న ఏసీబీ అధికారులు..
-అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధీనం లోనే నిందితులు..
-నగేష్ బ్యాంక్ లాకర్ పై నేడు విచారణ
-40 లక్షలు ఎక్కడ అనే దానిపై రాని స్పస్టత
-అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నంచనున్న ఏసీబీ
-పలువురు అనుమానితులను, సాక్షులను విచారించనున్న ఏసీబీ.
- 22 Sep 2020 5:13 AM GMT
Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
మహబూబ్ నగర్ జిల్లా :
-26 గేట్లు ఎత్తివేత..
-ఇన్ ఫ్లో: 2,25,400 వేల క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 2,32,602 వేల క్యూసెక్కులు.
-పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: :9.657 టీఎంసీ.
-ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.869 టీఎంసీ.
-పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
-ప్రస్తుత నీటి మట్టం: 318.130 మీ.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire