Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 22 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి రా. 3-09వరకు తదుపరి సప్తమి | అనూరాధ నక్షత్రం రా. 1-36 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం ఉ.6-45 నుంచి 08-15 వరకు | అమృత ఘడియలు: ఉ. 3-45 నుంచి 6-22 వరకు | దుర్ముహూర్తం: ఉ. 08-17 నుంచి 09-06 వరకు తిరిగి రా. 10-44 నుంచి 11-33 వరకు | రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Sep 2020 12:19 PM GMT
Jayashankar Bhupalpally: లక్ష్మీ బ్యారేజ్- 46 గేట్లు ఎత్తిన అధికారులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
- పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 95.30 మీటర్లు
- ఇన్ ఫ్లో 2,85,500 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 3,28,100 క్యూసెక్కులు
- 22 Sep 2020 12:07 PM GMT
National updates: భవిష్యత్ కార్యాచరణ పై చర్చించేందుకు సమావేశం అయిన విపక్ష పార్టీలు..
జాతీయం..
-రాజ్యసభ లో 8 మంది ఎంపిల సస్పెన్షన్ కు సంఘీభావంగా ఒక రోజు పాటు లోక్ సభ కార్యక్రమాలను బహిష్కరించిన శివసేన, టీఆర్ఎస్ , బీఎస్పీ పార్టీలు.
-లోక్ సభ కార్యక్రమాలను ఈ సెషన్ పూర్తి అయ్యే వరకు బహిష్కరించిన కాంగ్రెస్
-వ్యవసాయ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంటే లోక్ సభ కు హాజరయ్యే విషయం పై పరిశీలిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన.
- 22 Sep 2020 11:51 AM GMT
Nalgonda updates: ప్రముఖ న్యాయవాది బంటు బుచ్చిబాబు ని ఆరెస్ట్ చేసి పిడి యాక్ట్ చేసిన జిల్లా పోలీసులు....
నల్గొండ :
-న్యాయవాది వృత్తిలో ఉంటూ....బెదిరింపులు కబ్జాలతో పాటు 220 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమణ, బలవంతపు వసూళ్లపై బుచ్చిబాబు పై పెద్ద ఎత్తున పిర్యాదు లు....
-మిర్యాలగూడ టౌన్, రూరల్ పిఎస్ ,దామరచర్లలో కేసులు, బుచ్చిబాబు కు సహకరించిన కొడుకు మహేష్ బామ్మర్ధి పాపయ్య పై కేసు నమోదు...
- 22 Sep 2020 11:29 AM GMT
Jayashankar Bhupalpally updates: సరస్వతి బ్యారేజ్-35 గేట్లు ఎత్తిన అధికారులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
- పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 116.00 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 5.10 టీఎంసీ
- ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,75,000 క్యూసెక్కులు
- 22 Sep 2020 11:25 AM GMT
Hyderabad updates: 12 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బండి సంజయ్..
బండి సంజయ్..
- ఒక్కో జిల్లాకు ఒక్కో అధ్యక్షుల నియామకం.
- రంగారెడ్డి అర్బన్... సామారంగరెడ్డి.
- మేడ్చల్ అర్బన్... పండాల హరీష్ రెడ్డి.
- గోల్కొండ గోశామహల్.. పాండు యాదవ్.
- భాగ్యనగర్ మాలక్పేట్... సంరెడ్డి సురేందర్ రెడ్డి.
- మహంకాళి సికింద్రాబాద్... సాంసుందర్ గౌడ్.
- బర్కత్ పుర అంబర్ పెట్... గౌతమ్ రావ్.
- మేడ్చల్ రూరల్... విక్రంరెడ్డి.
- కామారెడ్డి... అరుణతారా.
- జగిత్యాల్... మొరపల్లి సత్యనారాయణ.
- ఖమ్మం....గల్లా సత్యనారాయణ.
- సూర్యాపేట.. బోబ్బా భాగ్యరెడ్డి.
- వికారాబాద్.. సదానంద రెడ్డి.
- 22 Sep 2020 11:19 AM GMT
Telangana updates: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐకి ఎక్సైజ్‌శాఖ రిప్లై..
ఎక్సైజ్‌శాఖ..
-గత రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు వెల్లడి
-12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్ దాఖలు
-టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వని శాఖ
-ఎక్సైజ్‌శాఖ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు
-ఖండాంతరాలు దాటిన హైదరాబాద్ డ్రగ్స్ దందా
-జర్మనీ, బ్రిటన్, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ సప్లై
-విదేశాలనుంచి స్టీల్‌బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్‌ఎస్‌డీ
-www.ipsld.lo వెబ్‌సైట్ ద్వారా స్టూడెంట్స్ డ్రగ్స్ బుకింగ్
-సికింద్రాబాద్ మోండా మార్కెట్ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్
-ఎనిమిది చార్జిషీట్లలో కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు ప్రముఖుల పేర్లు
-సంచలనం సృష్టించిన టాలీవుడ్ కేసులో 72 మంది పేర్లు
-విచారణకు హాజరైన 12 మందితో మరో 60మంది జాబితా
- 22 Sep 2020 11:07 AM GMT
Hyderabad updates: ఎస్సై పై హెచ్చార్సీ లో చీలపల్లి గ్రామస్తుల ఫిర్యాదు..
హైదరాబాద్ :
- అక్రమ కేసులు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ ఎస్సై పై హెచ్చార్సీ లో చీలపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
- మెదక్ జిల్లా , పెద్ద శంకరం పేట మండలం , చీలపల్లి గ్రామం మధ్యలో నిర్మిస్తున్న స్మశాన వాటికను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు.
- హైకోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ... స్థానిక అధికారపార్టీ సర్పంచ్ , ఎంపీటీసీల ప్రోద్భలంతో పెద్ద శంకర్ పేట పీఎస్ ఎసై సత్యనారాయణ తమ పై అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కమిషన్ కు వివరించిన గ్రామస్తులు.
- తమను వేధిస్తున్న ఎసై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ కమిషన్ ను వేడుకున్న చీలపల్లి గ్రామస్తులు.
- 22 Sep 2020 11:04 AM GMT
Vanasthalipuram updates: ప్రేమ పేరుతో నయవంచన...
వనస్థలిపురం..
- వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో నయవంచన ఘటన...
- వనస్థలిపురం హస్తిన పురం కి చెందిన ఆకురి గీత (23) హస్తిన పురం లో VSR ధాన్యం గోదాం పనిచేస్తున్న క్రమంలో సున్నం విష్ణు (25) తో పరిచయం ఏర్పడింది..
- రెండు సంవత్సరాలుగా ఇద్దరు పార్కులు, సినిమాలు తిరిగాము అని తెలిపిన గీత.
- పెళ్లి చేసుకొమ్మని అడిగితే కులం తక్కువ దానివి అని పెళ్లికి నిరాకరించిన విష్ణు..
- తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన గీత. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
- 22 Sep 2020 11:00 AM GMT
Nizamabad updates: జక్రాన్ పల్లి లో చైన్ స్నాచింగ్..
నిజామాబాద్ :
- ముసుగు ధరించి మహిళ మెడ పై కత్తి పెట్టి చితక బాధి 2తులాల బంగారు గొలుసు, సెల్ ఫోన్ లాక్కు వెళ్లిన ఇద్దరు దుండగులు.
- పంట పొలం లో పని చేస్తున్న మహిళ ను టార్గెట్ చేసిన దుండగులు.
- ముసుగు దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు.
- 22 Sep 2020 10:52 AM GMT
National updates: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది..
జాతీయం..
ఢిల్లీ:
(వెంకటేష్ నేత, టి.ఆర్.ఎస్, ఎంపీ)
• ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల చేత శభాష్ అనిపించుకున్న ఘనత సీఎం కేసీఆర్ ది..
• బిజెపి ఎంపీలు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడడం సిగ్గు చేటు.
• పార్లమెంట్ సభ్యుడిగా అరవింద్ హుందాగా వ్యవహరించాలి.
• ధర్మపురి అరవింద్.. జీవితం జీరో.
• “కరోనా” నియంత్రణకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 290 కోట్లు మాత్రమే.
•ఇలా సభ్యత లేకుండా మాట్లాడమని బిజేపి ఎంపీలకు ప్రధాని మోడి చెప్పారా..?
• టిఆర్ఎస్ పార్టీ నేతలకు సభ్యత, సంస్కారం ఉంటుంది.
• వ్యవసాయ బిల్లులు యుద్ధ వాతావరణంలో ఆమోదం చేశారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
• మేము ప్రజాస్వామ్య బద్దంగా రెవెన్యూ బిల్లును ఆమోదించినం.
• వీగిపోతుందని తెలిసే మూజువాణి ఓటుతో మీరు వ్యవసాయ బిల్లులు ఆమోదింపజేసుకున్నారు.
• అసెంబ్లీ లో ప్రతిపక్ష పార్టీల చర్చ తరువాతే రెవెన్యూ బిల్లు ఆమోదం పొందింది. రైతులు సంబరాలు చేసుకున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire