Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 22 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి మ.01-09 వరకు తదుపరి సప్తమి | మూల నక్షత్రం ఉ.07-22 వరకు తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.05-50 నుంచి 07-22 వరకు తిరిగి సా.04-44 నుంచి 06-18 వరకు | అమృత ఘడియలు రా.02-05 నుంచి 04-12 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి 02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
విషాదం: తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూసారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాయిని కన్నుమూత. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వర్తించిన నాయిని. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలకపాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కార్మిక నేత నర్సన్నగా నాయిని నర్సింహారెడ్డి అందరికి సుపరిచితుడు. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికైన నాయిని నర్సింహారెడ్డి. బుల్లెట్ నర్సన్నగా ప్రసిద్ధి. 1944 మే 12న జన్మించిన నాయిని నర్సింహారెడ్డి. నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మం. నేరేడుగొమ్ము
Live Updates
- 22 Oct 2020 7:49 AM GMT
#కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరి శ్రీ ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఇంటర్ మినిస్టీరియల్ బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో భేటి.
ఉదయం బిఆర్ కెఆర్ భవన్ లో కలిసి రాష్ట్రంలో వరదల పరిస్ధితి, చేపడుతున్న సహాయక చర్యల పై చర్చించారు.
రాష్ట్రంలో వరదలు, వర్షాల వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది.
కమిటి రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రాష్ట్రంలో ఆస్తులకు, పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది.
#కేంద్ర బృందంలో ప్రవీణ్ వశిష్ట తో పాటు ఆర్.బి. కౌల్, కన్సల్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కె.మనోహరన్, డైరెక్టర్ వ్యవసాయశాఖ, ఎస్.కె. కుషువహా, ఎస్.ఈ రవాణాశాఖ, ఎమ్.రఘురామ్, ఎస్.ఈ కేంద్ర జలవనరుల శాఖ ఉన్నారు.
- 22 Oct 2020 7:48 AM GMT
#హైదరాబాద్ మినిస్టర్స్ క్వాటర్స్ నుంచి ప్రారంభమైన నాయిని అంతిమ యాత్ర
#ఫిల్మ్ నగర్ మహాప్రస్థానం లో అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు
#అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు...టీఆర్ఎస్ నాయకులు....వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు.
- 22 Oct 2020 7:47 AM GMT
గూడూరు నారాయణ రెడ్డి...పీసీసీ కోశాధికారి
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన గూడూరు నారాయణ రెడ్డి
ఆయన కుటుంబ సంభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి
తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి కార్మిక లోకానికి తీరని లోటు
కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన యోధుడు నాయిని
తెలంగాణ రాష్ట్రానికి నాయిని చేసిన సేవలు మరువరానివి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి నాయిని తన చివరి శ్వాసవరకు రాష్ట్ర అభివృద్ధికి కృసి చేసిన వ్యక్తి
రాజీకీయాలకు అతీతంగా...అందరితో కలిసిపోయే వ్యక్తి నాయిని
ముక్కుసూటిగా, నిక్కార్సుగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వ్యక్తి నాయిని
నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని....దేవుడి ప్రార్థిస్తున్నా.
- 22 Oct 2020 7:47 AM GMT
నాయిని బౌతికదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
రాములు నాయక్
మానసిక క్షోభ వల్లనే నాయిని మరణించారు
ఎమర్జెన్సీ లో కూడా జైల్ జీవితం గడిపారు.
నాయిని మృతదేహాన్ని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెట్టాలి..
- 22 Oct 2020 7:46 AM GMT
బ్రేకింగ్.....
గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు ఉన్న యాడ్స్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్.....
భార్య భర్తల నడుమ గొడవ కారణంగా యర్డ్స్ టవర్ ఎక్కిన యువకుడు....
మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు ఉండగా పోలీసులు పట్టించుకోకపోవడం లేదంటున్న యువకుడు...
యువకున్ని సముదయించి కిందకి దింపిన పోలీసులు....
- 22 Oct 2020 7:46 AM GMT
బండి సంజయ్... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.
కార్మిక రంగంలో నాయకునిగా సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించి,కార్మికుల సమస్యల పట్ల నిత్యం పోరాడి, పలు కంపెనీల్లో యూనియన్లకు నాయకత్వం వహించిన ప్రజా నాయకుడు,కార్మిక నాయకులు మాజీ మంత్రివర్యులు నాయిని నర్సింహ రెడ్డి గారు.
వారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను.
- 22 Oct 2020 7:45 AM GMT
కేంద్ర హోమ్ సహాయమంత్రి కిషన్ రెడ్డి@నాయిని హౌస్
# కార్మిక-హోమ్ మంత్రిగా నాయిని అనేక సేవలు చేశారు.
# నాయిని మరణం రాష్ట్రానికి తీరని లోటు.
# జనతా పార్టీ- తెలంగాణ ఉద్యమంలో నాయిని తో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది.
# ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి నాయిని నర్సింహారెడ్డి.
# కేంద్రప్రభుత్వం తరపున నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
- 22 Oct 2020 4:56 AM GMT
తెలంగాణ రాష్ట్ర మొదటి హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి రెడ్డి మృతిపట్ల సంతాపం ప్రకటించిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావ్.
తెలంగాణ ఉద్యమ సమయం, ఆయన హోమ్ మంత్రి గా భాద్యతలు నిర్వహిస్తున్న సమయంలో చాలాసార్లు ఆయనతో కలిసిన సందర్భాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఓ మంచి రాజకీయ నాయకుని కోల్పోయింది.
కార్మికనేతగా , ఉద్యమ నాయకుడిగా ఆయన చేసిన సేవలు మారువలేనివి.
- 22 Oct 2020 4:55 AM GMT
మంత్రి మల్లారెడ్డి
నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి మల్లారెడ్డి..
కార్మిక నాయకులు నర్సన్న లేకపోవడం బాధాకరం..
కార్మిక లోకానికి నాయిని చేసిన సేవలు మరచిపోలేము..
ప్రభుత్వాల తో కోట్లాడి కార్మికుల హక్కులను కాపాడే వారు నాయిని..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో నాయిని చేసిన పోరాటం మరచిపోలేము.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire