Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 22 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి మ.01-09 వరకు తదుపరి సప్తమి | మూల నక్షత్రం ఉ.07-22 వరకు తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.05-50 నుంచి 07-22 వరకు తిరిగి సా.04-44 నుంచి 06-18 వరకు | అమృత ఘడియలు రా.02-05 నుంచి 04-12 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి 02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
విషాదం: తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూసారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాయిని కన్నుమూత. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వర్తించిన నాయిని. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలకపాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కార్మిక నేత నర్సన్నగా నాయిని నర్సింహారెడ్డి అందరికి సుపరిచితుడు. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికైన నాయిని నర్సింహారెడ్డి. బుల్లెట్ నర్సన్నగా ప్రసిద్ధి. 1944 మే 12న జన్మించిన నాయిని నర్సింహారెడ్డి. నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మం. నేరేడుగొమ్ము
Live Updates
- 22 Oct 2020 3:14 PM GMT
Medak district updates: టీ ఆర్ ఎస్ ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు మానుకో...
మెదక్:
-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్...
-చేగుంట లో ప్రచారం సందర్భంగా బీజేపీ ఎంపీ అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడు.
-కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క చెప్పలేక ...టీ ఆర్ ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాడు.
-కేంద్రం నుండి నిధులు తెచ్చి నీ నియోజకవర్గ అభివృద్ధి చేసుకో..
-ఎన్ని మాయమాటలు చెప్పిన దుబ్బాక ప్రజలు మిమ్మల్ని నమ్మరు.
-దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టాడు.
-రైతు బంధు, రైతు భీమా పథకలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి.
-దుబ్బాక లో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిన టీ ఆర్ ఎస్ గెలుపును ఆపలేరు.
-దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీ కి బుద్ధి చెబుతారు.
- 22 Oct 2020 2:10 PM GMT
Hyderabad updates: ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు...
హైదరాబాద్
-తెలంగాణ తెలుగు మహిళా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
-7వ రోజు వేపకాయల బతుకమ్మ ఉత్సవాలు...
-హాజరైన టీటీడీపీ మహిళ ఉపద్యక్షురాలు నందమూరి సుహాసిని, భారీగా పాల్గొన్న మహిళా కార్యకర్తలు..
-బతుకమ్మ ఆడుతూ మహిళ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిన తెలంగాణ తెలుగు మహిళ అధ్యక్షురాలు జోష్ణ తిరునగిరి...
- 22 Oct 2020 1:17 PM GMT
Laxmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనాగుతున్న వరద...
//జయశంకర్ భూపాలపల్లి జిల్లా
//24 గేట్లు ఎత్తిన అధికారులు
//పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
//ప్రస్తుత సామర్థ్యం 95.50 మీటర్లు
//ఇన్ ఫ్లో 1,12,300 క్యూసెక్కులు
//ఔట్ ఫ్లో 23,600 క్యూసెక్కులు
- 22 Oct 2020 1:14 PM GMT
A.C.B. updates: మహబూబ్ నగర్ మున్సిపల్ కమీషనర్ ఆఫీస్ లో ఏసిబి సోదాలు!
ఏసిబి సోదాలు...
* మహబూబ్ నగర్ మున్సిపల్ కమీషనర్ ఆఫీస్ లో ఏసిబి సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు....
* మహబూబ్నగర్ నల్లగొండ హైదరాబాద్ మూడు చోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు...
* ఆలీ అహ్మద్ ఖాన్ బాధితుడు నుండి 1,65,000 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్...
* 10 లక్షల పదిలక్షల సంబంధించి కాంట్రాక్టర్ ఒప్పందం కుదించడానికి లక్షా అరవై ఐదు వేలు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ కమిషనర్.
* మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు...
- 22 Oct 2020 1:03 PM GMT
Medak district updates: చేగుంట రోడ్డు షోలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కామెంట్...
మెదక్:
• తెలంగాణ ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాల భూమి, దళితుడికి ముఖ్యమంత్రి పదవి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏమయ్యాయి
• తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు ఇచ్చిన మాట తప్పారు
• ఉద్యమ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళ నిధులు దోచుకుంటున్నారని చెప్పిన ముఖ్యమంత్రి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో దోచుకుంటున్నాడు
• నూరు తప్పులు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుబ్బాక ఉప ఎన్నిక మూడవ తారీఖు నాడు ప్రజలు బిజెపికి గెలిపించి ముఖ్యమంత్రి తలను నరుకుతారు
• గాంధీభవన్లో జీతాలు సైతం ముఖ్యమంత్రి నివాసం నుండి వెళ్తున్నాయి.
• కాంగ్రెస్కు ఓటు వేస్తే దేశ ద్రోహం చేసినట్లే,
• కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయింది
• ఏడు సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో దుబ్బాక నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు
• నేడు వచ్చిన హరీష్ రావు మాత్రం నాకు రెండు కళ్ళు అంటూ ప్రజల్ని మోసగిస్తున్నారు
• కల్వకుంట్ల కుటుంబం ఉదయం నుండి కలెక్షన్లు చేసి రాత్రి కాగానే ఫామ్ హౌస్ లో పంచుకుంటారు.
• చిల్లర డబ్బుల కోసం హరీష్ రావు కక్కుర్తి పడుతున్నాడు
• సిద్ధాంతం పై నిలబడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామమందిర నిర్మాణం చేపట్టారు
• మైనార్టీ సోదరులకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ
• హైదరాబాద్ లో వరద నష్టం జరిగిన వారికి డబ్బులు ఇస్తున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు మాత్రం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు
• టిఆర్ఎస్ కు ఓటమి పాలైతే పెన్షన్ డబ్బులు ఆగిపోతాయని టిఆర్ఎస్ వారు ప్రచారం చేస్తున్నారు ని
• జామాబాద్ కరీంనగర్ లో టిఆర్ఎస్ ఓడిపోతే ఎందుకు ఆపలేదు
- 22 Oct 2020 12:40 PM GMT
Mahabubabad updates: దీక్షిత్ అంత్యక్రియలు పూర్తి...
మహబూబాబాద్ జిల్లా...
//బాలుడి తండ్రి రంజిత్ స్వగ్రామం శనిగపురం లో పూర్తి అయిన దహన సంస్కారాలు..
- 22 Oct 2020 12:34 PM GMT
Nalgonda district updates: మునుగోడు రైతు దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
నల్గొండ :
//వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు తో పాటు ఐకెపి సెంటర్లు సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభీంచాలని మునుగోడు రైతు దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
//దీక్ష అనంతరం నల్గొండ క్యాంప్ కార్యాలయం లో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
- 22 Oct 2020 12:29 PM GMT
Mahabubabad updates: దీక్షిత్ రెడ్డి కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు...
మహబూబాబాద్ జిల్లా.
//మహబూబాద్ కిడ్నాప్, హత్యగురైన దీక్షిత్ రెడ్డి కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.
//నిందితుడు మంద సాగర్ ని కట్టుదిట్టమైన భద్రత మధ్య బాలుణ్ణి హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్లి, సీన్ రికన్స్త్రక్షన్ చేస్తున్న పోలీసులు..
//బాలుడి ఇంటి వద్ద నుండి మహబూబాద్ శివారులోని గుట్టల వద్దకు తీసుకెళ్లి సీన్ జరిగిన తీరును పరిశీలిస్తున్న పోలీసులు.
- 22 Oct 2020 12:00 PM GMT
Nayini Narsimha Reddy passed away: మహాప్రస్థానం లో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు పూర్తి..
#నాయిని చితికి నిప్పు అంటించిన నాయిని కొడుకు దేవేందర్ రెడ్డి
#గౌరవ వందనం సమర్పించి గాల్లోకి కాల్పులు జరిపిన పోలీస్లు
#అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు కేటీఆర్,ఈటెల, శ్రీనివాస్ గౌడ్, తలసాని, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్..వివిద ట్రేడ్ యూనియన్ నేతలు నాయిని బంధువులు, అభిమానులు.
- 22 Oct 2020 11:57 AM GMT
Maha Prasthanam: నాయిని అంతక్రియల్లో జేబుదొంగల చేతి వాటం..
#అంతక్రియలకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకుల పర్సులు కొట్టేసిన జేబుదొంగల గ్యాంగ్..
#గ్యాంగ్ లో ఒక సభ్యున్ని పట్టుకుని పోలీసులకు అప్పగింత..
#ఒక వ్యక్తికి చెందిన 3 వేలు రికవరీ..
#పలువు పర్సులు కూడా పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire