Live Updates: ఈరోజు (22 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 22 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | అష్టమి - 22:53:39 వరకు తదుపరి నవమి | ధనిశ్ఠ - 11:09:53 వరకు తదుపరి శతభిష | వర్జ్యం 14:50:57 నుండి 16:15:16 | అమృత ఘడియలు 11:39:51 నుండి 12:24:49 | దుర్ముహూర్తం 16:09:39 నుండి 16:54:37 | రాహుకాలం 16:15:16 నుండి 17:39:34 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Nov 2020 2:46 PM GMT
Aravind Kumar Goud: హైదరాబాద్ లో ఏ అభివృద్ధి చూసిన తెలుగుదేశం పార్టీ చేసిందే..
- అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీ జిహెచ్ఎంసి సమన్వయ కమిటీ కన్వీనర్..
- జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఉపసంహరణ గిఫ్దువు ముగిసిన తరువాత 105 స్థానాల్లో టీటీడీపీ అభ్యర్థులు భరిలో ఉన్నారు...
- 80 శాతం కు పైగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారున్నారు...
- హైదరాబాద్ దాహార్తిని తీర్చిదిద్దడానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చింది టీడీపీ..
- హైటెక్ సిటీని నిర్మించి మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ కంపనిలను నగరానికి తీసుకువచ్చింది...
- నగర ట్రాఫిక్ ను తగ్గించడానికి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు టీడీపీ అంకురార్పణ చేసింది..
- నిత్యం మతఘర్షణలు ,కర్ఫ్యూ లు ఉండే శాంతి భద్రతలకు పరిరక్షించింది టీడీపీ..
- 22 Nov 2020 2:06 PM GMT
Sangareddy Updates: బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి...
సంగారెడ్డి జిల్లా:
- బీజేపీ ఆఫీసులో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయ్.
- అంగీలు....లాగులు చినుగుతున్నాయ్.
- మీలో సయోధ్య లేదు..ప్రజలకేం చేస్తారు.. ?
- పఠాన్ చెరు శ్రీనివాస్ నగర్ , వడ్డెర బస్తీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం.
- 22 Nov 2020 1:47 PM GMT
Bandi Sanjay Comments: బీజేపీ అంటే టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది..
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..
- ఓ ఛానెల్ లోగో తో బండి సంజయ్ ప్రచారం నుండి తప్పించారని అధికార పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
- హైదరాబాద్ లో ఎగిరిది కాషాయ జెండానే..
- 2023 తెలంగాణ లో బీజేపీ జెండా ఎగురవేస్తున్నాం..
- కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ రావడం వల్ల అయోధ్య లో రామమందిరం నిర్మాణం చేపట్టింది..
- 22 Nov 2020 1:36 PM GMT
Vijayashanthi Comments: ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఓటర్లను దోఖా చేసే కుట్ర...
విజయశాంతి
-ఈ రోజు టీఆరెస్ ప్రభుత్వాన్ని దింపుతామన్న ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు పూర్తిగా టీఆరెస్ - ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఓటర్లను దోఖా చేసే కుట్ర.
-ఎంఐఎం ఏడుగురి ఎమ్మెల్ల్యేలతో ప్రభుత్వానికి అవసరం లేదు... పడదు. అంటే ఎంఐఎం మతకలహాలు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెబుతున్నట్టా...?
-జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక టీఆరెస్-ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకు తీరుతాయి.
-అవసరం లేకున్నా కలిసే ఉంటాయి. ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్*
-బీహార్‌లో టీఆరెస్-ఎంఐఎం కలసి బలమైన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని ఓడగొడితే దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీలు ఇక కాంగ్రెస్ గెలవదు అన్న అభిప్రాయానికి వస్తారు.
-తద్వారా అనేక రాష్ట్రాలలో పట్టు ఏర్పరుచుకుని, పొత్తుల ద్వారా దేశమంతా వ్యాప్తి చెందాలనే ప్రయత్నం చేశారు.
-అందుకు అవసరమైన పెద్ద ఎత్తు నిధులను కూడా టీఆరెస్ అందించినట్లు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.
-అయితే ఆ ఫలితాల వల్ల తెలంగాణలోని మొత్తం మైనార్టీలు టీఆరెస్ - ఎంఐఎంలకు కూడా దూరమయ్యే దిశగా చర్చ జరుగుతుంది.
-ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు టీఆరెస్ అధినేత ఎంఐఎంతో కలసి చర్చించి, తిరిగి మైనార్టీల నమ్మకం పొందగలిగే ఎత్తుగడలో భాగంగా దేశవ్యాప్త నేతలతో సమావేశాలు, మోడీపై యుద్ధం లాంటి నిష్ఫలమైన ప్రసంగాలు చేస్తున్నారు.
-గతంలో వీరి ఫెడరల్ ఫ్రంట్ విన్యాసాలు అందరూ చూసినవే.
- 22 Nov 2020 1:05 PM GMT
Ponnam Prabhakar Comments: మా నేతలు ఎన్నికల కమిషనర్ని కలిసి 24గంటలు అయ్యింది..
- పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ @గాంధీ భవన్
- ఇప్పటికి ప్రభుత్వ హోర్డింగ్స్ తొలగించలేదు..
- అవి తొలగించడానికి ఎందుకు ఆదేశాలు ఇవ్వటం లేదు..
- మీరు చేయకుంటే మేము మా కార్యకర్తలు తో తొలగిస్తాం..
- మేమేది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించము
- 22 Nov 2020 1:03 PM GMT
N. Uttam Kumar Reddy Comments: జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ ని గెలిపించాలని విజ్ఞప్తి..
-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి @ గాంధీ భవన్..
-స్వతహాగా నేను హైదరాబాద్ వాడిని..
-హైదరాబాద్ నగరానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే..
-ఫార్మా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో ఉందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే..
-మెట్రో రైల్,పివి హైవే ,కృష్ణా, గోదావరి జలాలు హైదరాబాద్ లో ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే..
-అసమర్థత, అవినీతికి మారుపేరు టీఆరెస్..
-వరదల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే 550 కోట్లు వరద సహాయం పేరుతో టీఆరెస్ నాయకుల జేబులోకి వెళ్లాయి..
-కరోన తో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌజ్ లో పడుకున్నారు..
-కరోన ని ఆరోగ్యశ్రీ లో పెట్టమని చెప్తే ఇంతవరకు సమాధానం చెప్పలేదు..
-టీఆరెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు..
-7 ఏళ్లలో నరేంద్రమోదీ ప్రభుత్వం హైదరాబాద్ కి ఎం చేసిందని ఓట్లు అడుగుతున్నారు...
-ఐటిఎం ఆర్ ప్రాజెక్టు రద్దైతే కిషన్ రెడ్డి స్పందించరు..
-అర్ధరాత్రి ఇతర పార్టీల ఇళ్లలోకి చొరబడి ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేరమని చెప్తున్నారు..
-రాష్ట్రపతి ,ఉపరాష్ట్రపతి , డిమనిటైజేషన్ కు సపోర్ట్ గా ఓటేయలేదా...?
-కాశ్మీర్ నుండి 370 రద్దు చేసినప్పుడు పార్లమెంట్ లో మద్దతు పలకలేదా...?
-ఇదే టీఆరెస్ ,బీజేపీ లాలూచీ..
-బీహార్ లో 70 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం హైదరాబాద్ లో 150 కి 40 చోట్లే ఎందుకు పోటీ చేస్తున్నారు...?
-ఆసుదుద్దీన్ ఒవైసీ అమిత్ షా ని కలిసింది వాస్తవమా కదా..?
-4 కార్పొరేట్ సీట్ల కోసం హైదరాబాద్ ప్రజల్లో మత చిచ్చు రగిల్చడం సరైంది కాదు..
-మెట్రోలో సెమి గోవర్నమెంట్ సంస్థ..మెట్రో పిల్లర్ల మీద ఒక పార్టీకి సంబంధించిన ప్రకటనలు ఎలా వేస్తారు..
-ఆర్టీసి బస్సులు,పబ్లిక్ టాయిలెట్లలో ,హోర్డింగులతో నింపేశారు..
-కుత్బుల్లాపూర్ కేటీఆర్ మీటింగ్ లో ఎల్ఈడి వ్యాన్స్ ఉపయోగించారు..
జిహెచ్ఎంసి కమిషనర్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి..
-హైదరాబాద్ లో అన్ని మతాల వారు కుటుంబ సభ్యుల వాలే కలిసి ఉంటారు..
-మతతత్వ బీజేపీని ,టీఆరెస్ ని తిరస్కరించండి..
-జిహెచ్ఎంసి ఎన్నికల కోసం సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ కోసం కన్వీనర్ గా గూడూరి నారాయణ రెడ్డి సలహాదారు గా వంశీ చంద్ రెడ్డి ఉంటారు..
- 22 Nov 2020 12:59 PM GMT
Raghunandan Rao Comments: మేము ఇచ్చినం అంటున్న కేసీఆర్, కేటీఆర్ ఇంట్లకెళ్ళి ఇచ్చారా...
- రఘునందన్ రావు,దుబ్బాక ఎమ్మెల్యే
- గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ప్రారంభంకాగానే తనకు తానే ముఖ్యమంత్రిగా కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నాడు
- 62వేల కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి కావు ప్రజలవి
- కేంద్రం ఏమీ ఇచ్చింది అంటున్న కేటీఆర్ హైదరాబాద్ కు మీరేమి ఇచ్చిండ్లు
- చింతమడకకు లక్ష యాభై వేలు కేసీఆర్ ఇస్తే.. కేంద్రం ఎనిమిది లక్షలు ఇచ్చింది
- దేవాలయాల గురించి మాట్లాడే నైతికహక్కు తండ్రి, కొడుకులకు కాదు
- సెక్యులర్ అనే పదానికి కేటీఆర్ కు అర్ధం తెలుసా
- ఇది సిరిసిల్ల కాదు కేటీఆర్ హైదరాబాద్
- హైదరాబాద్ కు రూపాయి ఇచ్చారా...భూములు అమ్మితే వచ్చాయా
- కేసీఆర్ పాలనలో మత ఘర్షణలయ్యాయా... మోదీ పాలనలో దేశంలో మత ఘర్షణలయ్యాయి
- అరాచకం అంటేనే కేసీఆర్ కుటుంబం
- యుద్ధం అంటే ఫామ్ హౌజ్ లో సాయంత్రం గ్లాసుల చప్పుడు అనుకుంటున్నావా
- ఆరేళ్ళ నుంచి జనంలోకి రాని కేసీఆర్ యుద్ధం చేస్తాడా
- తెరాస యాక్షన్ బట్టే... బీజేపీ రియాక్షన్ ఉంటుంది
- జీహెచ్ఎంసీ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దు
- 22 Nov 2020 12:51 PM GMT
DK Aruna: ఆధార బాధర గా జిహెచ్ఎంసి ఎన్నికలు పెట్టారు సీఎం కేసీఆర్...
డీకే అరుణ.
-దుబ్బాక లో బీజేపీ గెలిచినప్పటి నుండి కేసీఆర్ బీజేపీ అంటే బయపడుతున్నాడు...
-5 ఏండ్ల లలో జిహెచ్ఎంసి లో ఏమి చేశావని ఓట్లు అడుగుతున్నావు...
-లక్ష డబుల్ బెడ్ రూమ్ లలో జూబ్లీహిల్స్ లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ లు కట్టావో చెప్పు కేసీఆర్...
-100 రోజుల ప్రణాళిక ఏమైంది కేటీఆర్ 65 వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే రోడ్ల మీదికి ఇండ్ల లోకి నీళ్లు ఎందుకు వచ్చాయి...
-కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ లు తప్ప ఏమీ అభివృద్ధి జరగలేదు ..
-దుబ్బాక అభివృద్ధి కావాలని బీజేపీ ని అక్కడి ప్రజలు దుబ్బాకలో బీజేపీని గెలిపించారు.
-హైదరాబాద్ ప్రజలు కూడా హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే హైదరాబాద్ లో బీజేపీ ని గెలిపించాలి...
-బీజేపీ కార్యకర్తలు అలెర్ట్ గా ఉండాలి దొంగ ఓట్లను గుర్తించాలి..
- 22 Nov 2020 12:33 PM GMT
CM K. Chandrashekar Rao: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేత ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది...
సీఎం..కేసీఆర్..
* కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
* హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు.
* ఈ నెల 23న కోర్టు విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
* రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షాణాధికారం ఎవరికీ లేదాన్నారు.
- 22 Nov 2020 11:17 AM GMT
Hyderabad Updates: గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ కు హై కోర్ట్ లో ఊరట..
హైదరాబాద్...
* నామినేషన్ తిరస్కరణ పై స్టే ఇచ్చిన కోర్ట్..
* కొద్దిసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తో భేటీ కానున్న ఎంపీ రేవంత్ రెడ్డి .
* తీర్పు కాపీ ని కమిషనర్ కు అందజేసి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని కొనసాగెలా చర్యలు తీసుకోవాలని కొరనున్న రేవంత్
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire