Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 22 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం శు.తదియ రా.2.21 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.1.30 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.41 నుంచి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు... సా.6.42 నుంచి 7.42 వరకు. సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-19

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు జేజేలు!

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 22 Aug 2020 3:18 AM GMT

    Vinayaka Chavithi: కరోనా ఆంక్షల మధ్య జిల్లాలో నిరాడంబరంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు..

    తూర్పుగోదావరి :

    - కరోనా ఆంక్షల మధ్య జిల్లాలో నిరాడంబరంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు..

    - బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో భక్తులకు దర్శనానికి మాత్రమే అనుమతి..

    - కరోనా ప్రభలుతోన్న నేపధ్యంలో అంతరాలయ దర్శనాలు నిలిపివేత..

    - నవరాత్రులను పురస్కరించుకుని యధావిధిగా స్వామి వారి కైంకర్యాలు.. అభిషేకాలు నిర్వహిస్తోన్న అర్చక స్వాములు..

    - ఐనవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలోనూ తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతి..

    - పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతిస్తోన్న దేవాదాయశాఖ అధికారులు..

    - పూర్తి జాగ్రత్తలు తీసుకున్న తరువాతే భక్తులకు దర్శనాలకు అనుమతి..

  • 22 Aug 2020 3:17 AM GMT

    Vinayaka Chaturthi 2020: నగరంలో కళ తప్పిన వినాయకచవితి

    విజయవాడ:

    - నగరంలో కళ తప్పిన వినాయకచవితి

    - వాణిజ్య రాజధాని లో అత్యధికంగా వ్యాపారులు ఘనంగా వినాయక చవితి నిర్వహించే వారు...

    - ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలతో ఇళ్లకే పరిమితము అయ్యిన పండుగ కళ

    - అలయాల్లోనూ కనిపించని పండుగ శోభ

  • 22 Aug 2020 3:16 AM GMT

    Vinayaka Chavithi 2020: జిల్లా వ్యాప్తంగా గా దేవాలయాలు, ఇళ్ల కే పరిమితమైన వినాయక చవితి..

    అనంతపురం:

    - జిల్లా వ్యాప్తంగా గా దేవాలయాలు, ఇళ్ల కే పరిమితమైన వినాయక చవితి.

    - ఒక్క రోజు లోనే నిమజ్జనం.

    - ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే వినాయక చవితి ఉత్సవాలు

  • 22 Aug 2020 1:46 AM GMT

    Ananthapur: ఎస్కేయూ పనివేళల్లో మార్పు..

    అనంతపురం:

    - ఎస్కేయూ పనివేళల్లో మార్పు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగుల హాజరు. ఈ నెల 24 నుంచి అమలు: మల్లికార్జున, రిజిస్టర్, ఎస్కేయూ

    - బ్యాంకు వేళల్లో మార్పు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరవాలి: మోహన్ మురళి,లీడ్ బ్యాంకు మేనేజర్

  • 22 Aug 2020 1:44 AM GMT

    Srisailam: శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న భారీ వరద ఉధృతి

    కర్నూలు జిల్లా:

    - శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న భారీ వరద ఉధృతి

    - 10 క్రేస్ట్ గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కి నీటిని విడుదల

    - ఇన్ ఫ్లో : 4,03,201 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో : 4,60,250 క్యూసెక్కులు

    - పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

    - ప్రస్తుత : 883.70 అడుగులు

    - నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు

    - ప్రస్తుతం : 208.2841 టీఎంసీలు

    - కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

    - ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో నిల్

  • 22 Aug 2020 1:43 AM GMT

    Godavari River: పరవళ్ళు తొక్కుతున్న వరద గోదావరి..

    తూర్పుగోదావరి:

    - పరవళ్ళు తొక్కుతున్న వరద గోదావరి..

    - ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న వరద మూడో ప్రమాద హెచ్చరిక

    - 18.40 అడుగులకు చేరుకున్న నీటిమట్టం

    - ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న 20 లక్షల 11వేల క్యూసెక్కుల వరద ప్రవాహం

    - అంతకంతకూ పెరుగుతున్న వరద..

    - పోలవరం అప్పర్ కాఫర డ్యాం వద్ద 30.10 మీటర్లు నీటిమట్టం

    - భద్రాచలం వద్ద 53.7 అడుగులతో కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

    - శబరిలో తగ్గని వరద ఉధృతి

Print Article
Next Story
More Stories