Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 21 Oct 2020 4:57 AM GMT

    విజయవాడ

    సీఎం జగన్ తో పాటుగా హోంమంత్రి సుచరిత,

    సీఎం చేతుల మీదుగా అమరులైన పోలీసు వీరుల వివరాలతో పుస్తక ఆవిష్కరణ

    డీజీపీ గౌతం సవాంగ్

    పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి

    వారి త్యాగం నుంచీ ప్రతీ పొలీసు చాలా నేర్చుకోవాలి

    సీఆర్పీఎఫ్ దళాలు భారతదేశాన్ని రక్షించడానికి పనిచేస్తారు

    ప్రతీ సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తాం

    పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారి త్యాగాలను గుర్తుంచుకోవడానికి అని ప్రధాని మోదీ చెపుతారు

    మొత్తం పోలీసు దళాలు దేశ సేవ కోసం పని చేస్తున్నాయి.

    కోవిడ్ - 19 విపత్తులో ముందుండి పనిచేసారు ప్రతీ పోలీసు

    అన్ లాక్ డౌన్ తరువాత కూడా వెనుకాడని ధైర్యంతో పనిచేసారు

    సీఎం జగన్ మరణించిన పోలీసులకు 50లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు

    భీమా సదుపాయం కల్పించడం కూడా మాకు అత్యుత్తమ‌ సదుపాయం

    స్పందన చాలా ఉపయోగకరంగా మారింది

    మహిళా భద్రతకు వినూత్న విధానాలు తీసుకొచ్చాం

    87 పోలీసు సేవలతో కూడిన పోలీసు సేవా యాప్ ప్రజలకు ఎంతో ఉపయోగకరం

    ఎలాంటి క్లిష్టమైన పరిస్ధితులైన ఏపీ పోలీసు ముందుంటారు

  • 21 Oct 2020 4:56 AM GMT

    తిరుమల

    శ్రీవారిని దర్శించుకున్న ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి

  • 21 Oct 2020 4:56 AM GMT

    తూర్పుగోదావరి

    ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని నమ్మించి, రూ.లక్షకుపైగా నగదు దోచేసిన ఓ అగంతకుడు

    రాజమండ్రి- ప్రకాశంనగర్‌ పోలీసు స్టేషన్ పరిధి శ్యామలానగర్‌ లో ఘటన

    ఎ.శ్రీనివాసశర్మకు ఈ నెల 16న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌

    మీ పేటీఎం యాప్‌ అప్‌డేట్‌ చేయాలి... ఆధార్‌, ఇతర వివరాలు చెప్పాలని కోరిన ఆ అగంతకుడు

    ఆ అగంతకుడు చెప్పిన మాటలు నమ్మిన శర్మ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా చెప్పేశాడు

    దీంతో రెండు దఫాలుగా మొత్తం రూ.1.09 లక్షలను శర్మ బ్యాంకు ఖాతా నుంచి అగంతకుడు తన ఖాతాకు ఆన్‌లైనులో దోచేశాడు

    నగదు డ్రా చేసినట్లు బ్యాంకు నుంచి సంక్షిప్త సందేశాలు రావడంతో కంగారు పడిన శర్మ బ్యాంకును సంప్రదించాడు.

    తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు శర్మ ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • 21 Oct 2020 4:55 AM GMT

    తూర్పుగోదావరి

    ఏలేరు ఎగువ పరివాహక ప్రాంతం ఏజన్సీ లో భారీగా వర్షాలు

    జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం , ప్రత్తిపాడు ,పిఠాపురం నియోజకవర్గాలలో కొనసాగుతున్న ఏలేరు వరద ముంపు- రైతుల ఇబ్బందులు

    ఏలేరు ప్రాజెక్టు గేట్ల నుంచి కొనసాగుతున్న 12 వేల క్యూసెక్కుల వరదనీరు విడుదల.

    ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీవర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

    ఏలేరు పూర్తి స్థాయి నీటి మట్టం 86.56 మీటర్లు, ప్రస్తుతం 86.28 మీటర్ల

  • 21 Oct 2020 4:55 AM GMT

    విజయవాడ

    కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ కేశినేని నాని ..

    ఎంపీ కేశినేని నాని

    ప్రస్తుతం కరోనా తో ప్రపంచం విలవిలాడుతోంది...

    కరోనా నుండి ప్రపంచాన్ని కాపాడాలని అమ్మవారిని కోరుకున్న.....

  • 21 Oct 2020 4:55 AM GMT

    విశాఖ

    శారదాపీఠంలో నేడు మహా సరస్వతి అవతారంలో రాజశ్యామల అమ్మవారి దర్శనం

    చేతిలో వీణతో హంస వాహనంపై ఆసీనులైన అమ్మవారి అవతారం

    మూలా నక్షత్రం సందర్భంగా పీఠం ప్రాంగణంలో అక్షరాభ్యాసాలు

  • 21 Oct 2020 4:54 AM GMT

    కర్నూలు జిల్లా....

    శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

    ఇన్ ఫ్లో : 3,38,164 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో : 4,11,092 క్యూసెక్కులు

    పూర్తి స్థాయి నీటి మట్టం: 885.00 అడుగులు

    ప్రస్తుతం : 884.10 అడుగులు

    పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

    ప్రస్తుతం: 210.5133 టీఎంసీలు

    కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 21 Oct 2020 3:37 AM GMT

    శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    - 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

    - ఇన్ ఫ్లో : 3,38,164 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో : 4,11,092 క్యూసెక్కులు

    - పూర్తి స్థాయి నీటి మట్టం: 885.00 అడుగులు

    - ప్రస్తుతం : 884.10 అడుగులు

    - పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

    - ప్రస్తుతం: 210.5133 టీఎంసీలు

    - కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 21 Oct 2020 3:36 AM GMT

    ఈరోజు శ్రీశైలంలో అమ్మవారికి శ్రీచక్రార్చన

    - శ్రీశైల మహాక్షేత్రం దసరా మహోత్సవాలలో భాగంగా ఐదవ రోజైన నేడు అమ్మవారికి స్కందమాత అలంకారం, స్వామిఅమ్మవార్లకు శేషవాహనసేవ

    - ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,

    - అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు రుద్రహోమం, చండీహోమం

    - ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, , జపానుష్ఠానాలు

  • తిరుమల సమాచారం
    21 Oct 2020 3:34 AM GMT

    తిరుమల సమాచారం

    - నిన్న శ్రీవారిని దర్శించుకున్న 17,256 మంది భక్తులు

    - తలనీలాలు సమర్పించిన 3,873 మంది భక్తులు

    - నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.52 కోట్లు

    - శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

    - ఆరోవ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌నం.

    - మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పుష్ప‌క విమానం.

    - రాత్రి 7 గంట‌ల‌కు గ‌జ వాహ‌నం

Print Article
Next Story
More Stories