Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 21 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం తదియ(రా. 2-22 వరకు) తదుపరి చవితి; ఉత్తర నక్షత్రం (రా. 1-31 వరకు) తదుపరి హస్త నక్షత్రం, అమృత ఘడియలు (సా. 6-44 నుంచి 8-15 వరకు) వర్జ్యం (ఉ. 9-42 నుంచి 11-12 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-28 నుంచి 1-18 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Aug 2020 8:01 AM GMT
vijayawada swarna palace fire accident: స్వర్ణప్యాలెస్ ఘటనలో బెయిల్ పిటీషన్లు వాయిదా
విజయవాడ: స్వర్ణప్యాలెస్ ఘటనలో నిందితుల బెయిల్ పిటీషన్లు ఈనెల 24కు వాయిదా
డాక్టర్ రమేష్, చైర్మన్ సీతారామ మోహనరావు ముందస్తు బెయిల్ పిటీషన్లు కూడా ఈనెల 24కు
స్క్వాష్ పిటీషన్ హైకోర్టులో బెంచి మార్చి, ఏ బెంచికి అనేది సోమవారం తెలిసే అవకాశం
- 21 Aug 2020 7:58 AM GMT
Ganesh Idols Distribution: పత్తికొండలో మట్టి వినాయకుల పంపిణీ
కర్నూల్ జిల్లా: పత్తికొండలో 4 వేల మట్టి వినాయకులను ఇంటింటికి పంపిణీ చేసిన పొచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి.
కరోనకాలంలో పర్యవరణన్ని కాపాడేదిశగా ప్రతి ఇంటికి మట్టి వినాయకుల పంపిణీ.
- 21 Aug 2020 7:54 AM GMT
Srisailam Power Plant Fire Accident Live Updates: శ్రీశైలం ప్రమాదాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఏపీ ఎమ్మెల్యేలు మంత్రులు
కర్నూలు జిల్లా: తెలంగాణ భూగర్భ జల విద్యుత్ కేంద్రం షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఏపీ ఎమ్మెల్యేలు మంత్రులు పార్లమెంటు సభ్యులు
జరిగిన ప్రమాద సంఘటన వివరాలను టీఎస్ అధికారులతో తెలుసుకుంటున్న ప్రజా ప్రతినిధులు
షార్ట్ సర్క్యూట్ ప్రమాద సంఘటనలో చిక్కుకున్న 9 మంది యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్న ప్రజా ప్రతినిధులు
- 21 Aug 2020 7:43 AM GMT
Srisailam Power Plant Fire Accident Updates: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరం
బీజేపీ మీడియా స్టేట్మెంట్, కె కృష్ణసాగర రావు..బీజేపీ, ముఖ్య అధికార ప్రతినిధి,
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరం, ఆ ఘటన బీజేపీని కలచివేసింది. అక్కడ పలువురు చిక్కుకుపోయారన్న వార్తలు షాక్ కు గురి చేశాయి.
గాయపడ్డ వారికి వెంటనే చికిత్స అందించడం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్లాంటులో చిక్కుకున్న వారిని యుద్ధ ప్రాతిపదికన బయటకు తీసుకురావాలి.
- 21 Aug 2020 7:37 AM GMT
Eleru Reservoir Updates: ఏలేరు రిజర్వాయర్ జలకళ
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లో గల ఏలేరు రిజర్వాయర్
నేడు ఉదయ సమయానికి ఏలేరు అధికారులు అందించిన వివరాల ప్రకారం
రిజర్వాయర్ 86.56 మీటర్ల స్థాయిలో 24.11 టీఎంసీల సామర్థ్యమున్న
రిజర్వాయర్లో 84.48 మీటర్ల స్థాయిలో 20.02 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు.
ఇందులో ఇన్ ఫ్లో
8667 క్యుసెక్కులు చేరగా
70 క్యూసెక్కుల నీటిని మాత్రమే వై ఎల్ ఎం సి ద్వారా అవుట్ ఫ్లోస్ గా విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.
- 21 Aug 2020 7:32 AM GMT
Nagarjuna Sagar Dam Updates: నాగార్జున సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత
తెరుచుకున్న నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు..నాగార్జున సాగర్ నాలుగు గేట్లను ఎత్తి దిగవకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, సిఈ నరసింహ ,ఎస్ఈ మధు సూదన్...
పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.కాగా,,
ప్రస్తుత నీటిమట్టం : 585 అడుగులకు చేరుకున్నది...
ఇన్ ఫ్లో :4 లక్షల క్యూసెక్కులు.
పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.
ప్రస్తుత నీటి నిల్వ : 290.టీఎంసీలు.
- 21 Aug 2020 7:27 AM GMT
Chandra Babu Condolence on lawyer Ramachandra Rao death: న్యాయవాది రామచంద్రరావు మృతిపట్ల చంద్రబాబు సంతాపం
అమరావతి: సీనియర్ న్యాయవాది ఎస్ రామచంద్రరావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
అడ్వకేట్ జనరల్ గా, న్యాయవాదిగా రామచంద్ర రావు విశిష్ట సేవలు అందించారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- 21 Aug 2020 7:19 AM GMT
Minister Vellampalli Srinivas fire on Raghurama Krishna raju: కరోనా వ్యాప్తి నివారణ కోసమే ఈ ప్రయత్నం: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
వేంకటేశ్వర స్వామివారి దయతో అంతా మంచే జరుగుతుందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
కోవిడ్ నిబంధనలు అనుసరించి వినాయకచవితి జరుపుకోమన్నామే తప్ప పండుగలే వద్దని చెప్పలేదు
కరోనా వ్యాప్తి నివారణ కోసమే ఈ ప్రయత్నం .
రఘురామ కృష్ణరాజుకు నిజంగా భక్తి ఉంటే తన నియోజకవర్గానికి వచ్చి గణపతి పూజ చేయాలని సవాల్
ఢిల్లీలో చెట్టుకింద రఘురామ కృష్టరాజు, హైదరాబాదులో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్టపాల్జేయాలని చూస్తున్నారు
రాజశేఖరరెడ్డి కుటుంబానికి హిందూ వ్యతిరేఖ ముద్రను అంటకట్టాలని చూస్తున్నారు.
అది ఎన్నటికీ జరగదు
వినాయకచవితిని ఇళ్ళలోనే ఘనంగా నిర్వహించుకోండి
టీటీడీ ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుందరకాండ పారాయణం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు విరాట పర్వ పారాయణం నిర్వహిస్తుండటం శుభ పరిణామం
దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- 21 Aug 2020 7:14 AM GMT
Suspension on Ongole CI: ఒంగోలు సీఐపై సస్పెన్షన్ వేటు
ప్రకాశం: ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మణ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
సివిల్ కేసులు, పంచాయితీలు చేస్తున్నారనే ఆరోపణలపై సీఐ లక్ష్మణ్‌పై జిల్లా ఎస్పీ సిద్ధార్ట్ కౌశల్ విచారణకు ఆదేశించారు.
ఆరోపణలపై ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు.
విచారణ నివేదికతో పాటు ఎస్పీ సిఫారసు మేరకు సీఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
పామూరు సీఐగా పనిచేస్తున్న శివరామకృష్ణారెడ్డిని ఒంగోలు తాలూకా సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- 21 Aug 2020 7:09 AM GMT
Vijayasai Reddy Tweet: నూతన విధానంతో పర్యాటక రంగానికి చిరునామాగా ఆంధ్రా
అమరావతి: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
నూతన విధానంతో పర్యాటక రంగానికి చిరునామాగా ఆంధ్రా.
అరకులో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని జగన్ గారు ఆదేశించారు.
హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ లో మంచి కాలేజ్ కూడా ఏర్పాటు కాబోతోంది.
రాష్ట్రంలో ఎకో, టెంపుల్ టూరిజం కొత్త పుంతలు తొక్కనుంది.
నూతన విధానంతో పర్యాటక రంగానికి చిరునామాగా ఆంధ్రా. అరకులో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని జగన్ గారు ఆదేశించారు. హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ లో మంచి కాలేజ్ కూడా ఏర్పాటు కాబోతోంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 21, 2020
రాష్ట్రంలో ఎకో, టెంపుల్ టూరిజం కొత్త పుంతలు తొక్కనుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire