Live Updates: ఈరోజు (సెప్టెంబర్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 20 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ: ఉ.10-07 వరకు తదుపరి చవితి | చిత్త నక్షత్రం ఉ.6-20 వరకు స్వాతినక్షత్రం తె.4-41వరకు తదుపరి విశాఖ | వర్జ్యం: ఉ.11-32 నుంచి 1-01 వరకు | అమృత ఘడియలు: రా.8-28 నుంచి 9-58 వరకు | దుర్ముహూర్తం: సా.4-20 నుంచి 5-08 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 20 Sep 2020 9:19 AM GMT
Visakha updates: సభ్యత లేని మంత్రులు జగన్ మంత్రి వర్గంలో ఉన్నారు: బండారు సత్యనారాయణ మూర్తి..
విశాఖ..
-మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్స్..
-ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పశువులను కొన్నట్టు శాసన సభ్యులను కొన్నారు అని విమర్శించిన జగన్, ఇప్పుడు ఏం మాట్లాడతారు.
-దేశంలో అత్యధిక కేసులు ఉన్న ప్రజా ప్రతినిధులు జాబితాలో సీఎం జగన్ ముందు వరుసలో ఉన్నారు.
-న్యాయ స్థానాలు మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
-ఎంత మంది శాసన సభ్యులను తీసుకెళ్లిన టిడిపి భయపడదు.
-వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో వ్యవసాయ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తున్నారు.
-కేసులకు భయపడి కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారు..
- 20 Sep 2020 9:14 AM GMT
Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న వరద ఉధృతి..
-విజయవాడ..
-సముద్రంలోకి 4,44,640 క్యూసెక్కుల నీటి విడుదల
-కాలువలకు 4,328 క్యూసెక్కుల నీటి విడుదల
-మొత్తం ఇన్ ఫ్లో 4,48,968 క్యూసెక్కులు
-ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక
-పులిచింతల వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
-లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
-బోట్లు, మర బోట్లు, స్పీడ్ బోట్లు తిరగరాదన్న కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్
- 20 Sep 2020 6:08 AM GMT
Kurnool District updates: కుందూనది, పాలేరు వాగులకు కొనసాగుతున్న వరద ఉధృతి...
కర్నూలు జిల్లా......
-తేలికపాటి వర్షం కురుస్తుంది..
-సంజామల మండలం లో ముదిగేడు వద్ద పాలేరు వాగు వంతెనపై ప్రవహిస్తున్న వరద నీరు నిలిచిపోయిన రాకపోకలు ...
-జలదిగ్బంధంలోనే ఓత్రమాన్ దీన్నే , వల్లం పాడు , చిన్న కొప్పెర్ల , పెద్ద కొప్పెర్ల , లింగాల గ్రామాలు ....
-కానాల చెరువు కు పడ్డ గండి ని పూడ్చే ప్రయత్నంలో ఇరిగేషన్ అధికారులు.....
- 20 Sep 2020 6:03 AM GMT
Kadapa District updates: గండికొటకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహాం..
కడప :
-జిఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 10వేల క్యూసెక్కులు, పరివాహాక ప్రాంతంలొ కురిసిన వర్షాల వల్ల మరొ 16 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతున్న ప్రవాహాం
-మైలవరం ప్రాజెక్టుకు 23వేలు, జిఎస్ఎస్ఎస్ కాలువకు 400, గండికొట లిప్ట్ 990క్యూసెక్కులు విడుదల
-గండికొటలొ 13.400టిఎంసీలకు చేరిన నీటి నిల్వ
- 20 Sep 2020 4:11 AM GMT
Rajahmundry updates: జిల్లాలో నేటి నుంచి 26వ తేదీ వరకూ 19 విభాగాలలో ఖాళీగా వున్న గ్రామ,వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు..
తూర్పుగోదావరి -రాజమండ్రి..
-1388 పోస్టులకు గాను 1,06,449 మంది అభ్యర్థులు పోటీ
-వీరిలో 1,877 మంది దివ్యాంగ అభ్యర్ధులు
-కాకినాడ – 166, రాజమహేంద్రవరం-106, అమలాపురం-64 మొత్తం 336 పరీక్షా కేంద్రాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు..
- 20 Sep 2020 4:07 AM GMT
Nellore updates: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంపిక పరీక్షలకు సర్వం సన్నద్ధం..
నెల్లూరు:-
- జిల్లా వ్యాప్తంగా 1556 పోస్టుల కోసం 138 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం సచివాలయ పరీక్షలు.
- కరోనా సోకిన వారికి సైతం ప్రత్యేక ఏర్పాట్లు.
- 20 Sep 2020 4:03 AM GMT
Visakha updates: నేటి నుండి జరగనున్న సచివాలయం పరీక్షలు..
విశాఖ...
-1585 పోస్టులకు గాను 1,50,441 మంది అభ్యర్థులు..
-తొలిరోజు 95 వేల మంది హజరు..
-277 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు..
- 20 Sep 2020 4:01 AM GMT
East Godavari updates: నేటి నుంచి ఈ నెల 26 వరకు గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఫేజ్-2 పరీక్షలు..
తూర్పుగోదావరి :
-జిల్లాలో 1388 ఉద్యోగాలకు.. దరఖాస్తు చేసి 1,06,449 మంది అభ్యర్ధులు..
-వీరిలో 1817 మంది దివ్యాంగులు.. జిల్లా వ్యాప్తంగా 336 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.
-సచివాలయం పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 176 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సేవలు..
-కరోనా నేపధ్యంలో రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటరుకు చేరుకుంటున్న అభ్యర్ధులు..
-ప్రతి అభ్యర్ధి మాస్క్, హ్యాండ్ గ్లౌవ్స్, శానిటైజర్ తప్పనిసరి.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ధర్మల్ స్కానింగ్ పరీక్షలు..
-కరోనా లక్షణాలు ఉన్న అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ రూమ్ లు ఏర్పాటు..
-ప్రతీ పరీక్షకు ముందు.. ఎగ్జామ్ హల్ ను హైపోక్లోరైడ్ సొల్యుషన్ తో శుభ్రం చేసిన సిబ్బంది..
- 20 Sep 2020 3:45 AM GMT
Weather updates: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం...
విశాఖ...
-24 గంటల్లో బలపడే అవకాశం..
-తెలంగాణ, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఆవర్తనాలు..
-వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
-తీరం వెంబడి గంట కు 45-50 కీ మీ వేగం తో గాలులు
-మత్స్యకారుల కు కొనసాగుతున్న హెచ్చరికలు..
- 20 Sep 2020 3:35 AM GMT
Sachivalayam Exams: నేటి నుంచి సచివాలయ పరీక్షలు
అమరావతి
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ప్రారంభం
- ఈరోజు ఉదయం, మధ్యాహ్నం కలిపి మొత్తం 6.81 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు.
- ఉదయం రాసే వారి కోసం 2221 కేంద్రాలు, మధ్యాహ్నం పరీక్ష రాసే వారి కోసం 1068 కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు
- పరీక్షల నిర్వహణ కోసం 77,558 మంది సిబ్బందిని వినియోగo.
- ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలు ఉంచడానికి 13 జిల్లాల కేంద్రాల్లో స్ట్రాంగ్‌రూములు ఏర్పాటు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire