Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 20 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పాడ్యమి(ఉ.6-39 వరకు) తదుపరి విదియ; పుబ్బ నక్షత్రం (రా. 2-56 వరకు) తదుపరి ఉత్తర నక్షత్రం, అమృత ఘడియలు (రా. 8-51 నుంచి 10-22 వరకు) వర్జ్యం (ఉ.11-45 నుంచి 1-16 వరకు) దుర్ముహూర్తం (ఉ. 9-58 నుంచి 10-48 వరకు తిరిగి మ. 2-59 నుంచి 3-49 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 20 Aug 2020 7:59 AM GMT

    హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్


    మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ నారాయణ గురు జయంతి వేడుకలు.


    శ్రీనారాయన గురు జయంతి వేడుకల్లో మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు


    కొన్ని కులాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయి


    కుళరూప రక్కసితో బడుగుబాలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది


    బడుగుబాలహీన వర్గాలు-నారాయణ గురు ఆశయాల కోసం కృషి చేయాలి


    ఏకరూప సిద్ధాంతం కోసం నారాయణ గురు ఎంతో కృషి చేసారు


    ఆనాడు ఉన్న కుల రక్కసే.. అవే కులాలు ఈనాడు పాలిస్తున్నారు..


    బడుగు బలహీన వర్గాల మీద దాడులు ఆగాడానికి త్వరలోనే అందరూ ఏకం అవుతారు.


  • 20 Aug 2020 6:53 AM GMT

    ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు

    గాంధీభవన్లో రాజీవ్ గాంధీ 76 జన్మదిన వేడుకలు.

    ఇందిరాగాంధీ కుమారునిగా జవహర్లాల్ నెహ్రూ మనువడిగా ఖ్యాతి గడించారు.

    40 ఏళ్ల వయసులో ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా చిన్న వయసులో ప్రధానిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టారు.

    అనూహ్య పరిస్థితుల్లో ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు

    చరిత్రలో రాజీవ్ గాంధీ దేశ పాలన పై తన చెరగని ముద్ర వేశారు.

    దేశ నిర్మాణంలో యువతకు భాగస్వామ్యం కల్పించడం కోసం 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన నేత రాజీవ్ గాంధీ.

    దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను గుర్తించి ప్రోత్సహించారు.

    పంచాయతీరాజ్ వ్యవస్థ ను బలపరచడానికి 72 వ రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు.

    మొబైల్ ఫోన్లో కంప్యూటర్ల వాడకం లో భారతదేశం నెంబర్ వన్ గా ఉండడానికి ఆ రోజు రాజీవ్ గాంధీ తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయే కారణం.

    ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఉండాలని కోరుకున్నారు.

    రాజీవ్ గాంధీ వారు వారి కుటుంబం ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేశారు.

    దేశ సమగ్రత కోసం రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారు.

    భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ నే.

    అది చిన్న వయసులోనే రాజీవ్ గాంధీ మనకు దూరమయ్యారు.

    గాంధీ నెహ్రూ కుటుంబాలు ఈ దేశానికి చేసిన సేవలను మోడీ ప్రభుత్వం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంది.

    నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు దేశం కోసం సమాజం కోసం సేవ చేస్తుంటే వారి చరిత్రను తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.

    హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్ విషయంలో మాట్లాడుతూ నెహ్రూ ను తక్కువ చేసి మాట్లాడారు.

    మేమంతా రాజీవ్ గాంధీ బాటలో నడుస్తూ తెలంగాణలో వచ్చే జిహెచ్ఎంసి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాము.

  • 20 Aug 2020 6:53 AM GMT

    హైదరాబాద్ : విశ్వేశ్వరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన ప్లాస్మా డొనేషన్ క్యాంప్..


    కరోన ను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి అత్యవసర చికిత్స పొందే వారికి ప్లాస్మా అందించేందుకు చొరవ తీసుకుంటున్న హైదరాబాద్ పోలీసులు...


    హైదరాబాద్ సిటీ సెక్యురిటి కౌన్సిల్ తో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ సంయుక్తంగా లాంచ్ చేయనున్న ప్లాస్మా డొనేషన్ క్యాంప్...


    హోమ్ మినిస్టర్ మోహముద్ అలీ,రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, నగర సీపీ అంజనీ కుమార్,రాష్ట్ర హెల్త్ సెక్రటరీ సయ్యద్ అలీ మూర్తజా రిజ్వి పాల్గొన్న పలువురు పోలీసు ఉన్నతాధికారులు అధికారులు


  • 20 Aug 2020 6:52 AM GMT

    వరంగల్ రూరల్ జిల్లా.

    రాయపర్తి మండలం రాయపర్తి, వేంకటేశ్వర పల్లె, కేశవపురం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

  • 20 Aug 2020 6:52 AM GMT

    కామారెడ్డి జిల్లా


    పోచారం ప్రాజెక్టు కు పెరిగిన వరద


    నేటి సాయంత్రం లోగా నిండనున్న ప్రాజెక్టు


    మంజీరా వాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు


  • 20 Aug 2020 6:52 AM GMT

    ఏసీబీ సోదాలు


    రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు...


    సర్వేయర్ సూపర్డెంట్ వెంకటేశ్వర్ రెడ్డి పై కొనసాగుతున్న ఎసిబి సోదాలు..


    5000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా దొరికిన వెంకటేశ్వర్ రెడ్డి.


    సర్వే రీపోర్ట్ ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేసిన సూపర్డెంట్ వెంకటేశ్వర్ రెడ్డి


  • 20 Aug 2020 6:51 AM GMT

    నిజమాబాద్ : నందిపేట మండలం ఉమ్మెద గోదావరి బ్యాక్ వాటర్ లో చిక్కుకున్న కృష్ణ జింకలు.

    గోదావరికి వరద ప్రవాహం పెరగడం తో చెల్ల చెదురైన జింకలు.

    ప్రవాహం లో చిక్కుకున్న ఐదు జింకలను కాపాడిన స్థానిక మత్స్యకారులు.

    సురక్షిత ప్రాంతానికి తరలించిన అటవీ అధికారులు.

  • 20 Aug 2020 5:21 AM GMT

    నిజామాబాద్ -శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు పోటెత్తిన వరద


    మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి పెరిగిన వరద ప్రవాహం


    ఇన్ ఫ్లో 86 వేల క్యుసెక్కులు


    ఔట్ ఫ్లో 863 క్యూసెక్కుల


    పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు


    ప్రస్తుత నీటి మట్టం 1084 అడుగులు


    నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు



    ప్రస్తుతం 66 టిఎంసీ లు


  • 20 Aug 2020 5:21 AM GMT

    నిర్మల్

    కరోనా ప్రభావం వల్లే నిరాడంబరంగా పండగల నిర్వహణ:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి*

    కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి భౌతిక దూరం పాటించడం అనివార్యం

    ప్రజలు ఒకే చోట గుమిగూడే అవకాశమున్న కార్యక్రమాలపై దేశ వ్యాప్తంగా నియంత్రణ కొనసాగుతున్నది.

    కేంద్ర ప్రభుత్వ కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి, రాష్ట్రంలో కూడా జనం ఎక్కువగా పోగయ్యే అవకాశం ఉన్న సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, బార్లు, పబ్బులు, క్లబ్బుల లాంటి వాటిని మూసేయడం జరిగింది.

    పాఠశాలలు, కళాశాలలు, క్రీడా మైదానాలు, పార్కులను కూడా తెరవడం లేదు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడడమే అతి ముఖ్యం

    సామూహికంగా నిర్వహించే కార్యక్రమాలన్నింటి పైనా నియంత్రణ కొనసాగుతున్నది.

    కరోనా వైరస్ పై పోరాడడంలో భాగంగా సామూహిక ఉత్సవాలకు అనుమతి ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాలు ఇచ్చింది.

    గత మార్చి 16 నుంచి అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను దేవాలయాల్లో కాకుండా ఎవరిళ్లలో వారే నిర్వహించుకుంటున్నారు.

    ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్, జగ్నే కీ రాత్, బోనాలు, బక్రీద్ తదితర పండుగలు సామూహికంగా కాక ఎవరిళ్లలో వారే భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

    ప్రభుత్వ పరంగా జరిపే స్వాతంత్ర్య దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా చాలా నిరాడంబరంగా, చాలా తక్కువ మందితో జరిగింది.

    ఈ నెలలో జరిగే వినాయక చవితి ఉత్సవాలను, మొహర్రంను కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

    వినాయక చవితి, మొహర్రం విషయంలో కూడా అదే స్పూర్తి కొనసాగించాలని కోరుతున్నాను.

    ఎవరిళ్లలో వారే వినాయకుడికి పూజలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

    సామూహిక ప్రార్థనలు, ఊరేగింపుల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది.

    ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని విన్నవించుకుంటున్నాను.

    కోవిడ్ నిబంధనల కారణంగా సామూహికంగా వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రం నిర్వహించుకోవడానికి, ఊరేగింపులు జరపడానికి, నిమజ్జనానికి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయడం కుదరదు.

    ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని, ఎవరిళ్లలో వారు ఉత్సవాలు, పండుగలు, మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించుకుని సహకరించగలరని సవినయంగా కోరుతున్నాను

    ప్రకటన విడుదల చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

  • 20 Aug 2020 5:20 AM GMT

    గాంధీభవన్

    మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు..

    ఉదయం సోమజిగూడా లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేశారు.

    గాంధీభవన్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు.

    టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.

Print Article
Next Story
More Stories