Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 20 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పాడ్యమి(ఉ.6-39 వరకు) తదుపరి విదియ; పుబ్బ నక్షత్రం (రా. 2-56 వరకు) తదుపరి ఉత్తర నక్షత్రం, అమృత ఘడియలు (రా. 8-51 నుంచి 10-22 వరకు) వర్జ్యం (ఉ.11-45 నుంచి 1-16 వరకు) దుర్ముహూర్తం (ఉ. 9-58 నుంచి 10-48 వరకు తిరిగి మ. 2-59 నుంచి 3-49 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 20 Aug 2020 5:11 PM GMT
లాంచీ ప్రమాదం అప్డేట్
తూర్పుగోదావరి -రాజమండ్రి
- లాంచి ప్రమాదం ఆఫ్టేడ్ ...
- చింతూరు లాంచి ప్రమాదం సుఖాంతం..
- గల్లంతైన వారందరూ క్షేమం...
- 20 Aug 2020 3:44 PM GMT
Boat Accident at Rajahmandry: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఘోర ప్రమాదం
- చింతూరు లోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ మునక
- లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం
-చీకటి కావటంతో ఎంత మంది లాంచీలో ఉన్నారో తెలియని పరిస్థితి
- ఘటనా ప్రాంతానికి చేరుకుంటున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు
- చింతూరు మండలం వరద ముంపు గ్రామం కల్లేరు లాంచిలో వెళ్ళిన రెవిన్యూ అధికారులు
- నిత్యావసరాలు బాధితులకు పంపిణీ చేసి వెనక్కి వచ్చిన లాంచీ
ఐటిడిఎ పివో వెంకటరమణ తో సహా చింతూరులో తిరిగి లాంచీ దిగిన రెవిన్యూ సిబ్బంది.
-ఆ తర్వాత లాంచీ వెనక్కి తీసుకువెళ్ళి లంగరు బ్రిడ్జి సమీపంలో వేసుకోవడానీకి మళ్ళింపు
-చీకటి కావడంతో నేరుగా బ్రిడ్జి కి ఢీకొట్టడంతో ముక్కలైన లాంచీ
- అందులో వున్న డ్రైవరు తో సహా ముగ్గురు గల్లంతు
-వారికోసం హుటాహుటీన గాలింపు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు...
- లాంచీ దుర్ఘటనలో గల్లంతైన ముగ్గురులో ఇద్దరు సురక్షితం క్షేమంగా బయటపడ్డారు.
- కచ్చులూరు వద్ద లాంచీ జలసమాధి ఘటన జరిగి ఏడాది గడవక ముందే గోదావరి వరద ఉధృతి లో మరో ప్రమాదం
- ప్రమాదానికి గురైన లాంచీ పేరు గోదావరి
- తృటిలో భారీ ప్రమాదం తప్పింది అంతకు ముందే లాంచీలో రెవిన్యూ టీం లాంచి దిగారు
- 20 Aug 2020 8:04 AM GMT
శ్రీకాకుళం జిల్లా..
జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన..
రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన వీర్రాజు..
ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు..
జిల్లా పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షులతో సమావేశమైన సోము వీర్రాజు..
పార్టీ బలోపేతం పై జిల్లా నాయకులతో చర్చ..
- 20 Aug 2020 8:04 AM GMT
అమరావతి:
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కుంభకోణాలపై విచారణ జరపాలని హై కోర్టును కోరిన పిటిషనర్లు
కేసుల తుది వాదనలను కోర్టు తిరిగి ప్రారంభం అయిన తర్వాత విచారిస్తామని తెలిపిన హైకోర్టు
2015లో దాఖలైన పిటిషన్లు కాబట్టి ప్రస్తుతం అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరంలేదని అభిప్రాయ పడిన హైకోర్టు
సెప్టెంబర్ 7 నుంచి హైకోర్టు కార్యకలాపాలు యధావిధిగా నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించిన హైకోర్టు
- 20 Aug 2020 8:04 AM GMT
కడప :
పులివెందుల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నాటుసారా కు పాల్పడుతున్న 4 వ్యక్తులు అరెస్టు.
వారి వద్ద నుంచి 340 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్న పులివెందుల పోలీసులు.
- 20 Aug 2020 6:57 AM GMT
అమరావతి
ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
అచ్చెన్న రూపాయి అవినీతి చెయ్యలేదు, కేవలం తెలంగాణాలో
అమలైన విధానాన్ని అధ్యయనం చేసి చెయ్యండి అని లెటర్ రాసినందుకు, అరెస్ట్ చేసాం అంటున్నారు అధికారులు..
ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా ?
- 20 Aug 2020 6:56 AM GMT
తూర్పుగోదావరిజిల్లా :
మామిడికుదురు మం.లో వరద బాధితుల ఆకలి కేకలు..
దొడ్డవరం త్రాగునీరు ఆహారంగానే అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు..
పడవలు కూడా ఏర్పాటు చేయకపోవడం తీవ్ర ఇబ్బందులు పడుతోన్న వరద ముంపు గ్రామాల ప్రజలు..
పడవ ఏర్పాటు చేయాలని రెవెన్యూ సిబ్బందిని నిలదీసిన గ్రామస్తులు..
- 20 Aug 2020 6:56 AM GMT
విశాఖ
వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ కామెంట్స్
జూమ్ మీటింగ్ లో బాబు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం
విశాఖ పై ఎందుకు విషము చిమ్ముతున్నారు?
విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చూస్తున్నారు
ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ప్రకటన చేసినప్పటి నుంచి కుట్రలు పన్నుతున్నారు
బాబు హయాంలో విశాఖకు ఏమి చేశారో చెప్పాలి
అమరావతి రాజధాని నిర్మాణం దేశంలో అతి పెద్ద స్కామ్
అమరావతి పేరుతో అవినీతి చేశారు.
అమరావతి ప్రాంతాల్లో లోకేష్ తో సహా టిడిపి నేతలు ఎందుకు ఒడిపోయారో బాబు చెప్పాలి?
మైసూర్ బోండాలో
మైసూర్ ఎలా ఉండదో,
అమరావతి లో అభివృద్ధి కూడా అంతే
విశాఖలో అభివృద్ధి అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి , జగన్ హయాంలో జరిగింది.
కాదని టీడీపీ నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తాను
ఆమోనియం నైట్రేట్ నిల్వలపై బాబు మాట్లాడం.. ప్రజలను భయపించే ప్రయత్నం చేస్తున్నారు
తెలుగుదేశం పార్టీ..
ట్విట్టర్, జూమ్ పార్టీగా మారింది
పరిపాలన రాజధానికి భూమి పూజ జరిగినట్లు నాకు తెలియదు
విశాఖలో స్టేట్ గెస్ట్ గౌస్ కట్టకూడదా?
- 20 Aug 2020 6:55 AM GMT
తూర్పుగోదావరి :
జలకళను సంతరించుకున్న ఏలేరు రిజర్వాయర్..
ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయి నీట మట్టానికి చేరువలో ఏలేరు జలాశయం..
నిండుకుండను తలపిస్తున్న ఏలేరు రిజర్వాయర్..
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ 24.11 టిఎంసి లు కాగా 19.27 టిఎంసిలకు చేరుకున్న నీటి మట్టం..
86.56 అడుగుల సామర్థ్యానికి 84.08 అడుగులకు చేరిన నీటి మట్టం.
ఇన్ ఫ్లో 5365 క్యూసెక్కులు.. 70 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోన్న అధికారులు.
- 20 Aug 2020 6:55 AM GMT
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
ఇళ్లపట్టాల పేరుతో భూసేకరణలో అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో పేదల భూములు లాక్కోవడం బాధాకరమన్నారు. ఇళ్ల నిర్మాణానికి అనువుగాని భూముల సేకరణ ఇంకో దుశ్చర్య అని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తడి నేలలు, ముంపు భూములు, మడ అడవులను ప్రభుత్వమే కొనడం దుర్భరమన్నారు.
రాజానగరం(తూగో) కోరుకొండ మండలం బూరుగుపూడి భూసేకరణ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. 600ఎకరాల ఆవ భూములు ఇళ్లపట్టాల కింద సేకరించారన్నారు. ఎకరం రూ45లక్షల చొప్పున రూ 270కోట్లు ఖర్చుచేశారని వెల్లడించారు. ఆవ భూముల్లోనే మొత్తం రూ 500కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లపట్టాల భూసేకరణలో సరికొత్త అవినీతికి అంకురార్పణ జరిగిందన్నారు. అధికార వైసీపీ నాయకులు స్థానిక అధికారులతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
భూసేకరణలో తొలిదశ అవినీతి.. మెరక, లే అవుట్, రోలింగ్‌లో రెండో దశ అవినీతి జరిగిందన్నారు. ఇళ్ల పట్టాలకు భూసేకరణపై సమగ్ర విచారణకు ఆదేశించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అప్పుడే అవినీతి దృష్టాంతాలు అనేకం బయట పడతాయన్నారు. సమగ్ర విచారణ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. లేఖతోపాటు వరదల్లో నీట మునిగిన ఆవభూములపై పేపర్ క్లిప్పింగ్‌లు కూడా పంపారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire