Live Updates: ఈరోజు (సెప్టెంబర్-19) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 19 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | విదియ: మ.12-34వరకు తదుపరి తదియ | హస్తనక్షత్రం ఉ.8-00 వరకు తదుపరి చిత్త | వర్జ్యం: మ.3-26 నుంచి 4-55 వరకు | అమృత ఘడియలు: రా.12-22 నుంచి 1-51 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-52 నుంచి 7-28 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-58
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిన్న అంకురార్పణతోహనం లాంచనంగా ప్రారంభం అయ్యాయి.
ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభం కానుంది.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Sep 2020 12:37 PM GMT
Neredmet Updates: నెరేడ్ మెట్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
హైదరాబాద్ :
- నెరేడ్ మెట్ లో ప్రమాదవశాత్తు నాలలో పడి మృతి చెందిన సుమేధ (12) ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసిన న్యాయవాది మామిడి వేణు మాధవ్.
- నగరంలో ఓపెన్ నాలల మృత్యు కుహరాలుగా మారుతూ పిల్లల ప్రాణాలు తీస్తూ... తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్న న్యాయవాది.
- వర్షాకాలంలో ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ ఆరోపణ.
- ఓపెన్ నాలలపై కప్పులు వేసి , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసే విధంగా.... ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించాలంటూ కమిషన్ ను కోరిన న్యాయవాది.
- 19 Sep 2020 12:35 PM GMT
Satyavathi Rathode: ఎన్నిక ఏదైనా గెలుపు టి. ఆర్.ఎస్ పార్టీదే: మంత్రి సత్యవతి రాథోడ్
- ఏ లక్ష్యం కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరేలా మనం ఈ ప్రభుత్వం వెంట నడవాలి.
- పట్టభద్రులు మరింత చైతన్యం ఉన్నవాళ్లు కాబట్టి వారిని ఓటర్స్ గా నమోదు చేసుకుంటే కచ్చితంగా మనకు మద్దతు ఇస్తారు.
- ఈ పది రోజులు ఎక్కువ దృష్టి సారించి నమోదు చేయాలి.
- సీఎం కేసిఆర్ గారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు.
- ఈ వరంగల్ నగరంలో ఐటీ కేంద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చారు.
- 19 Sep 2020 11:55 AM GMT
Sarasvati Barrage: సరస్వతి బ్యారేజ్ 30 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 117.50 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 7.58 టీఎంసీ
- ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,57,000 క్యూసెక్కులు
- 19 Sep 2020 11:53 AM GMT
Hyderabad Updates: బీజేపీ- కాంగ్రెస్ నేతలు ఉపన్యాసాలు ఇస్తారు తప్ప.. పనిలో చిత్తశుద్ధిలేదు: ఎర్రబెల్లి దయాకరరావు
- వారికి ఇంట్లో వారు కూడా ఓట్లు వేయరు..
- కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా రాకుండా అడ్డుపడుతున్న బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. వారికి MLC ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలి..
- కేంద్రం నుండి నిధులు తీసుకురాలేని బీజేపీ నేతలు ఇత్తేసిపొత్తు కలుస్తున్నారు..
- బీజేపీ నేతలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిలదీయాలి..
- బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిపాలన ఎలా ఉంది... TRS పాలిస్తున్న తెలంగాణలో అభివృద్ధి ఎలా వుందో వ్యత్యాసం గమనించండి...
- పట్టభద్రుల ఓటరునమోదు కార్యక్రమంలో TRS శ్రేణులు సైనికులవలె పనిచేయాలి..
- 19 Sep 2020 7:05 AM GMT
Minister Prashanth Reddy: ప్రతిపక్షాలవి లేనిపోని ఆరోపణలు: మంత్రి ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ : కేసీఆర్ సీఎం అయ్యాకే రైతులకు కరెంట్ కష్టాలు తీరాయి.
24 గంటలు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.
కేంద్రం తెస్తున్న విద్యుత్ సవరణ చట్టం బిల్లును సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కరెంట్ ను కేంద్రం ప్రయివేట్ చేద్దామని చూస్తోంది.
చంద్రబాబు కరెంట్ మీటర్లు తెస్తా అంటే తెలంగాణ ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు.
ఎస్సారెస్పీ పునరుజ్జివన పథకం ఊహకందనిది. ఈ పతాకంపై హేళన చేశారు.
పునరుజ్జివనం సక్సెస్ కావటంతో ప్రతి పక్షాలు నోళ్లు ముసుకున్నాయ్
కేసీఆర్ ఆలోచనతో గ్రామాల్లో వైకుంఠ దామాలు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంను తలెత్తుకొనేలా తీర్చిదిద్దుతున్నారు సీఎం కేసీఆర్.
అభివృద్ధి చేసినా ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
టీఆరెస్ ప్రభుత్వంలో ఒక్క ఎమ్మెల్యే పై కూడా అవినీతి ఆరోపణలు రాలేదు.
- 19 Sep 2020 6:47 AM GMT
Kaleshwaram: కాళేశ్వరానికి భారీగా వరద ప్రవాహం
పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ లకు భారీగా వరద ప్రవాహం...
ఎల్లంపల్లి ప్రాజెక్టు కి 15 లక్షల 50 వేల క్యూసెక్స్ ఇన్ ఫ్లో...
20 గేట్ల ని ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్న అధికారులు...
- 19 Sep 2020 6:44 AM GMT
LMD: లోయర్ మానేరు డ్యామ్ లో పెరుగుతున్న నీటి ప్రవాహం
కరీంనగర్ : లోయర్ మానేరు డ్యామ్ కి పెరిగిన వరద ప్రవాహం..
మిడ్ మానేరు నుండి 30 వేల క్యూసెక్స్..,మోయతుమ్మెద వాగు నుండి 25 వేల క్యూసెక్స్ ఇన్ ఫ్లో...
గేట్లు ఎత్తి దిగువకు 55 వేల క్యూసేక్స్ నీళ్లు విడుదల...
లోయర్ మానేరు మొత్తం కెపాసిటీ 24 టీఎంసీ లు..ప్రస్తుతం 23.5 టీఎంసీ లు..
- 19 Sep 2020 6:41 AM GMT
BJP: జుక్కల్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన
కామారెడ్డి : జుక్కల్ నియోజక వర్గంలోని అసంపూర్తి బ్రిడ్జిలను వెంటనే పూర్తి చేయాలంటూ బండ రెంజల్ గ్రామంలోని బిచ్కుంద
- బాన్స్ వాడ రోడ్డుపై బైఠాయించిన బిజెపి కార్యకర్తలు.
- జుక్కల్ నియోజక వర్గ బిజెపి పార్టీ ఇంచార్జీ,మాజీ ఎమ్మెల్యే అరుణ తారా ఆధ్వర్యంలో నిరసన.
- 19 Sep 2020 6:35 AM GMT
ఆక్సిజన్ సరఫరాపై ఎలాంటి ఆంక్షల్లేవు: కేంద్ర హోం శాఖ
ఆక్సిజన్ సరఫరాలో లోపాలు, కొరత లేకుండా చూడాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచన
రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసిన కేంద్ర హోం శాఖ
ఆక్సిజన్ సరఫరాపై ఎలాంటి ఆంక్షలు ఉండరాదని లేఖలో స్పష్టం
కరోనా చికిత్స అందించే ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసే అంశంలో ఆంక్షలు ఉండరాదని, వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచన.
రాష్ట్రాల్లో స్థానికంగా సరఫరా చేసేందుకు అన్ని అనుమతులు ఇవ్వాలి.
ఆక్సిజన్ సరఫరా సంస్థలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టంచేశారు.
రాష్ట్రాల మధ్య సరఫరాలో కూడా ఆంక్షలు వర్తించవన్నారు.
పలు నగరాల మధ్య జరిగే ఆక్సిజన్ సరఫరాలో కూడా ఎలాంటి కాలపరిమితిలేదని లేఖలో పేర్కొన్న హోం శాఖ.
- 19 Sep 2020 4:43 AM GMT
Jurala Project Upates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద 25 గేట్లు ఎత్తివేత..
మహబూబ్ నగర్ జిల్లా :
- ఇన్ ఫ్లో: 1,57,072 వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 1,60,741 వేల క్యూసెక్కులు.
- పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: 9.657 టీఎంసీ.
- ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.493 టీఎంసీ.
- పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
- ప్రస్తుత నీటి మట్టం: 318.940 మీ
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire