Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Oct 2020 3:41 PM GMT
Amaravati updates: రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నారా లోకేష్..
అమరావతి..
-రేపు కృష్ణా జిల్లా కైకలూరు,పశ్చిమగోదావరి జిల్లా ఉండి,తణుకు నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
-దెబ్బతిన్న పంటలు,నీట మునిగిన ఇళ్ళు పరిశీలించి నష్టపోయిన రైతులు,ప్రజల్ని పరామర్శించనున్న లోకేష్
- 19 Oct 2020 3:37 PM GMT
Maharashtra updates: ఎదురు కాల్పుల్లో చనిపోయిన ఐదుగురు మావోల వివరాలు వెల్లడించిన పోలీసులు..
మహారాష్ట్ర:
-గడ్చురోలి జిల్లా దానోర తాలూకా గ్యారపత్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోసమి కేసానిలి అడవి ప్రాతంలో నిన్న సాయంత్రం జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిన ఐదుగురు మావోల వివరాలు వెల్లడించిన పోలీసులు
-ఈ సంవత్సరం లో 10 మంది మావోలను మట్టుపెట్టడం జరిగింది అన్నారు.
-ఈ సంవత్సరంలో ఇదే పెద్ద సంఘటన అనిఅన్నారు.
-ఈ కుంబింగ్ లో పాల్గొన్న సి60 కమోడోస్ అభినందించిన గడ్చురోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్
-1)సుమిత &రాజో,వయసు 34 గ్రామం: ముంగనిర్,
-తాలూకా దానోర,
-ఈమె మీద 14 కేసులు
-4 లక్షలు రివార్డు
-2)కుమిలి దావీడే, వయసు23, గ్రామం: కటజీరి
-తాలూకా: దానోర
-కోర్చి దళం సభ్యురాలు
-2 కేసులు
-రివార్డు 2 లక్షలు
-3)సుమన్ &జుంకి &సుంకి వయసు32
-గ్రామము:పిసిలి బొరిగి,
-తాలూకా :ఏటపల్లి,
-జిల్లా:గడ్చురోలి
-తిపగడ్ దళం acm సభ్యురాలు,2006 నుండి పని చేస్తుంది,
-21 కేసులు,6 లక్షల రివార్డు
-4)చందా&చందన&మాకే వయసు26
-గ్రామం: బుడిగిన్:
-తాలూకా :జోగర్ గుండా
-జిల్లా బీజాపూర్
-రాష్ట్రం; ఛత్తీస్ గడ్
-15 నెంబర్ ప్లాటున్ దళ సభ్యురాలు,4 లక్షలు రివార్డు
-5)టిరా &నిలిష్&శివాజీ వయసు30
-గ్రామం: కిచోడ,
-తాలూకా :దానోర
-జిల్లా:గడ్చురోలి
-తిప్పగాడ్ దళ సభ్యుడు,20 కేసులు,2లక్షల రివార్డు
-చనిపోయినా మావోల మీద 16 లక్షల రివార్డు ఉంది
- 19 Oct 2020 3:23 PM GMT
Srikakulam updates: బలహీన వర్గాలకు టిడిపి ఎప్పుడూ అండగా ఉంటుంది...
శ్రీకాకుళం..
-అచ్చెన్నాయుడు, టిడిపి ఎపి అద్యక్షుడు..
-పార్టీ ఓడినా గెలిచినా...ఓడినా ఎప్పుడూ టిడిపితో ఉండేది బిసిలే!
-టిడిపి నియామకాల్లో 60 శాతం బిసిలకే ఇచ్చారు
-2024లో ఎన్నికలుజరిగినా...ముందు జరిగినా చంద్రబాబును సిఎం ను చేస్తాం
-రాష్ట్రం కోసం చంద్రబాబు మళ్లీ సిఎం కావాలి
-16 నెలల్లో రాష్ట్రంలో అవినీతి, దౌర్జన్యం, కక్ష సాదింపు చర్యలే
-వైసిపి పాలన కారణంగా టిడిపి క్యాడర్ భయంలోకి వెళ్లిపోయారు
-పార్టీలో అందరినీ కలుపుకుంటా....ప్రజా క్షేత్రంలో పారాడుతా
- 19 Oct 2020 3:12 PM GMT
Peddireddy Ramchandra Reddy: ఎవ్వరికీ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం..
-వరదలపై మంత్రి పెద్ది రెడ్డి సమీక్ష.......
-ఎవ్వరికీ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం
-హైదరబాద్ లో నాళాలు పై నిర్మాణాలు చేపట్టి ఇబ్బందులు పడుతున్నారు
-బలహీనంగా ఉన్న కాలువలు, చెరువులు గుర్తించి పనులు చేపడుతాం
-ముఖ్యమంత్రి కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు
-అవసరమైన నిధులు సమకూర్చి నష్ట పరిహారం చెల్లిస్తాం
- 19 Oct 2020 2:46 PM GMT
Amaravati updates: తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు..
అమరావతి :
-2018 గ్రూప్ -1 పరీక్షల నిర్వహణ అంశంపై దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ..
-అక్టోబర్ 22 లోపులో తీర్పు వెలువరించనున్న ధర్మాసనం..
- 19 Oct 2020 1:29 PM GMT
Visakha updates: గత పాలకులు బీసీలను మోసం చేశారు!
విశాఖ..
-ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కామెంట్స్
-భారతదేశంలోనే బీసిలకు పెద్దపీట వేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి.
-కలలో కూడా ఊహించని విధంగా ముఖ్యమంత్రి బీసిలకు న్యాయం చేశారు.
-తెలుగుదేశం పార్టీ నాయకులు కుక్కులులాగా మెరుగుతున్నారు.
-టిడిపిలో కుక్కులాగ ఉండలేకే వైసిపీ పార్టీకి మద్ధతు ఇచ్చాను.
- 19 Oct 2020 1:18 PM GMT
Visakha updates: రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాల అభిషేకం చేసిన నూతన కార్పొరేషన్ ఛైర్మన్లు!
విశాఖ..
-విశాఖ బీచ్ రోడ్డులో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాల అభిషేకం చేసిన నూతన కార్పొరేషన్ ఛైర్మన్లు
-హాజరైన ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్,అదీప్ రాజు,వాసుపల్లి గణేష్ కుమార్ ,వైసిపీ నాయకులు
- 19 Oct 2020 1:11 PM GMT
Srikakulam updates: సముద్రంలో దిగి గల్లంతైన సిసింద్రీ!
శ్రీకాకుళం జిల్లా..
-మందస మండలం రట్టి తీరంలో మృతదేహం లభ్యం..
-మృతుడు సిసింద్రీగా గుర్తింపు..
-నిన్న స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సముద్రంలో దిగి గల్లంతైన సిసింద్రీ..
-24 గంటలుగా సిసింద్రీ కోసం కొనసాగిన గాలింపు చర్యలు..
-సిసింద్రీ మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు..
- 19 Oct 2020 1:07 PM GMT
East godavari updates: నారా లోకేష్ కు వైసిపి కార్యకర్తల నుంచి నిరసన సెగ..
తూర్పుగోదావరి :
-పెదపూడి మం. అచ్చుతాపురత్రయం లో నారా లోకేష్ కు వైసిపి కార్యకర్తల నుంచి నిరసన సెగ..
-వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన నారా లోకేష్ ను బ్యాక్ అంటూ నినాదాలతో ఆందోళనకు దిగిన వైసిపి కార్యకర్తలు..
-పోలీసుల జోక్యంతో వెనుదిరిగిన వైసిపి కార్యకర్తలు.. సద్దుమణిగిన వివాదం..
- 19 Oct 2020 12:05 PM GMT
Weather updates: రాయలసీమలో మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
రాయలసీమ :
-ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
-రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
-ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
-అమరావతి వాతావరణ కేంద్రము
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire