ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Aug 2020 11:36 AM GMT
నిర్మల్ జిల్లా:
- బాసర రైల్వే స్టేషన్ రెండవ నెంబర్ ప్లాట్ వెనకాల ముండ్ల పొదలలో 1.5 సంవత్సరాలు గుర్తుతెలియని బాలుడి మృతదేహం లభ్యం దర్యాప్తు జరుపుతున్న బాసర పోలీసులు..
- 19 Aug 2020 11:35 AM GMT
సంగారెడ్డి:
- అరణ్య భవన్ లోఆర్థిక మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన సదాశిప పేట, సంగారెడ్డి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్స్ .
- కో ఆప్షన్ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించిన మంత్రి హరీశ్ రావు.
- 19 Aug 2020 11:31 AM GMT
నాగర్ కర్నూల్ జిల్లా:
- తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామంలో పల్లె ప్రగతి లో చేపట్టిన కార్యక్రమాలను పర్యవేక్షించిన కలెక్టర్ శర్మన్
- 19 Aug 2020 11:27 AM GMT
Lakshmi Barrage: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 94.60 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 4.050 టీఎంసీ
- ఇన్ ఫ్లో 4,58,500 క్యూసెక్కులు
- ఓట్ ఫ్లో 4,76,200 క్యూసెక్కులు
- 19 Aug 2020 9:52 AM GMT
JayaShankar Bhupallapally: సరస్వతి బ్యారేజ్ 10 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- సరస్వతి బ్యారేజ్ 10 గేట్లు ఎత్తిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 114.00 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 2.82 టీఎంసీ
- ఇన్ ఫ్లో 90,926 క్యూసెక్కులు
- ఓట్ ఫ్లో 22,500 క్యూసెక్కులు
- 19 Aug 2020 9:51 AM GMT
Warangal: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ట్రాక్టర్ ను డీ కొట్టిన బైక్..
వరంగల్ రూరల్ జిల్లా:
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ట్రాక్టర్ ను డీ కొట్టిన బైక్..
బైక్ పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు. హాస్పిటల్ కు తరలింపు..
క్షతగాత్రులు నెక్కొండ గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు...
- 19 Aug 2020 9:45 AM GMT
Jagga Reddy: అసెంబ్లీలోనే కరొనా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే సీఎం కేసీఆర్ వ్యంగంగా మాట్లాడారు!.
- అసెంబ్లీలోనే కరొనా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే సీఎం కేసీఆర్ వ్యంగంగా మాట్లాడారు!.
- అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కరొనా పై ఎలా మాట్లాడారో ప్రజలందరూ గమనించారు!.
- దేశంలో కరొనా గురించి రాహుల్ గాంధీ జనవరి లో చెప్పిన నెలకు మోడీ స్పందించారు.
- మోడీ స్పందించిన తరువాత కేసీఆర్ కరొనాను పట్టించుకున్నారు.
- టిఆర్ఎస్ ప్రభుత్వం-మంత్రులు మాటలతో టైం పాస్ చేయటం తప్ప కరొనా కట్టడికి ఎలా ప్రణాళికలు లేవు.
- తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ కి భయం లేదు- ప్రజల బలహీనతను కేసీఆర్ పట్టారు.
- ఎన్నికల ముందు 5వేలు- 10వేలు ఇస్తే ఓట్లు పడతాయి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.
- సీఎం కేసీఆర్ కు---సీఎస్ కు కనీసం హైకోర్టు అంటే కూడా భయం లేదు.
- గతంలో ఉన్న గవర్నర్ అంటే ఎవ్వరికి లెక్కలేకుండా ఉండేది అనేది అందరికి తెలుసు.
- 19 Aug 2020 9:44 AM GMT
Jeevan Reddy: కరొనా విషయంలో న్యాయస్థానం పలు సార్లు ప్రభుత్వాన్ని చురకలు అంటించింది.
- కరొనా విషయంలో న్యాయస్థానం పలు సార్లు ప్రభుత్వాన్ని చురకలు అంటించింది.
- హైకోర్టు హెచ్చరికలతో కరోనా టెస్టులు పెంచుతామని చెప్పి కనీసం సగం కూడా చేయడం లేదు.
- 40వేల టెస్టులు చేస్తామని కేబినెట్ లో చెప్పి- ఆచరణలో అమలు చేయకపోవడం దారుణం.
- ప్రైవేట్ హాస్పిటల్స్ పై వైద్యమంత్రి హెచ్చరికలు తాటాకు చప్పుళ్లకు మాత్రమే పరిమితం అయింది.
- కేంద్రంలో ఉన్న ఆయుష్మాన్ భారత్ లేదా ఆరోగ్యశ్రీ లో చేర్చాలి.
- నిరుపేద కుటుంబాలకు కొరొనా ట్రీట్మెంట్ ఉచితంగా అందించాలి.
- ర్యాపిడ్ టెస్టులు కేవలం 50శాతం కి మాత్రమే పరిమితం అయింది--ఆర్టీపీసీఆర్ టెస్టులు జిల్లాల్లో కేవలం రోజులు 30 మాత్రమే చేస్తున్నారు.
- రాజ్యాంగ అధిపతి గవర్నర్ తన ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకున్నారు కాబట్టి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.
- 19 Aug 2020 9:43 AM GMT
Bhatti Vikramarka: కరోనా విజృంభిస్తుంది అని గవర్నర్ ముందే గ్రహించి ప్రభుత్వానికి లేఖలు రాశారు.
- కరోనా విజృంభిస్తుంది అని గవర్నర్ ముందే గ్రహించి ప్రభుత్వానికి లేఖలు రాశారు.
- వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేయండి- హాస్పిటల్స్ బెడ్స్ పెంచాలని గవర్నర్ కొన్ని నెలల క్రితమే లేఖలు రాశారు.
- గవర్నర్ సూచనలను టిఆర్ఎస్ ప్రభుత్వం బేఖాతర్ చేయడం వల్ల రాష్ట్రం అంతా కొరొనా విజృంభించింది.
- కరోనా తీవ్రతను ముందే పసిగట్టి మేము ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాసాము.
- గవర్నర్ ప్రభుత్వానికి మంచి సూచనలు చేస్తే గవర్నర్ పై విమర్శలు చేయడం కరెక్టేనా..
- ప్రతిపక్షణాలను- మీడియా పై ఎదురుదాడి చేసిందే కాకా గవర్నర్ ను సైతం ఎదురిస్తారా
- టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ విలువలను బేఖాతరు చేస్తోంది.
- గవర్నర్ ప్రభుత్వం పై విమర్శలు-సూచనలు చేస్తే విలువలు ఉన్న సీఎంలు రాజీనామాలు గతంలో చేశారు.
- రాజ్యాంగం-విలువలు ఉన్న వ్యక్తి కేసీఆర్ అయితే రాజీనామా చెయ్యాలి!.
- కేసిఆర్ విలువలు లేని వ్యక్తి- కనీసం గవర్నర్ చెప్పిన సూచనలు అయినా అమలు చేయాలి.
- రేషన్ తరహాలో కరొనా బారిన పడిన బీపీఎల్ కుటుంబాలకు కరోనా చికిత్స ఉచితంగా అందించాలి.
- గవర్నర్ తన రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడటం అభినందనీయం.
- గవర్నర్ తన వ్యాఖ్యలను మాటలకే పరిమితం చేయకుండా ప్రభుత్వాన్ని అదేశించి ఆచరణలో పెట్టించాలి.
- రాజ్యాంగం సృష్టించిన అధిపతి గవర్నర్- గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సీఎం గవర్నర్ కి క్షమాపణ చెప్పాలి.
- 19 Aug 2020 9:41 AM GMT
Telangana High Court: నిలోఫర్‌లో భోజనం కాంట్రాక్టర్ అక్రమాలపై హైకోర్టు పిటిషన్
టిఎస్ హైకోర్టు:
- నిలోఫర్‌లో భోజనం కాంట్రాక్టర్ అక్రమాలపై హైకోర్టు పిటిషన్
- దర్యాప్తు జరపాలని హైకోర్టు పిటిషన్ ....
- కాంట్రాక్టర్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జరపాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ...
- తప్పుడు బిల్లులతో నిధులు దుర్వినియోగం చేశారని విచారణ నివేదిక...
- కాంట్రాక్టర్ సురేష్‌పై నివేదిక
- సమర్పించిన నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్
- ఎందుకు చర్యలు తీసుకోలేదు హైకోర్టు...
- కాంట్రాక్టర్‌ను గాంధీ, ఛాతీ ఆస్పత్రిల్లో ఎలా కొనసాగిస్తున్నారన్న హైకోర్టు...
- ఏం చర్యలు తీసుకున్నారో సెప్టెంబర్ 16లోగా నివేదిక సమర్పించాలి హైకోర్టు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire