Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 Sep 2020 6:41 AM GMT
Guntur Distrct updates: వైసీపీ అధికారంలోకి వచ్చాక, పూర్తిగా హిందు మతాన్ని టార్గెట్ చేసినట్లు కనపడుతుంది..కన్నా లక్ష్మీనారాయణ..
గుంటూరు...
బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..
-దేవాలయాలు ఆస్తులు ద్వంసం చేస్తున్నారు... ఆస్తుల అమ్మకాలు పెట్టారు...
-హిందు ధర్మం ని నిర్వీర్యం చేస్తున్నారు..
-గతంలో మతమార్పిడి ని అడ్డుకుంటే,వెనక్కి తగ్గే వాళ్ళు..ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు...పోలీసు కేసులు కూడా పట్టించుకోవటం లేదు..
-పాస్టర్లు కి 5వేలు ఇచ్చినప్పుడు కూడా ఆందోళన చేశాం..
-ఒక చర్చి పై రాళ్లు వేస్తే 40మందిని అరెస్ట్ చేసి నాన్ బెయిల్ కేసులు పెట్టారు..
-ఎన్ని ఆందోళనలు చేస్తున్న చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్లు ఉంది..
-గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా హౌస్ అరెస్టు లు చేస్తున్నారు..
-జరుగుతున్న విషయాల న్నీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నాం.....
- 18 Sep 2020 6:29 AM GMT
National updates: తిరుమల బస్సు టికెట్లపై మతప్రచారం చేసినప్పుడే ప్రభుత్వ వైఖరి బయటపడింది: సీఎం రమేశ్..
జాతీయం
సీఎం రమేశ్, బీజేపీ ఎంపీ..
-ఎవరో వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వార్డ్ చేశారని అరెస్టు చేశారు.
-విశాఖ నుంచి కర్నూలు తీసుకెళ్లి కోవిడ్ వచ్చి చనిపోయేలా చేశారు.
-ఒక చిన్న సంఘటనపై అంత పెద్దగా స్పందించిన ప్రభుత్వం, ఇన్ని పెద్ద ఘటనలు జరిగినా పట్టించుకోవడం లేదు
-షిరిడీ సాయిబాబా తల పగులగొట్టారు, నందిని ధ్వంసం చేశారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నా పట్టించుకోవడం లేదు
-ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కుంది
-ఆ క్రమంలో న్యాయం చేయమంటూ బీజేపీ నేతలు, హిందువులు నిరసన ప్రదర్శన చేపట్టాలనుకుంటే అరెస్టులు చేస్తున్నారు
-ప్రశ్నించినవారిని జైల్లో పెట్టి నోరు మూయాలని చూస్తున్నారు
-కోర్టులు మొట్టికాయలు వేసినా ఏపీ పోలీసుల తీరు మారడం లేదు
-అరెస్టు చేసిన ప్రజాప్రతినిధులను విడుదల చేయాలి, కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి
- 18 Sep 2020 6:14 AM GMT
National updates: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది: జీవీఎల్ నరసింహారావు..
జాతీయం
-హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ఒకలా, ఇతర ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగితే మరోలా స్పందిస్తోంది
-చర్చిపై 4 రాళ్లు పడ్డాయని, 41 మందిని అరెస్టు చేశారు
-అంతర్వేది రథం ఘటనపై సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారు
-ప్రభుత్వ తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశాం
-చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు హిందువులు గుర్తొచ్చారు
-టీడీపీ హయాంలోనూ హిందూ ఆలయాలపై వివక్ష కొనసాగింది
-విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు కూడా బాబు హయాంలోనే జరిగాయ
-పాకిస్తాన్‌లో అణచివేతకు గురవుతున్న హిందువులు భారత్ శరణు కోరుతున్నారు
- 18 Sep 2020 5:57 AM GMT
National updates: దేవాలయాల పై జరుగుతున్న దాడుల నిరోధానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశాం..
జాతీయం
-జీవీఎల్ నరసింహారావు, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి..
-చర్చి పై రాళ్ళు వేశారని ఆరోపణలతో అరెస్టు చేసిన 41 మందిని తక్షణమే విడుదల చేయాలి
-అంతర్వేది , అమరావతి ల పై సిబిఐ దర్యాప్తు జరపాలి
-గతంలో జరిగిన అవినీతి పైన దర్యాప్తు జరగాల్సిందే
-చంద్రబాబు హయాంలో అనేక దేవాలయాలను కూల్చి వేశారు
-పుష్కరాల సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు
-హిందూ ఉద్దరకుడిగా ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు..
- 18 Sep 2020 5:32 AM GMT
Kanaka Durgamma updates: దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా..
అమరావతి...
-కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం..
-ప్రారంభం అయ్యేవరకూ ఎలాంటి రాకపోకలకు అనుమతి లేదు.
-రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు....
- 18 Sep 2020 5:28 AM GMT
Amalapuram updates: అమలాపురం చేరుకున్న ఏమ్మేల్సీ మాధవ్...
యాంకర్:
-అంతర్వేది ఘటనలో బాద్యులను వదిలేసి, నిరసన తెలపుతున్న బీజేపీ నేతలను అరెస్టులు చేయడం దుర్మార్గం...
-రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది...
-తరుచూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలు ను దెబ్బతీస్తున్నాయి ..
-రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలకు బాధ్యత వహించాలి..
- 18 Sep 2020 5:22 AM GMT
Vijayawada Durgamma updates: దుర్గగుడి వెండి సింహాల మాయంలో కీలక పరిణామాలు...
విజయవాడ..
-విజయవాడ దుర్గగుడిలోని రథం వెండి సింహాల మాయం విషయంలో పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే.
-ఉత్సవం సమయంలో మాత్రమే రథాన్ని బయటకు తీస్తామని, మిగతా సమయంలో రథం ఆలయంలోపలే ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
-గత 18 నెలలుగా రథాన్ని బయటకు తీయలేదని అధికారులు చెప్తున్నారు.
-రథంలోని వెండి సింహాలు ఎప్పుడు మాయం అయ్యాయి, ఎలా మాయం అయ్యాయి అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభము.
-ఈ విచారణ పోలీసులకు సవాల్ గా మారింది
-ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆధారాల సేకరణకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు
-పోలీసుల ఫిర్యాదు కంటే ముందే అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వెండి రథాన్ని సందర్శించారు.
-దీంతో వేలి ముద్రలు, డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితులను కనుగొనడం కష్టంగా మారుతుంది.
-ఆలయ అప్రైజర్ షమ్మీ, ఏఈవో రమేష్ లను పోలీసులు ఇప్పటికే విచారించారు.
-ఈరోజు మరికొందరు ఉద్యోగులు, ఆలయ సెక్యూరిటీని విచారించే అవకాశం.
- 18 Sep 2020 4:58 AM GMT
East Godavari updates: అమలాపురం పట్టణంలో పూర్తి కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది..
తూర్పుగోదావరి..
-బీజేపీ 'ఛలో అమలాపురం' పిలుపునివ్వడంతో పోలీసులు అమలాపురం వైపు వచ్చేరహదారులన్నిటినీ అదుపులోనికి తీసుకున్నారు.
-పట్టణంలోనికి ఇతర వ్యక్తులు రాకుండా భారీ గేట్లను ఏర్పాటు చేశారు.
-అమలాపురంతో పాటు కోనసీమలోకి వచ్చే రహదారుల వద్ద కూడా పోలీసులు చెక్ పోస్టులు పెట్టీ తనిఖీలు చేస్తున్నారు.
- 18 Sep 2020 4:53 AM GMT
Antarvedi updates: అంతర్వేది లక్ష్మీనరశింహస్వామీ రధం దగ్ధమైన ఘటనకు నిరసనగా ఛలో అమలాపురం నకు పిలుపునివ్వడంతో కాకినాడలో పలువురు బిజేపి నేతల హౌస్ అరెస్ట్..
తూర్పుగోదావరి :
-కాకినాడలో మాజీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న గృహ నిర్భంధం..
-రూరల్ మండలంలో బిజేపి అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ, రంభాల వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి రవికిరణ్ లను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..
-నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న బిజేపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు వేటుకూరి సూర్యనారాయణరాజు..
-గన్ మ్యాన్ ను కాకినాడలో విడిచిపెట్టి అజ్ఞాతంలో వెళ్లిన ఎమ్మెల్సీ మాధవ్, అమలాపురంలో రహస్యం ప్రాంతంలో ఉన్నట్టు అనుమానిస్తోన్న పోలీసులు.
- 18 Sep 2020 4:49 AM GMT
Prakasam updates: జిల్లా జాయింట్ కలెక్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ..
ప్రకాశం జిల్లా..
-జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట మురళీకృష్ణ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.
-హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న జేసి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire