Live Updates: ఈరోజు (18 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 18 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | విదియ రా.09-05 వరకు తదుపరి తదియ | స్వాతి నక్షత్రం మ.12-41 వరకు తదుపరి విశాఖ | వర్జ్యం: సా.05-55 నుంచి 07-24 వరకు | అమృత ఘడియలు రా.02-52 నుంచి 04-25 వరకు | దుర్ముహూర్తం: సా.04-03 నుంచి 04-50 వరకు | రాహుకాలం: సా.04-30 నుంచి 06-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 Oct 2020 12:52 PM GMT
Hyderabad updates: నాయిని నర్సింహారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు: తలసాని శ్రీనివాస్ యాదవ్..
హైదరాబాద్..
-జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ని పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
-నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
- 18 Oct 2020 12:45 PM GMT
Sidhipeta updates: బిజెపి పార్టీల నుండి టిఆర్ఎస్ లో చేరిక..
సిద్దిపేట జిల్లా..
దుబ్బాక మండల కేంద్రంలో స్థానిక రెడ్డి ఫంక్షన్ హాలులో మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ సమక్షంలో హబ్సీపూర్, ధర్మాజీపేట గ్రామానికి చెందిన సుమారు రెండు వందల మంది కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి టిఆర్ఎస్ లో చేరిక.
హరీష్ రావు కామెంట్స్..
- మీ అబద్దపు ప్రచారాలన్ని రేపటి నుంచి ఎల్ఇడి స్ర్కిన్ పెట్టి ఊరూరు ప్రచారం చేపిస్త్ం
- ఎనుకట చంద్రబాబు మీటర్లు పెడుత నంటే జనమంతా ఆయనకు మీటర్లు పెట్టిండ్రు
- ఇప్పుడు బిజెపి కి కూడా అదేవిధంగా మీటర్లు పెడుతారు
- మీ పార్టీ కార్యకర్తలే మీరు ప్రవేశపెట్టే మీటర్ల బిల్లు ను వ్యతిరేకించిండ్రు
- 18 Oct 2020 12:37 PM GMT
Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ వరద ప్రవాహం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-28 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 117.10 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 6.82 టీఎంసీ
-ఇన్ ఫ్లో 1,35,,000 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 1,26,000 క్యూసెక్కులు
- 18 Oct 2020 12:33 PM GMT
Kotha Prabhakar Reddy: మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేది trs నాయకులే..
సిద్దిపేట:
కెసిఆర్ తోనే అభివృద్ధి..
- చేగుంట మండలంలో TRS ఎన్నికల ప్రచారం..
- ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..
- బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు గుడి కట్టిస్తాం, గోడ కట్టిస్తాం అంటూ... ఎన్నో మాటలు చెప్తారు
- అలాంటి వారి మాటలు నమ్మొద్దు.. వాళ్ళు గెలిచేది లేదు.. ఎం లేదు
- త్రాగు నీరు అందించాం... సాగు నీరు కూడా వస్తుంది
- ఇంకా అభివృద్ధి చేసుకుందాం
- సుజాతక్క మీ ముందుకు వచ్చింది.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి
- 18 Oct 2020 12:23 PM GMT
Padma Devender Reddy: మీకు అందుబాటులో ఉంటా.. సేవ చేసే అవకాశం కల్పించండి..
సిద్దిపేట:
-కెసిఆర్ తోనే అభివృద్ధి
- మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు
- మీ రామలింగారెడ్డి లాగే అభివృద్ధి చేస్తా
- ఆయనపోయి నన్ను ఆగం చేసిండు
- కెసిఆర్ ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చాను..
- దుబ్బాకను కెసిఆర్ సహకారంతో రామలింగారెడ్డి అభివృద్ధి చేశాడు
- మంత్రి హరీష్ రావు, mp ప్రభాకర్ రెడ్డి ల అండదండలతో అభివృద్ధి చేస్తాను
- కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించండి
- trs అభ్యర్థి సోలిపేట సుజాత గారు
- ముళ్ల చెట్టుకు నీళ్లు పోసి.. పండ్లు ఇవ్వమంటే ఇస్తదా?
- అధికారంలో ఉంది కెసిఆర్.. అభివృద్ధి చేసేది కెసిఆర్
- పింఛన్ లు ఇస్తూ.. కెసిఆర్ ప్రతి ఇంట పెద్ద కొడుకు అయ్యాడు
- రైతులను ఆర్థికంగా ఎదిగేలా కెసిఆర్ చూస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడ్తరట
- వాళ్లకు ఓటుతో సమాధానం చెప్పే రోజు వచ్చింది
- బీజేపీ, కాంగ్రెస్ పాలించే రాష్ట్రములో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు
- రైతులను రాజును చేయాలనే సంకల్పంతో కెసిఆర్ ముందుకెళ్తున్నారు
- పుట్టడు దుఃఖంతో సుజాతక్క మీ ముందుకు వచ్చింది.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి
- 18 Oct 2020 12:13 PM GMT
Sangareddy updates: అల్లికుంట వాగులో విషాదం..
సంగారెడ్డి:
-కంది మండలం ఎర్దనూర్ లోని అల్లికుంట వాగులో పడి కొట్టుకపోయిన వడ్డే పోచయ్యా అనే వృద్దుడు..
-వాగు ఉదృతి చుసేందుకు వెల్లి కాలు జారి పడ్డ వృద్దుడు..
-ఘటనా స్థలానికి చెరుకున్న పోలుసులు
- 18 Oct 2020 12:06 PM GMT
Rangareddy updates: ఇసుక ఫిల్టర్లపై శంషాబాద్ ఎస్ఓటి పోలీసుల దాడులు..
రంగారెడ్డి జిల్లా:
-ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి వాగులో..
-మూడు ట్రాక్టర్లు సీజ్
-ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు..
-ఇసుకను ట్రాక్టర్లలో ఫిల్టర్ చేస్తుండగా రెడ్ హ్యాండేడుగా పట్టుకున్న పోలీసులు.
- 18 Oct 2020 12:01 PM GMT
Hyderabad Latest news: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం...
హైదరాబాద్..
-చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్డింగ్ ఐదవ అంతస్తు పై నుండి దూకి వివాహిత శ్రీవిద్య (27) ఆత్మహత్య.....
-ఆరు నెలల క్రితం వరంగల్ కు చెందిన శబరిష్ తో కరీంనగర్ కు చెందిన శ్రీవిద్యకు వివాహం జరిగింది....
-భర్త శబరిష్ పని నిమిత్తం బెంగళూర్ కు వెళ్లడంతో చందానగర్ లోని వారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లిన శ్రీవిద్య....
-నిన్న మధ్యాహ్నం భర్త శబరిష్ తో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఘర్షణ పడి భవనం పై నుండి దూకిన శ్రీవిద్య....
-హుటాహుటిన గాయాల పాలైన శ్రీవిద్య ను ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించిన కుటుంబ సభ్యులు...
-ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీవిద్య....
-భర్త శబరిష్ వేధింపులు శ్రీవిద్య ఆత్మహత్యకు కు కారణమని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు....
-శ్రీవిద్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించిన పోలీసులు....
-కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న చందానగర్ పోలీసులు....
- 18 Oct 2020 4:55 AM GMT
Mahabubabad updates: డోర్నకల్ మండలం చిలకోయలపాడులో ఆర్దరాత్రి నల్లబెల్లం పట్టివేత!
మహబూబాబాద్ జిల్లా..
-గుడుంబా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం సుమారు వంద బస్తాలు
-ఆంధ్రా నుండి చిలుకోయలపాడు గ్రామానికి DCM వాహనంలో తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్న. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ సిఐ టిటి శ్రీనివాస్ ఎస్ఐ బిక్షపతి అండ్ సిబ్బంది
- 18 Oct 2020 4:31 AM GMT
Rajanna Sirisilla updates: స్వామివారి ఆలయం లో రెండో రోజు వేడుకలు...
రాజన్నసిరిసిల్ల జిల్లా..
-శ్రీ దేవి శరన్నవరాత్రులు సందర్భంగా
-వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయం లో రెండో రోజు వేడుకలు
-బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
-స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
-శ్రీ రాజరాజేశ్వరిదేవి కి శ్రీసూక్తం శ్రీ దుర్గా సూక్తం ద్వారా లలిత సహస్ర నామ అష్టోత్తర శతనామ సహిత చత్యుస్ట ఉపచార పూజ నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire