Live Updates: ఈరోజు (18 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (18 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

తాజా వార్తలు
Show Full Article

Live Updates

  • 18 Nov 2020 1:51 PM GMT

    Gandhi Bhavan Updates: జిహెచ్ఎంసి ఎన్నికలు చూస్తుంటే దొరల పాలనలా ఉంది...

    -రాములు నాయక్ @ గాంధీ భవన్

    -హైదరాబాద్ లో జిహెచ్ఎంసి ఎన్నికలు చూస్తుంటే దొరల పాలనలా ఉంది

    -ఎవరికీ సరిగా సమయం ఇవకుండ తమ ఇష్టానుసారంగా ఎన్నికలను ఇర్వహిస్తున్నరు

    -వరదల పేరు మీద 10 వేలు ఇచ్చి ఓటు కొనుకుంటున్నరు

    -మీ సేవ కేంద్రాల వద్ద జనాలు కోట్టుకుంటున్నా పరిస్తితి

    -పైగా అప్లై చేయదానికి రూ. 300 కర్చు అవుతుంది

    -ప్రభుత్వం ప్రజల నిసహయతను ఓట్ల రూపంలో వాడుకుంటుంది

    -ఈ ప్రభుత్వం లో ప్రజా పాలన లేదు దోరల పాలన ఉంది.

    -Ghmc ఎన్నికలు తెరాస కి గుణపాఠం చెప్పాలి

    -కాంగ్రెస్ కి ఓటువేసి గెలిపించండి

    -గతంలో కాంగ్రెస్ ఎన్నో అభివ్రుది పనులు చేసింది దీనిని దృష్టి లో పెట్టు వలసిందిగా కోరుతున్నరు

  • Komatireddy Venkat Reddy: ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి...
    18 Nov 2020 1:43 PM GMT

    Komatireddy Venkat Reddy: ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి...

    -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ ప్రెస్ రిలీజ్

    -వరద బాధితులు ఇంటి దగ్గరే ఉండండి మీ ఇంటి దగ్గరకే వచ్చి డబ్బులు ఇస్తామని కేటీఆర్ చెప్పారు

    -ఇప్పటి వరకు చాలా మంది వరద బాధితులకు డబ్బులు రాలేదు

    -మీ సేవ దగ్గర వందల సంఖ్యలో q లైన్ లు కడుతున్నారు

    -ఉదయం నుండి రాత్రి వరకు లైన్లో నిలబడ్డ చాలా మంది అప్లికేషన్స్ ను స్వీకరించడం లేదు

    -Q లైన్ లో వృద్ధులు, వికలాంగులు,చిన్న పిల్లల తల్లులు ఉంటున్నారు

    -చాలా మంది లైన్ లో నిలబడి సొమ్ము జిల్లిపోయి కింద పడుతున్నారు

    -లైన్ లో నిలబెట్టి ప్రజలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం అవమనపరిస్తుంది

    -ప్రజలను అవమనపర్చే హక్కు టి ఆర్ ఎస్ కు ఎవరు ఇచ్చారు

    -తక్షణమే ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ క్షేమపన చెప్పాలి

    -టి ఆర్ ఎస్ ఇచ్చే డబ్బులు ఏ ములకు సరిపోవు

    -Mim ను అడ్డుపెట్టుకొని టి ఆర్ ఎస్ గెలవాలని చూస్తుంది

    -టి ఆర్ ఎస్ కు ghmc ప్రజలు బుద్ది చెప్పుతారు

  • Kishnareddy Comments: బీజేపీ ఉన్నంత వరకు ఆసుదుద్దీన్ ఒవైసీ ని అడ్డుకుంటుంది..
    18 Nov 2020 12:31 PM GMT

    Kishnareddy Comments: బీజేపీ ఉన్నంత వరకు ఆసుదుద్దీన్ ఒవైసీ ని అడ్డుకుంటుంది..

    -అంబర్ పేట నియోజకవర్గ టీఆరెస్ నాయకులు బీజేపీ లో చేరిక......

    -కత్తుల సుదర్శన్, శ్రీలతలకు కండువా కప్పి ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

    -తెలంగాణ లో మార్పు రావాలని జిహెచ్ఎంసి లో బీజేపీ జెండా ఎగురాలని ప్రజలు భానిస్తున్నారు..

    -ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆసుదుద్దీన్ రావాలని తాపత్రయ పడుతున్నాడు...

    -ఆసుదుద్దీన్ సీఎం కుర్చీలో కూర్చోవాలని తహతహలాడుతున్నాడు..

    -టీఆరెస్ పార్టీ లో కీలకపాత్ర పోషిస్తూ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం లో ఉన్న కత్తుల సుదర్శన్, శ్రీలత లకు బీజేపీ లోకి స్వాగతం పలుకుతున్నా..

    -కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

  • 18 Nov 2020 11:50 AM GMT

    Komaram Bheem District Updates: ప్రజలను వెంటాడిన పెద్దపులి..పరుగులు తీసిన గిరిజన గ్రామాల ప్రజలు..

    కొమురం భీం జిల్లా:

    * బెజ్జూర్ మండలం లోని ఏటి గూడ వద్ద రహదారిపై దర్జాగా నిలబడి ప్రయాణికులను వెంటాడిన పెద్దపులి ప్రజలు పరుగులు తీయడంతో ఇద్దరు కిందపడిపోయిన    సంఘటన చోటుచేసుకుంది .

    * పరుగులు తీస్తూ చెట్టు ఎక్కడంతో ప్రాణాలతో బయటపడ్డ యువకులు ప్రయాణం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు.

    * కమ్మర్గాం గుండె పల్లి గ్రామాల నుండి బెజ్జూర్ మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

  • Thummala Nageswara Rao Comments: వ్యక్తిగతంగా నాపైన సోషల్ మీడియాలో చేస్తున్న దృష్ప్రచారాన్ని కండిస్తున్నా...
    18 Nov 2020 11:19 AM GMT

    Thummala Nageswara Rao Comments: వ్యక్తిగతంగా నాపైన సోషల్ మీడియాలో చేస్తున్న దృష్ప్రచారాన్ని కండిస్తున్నా...

     మాజీ మంత్రి తుమ్మల కామెంట్స్.

    - గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నాపైన సోషల్ మీడియాలో చేస్తున్న దృష్ప్రచారాన్ని కండిస్తున్నా..

    - రాజకీయ లబ్ధికోసం, స్వలాభం కోసం కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారం విషయంలో ఈరోజు ఆడిషన్ సీపీ పూజ గారికి పిర్యాదు చేశారు.

    - నీచ రాజకీయాలు పాల్పడుతూ, వ్యక్తిగత ప్రతిష్ట ను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని గుర్తించాలని కోరారు.

    - ముఖ్యమంత్రి నేను ఓడిపోయినా మంత్రిపదవి ఇచ్చి నన్ను ఆదరించారు. నేను ముఖ్యమంత్రి సహకారంతో మంత్రిగా ఖమ్మం అభివృద్ధికి కృషి చేశాను.

    - ఖమ్మం పట్టణానికి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి, గోల్లపాడు ఛానల్ ఆధునీకరణ, దంసులాపురం రైల్వే బ్రిడ్జి, ఇంటింటికీ తాగు నీరు ఇచ్చి ఖమ్మం అభివృద్ధికి     కృషి చేసాను.

    - కొంతమంది స్వార్థ పర శక్తులు పార్టీనీ, ప్రభుత్వాన్ని కించపరిచే వారు, తన పైన వున్న అక్కసుతో ఇటువంటి పనులు చేస్తున్నారు.

    - అదృష్టం వల్లనో, కలిసొచ్చే పదవులు పొందిన వారు నీచమైన ఇటువంటి ప్రచారానికి పాల్పడుతున్నారు. అది వారి రాజకీయ జీవితానికి మంచిది కాదు.    ఇకనైనా అటువంటి చర్యలకు పాల్పడొద్దు.

    - తాను కేసిఆర్ నాయకత్వంలో పనిచేస్తూ హైదరాబాద్,ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసా విజయానికి కృషి చేస్తాను.

  • GHMC Updates: జిహెచ్ఎంసి ఎన్నికల కు బీజేపీ ఇంచార్జి ల నియామకం..
    18 Nov 2020 11:09 AM GMT

    GHMC Updates: జిహెచ్ఎంసి ఎన్నికల కు బీజేపీ ఇంచార్జి ల నియామకం..

    జిహెచ్ఎంసి ఎన్నికల కు బీజేపీ 24 అసెంబ్లీ పరిధిలోకి ఎన్నికల ఇంచార్జి ల నియామకం..

    1.ఎల్బీనగర్ - సంకినేని వెంకటేశ్వర రావు

    2.మహేశ్వరం - యెన్నం శ్రీనివాస్ రెడ్డి

    3.రాజేంద్రనగర్ - వన్నల శ్రీరాములు

    4.శేరిలింగంపల్లి -ధర్మపురి అరవింద్

    5.ఉప్పల్-ధర్మారావు

    6.మాల్కజిగిరి -రఘునందన్ రావు

    7.కుత్బుల్లాపూర్ - చాడ సురేష్ రెడ్డి

    8.కూకట్ పల్లి - పెద్దిరెడ్డి

    9. పటాన్ చేరు - పొంగులేటి సుధాకర్ రెడ్డి

    10. అంబర్పేట్ - రేవూరి ప్రకాశ్ రెడ్డి

    11.ముషీరాబాద్ - జితేందర్ రెడ్డి

    12.సికింద్రాబాద్ - విజయరామ రావు

    13.కంటోన్మెంట్ - శశిధర్ రెడ్డి

    14.సనత్ నగర్ - మోత్కుపల్లి నర్సింహులు

    15.జూబ్లీహిల్స్- ఎర్ర చంద్ర శేఖర్

    16.ఖైరతాబాద్ - మృత్యుంజయ

    17.నాంపల్లి - సాయం బాపురావు

    18.చార్మినార్ -కాసిపేట లింగయ్య

    19.గోశామహల్ - యెండల లక్ష్మీనారాయణ

    20.కార్వాన్ - బొడిగే శోభ

    21.మలక్ పేట - విజయపాల్ రెడ్డి

    22.యకత్ పుర - రామకృష్ణ రెడ్డి

    23.చాంద్రాయణగుట్ట - రవీంద్ర నాయక్

    24.బహదూర్ పుర - సుద్దాల దేవయ్య..

  • 18 Nov 2020 5:38 AM GMT

    Telangana Updates: బీజేపీ లో ఫలిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతల మంత్రాంగం..

    - మాజీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ లో బలమున్న నేతలతో చర్చలు.

    - రేపు ఎల్లుండి లోపు కాషాయ గూటికి మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు.

    - కీలక నేతల పై దృష్టి పెట్టిన అర్వింద్...

    - వారిని గ్రేటర్ ఎన్నికలోపే బీజేపీ లో చేర్చి మరింత బలం పెంచుకునే ప్రయత్నం లో బీజేపీ.

  • Hyderabad Updates: హైదరాబాద్ లో మెట్రో రైలు లో సాంకేతిక లోపం..
    18 Nov 2020 5:35 AM GMT

    Hyderabad Updates: హైదరాబాద్ లో మెట్రో రైలు లో సాంకేతిక లోపం..

    హైదరాబాద్ 

    - మియా పూర్ ఎల్ బి నగర్ రూట్ లో ఆగి పోయిన మెట్రో రైలు

    - దాదా పు 15 నిమిషాల పాటూ ఆగిన మెట్రో రైలు సేవలు

  • Hyderabad Updates: కాంగ్రెస్ సీనియర్ నేతల అలక...
    18 Nov 2020 5:34 AM GMT

    Hyderabad Updates: కాంగ్రెస్ సీనియర్ నేతల అలక...

       హైదరాబాద్ 

    - గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పార్టీ కార్యక్రమాలకు దూరం.

    - నిన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల కమిటీ సమావేశానికి డుమ్మాకొట్టిన అంజన్.

    - బీజేపీ గ్రేటర్ ఎన్నికల ఇంచార్జ్ గా భూపెందర్ యాదవ్ రావడంతో కాంగ్రెస్ లో ఉన్న యాదవ్ లాంత బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం.

    - ఇప్పటికే శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ కు రాజీనామా.

    - అంజన్ అదే బాటలో నడుస్తాడా అనే చర్చ రాజకీయవర్గాలలో కొనసాగుతుంది.

    - మరి కొంత మంది యాదవ్ నేతలను బీజేపీ వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్న కమలం పార్టీ

  • 18 Nov 2020 5:12 AM GMT

    Mulugu District Updates: వెంకటాపూర్ మండలంలో షిఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ కు ఢీ...

      ములుగు జిల్లా:

    - వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామం టోల్ గేట్ దగ్గర షిఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ కు ఢీ.....

    - ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు....

    - 108 సహాయంతో ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమం....

Print Article
Next Story
More Stories