Live Updates
- 18 Nov 2020 4:26 AM GMT
Amaravati Updates: మరింత ముదురుతున్న ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వ్యవహారం...
అమరావతి...
* సీఎస్ లేఖతో ఎస్ఈసీ నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్సు నిర్వహాణపై సందిగ్దత.
* ఎస్ఈసీ నిమ్మగడ్డకు.. సీఎస్ లేఖతో వీడియో కాన్ఫరెన్సుకు అధికారులు హాజరయ్యే అవకాశం లేదంటున్న ప్రభుత్వ వర్గాలు.
* వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని ఇప్పటికే ఎస్ఈసి కి లేఖ రాసిన సియస్ నీలం సాహ్ని.
* వీడియో కాన్ఫరెన్స్ నిర్వహాణపై మరిన్ని సంప్రదింపులకు సిద్దమని సీఎస్ స్పష్టీకరణతో ఆసక్తిగా మారిన వ్యవహరం.
* ప్రభుత్వం తీరును కోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎస్ఈసీ.
- 18 Nov 2020 4:24 AM GMT
Krishna District updates: శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం లో ప్రత్యేక పుష్ప అలంకరణ..
కృష్ణాజిల్లా
- నాగులచవితి పర్వదినం సందర్భంగా జనసంద్రమైన మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం
- రాష్ట్ర నలుమూలల మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో స్వామివారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు ..
- స్వామివారికి పంచామృత అభిషేకాలు పంచహారతులు ఘనంగా నిర్వహించిన ఆలయ వేదపండితులు
- ఉదయం రెండు గంటల 30 నిమిషాలకు స్వామివారి కి తొలి పూజ చేసి నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్నా రాష్ట్ర వ్యవసాయ శాఖఉపాధ్యక్షులు MVS నాగిరెడ్డి దంపతులు.. శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు దంపతులు....
- 18 Nov 2020 4:15 AM GMT
Kurnool District Updates: పగిడ్యాల మండలం ప్రాతకోటలో ఉద్రిక్తత...
కర్నూలు...
- వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి సిధార్థ రెడ్డి , ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయుల మధ్య ఘర్షణ
- నీళ్ల ట్యాంక్ లో మూత్ర విసర్జన చేశాడని సిద్దార్థ రెడ్డి వర్గానికి చెందిన యువకులపై దాడి చేసిన ఎమ్మెల్యే వర్గీయులు...
- పాతకక్షలు మనసులో పెట్టుకొనే కొట్టారని పోలీసులకు పిర్యాదు చేసిన సిద్దార్థరెడ్డి వర్గీయులు..
- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు
- 18 Nov 2020 3:55 AM GMT
Amaravati Updates: పోలవరం ఎత్తును కూడా తగ్గించే వాడని ప్రస్తుత కలవరింతలకు అర్థం...
అమరావతి....
- ట్విటర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- తగ్గించడం అంటే...జెన్కో థర్మల్ కేంద్రాల సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేట్ కరెంటు కొనుగోళ్లకు వేల కోట్లు దోచిపెట్టిడం.
- పంట రుణాలు టోటల్ గా మాఫీ చేస్తానని గెల్చి ‘ఛా...నేనలా అనలేద’ని పరిమితిని తగ్గించి మోసం చేయడం.
- 18 Nov 2020 3:49 AM GMT
Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..
విజయవాడ..
రామకృష్ణ.
- నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘాలు మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేశాయి.
- రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేయండి.
- రు.450 కోట్లు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇతర రంగాలకు మళ్ళించారు.
- గత 18 నెలలుగా ఇసుక కొరత, కరోనాల వల్ల పనులు లేక కార్మికులు అవస్థలు పడుతున్నారు.
- దిక్కుతోచని స్థితిలో కార్మికులు జేఏసీగా ఏర్పడి ఆందోళనకు సిద్ధమయ్యారు.
- సంక్షేమ బోర్డు నిధులను వినియోగించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి.
- 18 Nov 2020 3:45 AM GMT
Anantapur District Updates: జిల్లా లో 11 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ...
అనంతపురం:
* నాడు నేడు పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించినట్లు గుర్తించిన ప్రోగ్రెస్ మానిటరింగ్ యూనిట్ బృందం.
* పనుల్లో లోపాలు, ఆర్థిక తప్పిదాలు గుర్తింపు. స్టాక్ రిజిస్టర్ నిర్వహించకపోవడం వంటివి బాధ్యతారహితంగా భావించిన ప్రభుత్వం.
* జిల్లాలో 11,255 పాఠశాలల్లో రూ.330.56 కోట్ల అంచనాతో నాడు నేడు పనులు
- 18 Nov 2020 3:40 AM GMT
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
తిరుమల సమాచారం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 29,608 మంది భక్తులు.
- తలనీలాలు సమర్పించిన 10,137 భక్తులు.
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు.
- నాగులచవితి సందర్భంగా ఇవాళ సాయంత్రం పెద్దశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి
- 18 Nov 2020 3:37 AM GMT
Anantapur Updates: నేటి నుంచి పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలు....
అనంతపురం:
- నేటి నుంచి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో సత్యసాయి 95వ జయంతి వేడుకలు
- కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ట్రస్టు వర్గాలు.
- ఇవాళ వేణుగోపాల స్వామి రథోత్సవం, సాయి కుల్వంత్ హాలు లో సత్యసాయి మహా సమాధి వద్ద సాయి భక్తి గీతాలతో వేడుకలు ప్రారంభం.
- సీతారామ స్వామి కళ్యాణంతో పాటు సాయి సత్యనారాయణ వ్రతం చేపట్టనున్న ట్రస్ట్
- పెద్ద సంఖ్యలో పుట్టపర్తికి తరలివచ్చిన దేశ, విదేశీ భక్తులు
- 18 Nov 2020 3:32 AM GMT
Amaravati Updates: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సియస్ నీలం సాహ్ని లేఖ...
అమరావతి..
- ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సియస్ నీలం సాహ్ని లేఖ.
- రాష్ట్రంలో ఉన్న కరోన కేసుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేసిన సియస్.
- లేఖలో సియస్ నీలం సాహ్ని:
- కరోన కట్టడికి రాష్ట్రాలు వివిధ వ్యూహాలు రచించాయి.
- ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ని అంచనా వేయడం సరికాదు.
- చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది.
- ఇప్పటికే రాష్ట్రంలో 6890 మంది కరోనాకు బలయ్యారు.
- మరోసారి కరోన ప్రబలేలా చర్యలు తీసుకునేందుకు మేము ముందుకు వెళ్లలేము.
- ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలకు కరోన వ్యాపించడం ప్రాణాంతకం.
- ఇప్పటికే పరిపాలన సిబ్బంది, పోలీస్ సిబ్బంది,వివిధ శాఖలు, కరోన కట్టడికి కృషి చేస్తున్నారు.
- స్థానిక సంస్థల నిర్వహణకు పరిస్థితి అనుకూలించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణపై సమాచారం ఇస్తాం
- రాష్ట్ర ప్రజల ఆరోగ్యం,భద్రత దృష్ట్యా ఫలానా సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అని అనుకోవడం సరైన నిర్ణయం కాదు.
- దయచేసి ఎన్నికల నిర్వహణపై మీ నిర్ణయాన్ని పునరాలోచన చెయ్యాలి.
- నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి తీసుకువచ్చారు
- ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని మేము భావిస్తున్నాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire