Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 Aug 2020 10:21 AM GMT
విజయవాడ:
- విచారణలో న్యాయమూర్తి, నాట్ బిఫోర్ మీ అంటూ కేసును వేరే బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశం
- స్వర్ణప్యాలెస్ ప్రమాదంలో పోలీసులు పెట్టిన కేసు కొట్టేయలని డా.రమేష్ హైకోర్టులో పిటిషన్
- తుది విచారణ పూర్తయ్యే వరకు ఏ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన డా.రమేష్
- 18 Aug 2020 10:21 AM GMT
కోరుకొండ:
- ముంపు ప్రాంతాల పరిశీలన నేపథ్యంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
- తూర్పు గోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
- అమరావతి బయలుదేరేందుకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్.
- 18 Aug 2020 9:40 AM GMT
విజయవాడ:
- ఈరోజు సాయంత్రం మీడియా ముందుకు పటమట కారులో హత్యాయత్నం కేసు నిందితుడు
- రియల్ దంధా నేపథ్యంలో ఏం జరిగిందో తెలపనున్న డీసీపీ
- తహసీల్దారు ఎవరు, అసలు తహసీల్దారు ప్రమేయం ఉందా అనే ప్రశ్నలకు రానున్న సమాధానం
- 18 Aug 2020 9:39 AM GMT
క్రీడలు:
- ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ dream11.
- 250 కోట్ల రూపాయలకు టైటిల్స్ స్పాన్సర్షిప్ హక్కులను చేజిక్కించుకున్నారు డ్రీమ్11 ల
- 18 Aug 2020 9:38 AM GMT
ఏపీ ప్రభుత్వానికి ఇళ్ల పట్టాల విషయంలో మరో షాక్
అమరావతి:
- ఏపీ ప్రభుత్వానికి ఇళ్ల పట్టాల విషయంలో మరో షాక్
- ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
- 8 వారాల తరవాత తదుపరి విచారణ కు వాయిదా
- విశాఖ జిల్లా తిరుమల గిరి ట్రైబల్ పాఠశాల స్థలం ఇళ్ల పట్టాలుగా ఇవ్వటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టు స్టే ఆదేశాలు
- 18 Aug 2020 9:37 AM GMT
మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్...
తూర్పు గోదావరి:
పెద్దాపురం: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్...
- గోదావరి జిల్లాలో వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాకపోకలు స్థంబించి, కరెంటు లేక ప్రజల పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. పంటలు నీటమునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఒకవైపు కరోనాతో అల్లాడుతున్న ప్రజలపై, ఈ వరద ముంపు ఊహించని ఉపద్రవంగా పరిణామించింది.
- ముఖ్యంగా విలీనా మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూనవరం, విఆర్ పురం, చింతూరి, ఎటపాక మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
- దేవీపట్నం మండలంలోనే వేలాది ఇళ్లు నీట మునిగాయి.
- వందలాది గ్రామాలు వరద నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.
- కోనసీమలో లంక గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అనేక గ్రామాలు నీటమునిగాయి. కాజ్ వేలు మునిగిపోయి రహదారులు నీటమునిగాయి.
- కావున జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించి ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ దళాల ద్వారా సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలి. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలి. తాగునీరు, భోజనం, విద్యుత్ వసతులు కల్పించాలి.
- అంటువ్యాధులు ప్రబలకుండా సరైనా వైద్యం అందించాలి. పారిశుధ్య చర్యలు చేపట్టాలి.
- 18 Aug 2020 9:36 AM GMT
- తుంగతుర్తి లో అద్దంకి దయాకర్ పై వేధింపులు ఆపాలంటూ.... రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ని అరెస్ట్ చేయాలంటూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అద్దంకి దయాకర్ అనుచరులు, మాల మహానాడు నేతలు ధర్నా.
- 18 Aug 2020 9:36 AM GMT
కె కృష్ణసాగర్ రావు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి..
- కె కృష్ణసాగర్ రావు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
- కోవిడ్ అనంతర చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మా పార్టీ సీనియర్ నాయకులు , మాజీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని, తొందరగా కోలుకోవాలని బీజేపీ ప్రార్థిస్తోంది.
- పూర్తి ఆరోగ్యం తో ఆయన గతంలోలాగా చురుగ్గా రంగం లోకి దిగుతారని బీజేపీ ఎదురు చూస్తోంది.
- 18 Aug 2020 9:35 AM GMT
నిన్న నోవ టెల్ హోటల్ వద్ద కారులో హత్యాయత్నం కేసులో తెర మీదకు తహసీల్దార్ పెరు
విజయవాడ:
- నిన్న నోవ టెల్ హోటల్ వద్ద కారులో హత్యాయత్నం కేసులో తెర మీదకు తహసీల్దార్ పెరు
- తనకు తెలిసిన తహసీల్దార్ కు 5 కోట్లు వచ్చాయని గంగాధర్ దంపతులు, కృష్ణా రెడ్డికి చెప్పిన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి
- పేదలకు ఇళ్ల పట్టాల కోసం బినామీలుగా మనమే స్థలం తహసీల్దార్ కి కొనిస్తే మనకు 2 కోట్లు వస్తాయని తెలిపిన వేణుగోపాల్ రెడ్డి
- తహసీల్దార్ ను కలవడానికి బయల్దేరిన వేణుగోపాల్ రెడ్డి, కృష్ణా రెడ్డి, గంగాధర్ దంపతులు
- తొలుత గుంటూరు ఈట్ స్ట్రీట్, తర్వాత ఖలీల్ డాబాకు కారులో వెళ్ళిన నలుగురు
- తహసీల్దార్ ఏలూరు వెళ్తున్నారని చెప్పి బెజవాడ నోవా టెల్ దగ్గర కలుద్దామని తీసుకెళ్లిన వేణుగోపాల్ రెడ్డి
- మద్యం బాటిల్ అని చెప్పి అందులో పెట్రోల్ తీసుకువచ్చిన వేణుగోపాల్ రెడ్డి
- తహసీల్దార్ ఎవరనే అంశంపై విచారణ చేస్తున్న బెజవాడ పోలీసులు
- 18 Aug 2020 9:21 AM GMT
చెరుకుపల్లిలో వ్యక్తి అదృశ్యమైన కేసు రోజుకో మలుపు...
గుంటూఋ
చెరుకుపల్లి గ్రామం లో చిరంజీవి అనే వ్యక్తి అదృశ్యమైన కేసు రోజుకో మలుపు...
తమ కుమారుడు 3 నెలలుగా కనిపించడం లేదంటు చిరంజీవి తండ్రి సుబ్బారావు ఈ నెల 13 న చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు...
సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో విస్తుపోయే బయట పడ్డ నిజాలు...
మొదటి భార్యతో మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్న చిరంజీవి....
శిరీష అనే యువతితో సహజీవనం చేస్తున్న చిరంజీవి....
చిరంజీవిని హత్య చేసిన శిరిష్ పాత ప్రియుడు బాను ....
చిరంజీవి ని చంపేసి ఇంట్లోనే శవాన్ని పాతిపెట్టిన శిరిష్ ప్రియుడు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire