Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Sep 2020 6:04 AM GMT
Telangana updates: తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు...
ప్రొ,, కోదండరాం
-తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు...
-తెలంగాణ జన సమితి తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరుపుతోంది..
-ఉద్యమ సమయంలో జేఏసీ గా ఉన్నప్పుడే సెప్టెంబర్17 ను ఎలా చూడాలి అన్నప్పుడు విలీన దినోత్సవం గా జరుపుకోవాలని ఆరోజు అందరం నిర్ణయించాం..
-హైదరాబాద్ భారతదేశం లో అప్పటి పరిస్థితి ల వల్ల ఆలస్యంగా విలీనం జరిగింది...
-పోలీస్ చర్య వల్ల మాత్రమే హైదరాబాద్ విలీనం జరగలేదు అంతకుముందే ఇక్కడ బలమైన ప్రజా ఉద్యమాలు జరిగాయి...
-విలీనం తరువాత కూడా ప్రజా పోరాటాలు జరిగాయి తదనంతరం ప్రస్తుత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు..
- 17 Sep 2020 6:00 AM GMT
Bhatti Vikramarka: రేపు మీ ఇంటికి వచ్చి తీసుకెళతామని సవాల్ చేసిన తలసాని...
బట్టి విక్రమార్క ఇంటి వద్ద హైడ్రామా....
-నిన్న అసెంబ్లీ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పై సవాలు విసురుకున్నా బట్టి తలసాని... హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించామని... అసెంబ్లీలో తెలిపిన తలసాని... లేదు అని వాదించిన బట్టి...
-బట్టి ఇంటికి చేరుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మేయర్ బొంతు రామ్మోహన్...
-సాదరంగా ఆహ్వానించిన బట్టి విక్రమార్క.
- 17 Sep 2020 5:53 AM GMT
Telangana Latest news: విలీన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసిన టీపీసీసీ అధ్యక్షులు..
తెలంగాణ..
-విలీన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు,ఉత్తమ్
-సెప్టెంబర్ 17 కి బీజేపీ..mim కి సంబంధం లేదు
-కానీ బీజేపీ మతపరమైన రాజకీయం చేస్తున్నాయి
-బీజేపీ..mim పాత్ర ఏముంది
-తెలంగాణ ఇచ్చింది... హైదరాబాద్ సంస్థాన విలీనం లో అయినా కాంగ్రెస్ కే సంబంధం
-తెలంగాణ వచ్చిన తర్వాత..కల్వకుంట్ల కుటుంబం దే పెత్తనం
-దళితున్ని సీఎం చేస్తా అని మాట మార్చారు కేసీఆర్
-కాంగ్రెస్ నాయకులు ఐక్యమత్యం తో పని చేయాలి
-దుబ్బాకలో గెలిచేలా ప్రణాళిక వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవ్వాలి
- 17 Sep 2020 5:47 AM GMT
Telangana updates: - తెలంగాణ కు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు ఇదే: లక్ష్మణ్ మాజీ అధ్యక్షుడు..
-లక్ష్మణ్ మాజీ అధ్యక్షుడు..
- ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం దారుణం.
- సెప్టెంబర్17 ను అధికారికంగా నిర్వహించాలన్న బీజేపీ డిమాండ్ వెనుక ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవు.
- నిజం నుండి తెలంగాణ స్వేచ్ఛ వాయువు పిలిచిన ఈరోజున తెలంగాణ విమోచన దినంగా జరపాలని కోరుతున్నాము.
- ఆనాడు భారత దేశంలో హైదరాబాద్ విలీనం కాకుంటే ఒస్మానిస్తాన్ గా మారేది.
- 17 Sep 2020 4:32 AM GMT
Telangana updates: భారతదేశం లో హైదరాబాదు విలీన దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగుర వేసిన కేటిఆర్..
-భారతదేశం లో హైదరాబాదు విలీన దినోత్సవం ను పురస్కరించుకొని తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగుర వేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి,పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, హాజరైన రాష్ట్రలు హోం మంత్రి మహముద్ అలి,
-మంత్రి పువ్వాడ అజయ్, మేయర్ బొంతు రామ్మోహన్,విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ..నివాస రెడ్డి, నారాదాసు లక్ష్మణ రావు,
-టిఆర్ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ కార్యకర్తలు, నాయకులు.
- 17 Sep 2020 4:25 AM GMT
Peddapalli district updates: సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగరవేసిన బిజెపి శ్రేణులు..
పెద్దపల్లి జిల్లా :
-సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగరవేసిన బిజెపి శ్రేణులు, తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్
-సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రయత్నించిన బిజెపి నాయకులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
- 17 Sep 2020 4:19 AM GMT
Sangareddy district updates: భారీ వర్షాలతో పుల్కల్ మండలం: సింగూర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..
సంగారెడ్డి జిల్లా..
-ఇన్ ఫ్లో 45,282 క్యూసెక్కులు..
-ఔట్ ఫ్లో 120 క్యూసెక్కులు,
-ప్రస్తుత నీటిమట్టం 8.520 టియంసిలు,
-పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టియంసిలు,
-మిషన్ భగీరతకు 40 క్యూసెక్కులు ఈ వప్ ద్వారా 60, క్యూసెక్కులు ఔట్ ఫ్లో పంపిణీ జరుగుతుంది..
-నిన్న ఒక్క రాత్రే 4 టీఎంసీలు వరద జలాలు సింగూరు జలాశయం లోకి వచ్చి చేరాయి.
- జహీరాబాద్ మండలం సత్వర్ గ్రామంలో విషాదం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వరద లో గల్లంతు ఇద్దరి మృతదేహం లభ్యం,మృతులు ఏర్పుల రాజు, మరొకరు హద్నూర్ రాజులు గా గుర్తింపు..
- 17 Sep 2020 4:14 AM GMT
Nirmal district updates: నిర్మల్ జిల్లా కుబీర్ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు..
నిర్మల్ జిల్లా..
-ఖానాపూర్,కడెం మండల కేంద్రంలలో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా ప్రకటించాలని జాతీయ జెండాను ఎగురవేసిన బిజెపి మండల అధ్యక్షులు,నాయకులు....
-గ్రామపంచాయితీ కార్యాలయం పై జాతీయ జెండాను అవిష్కరించిన. బిజెపి కార్యకర్తలు..
-జాతీయ. జెండాను క్రిందికి దించిన పంచాయితీ కార్యదర్శి, టిఅర్ ఎస్ కార్యకర్తలు..
-పంచాయితీ కార్యదర్శి తీరుపై మండిపడుతున్నా బిజెపి నాయకులు..
- 17 Sep 2020 4:10 AM GMT
Adilabad district updates: నేరడిగొండ సిని హీరో అల్లు అర్జున్ కుంటాల జలపాతం సందర్శన పై పోలీసులకు పిర్యాదు..
ఆదిలాబాద్ జిల్లా..
-కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి జలపాతం సందర్శించారని పోలీసులకు పిర్యాదు చేసిన సమాచార హక్కు సాదన స్రవంతి ప్రతినిధులు..
-సందర్శనకు అనుమతులు ఉన్నాయా అనే ఆంశం పై విచారణ జరుపుతున్నా పోలీసులు..
- 17 Sep 2020 4:04 AM GMT
Kamareddy district updates: జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాలకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు: జిల్లా కలెక్టర్ శరత్..
కామారెడ్డి :
-ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 73829 28649,73829 29350 నంబర్లకు ఫోన్ చేయాలని 24 గంటల పాటు సహాయ కేంద్రం పనిచేస్తుంది..
-ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను నాయక్ కు కామారెడ్డి ఆర్డీవో గా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ శరత్ ఉత్తర్వులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire