Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Sep 2020 12:45 PM GMT
Warangal Urban updates: బతుకమ్మ సంస్కృతిని ఆచారంగా ప్రారంభించిన ఓరుగల్లు మహిళలు..
వరంగల్ అర్బన్..
-హన్మకొండ వెయ్యిస్థంబాల దేవాలయంలో పెత్రామవాస్య రోజు తొలి బతుకమ్మ వేడుకలు.
-ఎగువమాసం వచ్చిన ఓరుగల్లు మహిళలు నేడు ఆచారం ప్రకారం అమావాస్య రోజు బతుకమ్మ పండుగను అధిపడినా ఆడపడుచులు.
-ప్రపంచంలో తొలి బతుకమ్మ ఓరుగల్లులోనే ప్రారంభం అవుతుందిమ్ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నాం అంటున్న మహిళలు.
-తొలి రోజు బతుకమ్మ ఆడిపాడి, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్న మహిళలు, యువతులు.
-బతుకమ్మ వేడుకలకు ఎలాంటి తిధులు లేవని , ఇది మహిళల ఆత్మగౌరవం అంటున్న ఓరుగల్లు మహిళలు..
- 17 Sep 2020 11:54 AM GMT
Hyderabad updates: హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం..కేటీఆర్..
జిహెచ్ఎంసి..
-జిహెచ్ఎంసి పరిధిలో నిర్మాణమవుతున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష.
-హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని ఇది త్వరగా పూర్తి అవుతాయని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు
-లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశం
-డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేసిన ప్రాంతాల్లో గ్రీనరీ కి పెద్దపీట వేయాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ
-హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో జిహెచ్ఎంసి కమిషనర్ మరియు ఇతర జిల్లాల కలెక్టర్లతో సంయుక్తంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచన
-జిహెచ్ఎంసి పరిధి అవతల నిర్మాణం జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో స్థానికులకు పది శాతం లేదా 1000 మించకుండా కేటాయించాలని మంత్రులు ఆదేశం
-గతంలో ఇల్లు వచ్చిన వారికి మరొకసారి డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకుండా చూడాలని అధికారులకు సూచన
- 17 Sep 2020 11:44 AM GMT
Nama Nageswara Rao Comments: పార్లమెంట్ లో గాంధీ విగ్రహం సాక్షిగా రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ధర్నా చేశాం..నామా నాగేశ్వరరావు..
జాతీయం..
నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత..
-10 ప్రాంతీయ పార్టీల ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు
-తెలంగాణ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ కోరాం
-తెలంగాణ కు రావాల్సిన జిఎస్టీ బకాయిలు చెల్లించాలి
-9 వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం
-కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయి.
-తెలంగాణ ప్రజల కోసం ఎవరితోనైనా పోరాడుతాం
-జిఎస్టీ బకాయిల చెల్లింపుపై వాయిదా తీర్మానం ఇచ్చా... చర్చ కోసం పట్టుపడతాం
-విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్ని కేంద్రం ఇవ్వాలి
వెంకటేష్ నేత, టిఆర్ఎస్ ఎంపీ..
-రాష్ట్రాలకు రావాల్సిన నిధులనే హక్కుగా అడుగుతాం
-మా నిధులు మాకు ఇవ్వాలని పోరాటం చేస్తాం
- 17 Sep 2020 11:16 AM GMT
Khammam updates: ఖమ్మం లో NSUI ఎన్నికల ఓటర్ల నమోదు వ్యవహారం లో వివాదం..
ఖమ్మం..
-బత్తుల ప్రతాప్ వర్గం ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారని ఆందోళన కు దిగిన యడ్లపల్లి సంతోష్ వర్గం
-పరస్పరం దాడి చేసుకున్న ఇరువర్గాల యువజన కాంగ్రెస్ కార్యకర్తలు
- 17 Sep 2020 11:12 AM GMT
Hyderabad updates: తెలంగాణ చరిత్రను కేసీఆర్ మరుగుణ పడేయ్యాడానికి కుట్ర చేస్తున్నారు.. తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు జోస్న..
తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు జోస్న@ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్
* 2014 తెలంగాణ ఏర్పాటు జరిగిన నుంచి ప్రజలను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారు.
* ఎన్ని రోజులైనా అసెంబ్లీ నిర్వహిస్తా అన్న కేసీఆర్ వారం రోజులకే ముగించారు.
* 4వందల మంది స్టాఫ్ ఉండే అసెంబ్లీ గురించి ఆలోచన చేసిన కేసీఆర్..4 కోట్ల ప్రజల బాధలు కనిపించడం లేదా?
* కొరొనాను ఆరోగ్యశ్రీ చేర్చడానికి టీఆరెస్ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలి.
* ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఎల్ ఆర్ ఎస్ వెంటనే జివో లో సవరణ చేసింది...ఇది ప్రజల విజయం.
* తెలంగాణ లో మహిళా కమిషన్ ను ఏర్పాటు చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాము.
* హైదరాబాద్ అభివృద్ధికి అసెంబ్లీ సాక్షిగా 65వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ చెప్పారు.
* పది సెంటిమిటర్ల వర్షం పడితే బోగతా-నాయగరా వాటర్ ఫాల్ హైదరాబాద్ నడిబొడ్డున కనిపిస్తున్నాయి.
* 500 కోట్ల సచివాలయం టెండర్లు పిలిచిన ప్రభుత్వం..చదువు చెప్పే గురువులను ఆదుకోవడం లేదు ఎందుకు?
* కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో నాగులు లాంటి వ్యక్తులు ఎందరో బలి అవుతున్నారు.
* తెలంగాణ విమోచనరోజు నాగులు లాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది అనే ఒక్క ప్రకటన చేయలేరా?
- 17 Sep 2020 11:09 AM GMT
Telangana updates: నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు..ఎల్.రమణ..
టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ..
-తెలంగాణ లో దొరల పాలన అంతమై ప్రస్తుతం నెలకొన్న నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు..
-నిజాం పాలనలో ఎక్కడ చూసినా నిరంకుశత్వం పెత్తందారి పాలన చెప్పుచేతల్లో తెలంగాణ నలిగిపోయింది..
-ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలినమైంది ..
-తెలంగాణలో ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడంతో ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం సిద్ధించింది...
- 17 Sep 2020 11:05 AM GMT
IMS Scam: ఐఎంఎస్ స్కాం లో ఈడి దర్యాప్తు ముమ్మరం..
-దేవిక రాణి భర్త గురుమూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న ఈడీ...
-పీ ఎం జే లో 7 కోట్ల కు పైగా విలువ చేసే బంగారం కొనుగోలు చేసిన దేవిక రాణీ...
-బంజారాహిల్స్ పీ ఎం జే జువెలర్స్ యాజమానుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడి...
-నిధులు మళ్లించడానికి అనేక షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న ఐ ఎం ఎస్ నిందితులు...
- 17 Sep 2020 10:11 AM GMT
Telangana High Court: మంథిని శీలం రంగయ్య లాకప్ డెత్ అంటూ వేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ..
టీఎస్ హైకోర్టు....
-గతంలో ఈ కేసు లో స్పెషల్ అధికారి గా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను నియమించిన హైకోర్టు..
-శీలం రంగయ్య డెత్ కు సంబంధించిన రిపోర్ట్ ను కోర్ట్ కు సమర్పించిన సీపీ అంజనీ కుమార్...
-రామగుండం పోలీసు కమీషనర్ కాల్ డేట హైకోర్ట్ కు అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం.
-సీపీ సమర్పించిన అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేస్తామన్న పిటీషనర్ నాగమణి..
-ఆరు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటీషనర్ కు హైకోర్టు అదేశం..
-తదుపరి విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేసిన హైకోర్ట్.
- 17 Sep 2020 10:09 AM GMT
Hyderabad updates: పాతబస్తీలోని పురానాపూల్ లో మొసలి కలకలం...
హైదరాబాద్..
-నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా ఎగువ ప్రాంతం నుంచి పురానాపూల్ కొట్టుకొచ్చిన మొసలి...
-సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జూ పార్క్ సిబ్బంది..
-మోసలి ని బంధించే పనిలో నిమగ్నమైన సిబ్బంది....
- 17 Sep 2020 10:07 AM GMT
Talasani Srinivas Yadav: దేశ చరిత్రలో మొదటి సారి ఇంత మంచి ఇళ్ళు కట్టిస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ మాత్రమే..తలసాని శ్రీనివాస్
తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర మంత్రి..
-ఇంకా 60 ప్రాంతాల్లో పర్యటించాల్సిఉంది..
-కోల్లురూ ,మేడ్చల్ ,జవహర్ నగర్ ,కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతంల్లో రేపు పర్యటన ఉంటుంది..
-ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చే ఇళ్ళకు ప్రభుత్వం కొంత సొమ్ము వసూలు చేసేది.. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళు పూర్తి గా ఫ్రీ ఇస్తున్నాం.
-ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూం విలువ కోటి రూపాయలు ఉంటుంది.
-గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇళ్ళ నిర్మాణానికి పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నాం..
-బస్తి ప్రజల సమక్షంలో ఇళ్ళ పంపిణీ చేస్తాం..
-ఆలస్యమయినా క్వాలిటీ ఇళ్ళు కడతాం..
-లక్ష ఇళ్ళు కాంగ్రెస్ నేతలకు చూపిస్తాం...
-గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు కూడా ఈ పర్యటన ఉంటుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire