Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 17 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి రా.11-29 వరకు తదుపరి విదియ | చిత్త నక్షత్రం మ.02-23 వరకు తదుపరి స్వాతి | వర్జ్యం: రా.07-35 నుంచి 09-05 వరకు | అమృత ఘడియలు ఉ.08-25 నుంచి 09-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-57 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.19-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Oct 2020 3:43 PM GMT
Hyderabad rain updates: భాగ్యనగరంలో కుండపోత గా కురుస్తున్న వర్షం..
హైదరాబాద్..
-అంధకారంలో చర్లపల్లి
-చర్లపల్లిలో మొదలైన వాన.. విద్యుత్తు సరఫరా నిలిపివేత
-శంషాబాద్ లో ఉరుములతో కురుస్తున్న వర్షం
-మల్కాజిగిరిలో అరగంట నుంచి కురుస్తున్న వర్షం
-టోలిచౌకి - బృందావన్ కాలనీ, షేక్ పేట రోడ్డులో ట్రాఫిక్ జాం
-దిల్సుఖ్నగర్లో పోటెత్తుతున్న వరద
-ముంపు కాలనీలలో భారీగా వరద నీరు
-హరిహర పురంలో పెరిగిన వరద ఉధృతి, 14 కాలనీలకు పొంచి ఉన్న ప్రమాదం
-మెహదీపట్నం, బయోడైవర్శిటీ, గచ్చిబౌలి రహదారిపై నెమ్మదించిన వాహనాలు
-రహదారులపై పలుచోట్ల నిలిచిన వరదనీరు
-గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, నార్సింగి, లంగర్ హౌడ్, నానల్ నగర్, మెహదీపట్నం మీదుగా వాహనాల దారిమళ్లింపు.
- 17 Oct 2020 3:38 PM GMT
Hyderabad updates: ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా తెరిచిన పోలీసులు..
హైదరాబాద్..
-వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దీ ని దృష్టిలో ఉంచుకుని దుర్గం చెరువు తీగల వంతెన తెరచిన ట్రాఫిక్ పోలీసులు.
-వంతెన పై వాహనాలు ఆపరాదని...
-ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచన.సాధారణ రోజుల్లో శని ఆదివారాల్లో వాహన రాకపోకలను నిలిపి వేసి, కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతి.
- 17 Oct 2020 3:34 PM GMT
Hyderabad Oldcity updates: ఫలక్ నుమాలో తప్పిన భారీ ప్రమాదం...
హైదరాబాద్: పాతబస్తీ..
-రైల్వే బ్రిడ్జ్ మీద పడ్డ హోల్
-ఆరు ఇంచులు మధ్యలో బ్రిడ్జ్ పై పడ్డ హోల్..
-భారీ వర్షానికి కారణంగా హోల్ పడ్డాడు భావిస్తున్న రైల్వే అధికారులు
-రైల్ పట్టాలపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు
-వెంటనే అప్రమత్తమై రైల్వే అధికారులు
-రైళ్ల రాకపోకలు నిలిపివేసిన అధికారులు..
-బ్రిడ్జ్ పై వాహనాలను మళ్ళీస్తున్న అధికారులు
- 17 Oct 2020 3:28 PM GMT
Laxmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-35 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 97.40 మీటర్లు
-ఇన్ ఫ్లో 1,44,700 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 1,77,500 క్యూసెక్కులు
- 17 Oct 2020 3:24 PM GMT
Hyderabad Rain effect: హైదరాబాద్ లో వర్షపాతం!
హైదరాబాద్ లో రెయిన్ ఎఫెక్ట్..
-మళ్ళి పది సెంటీమీటర్ల మార్క్ ను దాటిన హైదరాబాద్ లో వర్షపాతం
-హయత్ నగర్ లో 10 cm, ఉప్పల్ లో 9.3 cm, సరూర్ నగర్ 9.2 cm, అబ్దుల్లా పూర్ మెట్ 9.1, నాగోల్ 9 cm ల అత్యధిక వర్షపాతం
- 17 Oct 2020 3:19 PM GMT
Khairtabad rain updates: భారీ వర్షానికి ఖైరతాబాద్ రహదారి జలమయం...
- పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ మీరుగా lakadikapul వెళ్లేదారిలో చెరువులను తలపిస్తున్న రహదారి.
- స్వల్పంగా ట్రాఫిక్కు అంతరాయం
- ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పంజాగుట్ట సైఫాబాద్ పోలీసులు.
- 17 Oct 2020 3:17 PM GMT
Nalgonda updates: ప్రారంభోత్సవం లో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
నల్గొండ :
-దేవరకొండ నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం లో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...
-దేవరకొండ లో గ్రంధాలయం భవనం,బస్టాండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో కలిసి ప్రారంభించిన గుత్తా..
- 17 Oct 2020 3:15 PM GMT
Hyderabad rain updates: హైదరాబాద్ శివారులో అతి భారీగా కురుస్తున్న వర్షం...
హైదరాబాద్..
-ఉప్పల్ , ఎల్బీనగర్ , ఘటికేసర్ , హాయథ్ నగర లల్లో కుండపోత వాన.
-ఉప్పల్ నుండి నార పల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్.
-వరంగల్ హైవే పై రోడ్డు పనులు జరుగుతుండటంతో భారీగా గుంతలు.
-ఎక్కడ కనిపించని ట్రాఫిక్ పోలీసులు.
-వాహనదారులు అవస్థలు.
-ఘటికేసర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే వాళ్ళు రంపల్లి దమ్మాయి గూడ మీదుగా తార్నాక నుండి నగరంలో కి వస్తే బెట్టర్.
- 17 Oct 2020 3:12 PM GMT
C.Venkat Reddy: ఎల్లూరు పంప్ నీట మునిగిన ఘటన నిర్లక్షానికి నిదర్శనం...
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
-కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లూరు పంప్ నీట మునిగిన ఘటన కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్షానికి నిదర్శనం...
-పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మొదటి పంపుహౌజ్ మొదట భావించినట్లు ఉపరితలంపై కాకుండా భూగర్భంలో నిర్మిస్తే కల్వకుర్తి ఎత్తిపోతల పంపు హౌజ్ ప్రమాదమని నిపుణులు హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో ఈ ప్రమాదానికి దారి తీసింది...
-పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం బ్లాస్టింగ్ కారణంగా ఎల్లూరు పంపు హౌజ్ నీట మునిగి, కల్వకుర్తి ఎత్తిపోతల కింద లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడడం పట్ల ఆందోళన కలిగిస్తుంది...
-ఘటనకు పూర్తిగా నిర్లక్షమే కారణమని, కాంట్రాక్టర్లు, అధికారులపై ప్రభుత్వ అజమాయిషీ ఏమైంది.....?
-రాష్ట్ర స్థాయి నీటిపారుదల ఉన్నతాధికారులు, ప్రబుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర వహించింది....?
-తక్షణమే ఘటనపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వర్గాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ..
-కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని విజ్ఞప్తి ...
- 17 Oct 2020 3:03 PM GMT
Nizamabad updates: దేవునిఆలయాల్లో దొంగతనలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పట్టుకొని రిమాండ్ పంపిన పోలీసులు..
నిజమాబాద్:
-బోధన్ రూరల్ ప్రాంతాల్లో దేవునిఆలయాల్లో దొంగతనలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పట్టుకొని రిమాండ్ పంపిన పోలీసులు..
-వారి వద్ద నుండి 12 గ్రాముల బంగారం,35 తులాల వెండి రెండువేయిల్ రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రామారావు వెల్లడించారు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire