Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 16 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చతుర్దశి రా.7-03వరకు తదుపరి అమావాస్య | మఘ నక్షత్రం మ.12-07వరకు తదుపరి పుబ్బ | అమృత ఘడియలు: ఉ.9-47 నుంచి 11-20 వరకు తిరిగి తె.4-52 నుంచి | వర్జ్యం: రా.7-43 నుంచి 9-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-20 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-01
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 16 Sep 2020 12:43 PM GMT
Adilabad updates: ఆదిలాబాద్ జిల్లా బీమ్ పూర్ పిప్పల్ కోటీ లో పులి సంచారం..
ఆదిలాబాద్ జిల్లా..
-ఆవు పై దాడి చేసిన పులి
-పులి దాడిలో ఆవు మృతి..
-దాడి చేసిన ప్రాంతాన్ని సందర్శించిన. అటవీ అదికారులు..
-పులి అనవాళ్లను గుర్తించిన అటవీ అదికారులు
- 16 Sep 2020 12:38 PM GMT
Hyderabad updates: హైదరాబాద్ లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారు..
హైదరాబాద్..
-ఈ నెల 19 న సాయంత్రం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు
-ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభం 19 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం
- 16 Sep 2020 12:04 PM GMT
Ambedkar Statue: రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి సంబంధించి జీవో విడుదలైంది..
మంత్రుల ప్రెస్ మీట్ @ అసెంబ్లీ హాల్ 1:
మంత్రులు ఈటెల రాజేందర్ ,కొప్పుల ఈశ్వర్ ,సత్యవతీ రాథోడ్ ,ప్రభుత్వ విప్ బాల రాజు ,రేగా కాంతా రావు ,ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ ప్రెస్ మీట్ @ అసెంబ్లీ హాల్ 1
మంత్రి కొప్పుల ఈశ్వర్
-ఈ రోజు శుభదినం ..
-బాబా సాహెబ్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు
-ఈ భారీ విగ్రహం ఏర్పాటు కు అనుమతులకు సంబంధించి జీవో నంబర్ 2 విడుదలైంది
-ఇందు కోసం 140 కోట్ల రూపాయల ఖర్చవుతుంది
-హుస్సేన్ సాగర్ సమీపం లో 11 ఎకరాల స్థలం లో అంబెడ్కర్ పార్కు ఏర్పాటు అవుతుంది
-ఈ పార్కు లో విగ్రహం తో పాటు ,మ్యూజియం ,లైబ్రరీ కూడా ఉంటాయి
-సీఎం కెసిఆర్ కు దళిత ,గిరిజన ,మైనారిటీ వర్గాలు రుణ పడి ఉంటాయి
-విగ్రహం వెడల్పు 45 .5 ఫీట్లు
-ఈ విగ్రహానికి వాడే స్టీలు 791 టన్నులు
-విగ్రహానికి వాడే ఇత్తడి ...96 మెట్రిక్ టన్నులు
-అంబెడ్కర్ విగ్రహ నమూనాను మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు
- 16 Sep 2020 11:16 AM GMT
Sravani Case Updates: ఈ కేసు లో నిర్దోషిగా బయటకు వస్తా....అశోక్ రెడ్డి..
శ్రావణి కేసు..
పోలీసుల విచారణలో అశోక్ రెడ్డి వాంగ్మూలం..
-తనకు శ్రావణి సూసైడ్ కేసులో ఎలాంటి సంబంధం లేదు..
-తనను కావాలనే ఈ కేసులో ఇరికించారు..
-మూడు సంవత్సరాల క్రితం ఓ సినిమాలో శ్రావణి కి అవకాశం ఇచ్చాను
-దేవరాజు, సాయి కృష్ణ, శ్రావణి మధ్య జరుగుతున్న వివాదాల తో నాకు ఎటువంటి సంబంధం లేదు
-అనారోగ్యం కారణంగానే పోలీస్ విచారణ కు హాజరు కాలేదు
-శ్రావణి ఆత్మహత్య కంటే 2రోజుల ముందు నాతో మాట్లాడింది
-శ్రావణి ని ఎప్పుడు వేదించలేదు
-లాక్ డౌన్ సమయంలో డబ్బులు అవసరం ఉన్నాయి అంటే సహాయం చేశా
-శ్రావణి ని వివాహం చేసుకుంటానని నేను ఎప్పుడు చెప్పలేదు..
-దేవరాజు తనకు అనుకూలంగా ఉన్న ఆడియో క్లిప్ లను బయటపెట్టి కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేసాడు..
- 16 Sep 2020 11:02 AM GMT
Medak-ACB Court: మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసులో నిందితులను కస్టడీకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్ట్...
ఏసీబీ కోర్ట్.....
-నాలుగు రోజుల పాటు ఐదుగురు నిందితులను ఏసీబీ కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్ట్...
-ఈ నెల 21 నుండి 24 వరకు కస్టడీకి తీసుకోనున్న ఏసీబీ..
-ఈ నెల 21 నుండి చంచల్ గూడ జైలు నుండి ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ.
-A-1 అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్, A-2 వసీమ్ హైమ్మద్, A-3 అరుణా రెడ్డి, A-4 అబ్దుల్ సత్తార్ , A-5 జీవన్ గౌడ్ లను కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ.
- 16 Sep 2020 10:43 AM GMT
Sravani Case Updates: రెండు గంటల నుంచి అశోక్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు..
శ్రావణి కేస్ అప్డేట్:
-ఎస్ ఆర్ నగర్ పీఎస్ లో కొనసాగుతున్న నిర్మాత అశోక్ రెడ్డి విచారణ.
-శ్రావణి కి మొదటగా అశోక్ రెడ్డి తో పరిచయం అనంతరం సాయి రెడ్డి , చివరగా దేవ్ రాజ్ తో ఫ్రెండ్షిప్.
-ముగ్గురితో శ్రావణి చనువుగా ఉన్నట్టు రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్న పోలీసులు.
-ముగ్గురి మధ్య జరిగిన వివాదం ఏంటి..ఎవరిని ఎవరు పెళ్లి చేస్కో అని వేధించారు అనేది అరా తీస్తున్న పోలిసులు.
-దేవ్ రాజ్ పై పంజాగుట్ట పీఎస్ లో నమోదు అయిన కేస్ విత్ డ్రా చేసుకునే విషయం లో సాయి కృష్ణ అశోక్ రెడ్డి ఎదుకు ఒత్తిడి తెచ్చారనే కోణం లో విచారిస్తున్న పోలీసులు.
-ఒకరిపై మరొకరు కాల్ రికార్డింగ్స్ విడుదల చేసుకున్న నిందితులు.
-శ్రావణి తో అశోక్ రెడ్డి పరిచయం వాట్సాప్ చాటింగ్, చివరి సరిగా కాల్ మాట్లాడినట్టు టెక్నీకల్ ఎవిడెన్స్ సేకరించిన పోలీసులు.
- 16 Sep 2020 10:30 AM GMT
Professor M. Kodandaram Comments: అరెస్టు చేసిన ప్రైవేట్ టీచర్లను వెంటనే విడుదల చేయాలి - ప్రొ,, కోదండరాం..
ప్రొ,, కోదండరాం తెలంగాణ జన సమితి అధ్యక్షులు..
-ఆరు నెలలుగా జీతాలు లేక, బతుకుదెరువు కోల్పోయి ఆందోళన బాట పట్టిన ప్రైవేట్ టీచర్లను అరెస్టులు, వేధింపులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.....
-జీవో 45 ప్రకారం జీతాలు ఇవ్వ వలసిన ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడమే కాదు, వాటి కోసం 'ఛలో అసెంబ్లీ' పిలుపు యిచ్చినందుకు టీచర్లను అరెస్టు చేసింది...
-దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం....
-వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం....
- 16 Sep 2020 10:21 AM GMT
NTR Bhavan: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని టీటీడీపీ నాయకులు నిర్వహించారు..
ఎన్టీఆర్ భవన్ లో ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మొదటి వర్ధంతి కార్యక్రమం...
దుర్గాప్రసాద్ టీటీడీపీ అధికార ప్రతినిధి:
కోడెల శివప్రసాద రావు వైద్యునిగా ,రాజకీయ నాయకునిగా,మంత్రి గా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ ఎన్నో బాధ్యతలు నిర్వహించారు...
పార్టీలో క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా అంకిత భావంతో పనిచేశారు...
రూపాయి డాక్టరు గా ప్రసిద్ది చెందిన కోడెల ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు...
- 16 Sep 2020 10:17 AM GMT
C Venkat Reddy: చాడ వాహనం పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి..
-సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వాహనం పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
-తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీసులకు అప్పగింత.
-తన స్నేహితుడి పై కోపంతో, స్నేహితుడి వాహనం అనుకోని దాడి చేసిన శుక్లా.
-గత సంవత్సరం మతిస్థిమితం సరిగా లేక.. తాను శంషాబాద్ ఆశాజ్యోతి హాస్పిటల్ లో 5 నెలలు చికిత్స తీసుకున్న శుక్లా.
-తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని.. సీపీఐ పార్టీ పై గానీ, ఆ పార్టీ నాయకులపై గాని ఎలాంటి దురుద్ధేశాలు లేవన్న శుక్లా.
-పోలీసుల విచారణలో తెలిపిన శుక్లా.
-విచారణ అనంతరం ఈ రోజు కోర్టు లో హాజరుపరచనున్న నారాయణగూడ పోలీసులు.
- 16 Sep 2020 10:12 AM GMT
L Ramana Comments: లాక్ డౌన్ సమయంలో ప్రయివేటు టీచర్లకు ఉపాధి లేక,జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు...ఎల్.రమణ..
టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ..
-అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వస్తున్న ప్రయివేటు టీచర్లను అరెస్ట్ చేయడం హేయమైన చర్య...
-కుటుంబ పోషణ భారమై వ్యవసాయ కూలీలు ,దినసరి కూలీలు ఉపాధిహామీ కూలిలుగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది...
-అరెస్ట్ చేసిన ప్రయివేటు టీచర్లను వెంటనే విడుదల చేయాలి, వారి డిమాండ్ల పై ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire