Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 16 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | పాడ్యమి ఉ. 9-07 తదుపరి విదియ | అనూరాధ నక్షత్రం సా. 5-41 తదుపరి జ్యేష్ఠ | వర్జ్యం రా.10-59 నుంచి 12-29 వరకు | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం మ.12-07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-09 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 16 Nov 2020 2:02 PM GMT
Telangana High Court Updates: దిశ ఎన్కౌంటర్ చిత్రం పై హైకోర్టు విచారణ..
టీఎస్ హైకోర్టు.
* దిశ ఎన్ కౌంటర్ చిత్రం యూనిట్ తో పాటు ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు..
* దిశ చిత్రాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి...
* మహిళ పై జరిగిన అత్యాచారం, హత్య ను కథ గా చేస్తూ అర్జీవి తీస్తున్న సినిమా ను నిలిపి వేయాలని కోర్టును కోరిన పిటీషనర్ తరపు న్యాయవాది అరుణ కుమారి..
* బాధితులు, నిందితుల కుటుంబ సభ్యులు జుడిషియల్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేసారని కోర్టుకు తెలిపిన అరుణ కుమారి..
* యూట్యూబ్ లో పెట్టిన దిశ ట్రైలర్ వెంటనే తీసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన అరుణ కుమారి..
* ఈ చిత్రం విడుదల కావడం వలన కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటున్నాయని కోర్టుకు తెలిపిన పిటీషనర్ అడ్వొకేట్..
* ఒకవైపు జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు చిత్రాన్ని ఎలా తీస్తారన్న పిటీషనర్..
* చిత్రాన్ని విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన అరుణ కుమారి.
* 7 గురు ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ..
* తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.
- 16 Nov 2020 1:57 PM GMT
Jogulamba Gadwal Updates: ఈనెల 20న ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు..
జోగులాంబ గద్వాల జిల్లా :
* ఈనెల 20న ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాల సందర్బంగా
* పుష్కర ఘాట్ ల వద్ద భక్తుల భద్రతపై అదికారులత సమీక్ష నిర్వహించి పుష్కర ఘాట్ ను పరిశీలించిన డి.ఐ.జి శివ శంకర్ రెడ్డి....
- 16 Nov 2020 1:21 PM GMT
Hyderabad Updates: గవర్నర్ తమిళసైని కలిసిన డీ.కే. అరుణ..
హైదరాబాద్...
గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను కలిసిన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే. అరుణ
#గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకే వెళ్లినట్లు వెల్లడి.
#జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో కాషాయపు జెండా ఎగురవేస్తాం.
#హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కనీసం పలకరించేందుకు కూడా సీఎం కేసీఆర్ వెళ్ళలేదు.
#జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో లబ్ది చేకూర్చేందుకే రూ.10వేల ఆర్థిక సాయం.
#వరద బాధితుల్లో అర్హులకంటే అనర్హులకే 10వేలు అందించారు.
- 16 Nov 2020 1:14 PM GMT
Khammama District Updates: పాలేరు నియోజకవర్గం బోదులబండలో ఘటన...
ఖమ్మం...
- మహిళా కౌలు రైతు ఆత్మహత్యా యత్నం
- ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ముందే పురుగు మందు తాగిన కౌలు రైతు తుమ్మల దివ్య
- గత నెలలో కౌలు భూమిలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఇద్దరు కూలీలు...
- 10 లక్షల పరిహారం ఇవ్వాలని పెద్ద మనుషుల తీర్మానం
- పరిహారం ఇవ్వలేమని ఆత్మహత్య యత్నం చేసిన మహిళా కౌలు రైతు....
- 16 Nov 2020 1:13 PM GMT
Allola Indrakaran Reddy Comments: పుష్కర అభివృద్ధి పనులపై అరణ్య భవన్ లో మంత్రి సమీక్ష...
హైదరాబాద్:
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
- తుంగభద్ర పుష్కరాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
- సమీక్ష లో పాల్గొన్న దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తో పాటు ఇతర అధికారులు
- ఈ నెల 20 న నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు
- పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు
- 16 Nov 2020 1:05 PM GMT
Nizamabad Updates: మొస్రా మండలం గోవూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం...
నిజామాబాద్:
- బస్ ఆటో ఢీకొని 12మందికి గాయాలు...
- మొస్రా మండలం గోవూర్ గ్రామ శివారులో బస్ ఆటో ఢీకొన్న ఘటనలో 12 మందికి గాయాలు ....
- అంబులెన్స్ లో నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు...
- 16 Nov 2020 1:02 PM GMT
Nizamabad Updates: జిల్లాలో జోరుగా దీపావళి పేకాట..
నిజామాబాద్...
--జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల దాడులు
--161 కేసులు నమోదు
--859 మంది అరెస్ట్
--15 లక్షల 23 వేల నగదు స్వాధీనం
--పోలీస్ కమిషనర్ కార్తికేయ వెల్లడి
- 16 Nov 2020 12:42 PM GMT
Nizamabad Updates: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కాశీర్ హనుమాన్ మందిరంలో అద్భుతం!
నిజామాబాద్:
- లింగం పై ఉన్న కలిశం దానింతట అదే ఉగడంతో మహిమను చూడడానికి బారులు తీరిన భక్తులు
- కార్తీక మాసం సోమవారం కావడంతో ఇది శివుని మహిమనే అని భక్తులు నమ్ముతున్నారు.
- శివలింగం ను దర్శించుకొంటున్న మహిళ భక్తులు
- 16 Nov 2020 12:40 PM GMT
Sangareddy Updates: జహీరాబాద్ మండలంలో భూ వివాదం!
సంగారెడ్డి జిల్లా..
- జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామ శివారులో 30 ఎకరాల భూ వివాదంలో ఒక వర్గం వారు మరో వర్గం వారిపై తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు చేసి పారిపోయారు
- కాల్పులలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
- ఘటనా స్థలం వద్ద విచారణ చేపడుతున్న పోలీసులు.
- 16 Nov 2020 12:36 PM GMT
Nalgonda District Updates: తారాస్థాయికి చేరిన ఇద్దరు ఎమ్మెల్యే ల పంచాయతీ...
నల్గొండ:
-నకరికల్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుల మధ్య తారా స్థాయిలో విభేదాలు...
-చిట్యాల లో ఉన్న తమ కాటన్ మిల్లు పై స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేధింపులు చేస్తున్నారని...ఎమ్మెల్యే లింగయ్య వైఖరి తో రేపటి నుంచి మిల్లు లో పత్తి కోనుగోళ్లు బంద్ అంటూ ప్లేక్సీ...
-మిల్లు లో స్థానిక ఎమ్మెల్యే, అధికారుల వైఖరిని పేర్కోంటూ ఫ్లేక్సీ లను ఏర్పాటు చేసిన నల్గొండ ఎమ్మెల్యే సోదరుడు ,టిఆర్ఎస్ నాయకుడు కంచర్ల కృష్ణా రెడ్డి...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire